మాధ్యమము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 7: పంక్తి 7:
నాట్య భంగిమలకు ప్రసిద్ధి. ఆ కాలపు శిక్షించిన విధానాన్ని సుచీంద్రం కేవెలలో శిలారూపంలో చూడవచ్చు. శిల్పకళా వైరుద్యాలు వాటిని నిర్మించిన కాలాన్ని అప్పటి సంస్కృతిని ఈ కాలానికి అందిస్తున్నాయి. కుడ్యచిత్రాలు, చిత్రలేఖనాలు కూడా అప్పటి చరిత్రను వేషధారణను మరింత విశదీకరిస్తాయి.

=== కళారూప మాధ్యమం ===
=== కళారూప మాధ్యమం ===
గానము, నాట్యము, నాటకము, బుర్రకధ, వీధినాటకాలు, కధాకాలక్షేపము, హరికధ, ఉపన్యాసము, యక్షగానము, ప్రవచనము వంటి రూపాలలో రాజుల కధలను, సంఘటనలను, పురాణాలను ఆకర్షణీయమైన కళారూపంలో ప్రజలకు చేరువ చేసే వారు. ఇవి ప్రజల మనసు రంజింప చేస్తూ ఇతిహాసాలను, ఆ నాటి రాజుల చరిత్రలను, ముఖ్య సంఘటనలు ప్రజల వద్దకు చేరేవి. వాల్మికి రామాయణమును రచించి రాముని పుత్రులకు గాన రూపంలో శిక్షణ ఇచ్చి అయోధ్య అంతా వినిపించ చేసాడు. రచించినది ప్రజల వద్దకు చేర్చడంత అవసరమో ఆది కవి నిరూపించాడు. వ్యాసుడు భారత రచన చేసి వాటిని శిష్యులకు నేర్పి ఆ కావ్యాన్ని ప్రజల మద్యకు తీసుకు వెళ్ళాడు. ఈ కధను వినిపించే వారిని సూతులు అంటారు. అలాగే వేద విభజన చేసి వాటిని శిష్యులకు నేర్పించి వేద వ్యాప్తికి తోడ్పడ్డాడు. వ్యాసుడి కుమారుడైన శుక మహర్షి భాగవత కధను స్వయంగా పరిక్షిత్తు మహారాజుకు ప్రవచన రూపంలో వినిపించాడు.కాశిదాసు నాటకాలను రచించి కళా కారుల చేత నటింప చేసి రచనలను ప్రజలకు నాటక రూపంలో చేర వేసాడు. నాటకాలు కధలను ఇతిహాసాలను దృశ్యరూపంలో ప్రజలకు అందించాయి. కబీరుదాసు, త్యాగరాజు, అన్నమయ్య వంటి గాయకులు తమ భక్తిరసమయ రచనలను కృతులను స్వయంగా గాన రూపంలో తిరుగుతూ పాడుతూ అందించారు. దేవదాసీ సంప్రదాయంతో నాట్యరూపంతో పురాణేతిహాసాలు ప్రజలకు చేరువ చేయబడ్డాయి. ఆసక్తి కరమైన మరొక మాధ్యమం బుర్రకధ. ఇది ముగ్గురు కళాకారులచేత చెప్పబడుతుంది. ప్రధాన కధకుడు కధను వినిపిస్తుంటాడు. పక్కన ఉండే ఇద్దరు కధకులు హాస్యోక్తులు పలుకుతూ తందాన అని చెబుతూ కొంత రంజింప చేస్తారు. దీనిలో కళాకారులు తమ వాద్యాలను తామే వాయుస్తుంటారు. వీరు ముఖ్యమైన సంఘటనలను, చారిత్రక విషయాలను చెప్పడానికి ప్రాముఖ్యత ఇస్తారు. హరికధకులు ఒంటరిగా కధచెప్తారు. వీరు కధను వచన రూపంలోను అక్కడక్కడా పద్య రూపంలోను గాన రూపంలోను చెప్తూ కొంత అభినయం చూపిస్తూ చెప్తారు. వీరికి పక్క వాయుద్యం కావాలి. వీరంతా ఆ కాలంలో ఆలయాలను తమ వేదికగా చేసుకుని ప్రచారం చేసిన వారే.

17:26, 30 అక్టోబరు 2010 నాటి కూర్పు

మాధ్యమము అంటే సమాచారమును అందింస్తూ రూపకర్తను ప్రజలను అను సంధానించేది. మానవాభివృద్ధికి మాధ్యమము చాలా ఉపకరిస్తుంది. సమాచారం ఒకరి నుండి ఒకరికి చేరినప్పుడే విజ్ఞానం విస్తరిస్తుంది. ఉదాహరణగా రచయిత తన కల్పనా శక్తితో రచించే కధలు, నవలలు, వ్యాసాలు లాంటివి ప్రజలకు చేరినప్పుడే రచయితకు తృప్తి రచనకు సార్ధకత ఏర్పడుతుంది. ప్రజా పాలనకు మాధ్యమం అత్యవసరం. ఉదాహరణగా రాజ్యాంగ ఉత్తరువులను ప్రజలకు చేర్చడంలో ప్రచురణా మాధ్యమం తోడ్పడుతుంది. పండితులను పామరులకు చక్కగా చేరువ కాగలిగింది అందరికి సులువుగా అర్ధం అయ్యేది శబ్ధరూపం. ఆకాశవాణి వాణి కార్యక్రమాలు శబ్ధరూప మాధ్యమం. ఆకాశవాణి వాత్రలను అందించడం లాంటి అనేక కార్యక్రమాలను అందించి ఒకప్పుడు ప్రజలను విపరీతంగా అలరించింది. ఇక ప్రచురణా వ్యవస్థ అత్యద్భుత సేవలు అందిస్తూ ప్రజలను విపరీతంగా అలరించింది ఇప్పుడూ అనేక సంచలనాలను సృష్టిస్తుంది ప్రజాదరణ చూరగొంటూ ముందడుగు వేస్తున్నదీ మాధ్యమం.

పురాతన కాల మాధ్యమం

ఆదిమానవుని కాలంలో కుడ్య శల్పాలు, కుడ్య చిత్రాలు ఒక రకంగా మొదటి మాధ్యమమని అనుకోవచ్చు. లిపి కూడా లేని కాలంలో మానవుడు తన భావాలను వెబుచ్చడానికి చేసిన ప్రయత్నమే కుడ్యశిల్పాలు. అవి ఇప్పటికీ ఆనాటి నాగరికత, ఆనాటి జంతువులు, వారి సంస్కృతి మనకు అందిస్తూ గత చరిత్రను ఆధునికులకు అందించడంలో తమ తోడ్పాటు అందిస్తున్నాయి. అజంతా ఎల్లోరా గుహలు దీనికి ఉదాహరణలు. లిపి పుట్టిన తరువాత కాగితం లేని సమయంలో ముందుగా సమాచారాన్ని, భద్రపరచి ప్రజలకు అందించడానికి కొంత ఎక్కువ కాలం మన్నే తాటి ఆకులను రచయితలు మాధ్యమంగా ఎంచుకున్నారు. ఇప్పటికీ పురాతన రచనల తాళ పత్ర గ్రంధాలను భద్రపరచి అపురూప సంపదగా కాపాడబడుతున్నాయి. అలాగే లోహాలను రచనలు భద్రపరచడానికి ఎంచుకుని రచనలు సాగించారు. అవే తామ్రపత్ర గ్రంధాలు. ఇవి అత్యధిక కాలం మన్నికగా ఉంటాయి. రాజులు తమ శాసనాలను ప్రజలకు తెలియపరచడానికి శిలలను మాధ్యమంగా చేసుకుని వాటి మీద శాసనాలను చెక్కించి ప్రజలకు కనిపించేలా స్థాపించారు. దేవాలయాలు, కోటలు మొదలైన ప్రదేశాలలో వీటిని ఇప్పటికీ చూడ వచ్చు. అలాగే రాజాజ్ఞను ప్రజలకు చేరవేయడానికి మనిషి డప్పు, ఢంకా వంటివి వాయిస్తూ మాటాలతో బిగ్గరగా పలుకుతూ ఉంరంతా తిరుగుతూ ప్రచారం చేసే వారు. ఆ కాలంలో విద్యుత్‌ పరికరాలు కనిపెట్ట లేదు కనుక ప్రజలకు సమాచారం ఈ విధంగా అందేది. డప్పు వాయిస్తూ విషయాన్ని బిగ్గరగా మాటలలో పలుకుతూ ఊరంతా తిరిగే వారు. ఈ పని చేయడానికి ప్రత్యేక ఉద్యోగులు ఉండే వారు. ఈ పద్దతిని చాటింపు అంటారు. ఇందులో డప్పు శబ్ధం ముందుగా ఆకర్షించి తరువాత మాటలు ప్రజలను చేరుతాయి. ఢంకా ప్రత్యేకమై ఉన్నత ప్రదేశంలో ఉంచి పెద్దగా వాయిస్తూ అతి బిగ్గరగా చెప్తారు. కొన్ని చోట్ల పెద్ద పెద్ద గంటలను రాజ భవనం ముందు ఉంచే వారు. ప్రజలు రాజుకు విన్న వించాలని అనుకున్నప్పుడు గంట వాగించి ఆతరువాత రాజోద్యోగుల ద్వారా రాజును దర్శించి తమ విన్నపాలను రాజుకు చెప్పుకునేవారు. కాగితం లేని రోజులలో రాజ్యాల మద్య సందేశాలను వస్త్రం మీద వ్రాయబడిన లేఖల ద్వారా ప్రత్యేక ఉద్యోల చేత అందించబడేది. వీరిని వార్తాహరులు అనే వారు. ఇదీ ఒక మాధ్యమమే.

వస్తురూప మాధ్యమం

ప్రాచీనకాల రాతి పనిముట్లు రాతియుగపు మానవుని తొలి నైపుణ్యంగా అప్పటి వారి సాంకేతిక జ్ఞానాన్ని మనకు అందిస్తున్నాయి. తవ్వకాలలో లభించే వస్తువులు, నగరాలు పురాతన మానవ సంస్కృతిని అధునికులకు చేరవేస్తున్నాయి. శిలాజాలు భూమి మీద నశించిన జీవరాశుల రహస్యాలను ఇప్పటి మానవులకు అందిస్తున్నాయి. దేవాలయ శిల్పాలు ఆ కాలపు నాట్య భంగిమలను, పురాణ కధలను అందిస్తున్నాయి. ఖజూరహో శిల్పాలు, బేలూరు, హళి బీడు శిల్పాలు నాట్య భంగిమలకు ప్రసిద్ధి. ఆ కాలపు శిక్షించిన విధానాన్ని సుచీంద్రం కేవెలలో శిలారూపంలో చూడవచ్చు. శిల్పకళా వైరుద్యాలు వాటిని నిర్మించిన కాలాన్ని అప్పటి సంస్కృతిని ఈ కాలానికి అందిస్తున్నాయి. కుడ్యచిత్రాలు, చిత్రలేఖనాలు కూడా అప్పటి చరిత్రను వేషధారణను మరింత విశదీకరిస్తాయి.

కళారూప మాధ్యమం

గానము, నాట్యము, నాటకము, బుర్రకధ, వీధినాటకాలు, కధాకాలక్షేపము, హరికధ, ఉపన్యాసము, యక్షగానము, ప్రవచనము వంటి రూపాలలో రాజుల కధలను, సంఘటనలను, పురాణాలను ఆకర్షణీయమైన కళారూపంలో ప్రజలకు చేరువ చేసే వారు. ఇవి ప్రజల మనసు రంజింప చేస్తూ ఇతిహాసాలను, ఆ నాటి రాజుల చరిత్రలను, ముఖ్య సంఘటనలు ప్రజల వద్దకు చేరేవి. వాల్మికి రామాయణమును రచించి రాముని పుత్రులకు గాన రూపంలో శిక్షణ ఇచ్చి అయోధ్య అంతా వినిపించ చేసాడు. రచించినది ప్రజల వద్దకు చేర్చడంత అవసరమో ఆది కవి నిరూపించాడు. వ్యాసుడు భారత రచన చేసి వాటిని శిష్యులకు నేర్పి ఆ కావ్యాన్ని ప్రజల మద్యకు తీసుకు వెళ్ళాడు. ఈ కధను వినిపించే వారిని సూతులు అంటారు. అలాగే వేద విభజన చేసి వాటిని శిష్యులకు నేర్పించి వేద వ్యాప్తికి తోడ్పడ్డాడు. వ్యాసుడి కుమారుడైన శుక మహర్షి భాగవత కధను స్వయంగా పరిక్షిత్తు మహారాజుకు ప్రవచన రూపంలో వినిపించాడు.కాశిదాసు నాటకాలను రచించి కళా కారుల చేత నటింప చేసి రచనలను ప్రజలకు నాటక రూపంలో చేర వేసాడు. నాటకాలు కధలను ఇతిహాసాలను దృశ్యరూపంలో ప్రజలకు అందించాయి. కబీరుదాసు, త్యాగరాజు, అన్నమయ్య వంటి గాయకులు తమ భక్తిరసమయ రచనలను కృతులను స్వయంగా గాన రూపంలో తిరుగుతూ పాడుతూ అందించారు. దేవదాసీ సంప్రదాయంతో నాట్యరూపంతో పురాణేతిహాసాలు ప్రజలకు చేరువ చేయబడ్డాయి. ఆసక్తి కరమైన మరొక మాధ్యమం బుర్రకధ. ఇది ముగ్గురు కళాకారులచేత చెప్పబడుతుంది. ప్రధాన కధకుడు కధను వినిపిస్తుంటాడు. పక్కన ఉండే ఇద్దరు కధకులు హాస్యోక్తులు పలుకుతూ తందాన అని చెబుతూ కొంత రంజింప చేస్తారు. దీనిలో కళాకారులు తమ వాద్యాలను తామే వాయుస్తుంటారు. వీరు ముఖ్యమైన సంఘటనలను, చారిత్రక విషయాలను చెప్పడానికి ప్రాముఖ్యత ఇస్తారు. హరికధకులు ఒంటరిగా కధచెప్తారు. వీరు కధను వచన రూపంలోను అక్కడక్కడా పద్య రూపంలోను గాన రూపంలోను చెప్తూ కొంత అభినయం చూపిస్తూ చెప్తారు. వీరికి పక్క వాయుద్యం కావాలి. వీరంతా ఆ కాలంలో ఆలయాలను తమ వేదికగా చేసుకుని ప్రచారం చేసిన వారే.

"https://te.wikipedia.org/w/index.php?title=మాధ్యమము&oldid=553723" నుండి వెలికితీశారు