రాహువు జ్యోతిషం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6: పంక్తి 6:
=== కారకత్వం ===
=== కారకత్వం ===
రాహువు పితామహుడు (తాత), వృద్ధాప్యము, శ్వాస, భాష, అసత్యము, భ్రమ, వాయువు, విచారము, జూదము, కఫము, సంధ్యా సమయం, బయట ప్రదేశం, గొడుగు, పల్లకి, అపరి శుభ్రం, గొడుగు, పల్లకి, విమర్శ, అంటరాని తనం, నల్లులు, దోమలు, గుడ్లగూబలు, విషకీటకములను సూచిస్తాడు.

* వృత్తులు :- విషసంబంధిత రసాయనాల తయారీ సంస్థలు, పాములు పట్టుట, భూతవైద్యము, శ్మశానంలో పని చేయుట, నాగ పూజ, దొంగతనం, వైద్య శాస్త్రం, గారడీ విద్యలు. శుక్రుడితో కలిసి ఉంటే సినీరంగం,నాటక రంగం, అడ్వర్టైజ్ మెంటు రంగం, బుధుడితో చేరిన రచయిత, గారడీ విద్య, శనితో చేరిన మోసపుచ్చిన జీవించుట, గురువుతో కలిసిన కపట గురువు మొదలైనవి. జైళ్ళు, క్రిమినల్ కోర్ట్లో ఉద్యోగాలు, ఎలెక్ట్రిక్‌సిటీ, ఆటోమొబైల్స్, గ్యాస్, ఇనుము, నిప్పుకు సంబంధించిన వృత్తులు. అగ్నిమాపక దళ వృత్తులను సూచిస్తాడు.
* వృత్తులు :- విషసంబంధిత రసాయనాల తయారీ సంస్థలు, పాములు పట్టుట, భూతవైద్యము, శ్మశానంలో పని చేయుట, నాగ పూజ, దొంగతనం, వైద్య శాస్త్రం, గారడీ విద్యలు. శుక్రుడితో కలిసి ఉంటే సినీరంగం,నాటక రంగం, అడ్వర్టైజ్ మెంటు రంగం, బుధుడితో చేరిన రచయిత, గారడీ విద్య, శనితో చేరిన మోసపూరిత జీవితం, గురువుతో కలిసిన కపట గురువు మొదలైనవి. జైళ్ళు, క్రిమినల్ కోర్ట్లో ఉద్యోగాలు, ఎలెక్ట్రిక్‌సిటీ, ఆటోమొబైల్స్, గ్యాస్, ఇనుము, నిప్పుకు సంబంధించిన వృత్తులు. అగ్నిమాపక దళ వృత్తులను సూచిస్తాడు.
* వ్యాధులు :- నులి పురుగులు, గుల్మ రోగం, అంతు చిక్కని రోగాలు మొదలైనవి. రాహువు ఏగ్రహంతో కలిసి ఉంటే ఆయాగ్రహ సంబంధిత రోగాలను ఇస్తాడు.
* వ్యాధులు :- నులి పురుగులు, గుల్మ రోగం, అంతు చిక్కని రోగాలు మొదలైనవి. రాహువు ఏగ్రహంతో కలిసి ఉంటే ఆయాగ్రహ సంబంధిత రోగాలను ఇస్తాడు.
* విద్యలు :- రాహువు ఏగ్రహముతో చేరిన ఆగ్రహ సంబంధిత విద్యలను సూచిస్తాడు.
* విద్యలు :- రాహువు ఏగ్రహముతో చేరిన ఆగ్రహ సంబంధిత విద్యలను సూచిస్తాడు.

=== రూపము ===
=== రూపము ===
రాహువు క్రూర రూపము కలవాడు, పొడగరి, నల్లని మేని ఛాయ కలవాడు. నాలుగు భుజములు గలవాడు. కత్తి, త్రిశూలమును ధరించి కవచ ధారణ చేసి ఉంటాడు. సింహాన్ని అధిరోహించి ఉంటాడు. తండ్రి కశ్యపుడు, తల్లి సింహిక, భార్య కరాళ. పార్ధివ నామ సంవత్సరం భాద్రపద శుక్ల పూర్నిమ నాడు పూర్వాభద్రా నక్షత్రములో జన్మించాడు. రాహువు క్షీర సాగర మధన సమయంలో దేవతా రూపం ధరించి మోహినీ చేతి అమృతపానం చేసాడు. దానిని సూర్య, చంద్రులు విష్ణు మూర్తికి చెప్పడంతో విష్ణువు అతడి తలను మొండెం నుండి వేరు చేయడంతో పాము శరీరం పొందాడు. విష్ణు మూర్తి అతడిని అనుగ్రహించి గ్రహ మండలంలో స్థానం కల్పించాడు. అప్పటి నుండి సూర్యచంద్రులకు శత్రువై గ్రహణ సమయాన కబళించి తిరిగి విడుస్తుంటాడని పురాణ కధనం వివరిస్తుంది. రాహువు రాక్షస నామ సంవత్సరం మాఘ కృష్ణ చతుర్ధశి ఆశ్లేష నక్షత్రంలో గ్రహజన్మను ఎత్తాడు.

04:33, 11 అక్టోబరు 2010 నాటి కూర్పు

రాహువు స్త్రీ గ్రహం.ఇది ఛాయా గ్రహం. అపసవ్య మార్గాన నడుస్తుంది. అంటే మేషం, తరువాత మీనం ఇలా వెనక్కు నడుస్తుంది. రాహువు నక్షత్రాలు ఆరుద్ర, స్వాతి, శతభిషం. ఈ మూడు నక్షత్ర జాతకులకు మొదటి దశ రాహుదశా శేషంతో ప్రారంభం ఔతుంది. రాహు దశాకాలం పద్దెనిమిది సంవత్సరాలు. సాధారణంగా రాహుదశాకాలంలో మనిషి జీవితంలో ఒడి దుడుకులు అధికం. కాని కొన్ని నక్షత్రాలకు కొంత వెసులు బాటు ఉంటుంది. రాహువుకు రాశిచక్రంలో ఇల్లు లేదు. రాహువు వృషభరాశిలో ఉచ్ఛస్థితి పొందుతాడు. రాహువు వృశ్చిక రాశిలో నీచ స్థితిని పొందుతాడు. కొన్ని ప్రాచీన గ్రంధాలలో జ్యోతిహ శాస్త్ర రాహువు ప్రస్తావన లేదు. కాని ఆధునిక శాస్త్రంలో రాహువుకు అధిక ప్రాముఖ్యత ఇస్తున్నారు. రాహువు పాపగ్రహం. రాహువు ఏగ్రహంతో కలిసి ఉంటే ఆ ఫలితాలను ఇస్తాడు. రాహువు శరీరం దిగువ భాగం పాము శరీరం ఉంటుంది. అందుకనే రాహువుకు విషముతో అధిక ప్రాముఖ్యత ఉంటుంది. ఎప్పుడూ రోదశీలో ఉండే సూర్యుడిని కొంత కాలం కనిపించకుండా చేస్తాడు కనుక కల్పనా జగత్తుకు ప్రతీకగా జ్యోతిష పండుతులు విశ్వసిస్తారు. కళాకారుల జీవితంలో రాహువు ప్రధాన పాత్ర పోషిస్తాడని జ్యోతిష శాత్ర పండితులు విశ్వసిస్తారు.

గుణగణాలు

రాహువు తమోగుణ ప్రధానుడు, గ్రహ సంఖ్య రెండు, అధిదేవత గౌరి, ముసలి వారిని సూచిస్తాడు. బుధుడు, శుక్రుడు, శని మిత్రులు. సూర్యుడు, చంద్రుడు, కుజుడు శత్రువులు. గురువు సముడు. స్వక్షేత్రం కుంభం, శత్రు క్షేత్రం సింహం, మిత్ర క్షేత్రం తుల. అసుర, బహి, స్వర్భాను, తమస అనేవి ఇతర నామాలు. జాతి మ్లేచ్ఛ, స్వాభావము క్రూరము, రుచులలో పులుపును సూచిస్తాడు. ప్రదేశం పాములు తిరిగే ప్రదేశం. దిక్కు నైరుతి, పాలనా శక్తి భటుడు, ఆత్మాధికారం కష్టాలు, లోహము సీసం, గృహ స్థానం ఉపయోగంలో లేని ప్రదేశం, గ్రహపీడ సంతాన లేమి, గ్రహం రాశిలో ఉండే కాలం ఒకటిన్నర సంవత్సరం. వృక్షము పొదలు, ఆహార పదార్ధాలు మినుములు, ఖర్జూరం, ఆవాలు. జంతువులు ఏనుగు, పాములు అడవి ఎలుకలు. వస్తువు గొడుగు, సమిధ దుర్వ, మూలిక చందనం, దేవ వర్గం శైవ, అవతారం వరాహావతారం.

కారకత్వం

రాహువు పితామహుడు (తాత), వృద్ధాప్యము, శ్వాస, భాష, అసత్యము, భ్రమ, వాయువు, విచారము, జూదము, కఫము, సంధ్యా సమయం, బయట ప్రదేశం, గొడుగు, పల్లకి, అపరి శుభ్రం, గొడుగు, పల్లకి, విమర్శ, అంటరాని తనం, నల్లులు, దోమలు, గుడ్లగూబలు, విషకీటకములను సూచిస్తాడు.

  • వృత్తులు :- విషసంబంధిత రసాయనాల తయారీ సంస్థలు, పాములు పట్టుట, భూతవైద్యము, శ్మశానంలో పని చేయుట, నాగ పూజ, దొంగతనం, వైద్య శాస్త్రం, గారడీ విద్యలు. శుక్రుడితో కలిసి ఉంటే సినీరంగం,నాటక రంగం, అడ్వర్టైజ్ మెంటు రంగం, బుధుడితో చేరిన రచయిత, గారడీ విద్య, శనితో చేరిన మోసపూరిత జీవితం, గురువుతో కలిసిన కపట గురువు మొదలైనవి. జైళ్ళు, క్రిమినల్ కోర్ట్లో ఉద్యోగాలు, ఎలెక్ట్రిక్‌సిటీ, ఆటోమొబైల్స్, గ్యాస్, ఇనుము, నిప్పుకు సంబంధించిన వృత్తులు. అగ్నిమాపక దళ వృత్తులను సూచిస్తాడు.
  • వ్యాధులు :- నులి పురుగులు, గుల్మ రోగం, అంతు చిక్కని రోగాలు మొదలైనవి. రాహువు ఏగ్రహంతో కలిసి ఉంటే ఆయాగ్రహ సంబంధిత రోగాలను ఇస్తాడు.
  • విద్యలు :- రాహువు ఏగ్రహముతో చేరిన ఆగ్రహ సంబంధిత విద్యలను సూచిస్తాడు.

రూపము

రాహువు క్రూర రూపము కలవాడు, పొడగరి, నల్లని మేని ఛాయ కలవాడు. నాలుగు భుజములు గలవాడు. కత్తి, త్రిశూలమును ధరించి కవచ ధారణ చేసి ఉంటాడు. సింహాన్ని అధిరోహించి ఉంటాడు. తండ్రి కశ్యపుడు, తల్లి సింహిక, భార్య కరాళ. పార్ధివ నామ సంవత్సరం భాద్రపద శుక్ల పూర్నిమ నాడు పూర్వాభద్రా నక్షత్రములో జన్మించాడు. రాహువు క్షీర సాగర మధన సమయంలో దేవతా రూపం ధరించి మోహినీ చేతి అమృతపానం చేసాడు. దానిని సూర్య, చంద్రులు విష్ణు మూర్తికి చెప్పడంతో విష్ణువు అతడి తలను మొండెం నుండి వేరు చేయడంతో పాము శరీరం పొందాడు. విష్ణు మూర్తి అతడిని అనుగ్రహించి గ్రహ మండలంలో స్థానం కల్పించాడు. అప్పటి నుండి సూర్యచంద్రులకు శత్రువై గ్రహణ సమయాన కబళించి తిరిగి విడుస్తుంటాడని పురాణ కధనం వివరిస్తుంది. రాహువు రాక్షస నామ సంవత్సరం మాఘ కృష్ణ చతుర్ధశి ఆశ్లేష నక్షత్రంలో గ్రహజన్మను ఎత్తాడు.

రాహుకాలం

  • రాహు కాలం వారంలో ప్రతి రోజు ఒకటిన్నర గంటల సమయం ఉంటుంది. ఆ సమయంలో చేసే పనులకు ఆంటంకం కలుగుతుందని విశ్వసిస్తారు కనుక ముఖ్యమైన పనులైతే ఆసమయంలో చేయరు. కాని దోష నివారణ కొరకు రాహుకాలంలో పూజలు నిర్వహిస్తారు. దుర్గాదేవికి రాహుకాలంలో నిమ్మడిప్పలో నూనె పోసి దీపం వెలిగిస్తారు. ఆది వారం సాయంత్రం 4 1/2(నాలుగున్నర )గంటల నుండి 6 గంటల వరకు, సోమ వారం ఉదయం 71/2(ఏడున్నర) 9 వరకు, మంగళ వారం 3 గంటల నుండి 41/2(నాలుగున్నర) గంటల వరకు, బుధ వారం 12 గంటల నుండి 11/2(ఒకటిన్నర), గురువారం 1/2 గంటల నుండి 3 గంటల వరకు, శుక్ర వారం 10 1/2 గంటల నుండి 12 గంటల వరకు, శని వారం 9 గంటల నుండి 101/2 గంటల వరకు రాహుకాలం ఉంటుంది.

పరిహారం

రాహువును శాంతింప చేయడానికి చేయవలసిన పరిహార విధులు. ప్రతిమకు కావలసిన లోహము సీసం, ప్రతిమకు పూజకు గ్రహ ఆసనం చేట, సమిధ దూర్వ, నైవేద్యం మినప సున్ని, మినప గారెలు, ఖర్జూరం, చేయవలసిన పూజ అధిష్టాన దేవత అయిన సరస్వతి పూజ, దుర్గా పూజ, సుభ్రహ్మణ్య స్వామి పూజ, శివారాధన, రాహుకాలంలో దుర్గకు నిమ్మకాయ దీపం పెట్టడం. ఇది దేవాలయంలో దుర్గాదేవి సన్నిధిలో చేయాలి. ఇంట్లో అయితే నేతి దీపం పెట్టాలి.ఆచరించ వలసిన వ్రతం సరస్వతి వ్రతం, రాహువుకు ప్రియమైన తిధి చైత్ర బహుళ ద్వారశి, పారాయణ చేయవలసినవి రాహు అష్టోత్తరం, లలితా సహస్రనామం, ఆచరించవలసిన దీక్ష భవానీ దీక్ష, ధరించవలసిన మాల రుద్రాక్ష మాల, అష్టముఖ రుద్రాక్ష, రత్నము గోమేధికము, దర్శించవలసిన దేవాలయములు సరస్వతి, దుర్గ, సుభ్రహ్మణ్య స్వామి దేవాలయం, శివాలయాలు, నవగ్రహాలయాలు. దానం చెయ్యవలసినవి ఎండు ద్రాక్ష, తేనె, ఖర్జూరములు. చేయవలసిన జపసంఖ్య పద్దెనిమిది వేలు.