జి.వరలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 60: పంక్తి 60:
[[వర్గం:2006 మరణాలు]]
[[వర్గం:2006 మరణాలు]]
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గం:తెలుగు సినిమా గాయకులు]]
[[వర్గం:తెలుగు రంగస్థల నటులు]]
[[వర్గం:తెలుగు రంగస్థల నటులు]]



11:37, 7 ఫిబ్రవరి 2011 నాటి కూర్పు

జి.వరలక్ష్మి

గరికపాటి వరలక్ష్మి అందరికీ జి.వరలక్ష్మిగా సుపరిచితురాలైన అలనాటి తెలుగు సినిమా నటీమణి. 1940ల నుండి 1960 వరకు తెలుగు తమిళ సినిమా రంగాలలో ప్రాచుర్యమైన నటిగా వెలుగొందినది.


జీవిత విశేషాలు

వరలక్ష్మి 1926లో ఒంగోలులో జన్మించింది. ఈమె బాల్యము నుండి మంచి గాయని. 11యేళ్ల వయసులో ఇల్లు వదిలి విజయవాడ చేరుకొని తుంగల చలపతి మరియు దాసరి కోటిరత్నం మొదలైన ప్రముఖ రంగస్థల నటుల నాటకబృందాలలో నటించినది. వరలక్ష్మి సక్కుబాయి మరియు రంగూన్ రౌడీ నాటకాలలో తన నటనకు మంచి పేరు తెచ్చుకొన్నది. రంగస్థలంపై తెచ్చుకున్న పేరు ఈమెను కె.ఎస్.ప్రకాశరావు మరియు హెచ్.ఎం.రెడ్డి వంటి తెలుగు సినిమా ఆద్యుల దృష్టికి తెచ్చినది. హెచ్.ఎం.రెడ్డి 1940లో తీసిన వ్యంగ్య హాస్య చిత్రం బారిష్టరు పార్వతీశం సినిమాతో వరలక్ష్మిని చిత్రరంగానికి పరిచయం చేశాడు.

వరలక్ష్మి ప్రముఖ తెలుగు సినిమా నటుడు, దర్శకుడైన కె.ఎస్.ప్రకాశరావును వివాహం చేసుకొన్నది. ఈమె ఆయన రెండవ భార్య. వరలక్ష్మి కుమారుడు కె.ఎస్.సూర్యప్రకాష్ కూడా తెలుగు సినీ రంగములో ఛాయాగ్రాహకుడు. కుమార్తె కనకదుర్గ. ఈమె మనవరాలు మానస తెలుగు సినీ రంగములో నటీమణిగా ప్రవేశించింది.

వరలక్ష్మి 2006 నవంబర్ 26న మద్రాసులో 80 ఏళ్ల వయసులో కన్ను మూసింది.

చిత్ర సమాహారం

నటిగా

దర్శకురాలిగా

బయటి లింకులు