ఆంధ్రప్రదేశ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 123: పంక్తి 123:
→ రాష్ట్ర జంతువు--[[కృష్ణ జింక]]
→ రాష్ట్ర జంతువు--[[కృష్ణ జింక]]


→ [[రాష్ట్ర పక్షి|రాష్ట్ర పక్షులు]]--[[పాలపిట్ట]]
→ [[రాష్ట్ర పక్షులు|రాష్ట్ర పక్షి]]--[[పాలపిట్ట]]


→ రాష్ట్ర వృక్షం--[[వేప చెట్టు]]
→ రాష్ట్ర వృక్షం--[[వేప చెట్టు]]

13:23, 19 ఫిబ్రవరి 2011 నాటి కూర్పు

ఆంధ్ర ప్రదేశ్
Map of India with the location of ఆంధ్ర ప్రదేశ్ highlighted.
Map of India with the location of ఆంధ్ర ప్రదేశ్ highlighted.
రాజధాని
 - అక్షాంశరేఖాంశాలు
హైదరాబాదు
 - 17°13′N 78°16′E / 17.22°N 78.26°E / 17.22; 78.26
పెద్ద నగరం హైదరాబాదు
జనాభా (2001)
 - జనసాంద్రత
75,727,000 (5వది)
 - 275/చ.కి.మీ
విస్తీర్ణం
 - జిల్లాలు
275,068 చ.కి.మీ (4వది)
 - 23
సమయ ప్రాంతం IST (UTC యుటిసి+5:30)
అవతరణ
 - [[ఆంధ్ర ప్రదేశ్ |గవర్నరు
 - [[ఆంధ్ర ప్రదేశ్ |ముఖ్యమంత్రి
 - చట్టసభలు (సీట్లు)
నవంబర్ 1 ,1956
 - ఎక్కడు శ్రీనివాసన్ లక్ష్మీ నరసింహన్
 - ఎన్.కిరన్ కుమర్ రెద్ది
 - {{{legislature_type}}} (294, 90)
అధికార బాష (లు) తెలుగు,

legislature_type=రెండు సభలు

పొడిపదం (ISO) IN-AP
వెబ్‌సైటు: www.aponline.gov.in
దస్త్రం:Kumbham.jpg

ఆంధ్ర ప్రదేశ్ రాజముద్ర

ఆంధ్ర ప్రదేశ్, భారతదేశంలోని ఒక రాష్ట్రం. దీనికి ఉత్తరాన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా రాష్ట్రాలు, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన తమిళనాడు రాష్ట్రం, పశ్చిమాన కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ భారతదేశంలో నాలుగవ అతి పెద్ద రాష్ట్రమై ఉత్తర, దక్షిణాలకు వారధిలా ఉన్నది. ఈ రాష్ట్రంలోని ముఖ్యమైన నదులు గోదావరి, కృష్ణ. 1953, అక్టోబర్ 1 న తొలుత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డపుడు కర్నూలు, రాష్ట్ర రాజధానిగా ఉండేది. 1956, నవంబర్ 1న రాజధాని హైదరాబాదు కు మార్చబడింది.

ఆంధ్రప్రదేశ్ 37', 54' ఉత్తర అక్షాంశాల మధ్య, 46', 46' తూర్పు రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది. భారత ప్రామాణిక రేఖాంశమైన 30' తూర్పు రేఖాంశం రాష్ట్రంలోని కాకినాడ గుండా పోతుంది.

చరిత్ర

ఆంధ్రులు వింధ్యపర్వత దక్షిణ భాగానికి తరలి వెళ్ళి, ద్రావిడులతో కలసిన ఆర్యులుగా క్రీ.పూ. 7వ శతాబ్దపు సంస్కృత రచనలు వర్ణిస్తున్నాయి. క్రీ. పూ. 5వ శతాబ్దములో ప్రతీపాలపురం (భట్టిప్రోలు) రాజధానిగా కుబేరక అను రాజు పాలన చేస్తున్నాడని ఆధారాలు దొరికాయి. మహావీరుడు, గౌతమ బుద్ధుడు ధాన్యకటకము (అమరావతి) సందర్శించారనడానికి ఆధారాలున్నాయి. మౌర్య చక్రవర్తి అశోకుని మరణానంతరం (క్రీ.పూ 232) ఆంధ్రులు వెలుగులోకి వచ్చారు. నవీన చరిత్రకారులు ఆంధ్రుల చరిత్ర ఆనాటినుండి మొదలైనట్లుగా లెక్కిస్తున్నారు. ఆంధ్ర (శాతవాహన), శక, పల్లవ, ఇక్ష్వాకు, తెలుగు చోళ, తూర్పు చాళుక్య, కాకతీయ, విజయనగర, కుతుబ్ షాహి, హైదరాబాదు నిజాం లు మొదలైన వంశాలకు చెందిన రాజులు ఆంధ్ర దేశాన్ని పరిపాలించారు. క్రీ.శ 17వ శతాబ్దములో బ్రిటీషు వారు కోస్తా ఆంధ్రను నిజామ్ వద్ద గెలుచుకొని మద్రాసు రాష్ట్రములో (మద్రాసు ప్రెసిడెన్సీ) కలుపుకున్నారు. హైదరాబాదు నిజామ్ బ్రిటిషు ఆధిక్యతను గుర్తించి తెలంగాణ ప్రాంతానికి పరిమితమైనాడు.

భారత దేశ స్వాతంత్ర్యానంతరము

1947లో భారత దేశానికి ఆంగ్లేయుల నుండి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నిజాము, హైదరాబాదు సంస్థానాన్ని తమ పాలనలోనే ఉంచుకోవటానికి ప్రయత్నించాడు. పోలీసు చర్య ద్వారా హైదరాబాదు 1948 భారత దేశంలో విలీనమై, హైదరాబాదు రాష్ట్రంగా అవతరించింది.


మద్రాసు రాజధానిగా ఉండే ఆంధ్ర రాష్ట్రం కోసం అమరజీవి' పొట్టి శ్రీరాములు 58 రోజుల నిరాహార దీక్ష చేసి మరణించారు, కానీ కర్నూలును రాజధానిగా చేసి 1953 అక్టోబరు 1న మద్రాసు రాష్ట్రంలో ఉత్తరాన ఉన్న 11 జిల్లాలతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం చేశారు. గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేసారు. టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి.


తెలుగు ప్రజల కోరికపై 1956, నవంబరు 1 న హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంలో కలిపి ఆంధ్ర ప్రదేశ్ ను ఏర్పాటు చేసారు. కొత్త రాష్ట్రానికి హైదరాబాదు రాజధానిగా అవతరించింది. ఈ విధంగా భాష ఆధారముగా ఏర్పడిన రాష్ట్రములలో ఆంధ్ర ప్రదేశ్ మొదటి రాష్ట్రము అయినది. నీలం సంజీవరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి.


1960 వ సంవత్సరంలో పటాస్కర్ కమీషన్ తీర్పుమూలంగా చిత్తూరు జిల్లా తిరుత్తణి తాలూకాలోని ఎక్కువ భాగాన్ని తమిళనాడు కు ఇచ్చి, తమిళనాడుకు చెందిన తిరువళ్లూర్ తాలూకాలోని కొన్ని గ్రామాలను ఆంధ్ర ప్రదేశ్ లో చేర్చారు. ఆంధ్ర ప్రదేశ్ ఆవిర్భవించినప్పుడు 20 జిల్లాలే ఉన్నాయి. తరువాత, 1970, ఫిబ్రవరి 2న ప్రకాశం జిల్లా, 1978 ఆగష్టు 12న రంగారెడ్డి జిల్లా, 1979 జూన్ 1న విజయనగరం జిల్లాలు ఏర్పడడంతో మొత్తం 23 జిల్లాలయ్యాయి.

రాజకీయాలు

నీలం సంజీవరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రి. 1982 వరకు అన్నీ కాంగ్రెసు ప్రభుత్వాలే ఆంధ్ర ప్రదేశ్ ను పరిపాలించాయి. 1982 వరకు కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలము పనిచేశాడు. ఆయన తరువాత పి.వి.నరసింహారావు ముఖ్యమంత్రిగా కొంతకాలం పనిచేసారు. తరువాతి కాలంలో ఆయన భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసారు.


అయితే 1982 వరకు రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెసుకు ఉన్న బలాన్ని సవాలు చేయటానికి నందమూరి తారక రామారావు అదే సంవత్సరములో తెలుగుదేశం అనే పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించాడు. స్థాపించిన తొమ్మిది నెలలలోనే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారపగ్గాలు చేపట్టడంతో ఒక బుడతడి దెబ్బకు వస్తాదు కుప్పకూలినట్లయింది.


2004 అసెంబ్లీ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెసు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉధృతంగా పోరాడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో కలిసి పోటీ చేసింది. కాంగ్రెసు, తెరాస కూటమి పదవిలోకి రావడంతో, కాంగ్రెసుకు చెందిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. ఐదేళ్ళ అనతరం 2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీచేయగా, తెలుగుదేశం పార్టీ, తెరాస, ఉభయ కమ్యూనిష్టు పార్టీలు కలిసి మహాకూటమి తరఫున పోటీచేశాయి. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ, భాజపాలు కూడా పోటీచేయడంతో బహుముఖ పోటీలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ సొంతంగా మెజారిటీ స్థానాలు సంపాదించి వరుసగా రెండోసారి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. సెప్టెంబరు 2, 2009న రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 14 నెలలు పాలించిన తరువాత కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా మార్చడం జరిగింది . ఇప్పుదు తెలన్తగానా కొసమ్ స్రీ క్రిష్న చొమ్మిత్తె వఛిన్ది

భౌగోళిక పరిస్థితి

కృష్ణా గోదావరి నదులు (ఉపగ్రహ ఛాయాచిత్రం)

ఆంధ్ర ప్రదేశ్ లో మూడు ముఖ్య ప్రాంతములు కలవు: కోస్తా ఆంధ్ర, తెలంగాణ మరియు రాయలసీమ. రాష్ట్రములో 23 జిల్లాలు కలవు. హైదరాబాదు, రాష్ట్ర రాజధాని మరియు అతి పెద్ద నగరము. ఇతర ముఖ్య నగరాలు విశాఖపట్నం, విజయవాడ,రాజమండ్రి,తిరుపతి,కర్నూలు, నెల్లూరు, వరంగల్లు, గుంటూరు. గోదావరి, కృష్ణ వంటి మహానదులు రాష్టంలో ప్రవహిస్తూ కొన్ని లక్షల హెక్టేరుల భూమి సాగు చేయుటకు తోడ్పడుతున్నాయి.

ప్రభుత్వము

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అధినేత ముఖ్యమంత్రి కాగా, రాష్ట్ర పరిపాలన గవర్నరు పేరున జరుగుతుంది. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ (దిగువ సభ) లో 294 స్థానాలు, విధాన మండలి (ఎగువ సభ)లో 90[1] స్థానాలు ఉన్నాయి.దీనికి తోడు, ఆంగ్లో-ఇండియన్ వర్గం నుంచి ఒకరిని శాసన సభకు నామినేటు చేస్తారు.ఆ రకంగా శాసన సభ లో సభ్యుల సంఖ్య 295. ఆంధ్ర ప్రదేశ్ కు పార్లమెంటులో 60 స్థానాలు కలవు (లోక్ సభ లో 42 మరియు రాజ్య సభలో 18).

జిల్లాలు

1956 లో 20 జిల్లాలతో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది.తరువాత 1970 లో ప్రకాశం జిల్లా, 1978లో రంగారెడ్డి జిల్లా, 1979 లో విజయనగరం జిల్లా ఏర్పడ్డాయి.ప్రస్తుతం 23 జిల్లాలున్నాయి.ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు చూడండి.

ఆర్ధిక రంగము

రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు వ్యవసాయం ఆయువుపట్టు. భారత దేశములోని రెండు ప్రధాన నదులు, గోదావరి మరియు కృష్ణ రాష్ట్రం గుండా ప్రవహిస్తాయి. వరి, పొగాకు, ప్రత్తి, మిర్చి, మరియు చెరుకు రాష్ట్రంలో పండించే ముఖ్యమైన పంటలు. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు బయోటెక్నాలజీ రంగాల్లో కొత్తపుంతలు తొక్కుతున్నది.


హైదరాబాదు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని. దేశంలోనే ఐదవ పెద్ద నగరము. మేలైన సంస్కృతీ సాంప్రదాయాలు, ధీటైన చరిత్ర, పారిశ్రామికాభివృద్ధి, మరియు సాంకేతిక పరిజ్ఞానం సహజీవనం సాగించే విభిన్నమైన అతి కొద్ది నగరములలో హైదరాబాదు ఒకటి. గతిశీల నాయకత్వంతో రాష్ట్రం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఫార్మసూటికల్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్, నిర్మాణము తదితర రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ, అపారమైన వ్యాపార అవకాశాలకు నెలవై ఉన్నది.

భాష-సంస్కృతి

తెలుగు రాష్ట్ర అధికార భాష. ఉర్దూ మాట్లాడే ముస్లింలు ఎక్కువగా హైదరాబాదులో ఉన్నారు.

కవిత్రయమని పేరుగన్న నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ మహా భారత కావ్యాన్ని తెలుగులోకి అనువదించారు. మహా భాగవతమును బమ్మెర పోతన అనువదించాడు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు విశ్వనాథ సత్యనారాయణ, డా.సి.నారాయణరెడ్డి మొదలైనవారు తెలుగులో ఆధునిక రచయితలు. ఆంధ్రప్రదేశ్ కు గొప్ప సాంస్కృతిక వారసత్వము కలదు. అన్నమాచార్య, త్యాగరాజు,రామదాసు తదితర గొప్ప కర్ణాటక సంగీతకారులు తెలుగు భాషలో కృతులు రచించి, భాషను సుసంపన్నం చేశారు. కూచిపూడి రాష్ట్ర శాస్త్రీయ నృత్యం. అలాగే నటరాజ రామకృష్ణ గారి కృషి వల్ల ఆంధ్రనాట్యం కూడా ప్రజాదరణ పొందింది.

ఆంధ్రులు గత 70 సంవత్సరాలుగా సినిమాను విపరీతముగా పెంచి పోషించారు. రాష్ట్రంలో సంవత్సరానికి సుమారు 130 సినిమాలు రూపొందుతాయి. ఆదాయపరంగా తెలుగు సినిమా ఒక పెద్ద పరిశ్రమ, కానీ తక్కిన భారత దేశములో పెద్దగా గుర్తింపు పొందలేదు. రాష్ట్రం నుండి ఉద్భవించిన కొందరు ప్రముఖ సినీ కళాకారులు ఎన్.టి.రామారావు (మాజీ ముఖ్యమంత్రి), అక్కినేని నాగేశ్వరరావు ("ఏ.ఎన్.ఆర్", దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత), ఎస్.వి.రంగారావు, ఘంటసాల, చిరంజీవి, వెంకటేష్, కె.విశ్వనాధ్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సావిత్రి, జమున, శారద, షావుకారు జానకి, జయప్రద మొదలైనవారు.


ఆంధ్ర ప్రదేశ్ లో పలు సంగ్రహాలయాలు (మ్యూజియం) కలవు, అందులో సాలార్ జంగ్ మ్యూజియం, పురావస్తుశాఖ మ్యూజియం ముఖ్యమైనవి. వీనిలో పలు శిల్పాలు, చిత్రాలు, హిందూ మరియు బౌద్ధ మత శిల్పాలు, కళాఖండాల సేకరణలు ప్రదర్శంచబడినవి. ఈ రెండు సంగ్రహాలయాలు హైదరాబాదులో ఉన్నాయి.

విద్యారంగము

ప్రధాన వ్యాసం: ఆంధ్ర ప్రదేశ్ లో విద్య
ఆంధ్రప్రదేశ్ లో విద్యా నిర్వహణ ప్రభుత్వ శాఖలద్వారా జరుగుతుంది.

  1. పాఠశాల విద్యాశాఖ[2] (సర్వ శిక్షా అభియాన్) [3]
  2. ఇంటర్ మీడియట్ విద్యా మండలి. [4]
  3. సాంకేతిక విద్యా మండలి[5]
  4. ఉన్నత విద్యా పరిషత్ [6]

పండుగలు

ఆంధ్ర ప్రదేశ్ లో జరుపుకొనే ముఖ్యమైన పండుగలు:

బోనాలు: సాదారణంగా తెలంగాణ ప్రజలు ఈ బోనాల పండుగను ఆషాడమాసములో జరుపుకుంటారు . ముఖ్యంగా హైదరాబాదు పరిసర ప్రాంత ప్రజలు అమ్మవారికి భక్తి, శ్రద్దలతో బొనం [ ప్రసాదం] వండు కుని, ఆ ప్రసాదాన్ని కుండ లలొ పెట్టుకుని ఊరేగింపుగా వెల్లి అమ్మ వార్లకు నైవేధ్యం సమర్పించుటయే భొనం అంటారు.

రాష్ట్ర గుర్తులు

→ రాష్ట్ర భాష--తెలుగు

→ రాష్ట్ర గుర్తు--పూర్ణకుంభం

→ రాష్ట్ర గీతం--మా తెలుగు తల్లికి మల్లె పూదండ

→ రాష్ట్ర జంతువు--కృష్ణ జింక

రాష్ట్ర పక్షి--పాలపిట్ట

→ రాష్ట్ర వృక్షం--వేప చెట్టు

→ రాష్ట్ర ఆట-- చెడుగుడు(కబడ్డీ)

→ రాష్ట్ర నృత్యం--కూచిపూడి

→ రాష్ట్ర పుష్పము--కలువ పువ్వు (వాటర్ లిల్లి)

పర్యాటక రంగము

ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి,భద్రాచలము, ద్వారక తిరుమల,శ్రీశైలం, శ్రీ కాళహస్తి, సింహాచలము, అన్నవరం, అహొబిలము, యాదగిరి గుట్ట, వేములవాడ , మహానంది, కానిపాకం, విజయవాడ మొదలైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. తిరుపతి లోని తిరుమల తిరుపతి దేవస్థానము ప్రపంచములోకెల్లా ఐశ్వర్యవంతమైన హిందూ దేవాలయము. వరంగల్ నగరమునందలి వేయిస్తంభాల దేవాలయము, రామప్ప దేవాలయము కాకతీయుల కాలమునాటి శిల్పకళకు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక అభివృద్ధి సంస్థ రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తోంది.పర్యాటక ప్రదేశాలలో విశాఖపట్నం ఒకటి చెప్పుకొదగినది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము

ఈ-ప్రభుత్వపాలన ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించటానికి ఆంధ్రప్రదేశ్ అంతర్జాలంలో గవాక్షాన్ని కలిగివుంది. దీనిని ఎపి ఆన్లైన్అంటారు. దీనిలో ఇంగ్లీషు, తెలుగులలో, ప్రభుత్వ సమాచారాన్నిపొందుపరిచారు. శాఖలు
పోలీస్

ఇవికూడా చూడండి

బయటి లింకులు

మూలాలు