విక్షనరీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[File:Te-Wiktionary-firstpage.png| thumb|right| తెలుగు విక్షనరీ]]
[[File:Te-Wiktionary-firstpage.png| thumb|right| తెలుగు విక్షనరీ ముఖ పత్ర తెరపట్టు]]
విక్షనరీ <ref>[http://te.wiktionary.org విక్షనరీ సైటు] </ref>, [[వికీపీడియా]] యొక్క సోదర వెబ్ సైట్. ఈ పదం [[వికి]], [[నిఘంటువు| డిక్షనరి ]] పదాలను కలుపగా తయారయ్యినది. ఇది తెలుగు పదాలను వివిధమైన వ్యాకరణ, వాడుక, నానార్ధ, వ్యతిరేఖార్థ లాంటి వివరణలతో నిక్షిప్తంచేసే మాధ్యమము (నిఘంటువు). అయితే పుస్తక రూపంలో వుండే నిఘంటువులు మహా అయితే మూడు భాషలలో వుంటాయి. దీనిలో తెలుగు-తెలుగు, ఇంగ్లీషు-తెలుగుతో పాటు ఇతర విక్షనరీలోని సమాన అర్థం గల పదాలకు లింకులుండటంవలన, మీకు ప్రపంచంలోని వికీ భాషలన్నిటిలో సమాన అర్థంగల పదాలను తెలుసుకునే వీలుండటంతో, దీనిని బహుభాష నిఘంటువుగా పేర్కొనవచ్చు. తెలుగు వికీపీడియాలో లాగా, ఇందులో ఎవరైనా తెలుగు పదాలకు పేజీలను సృష్టించవచ్చు లేక మార్పులు చేయవచ్చు.
విక్షనరీ <ref>[http://te.wiktionary.org విక్షనరీ సైటు] </ref>, [[వికీపీడియా]] యొక్క సోదర వెబ్ సైట్. ఈ పదం [[వికి]], [[నిఘంటువు| డిక్షనరి ]] పదాలను కలుపగా తయారయ్యినది. ఇది తెలుగు పదాలను వివిధమైన వ్యాకరణ, వాడుక, నానార్ధ, వ్యతిరేఖార్థ లాంటి వివరణలతో నిక్షిప్తంచేసే మాధ్యమము (నిఘంటువు). అయితే పుస్తక రూపంలో వుండే నిఘంటువులు మహా అయితే మూడు భాషలలో వుంటాయి. దీనిలో తెలుగు-తెలుగు, ఇంగ్లీషు-తెలుగుతో పాటు ఇతర విక్షనరీలోని సమాన అర్థం గల పదాలకు లింకులుండటంవలన, మీకు ప్రపంచంలోని వికీ భాషలన్నిటిలో సమాన అర్థంగల పదాలను తెలుసుకునే వీలుండటంతో, దీనిని బహుభాష నిఘంటువుగా పేర్కొనవచ్చు. తెలుగు వికీపీడియాలో లాగా, ఇందులో ఎవరైనా తెలుగు పదాలకు పేజీలను సృష్టించవచ్చు లేక మార్పులు చేయవచ్చు.
=== విక్షనరీ అభివృద్ధి ===
=== విక్షనరీ అభివృద్ధి ===

06:00, 17 సెప్టెంబరు 2010 నాటి కూర్పు

తెలుగు విక్షనరీ ముఖ పత్ర తెరపట్టు

విక్షనరీ [1], వికీపీడియా యొక్క సోదర వెబ్ సైట్. ఈ పదం వికి, డిక్షనరి పదాలను కలుపగా తయారయ్యినది. ఇది తెలుగు పదాలను వివిధమైన వ్యాకరణ, వాడుక, నానార్ధ, వ్యతిరేఖార్థ లాంటి వివరణలతో నిక్షిప్తంచేసే మాధ్యమము (నిఘంటువు). అయితే పుస్తక రూపంలో వుండే నిఘంటువులు మహా అయితే మూడు భాషలలో వుంటాయి. దీనిలో తెలుగు-తెలుగు, ఇంగ్లీషు-తెలుగుతో పాటు ఇతర విక్షనరీలోని సమాన అర్థం గల పదాలకు లింకులుండటంవలన, మీకు ప్రపంచంలోని వికీ భాషలన్నిటిలో సమాన అర్థంగల పదాలను తెలుసుకునే వీలుండటంతో, దీనిని బహుభాష నిఘంటువుగా పేర్కొనవచ్చు. తెలుగు వికీపీడియాలో లాగా, ఇందులో ఎవరైనా తెలుగు పదాలకు పేజీలను సృష్టించవచ్చు లేక మార్పులు చేయవచ్చు.

విక్షనరీ అభివృద్ధి

జులై 2005 లో ప్రారంభమైన తెలుగు విక్షనరీ, 34,751 పదాల పేజీలకు (సెప్టెంబర్ 17, 2010 న) విస్తరించింది. అగష్టు-అక్టోబర్ 2007 మధ్యకాలంలో లో మాకినేని ప్రదీప్ కృషితో బ్రౌణ్య నిఘంటువుని (సుమారు 32,000 పదాలు) చేర్చుకొంది.

విక్షనరీ రూపము

తెలుగు విక్షనరీ పేజి - అమ్మ

తెలుగు విక్షనరీలో పదాల పేజీని పరిశీలిస్తే మీకు వివిధ విభాగాలు కనపడతాయి. ఉదా: అమ్మ పదం తెరపట్టు చూడండి.

విక్షనరీలో పనిచేసే విధానం

కొత్త పదము చేర్చటం

ముందుగా కొత్త తెలుగు పదం అనే మూసలో మీరు సృష్టించ తలచిన పదాన్ని అన్వేషించండి . ఆ పదానికి పేజీ ముందే సృష్టించబడి ఉంటే ఆ పదము మీకు నీలిరంగులో వుంటుంది. లేదంటే ఎర్ర రంగు లో కనపడే పదాన్ని నొక్కినపుడు కొత్త పేజీ సృష్టించాలా అనే సందేశం కనిపిస్తుంది. తరువాత కొత్త తెలుగు పదం అనే మూసలో ఆ పదాన్ని వ్రాసి ప్రక్కన ఉన్న సృష్టించు అనే బటన్ నొక్కండి. మీరనుకున్న పదానికి పేజీ సిద్ధం ఔతుంది.

వ్యాకరణ విశేషాలు

దీనిలో భాషా భాగం, వ్యుత్పత్తి, వచనం వుంటాయి. వ్యాకరణ ఉప విభాగంలో పదం విభక్తి లేక లింగము లేక నామవాచకమో విశేషణం లేక ఇలా ఆపదం ఏ వ్యాకరణ విభాగానికి చెందినదో వ్రాయాలి. వ్యుత్పత్తి ఉప విభాగంలో పదం యొక్క మూల పదం లేక రూపాంతర పదమో లాంటి వివరణ ఇవ్వాలి. లేక అది మూల పదమైతే ఇది ఒక మూల పదము అని వ్రాయవచ్చు. ఉదా :- వ్రాత అనేది మూల పదము. చేతివ్రాత అనేదానికి చెయ్యి, వ్రాత అనేవి రెండు మూల పదాలు. బహువచనము లేక ఏక వచనము అనే విభాగంలో ఆ పదము యొక్క వచన రూపం వ్రాయాలి. చెప్పులు, కళ్ళు, కాళ్ళు, కళ్ళ జోడు లాంటి పదాలు యధాతధంగా బహువనంలో వ్రాయాలి కదా !

అర్ధ వివరణ

దీనిలో పదానికి తగిన అర్ధవివరణ వ్రాయాలి.

పదాలు

దీనిలో నానార్ధాలు, సంబంధిత పదాలు, వ్యతిరేక పదాలు ఉంటాయి. నానా అర్ధాలులో పదానికి ఉండే ఇతర అర్ధాలు సమాన అర్ధాలు వ్రాయాలి. సంబంధిత పదాలులో ఆ పదానికి సంబంధించిన పదాలు వ్రాయాలి. వ్యతిరేక పదానికి ఆ పదానికి ఉండే వ్యతిరేక పదం వ్రాయాలి. నానార్ధాలు ఉపవిభాగంలో ఇతర సమానార్ధాలు వ్రాయాలి. ఇందులో ప్రాంతీయ, మాండలికాల భిన్న రూప పదాలు వ్రాయ వచ్చు. కూడా వ్రాయవచ్చు. ఉదా;- కోస్తా ప్రాంతంలో ప్రాంతంలో చిన్న బిడ్డ, పసి బిడ్డ అనేది కొంచం పడమట తెలుగు ప్రదేశాలలో సన్న బిడ్డ అంటారు. అలాంటివి నానార్ధాలులో పేర్కొన వచ్చు. అలాగే పదానికి వివిధ విభక్తి రూపాలు, వివిధ విశేషణ రూపాలు పేర్కొన వచ్చు. ఉదా: రాముడు, రాముడితో, రాముని, రాముడి వలన, రాముడే, రాముడి వంటి, రామునిలా, రాముడేనా, రాముడా ఇలా ఒకే పదం విభక్తి కారణంగా వివిధ రూపాలు మారుతుంటాయి. వాటిని సంబంధిత పద విభాగంలో పేర్కొన వచ్చు. అలాగే విశేషణం వలన మారే రూపాలు.

పద ప్రయోగాలు

ఇక్కడ పదాన్ని వాక్యాలలో, పద్య పాదాలలో, పా పాదాలలో, జానపదాలతో, సామెతలతో ప్రయోగిస్తూ ఉదహరించాలి.

అనువాదాలు

ఇది సమగ్రంగా తయారైతే ఎక్కువ ఉపయోగంగా వుండే విభాగం. ఇందులో ఆ పదానికి ఇతర భాషలో అర్ధాలు తెలిసిన వారు వాటిని చేర్చ వచ్చు. అర్ధాల ప్రక్కన బ్రాకెట్ లో ఇతర భాషా ఉచ్ఛారణ తెలుగులో వ్రాయాలి. ఇక్కడ దిద్దుబాటులో ఆ భాషలకు లింకులు ముందే తయారుగా ఉంటాయి. వాటి మధ్య ఆ భాషా పదాన్ని వ్రాసినప్పుడు అది నేరుగా అయా భాషలలో ఆ పదం ఉన్న పేజీకి తీసుకు వెళుతుంది. అనువాదాలలో మరింత కృషి జరగ వలసి ఉంది. ఇతర భాషలతో పరిచయం ఉన్న తెలుగు వారు ఈ పని చేపట్ట వచ్చు.

మూలాలు వనరులు

ఇక్కడ పదానికి మూలాలు ప్రత్యేకంగా ఉంటే సూచించ వచ్చు. సాధారణంగా తెలుగు పదాలకు ప్రత్యేకమైన మూలాలు అవసరం లేదు. అందరికీ తెలిసే పదాలను చేర్చే సమయంలో మూలాలు వెతకనవసరం లేదు.

బయట లింకులు

ఆంగ్ల వీకీ, తెవీకీ లింకులు ఇవ్వాలి. ఆంగ్లవీకీ లింకు ముందే ఉంటుంది. దానిలో పదానికి ఉండే సమానమైన ఆంగ్ల పదాన్ని వ్రాయాలి. ఈ లింకు ఆంగ్ల వీకీలో ఉండే వ్యాసానికి దారి తీస్తుంది.

వర్గాలు

పదం ఏ వర్గంలో చేరుతుందో వ్రాయాలి. ఉదా: కంప్యూటర్, మీట లాంటి పదాలను సమాచార సాంకేతిక పదాలు వర్గంలో చేర్చితే, సమాచార సాంకేతిక పదకోశం తయారీలో సహాయంగా వుంటుంది.

ఇతరాలు

చివరిగా ఎడిట్ పేజీలో మీకు అందుబాటులో ఉన్న సాంకేతిక సహాయంతో ఆ పదానికి చిత్రాన్ని చేర్చగలిగితే భాష తెలియని వారికి కూడా పదమేమిటో అర్ధం ఔతుంది. ఇది చాలా ఉపయోగకరం. చిత్రాలు ఇప్పటికే లేక పోతే మీరే వికీలో ప్రవేశ పెట్టి (అప్లోడ్) పేజీలో చేర్చ వచ్చు. ఇతర వీకీల నుండి చేర్చ వచ్చు. అయితే సభ్యులు తమకు తెలిసిన ఏ విభాగంలోఅయినా వ్రాయ వచ్చు పూర్తిగా వ్రాయాలన్న నియమం ఏమీ లేదు.

పద సేకరణ

విక్షనరీలో సాధారణంగా నిత్య జీవితంలో మన వాడే పదాలను చేర్చాలి. ప్రస్తుతం వాడుకలో లేని పదాలు మన ఇళ్ళల్లో పెద్ద వారు వాడుతుంటారు వాటిని చేర్చి అర్ధాలను వివరిస్తే మరుగున పడుతున్న పదాలు వెలుగులోకి వస్తాయి. జానపదులలో, పల్లె సీమల్లో కొన్ని చిత్రమైన పదాలు వాడుకలో ఉంటాయి. వాటిని కూడా ఇక్కడ చేర్చ వచ్చు. పల్లె సీమల్లో విభిన్నతలు అధికంగా ఉంటాయి. వాటిని చిత్రాలతో ఉదహరిస్తే బాగుంటుంది. పల్లె పదాల్లో అమాయకత్వం, సహజత్వం ఎక్కువ అటువంటి పదాలను చేర్చ వచ్చు. కుల పరంగా కొన్ని ప్రత్యేక పదాలు ఉంటాయి. వాటిని కూడా చేర్చ వచ్చు. సంస్కృతి, సాంప్రదాయాల పరంగా కొన్ని ప్రత్యేక పదాలు ఉంటాయి. వాటినీ చేర్చ వచ్చు. వ్యవసాయానికి సంబంధించి అనేక పదాలు ఉంటాయి వాటినీ చేర్చ వచ్చు. ఇలా విభిన్న పదాలను చేర్చ వచ్చు.వార్తా పత్రికలు, అంతర్జాల అభివృద్ధి వలన కొన్ని కొత్త పదాలు సృష్టింపబడతాయి. వాటిని కూడా పేర్కొన వచ్చు. ఇలా మన పరిసరాలను గమనిస్తే అనేకానేక పదాలు వినిపిస్తాయి. వాటన్నింటినీ ఇక్కడ నిక్షిప్తం చేయవచ్చు.

విక్షనరీ గణాంకాలు

వనరులు

"https://te.wikipedia.org/w/index.php?title=విక్షనరీ&oldid=543630" నుండి వెలికితీశారు