ఇది మంచి సమయము రారా (పాట): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 2: పంక్తి 2:


==విశేషాలు==
==విశేషాలు==
ఇది వాగ్గేయకారుడైన [[సారంగపాణి]] పదము. ఈ శృంగారపదమును పల్లవిలో కాస్త మార్పు చేశారు. మూలంలో ''రారా సామి నీకు మ్రొక్కేరా'' అని మొదలవుతుంది. ''చలమేరా ఇంటికి రారా'' అన్న పంక్తిని ''చలమేల జేసేవౌరా'' అని మార్చారు. సారంగపాణి పదములోని 2, 4 చరణాలు తీసుకొన్నారు. ''మనసారా ఒక ముద్దీరా మనకిది'' అన్న చివరి పంక్తులు, పల్లవి మాత్రమే సముద్రాల కలానివి. మిగతా భాగం సారంగపాణిది. ఈ మార్పిడి పదాన్ని నాగయ్య కల్యాణి రాగంలో [[జావళి]]గా మార్చారు. తెరపై సామ్రాజ్యం అనే నటీమణి ''భోగిని'' పాత్రలో అభినయించారు.
ఇది వాగ్గేయకారుడైన [[సారంగపాణి]] పదము. ఈ శృంగారపదమును పల్లవిలో కాస్త మార్పు చేశారు. మూలంలో ''రారా సామి నీకు మ్రొక్కేరా'' అని మొదలవుతుంది. ''చలమేరా ఇంటికి రారా'' అన్న పంక్తిని ''చలమేల జేసేవౌరా'' అని మార్చారు. సారంగపాణి పదములోని 2, 4 చరణాలు తీసుకొన్నారు. ''మనసారా ఒక ముద్దీరా మనకిది'' అన్న చివరి పంక్తులు, పల్లవి మాత్రమే సముద్రాల కలానివి. మిగతా భాగం సారంగపాణిది. ఈ మార్పిడి పదాన్ని [[వి.నాగయ్య|నాగయ్య]] కల్యాణి రాగంలో [[జావళి]]గా మార్చారు. తెరపై సామ్రాజ్యం అనే నటీమణి ''భోగిని'' పాత్రలో అభినయించారు.


==పాట==
==పాట==

10:28, 29 జనవరి 2011 నాటి కూర్పు

ఇది మంచి సమయము రారా తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక మహిళ ఇతరులకు పాడిన తొలి నేపథ్యగీతం. ఈ పాటను అలనాటి గాయని బెజవాడ రాజరత్నం భక్త పోతన (1942) చిత్రంలో రాజనర్తకి భోగిని పాత్రధారిణి అయిన సామ్రాజ్యం అనే నటీమణికి పాడారు. ఈ పాటను అలనాటి ప్రముఖ రచయిత సముద్రాల రాఘవాచార్య రచించారు. దీనికి ప్రముఖ నటుడు, సంగీత దర్శకుడు అయిన చిత్తూరు నాగయ్య సంగీతం అందించారు.

విశేషాలు

ఇది వాగ్గేయకారుడైన సారంగపాణి పదము. ఈ శృంగారపదమును పల్లవిలో కాస్త మార్పు చేశారు. మూలంలో రారా సామి నీకు మ్రొక్కేరా అని మొదలవుతుంది. చలమేరా ఇంటికి రారా అన్న పంక్తిని చలమేల జేసేవౌరా అని మార్చారు. సారంగపాణి పదములోని 2, 4 చరణాలు తీసుకొన్నారు. మనసారా ఒక ముద్దీరా మనకిది అన్న చివరి పంక్తులు, పల్లవి మాత్రమే సముద్రాల కలానివి. మిగతా భాగం సారంగపాణిది. ఈ మార్పిడి పదాన్ని నాగయ్య కల్యాణి రాగంలో జావళిగా మార్చారు. తెరపై సామ్రాజ్యం అనే నటీమణి భోగిని పాత్రలో అభినయించారు.

పాట

మంచి సమయము రారా

ఇది మంచి సమయము రారా

చలమేల జేసేవౌరా

ఇది మంచి సమయము రారా

చలమేల జేసేవౌరా


నిన్నెకోరి నీకై నిలచితిరా

నిన్నెకోరి నీకై నిలచితిరా

రారా కోరిక తీరా

మనకిది మంచి సమయము రారా


లేదా కనికరమింతైనా లేదా

ఈ మేను నీదే కాదా వాదా


ఓరి! ఎంతో నెమ్మది నిను కోరి

వలచినందుకు ఒకసారి

పలుకవైతివి నను చేరి

ఫలమేమిక నిను దూరీ


రారా సామి రారా నను కౌగిటిని గైకోరా

రారా సామి రారా నను కౌగిటిని గైకోరా

మనసారా ఒక ముద్దీరా

మంచి సమయము రారా

మూలాలు

  • జీవితమే సఫలము - సీనియర్ సముద్రాల సినీగీతాలకు సుమధుర వ్యాఖ్య (మొదటి సంపుటి) - డాక్టర్‌.వి.వి.రామారావు - పుట 132

లింకులు