అంగదుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి యంత్రము కలుపుతున్నది: ml:അംഗദൻ
పంక్తి 19: పంక్తి 19:


[[en:Angada]]
[[en:Angada]]
[[ml:അംഗദൻ]]
[[id:Anggada]]
[[id:Anggada]]
[[ja:アンガダ]]
[[ja:アンガダ]]

04:32, 9 సెప్టెంబరు 2010 నాటి కూర్పు

రామాయణంలో అంగదుడు ఒక ముఖ్య పాత్ర.. ఇతను వానరుడైన వాలి కుమారుడు. ఇతని తల్లి తార. వాలిని రాముడు చంపాక సుగ్రీవుడు రాజు అయినప్పుడు అంగదుడు యువరాజయ్యాడు. అంగదుణ్ణి రావణుని వద్దకు చివరి రాయబారిగా పంపుతారు. అంగద రాయబారం రామాయణంలో ఒక ముఖ్య ఘట్టం. రామరావణ యుద్ధంలో ఇతడు రావణుని సేనాధిపతి అయిన మహాకాయుడు అన్న రాక్షసుని చంపాడు. ఇతడే కృష్ణావతార కాలంలో బోయవాడై పుట్టి ఆ అవతారం ముగింపుకి కారణమయ్యాడు అని మన పురాణాలు చెబుతాయి[ఆధారం చూపాలి].


వాల్మీకి రామాయణంలో అంగదుని పాత్రను ఎంతో వీరుడు, శూరుడు, కార్య నిర్వాహకుడు, కర్తవ్య దీక్షాపరునిగా చిత్రించాడు. సీతను వెతకడానికి దక్షిణ దిశకు వెళ్ళిన జాంబవంత, హనుమదాధి మహావీరుల బృందానికి అంగదుడు నాయకుడు. అన్వేషణ దాదాపు విఫలమైందని భావించి, ప్రాయోపవేశానికి సిద్ధమైనపుడు మాత్రం నిసృహతో అంగదుడు సుగ్రీవుని విమర్శిస్తాడు. అది తప్పితే మిగిలిన అన్ని సందర్భాలలోను అతని రాజ భక్తి, రామకార్యం పట్ల నిరతి చాలా దృఢంగా ప్రదర్శించాడు.


యుద్ధానికి ముందు చివరి యత్నంగా రావణుని వద్దకు రాయబారిగా రాముడు అంగదుని పంపాడు. సీతను రామునికి అప్పగించి యుద్ధం మానుకొని తన వంశాన్ని రక్షించుకోమని అంగదుడు రావణునికి చెప్పాడు కాని రావణుడు సమ్మతించలేదు. నలుగురు రాక్షసులు అంగదుని పట్టుకొనబోగా అంగదుడు వారిని తన బాహువులలో బిగబట్టి వారితో సహా పైకెగిరి, రావణుని సౌధాగ్రాన్ని కాలితో తన్ని ఎగిరి కపిసేన మధ్యకు వచ్చిపడ్డాడు.


లంకా యుద్ధంలో అంగదుడు అసమానమైన ధైర్య పరాక్రమాలను ప్రదర్శించాడు. అనేక రాక్షసులను హతమార్చాడు. విపత్కాలంలో వానర సేనకు ధైర్యం చెప్పాడు. గొప్ప రాక్షస మహావీరులు అంగదుని చేత హతమయ్యారు. రెండవరోజు యుద్ధంలో వజ్రదంష్ట్రుడు అనే రాక్షస వీరుడు భీకరంగా వానరసేనపైబడి వారిని చంపేయసాగాడు. అపుడు అంగదుడు అతనిని నిలువరించాడు. వారిద్దరూ భీకరంగా యుద్ధం చేశారు. చివరకు అంగదుడు వజ్రదంష్ట్రుని తల నరికేశాడు.


కుంభకర్ణుడు యుద్ధం చేసేటపుడు వానరసేన కకావికలై పోతుండగా వారికి ధైర్యం చెప్పి అంగదుడు యుద్ధానికి ప్రోత్సహించాడు. స్వయంగా కుంభకర్ణుని నిలువరించడానికి ప్రయత్నించాడు. అంగదుడి పిడి దెబ్బకు కుంభకర్ణుడు మూర్ఛిల్లాడు కాని అంతలోనే తేరుకొని అంగదుడిని ఒక్కపోటు పొడిచాడు. దానితో అంగదుడు తెలివి తప్పిపడిపోయాడు. తరువాత కుంభకర్ణుడు రామలక్ష్మణుల బాణాలతో మరణించాడు. కుంభకర్ణుడి మరణం తరువాత త్రిశిరుడు, దేవాంతకుడు, నరాంతకుడు, అతికాయుడు వంటి మహారాక్షస వీరులు యుద్ధానికి బయలుదేరారు. వారిలో నరాంతకుడు అంగదునితో భీకరమైన యుద్ధం చేసి అంగదునిచేత మరణించాడు. ఇంద్రజిత్తు మరణం తరువాత యుద్ధానికి వచ్చిన మహాపార్శ్వుడు కూడా అంగదునిచేతనే మరణించాడు.


"https://te.wikipedia.org/w/index.php?title=అంగదుడు&oldid=542089" నుండి వెలికితీశారు