మల్లీశ్వరి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
→‎విశేషాలు: Controversial comments removed
పంక్తి 59: పంక్తి 59:
* కోతీ బావకు పెళ్ళంట, కోవెల తోట విడిదంట -
* కోతీ బావకు పెళ్ళంట, కోవెల తోట విడిదంట -
* పిలచిన బిగువటరా ఔరౌరా- భానుమతి
* పిలచిన బిగువటరా ఔరౌరా- భానుమతి
* ఔనా!నిజమేనా! - ఘంటసాల, భానుమతి
* ఔనా! నిజమేనా! మరతునన్నా మరువలేను- ఘంటసాల, భానుమతి
* ఉషా పరిణయం యక్షగానం- కమలాదేవి, భానుమతి
* ఉషా పరిణయం [[యక్షగానం]]- కమలాదేవి, భానుమతి
* పరుగులు తీయాలి, గిత్తలు ఉరకలు వేయాలి - భానుమతి
* పరుగులు తీయాలి, గిత్తలు ఉరకలు వేయాలి - భానుమతి
* నోమిన మల్లాల నోమన్న లాలా (సంప్రదాయ గానం)- భానుమతి
* నోమిన మల్లాల నోమన్న లాలా (సంప్రదాయ గానం)- భానుమతి

15:29, 5 డిసెంబరు 2010 నాటి కూర్పు

మల్లీశ్వరి
(1951 తెలుగు సినిమా)

అప్పటి సినిమా పోస్టరు [1]
దర్శకత్వం బి.ఎన్.రెడ్డి
నిర్మాణం బి.ఎన్.రెడ్డి
రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి
చిత్రానువాదం బి.ఎన్.రెడ్డి
తారాగణం నందమూరి తారక రామారావు,
భానుమతి,
సురభి కమలాబాయి,
బేబీ మల్లిక,
మాస్టర్ వెంకటరమణ,
న్యాపతి రాఘవరావు,
ఋష్యేంద్రమణి,
శ్రీవాత్సవ,
వంగర,
కమలాదేవి
సంగీతం సాలూరి రాజేశ్వరరావు,
ఆదేపల్లి రామారావు
నేపథ్య గానం రామకృష్ణ,
ఘంటసాల,
భానుమతి,
మాధవపెద్ది సత్యం,
శకుంతల
గీతరచన దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి
సంభాషణలు దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి,
బుచ్చిబాబు
ఛాయాగ్రహణం బి.ఎన్.కోదండరెడ్డి,
ఆది.ఎమ్.ఇరాని
కళ ఎ.కె.శేఖర్
రికార్డింగ్ పి.వి.కోటేశ్వరరావు
నిర్మాణ సంస్థ వాహిని పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తెలుగు చలనచిత్ర చరిత్రలో సాటిలేని మేటి కళాఖండంగానూ, అపురూప దృశ్యకావ్యంగానూ మల్లీశ్వరి ఖ్యాతిగాంచింది. ఆ సినిమా ఎన్నిదేశాలు తిరిగిందో లెక్క లేదు. రాచరికపు ఆడంబరాలను, ఆచారాలను చిత్రించినా ఆ సినిమా కమ్యూనిస్టు దేశమైన చైనాలోనే వందరోజులకు పైగా ఆడింది. ఆ సినిమాకు మాటలు, పాటలు, కళ, నటన, సంగీతం, ఛాయాగ్రహణం, ఎడిటింగులతో సహా అంతా తానై బి.ఎన్. నడిపించినవే. అందుకే కృష్ణశాస్త్రి "మల్లీశ్వరి సృష్టిలో మేమంతా నిమిత్తమాత్రులం. బి.ఎన్.రెడ్డి గారు దీనికి సర్వస్వం." అన్నాడు.

నేపథ్యం

శ్రీకృష్ణదేవరాయలంటే ఆరాధనాభావమున్న బి.ఎన్. రాయలవారి మీద ఒక సినిమా తీయాలని సంకల్పించారు.ఆంధ్రాంగ్ల సాహిత్యాలను విస్తృతంగా అధ్యయనం చేసిన బి.ఎన్. తమ తొలి సినిమా 'వందేమాతరం' షూటింగు కోసం హంపి వెళ్ళినప్పటి నుంచి అందుకు తగిన కథ కోసం వెదుకుతూనే వున్నారు. ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో వచ్చిన ఒక కథ, బుచ్చిబాబు వ్రాసిన ఒక కథ(రాయలకరుణకృత్యం) కలిపి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి చేత మాటలు, పాటలు వ్రాయించారు. అదే "మల్లీశ్వరి"(1951). కృష్ణశాస్త్రికి అదే తొలి సినిమా.

సాహితీరంగంలో ఉద్ధండులైన కృష్ణశాస్త్రి, పాలగుమ్మి పద్మరాజు(పా.ప.) లను చిత్రసీమలోనికి తీసుకువచ్చింది బి.ఎన్.రెడ్డే. కృష్ణశాస్త్రి తొలి సినిమా మల్లీశ్వరి కాగా పా.ప. తొలి సినిమా బంగారుపాప. అలా సాహిత్య రంగంలో లబ్ధప్రతిష్టులైనవాళ్ళను సినీరంగంలో ప్రవేశపెట్టి తెలుగు సినిమా గౌరవప్రతిష్టలను పెంచడమే గాక అంతర్జాతీయ వేదికలపై తెలుగు సినిమా బావుటాను సగర్వంగా రెపరెపలాడించిన స్రష్ట బి.ఎన్.

సినిమా కధ

విజయనగర సామ్రాజ్యం చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు పరిపాలన నేపధ్యంలో ఈ చిత్ర కధ నడుస్తుంది. అప్పటి రాజవిధానం ప్రకారం రాజాతఃపురంలో పనిచేయడానికి ఇష్టపడిన యువతులను వారింటికి పల్లకీ పంపి, వారి కుటుంబానికి ధన కనక బహుమానాలు ఇచ్చి, రాజాస్థానానికి పిలిపించేవారు. కాని ఒకసారి అంతఃపురంలో చేరిన యువతులకు బయటి మగవారితో సంబంధాలు నిషిద్ధం. ఈ నియమాన్ని అతిక్రమించినవారికి ఉరిశిక్ష వేసేవారు.


మల్లిక (చిన్నపుడు బేబీ మల్లిక, పెద్దయినాక భానుమతి), నాగరాజు (చిన్నపుడు మాస్టర్ వెంకటరమణ, పెద్దయినాక నందమూరి తారక రామారావు) బావా మరదళ్ళు. ఒక చిన్నపల్లెలో కలసి పెరిగారు. ఒకరిపై ఒకరు మనసు పడ్డారు. నాగరాజు శిల్పి. మల్లిక మంచి గాయని. ఒకసారి వారు వర్షం వచ్చినపుడు ఒక పాతగుడిలో ఉండగా అక్కడికి మారువేషంలో ఆ దేశపురాజు శ్రీకృష్ణదేవరాయలు (శ్రీవత్సవ), ఆయన ఆస్థాన కవి అల్లసాని పెద్దన (న్యాపతి రాఘవరావు)వస్తారు. అతిధులకు మల్లిక, నాగరాజు ఆహారం సమకూర్చి ఆదరిస్తారు. వారిని సాగనంపుతూ "మా మల్లికి రాణివాసం పల్లకి పంపించండి" అని నాగరాజు (వేళాకోళంగా అంటాడు).


నిజంగానే కొద్దిరోజులకు రాణివాసం పల్లకి మల్లి ఇంటికి వస్తుంది. కూతురికి పట్టిన రాణివాస యోగం చూసి మల్లి తల్లి నాగమ్మ (ఋష్యేంద్రమణి) మురిసిపోతుంది. మల్లి క్రమంగా అంతఃపురంలో మహారాణికి ఇష్టసఖి "మల్లీశ్వరి" అవుతుంది. కాని ప్రియురాలికి దూరమైన నాగరాజు, బావకు దూరమై మల్లి విలవిలలాడిపోతారు. అయితే రాణివాసం వలన వచ్చిన సంపద వల్ల నాగమ్మ తన కూతురిని నాగరాజునుండి దూరం చేయచూస్తుంది.


రాజధానిలో కట్టే నిర్మాణాలలో శిల్పిగా నాగరాజు పట్టణానికి వస్తాడు. అనుకోకుండా మల్లి, నాగరాజు కలుస్తారు. తరువాత రాణివాసం నిబంధనలకు వ్యతిరేకంగా వారు ఒకరినొకరు కలిసికొన్నందున చెరపాలవుతారు. వారికి ఉరి శిక్ష విధించబడుతుంది.


చివరలో కరుణాహృదయుడైన రాయలవారు వారి శిక్షను రద్దు చేస్తాడు.

పాటలు

ఈ చిత్రంలో పాటలు అన్నీ విశేషంగా జనాదరణ పొందాయి. ఒక సంప్రదాయ గానం, మరొక పురందరదాసు కీర్తన (గణేశ ప్రార్ధన) తప్పించి మిగిలినవన్నీ దేవులపల్లి కృష్ణశాస్త్రి రచనలే. మొత్తం పాటల స్వరకల్పనకు ఆరు నెలల కాలం పట్టింది. రాజేశ్వర రావు ఎన్నో రిహార్సిల్స్ నిర్వహించారు. అద్దేపల్లి రామారావు ఆర్కెస్ట్రా.

  • లంబోదర లకుమికరా - పురంధర దాసు కీర్తన
  • కోతీ బావకు పెళ్ళంట, కోవెల తోట విడిదంట -
  • పిలచిన బిగువటరా ఔరౌరా- భానుమతి
  • ఔనా! నిజమేనా! మరతునన్నా మరువలేను- ఘంటసాల, భానుమతి
  • ఉషా పరిణయం యక్షగానం- కమలాదేవి, భానుమతి
  • పరుగులు తీయాలి, గిత్తలు ఉరకలు వేయాలి - భానుమతి
  • నోమిన మల్లాల నోమన్న లాలా (సంప్రదాయ గానం)- భానుమతి
  • మనసున మల్లెల మాలలూగెనే - భానుమతి
  • ఎవరు ఏమని అందురు - భానుమతి
  • ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు (జాలి గుండెల మేఘమాలా..)- బానుమతి, ఘంటసాల
  • ఎన్నినాళ్ళకీ బతుకు పండెనో, ఎంత హాయి ఈ రేయి నిండెనో - భానుమతి

విశేషాలు

  • ఈ చిత్రాన్ని కీ.శే. సర్వేపల్లి రాధాకృష్ణచూసారు. ఆయన గమనించిన విషయం- చిత్రం లో మల్లి, నాగరాజులు, మారువేషంలో ఉన్న రాయలవారిని కలిసింది పెద్దవర్షం వచ్చిన కారణం గా. ఐతె రాయలవారు వీరితో మాట్లాడి తిరిగివెళ్ళిపోయే సమయంలో గుర్రాల స్వారీ వల్ల ధూళి రేగుతుంది. ఇది ఎలా సాధ్యం?

మూలాలు

  • మనసున మల్లెలు జల్లిన మనోజ్ఞచిత్రం "మల్లీశ్వరి", నాటి 101 చిత్రాలు, ఎస్.వి.రామారావు, కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006, పేజీలు 60-62.
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.

బయటి లింకులు