కోస్తా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి corrected minor typo, removed commented opinionated content
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ta:கடற்கரை ஆந்திரா
పంక్తి 30: పంక్తి 30:
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్]]
[[వర్గం:భారతదేశంలోని ప్రాంతాలు]]
[[వర్గం:భారతదేశంలోని ప్రాంతాలు]]

[[en:Coastal Andhra]]
[[en:Coastal Andhra]]
[[ta:கடற்கரை ஆந்திரா]]

04:24, 3 మార్చి 2011 నాటి కూర్పు


ఆంధ్రప్రదేశ్ పటములో ఆకుపచ్చ రంగులో సూచించబడిన కోస్తా ప్రాంతం.

కోస్తా అన్న తెలుగు మాట, కోస్ట్‌ అన్న ఇంగ్లీషు మాట కూడ 'కోస్తా' అన్న బుడతగీచు (పోర్చుగీసు) భాష నుండి పుట్టేయని ఒక అనుమానం ఉంది. కోస్తా లేదా తీరాంధ్ర ఆంధ్ర ప్రదేశ్ లోని తీరప్రాంతము. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రధాన విభాగాలలో ఒకటి. మిగతావి తెలంగాణా, రాయలసీమ. 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడే వరకూ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఇది అంతర్భాగంగా ఉండేది. 1947లో భారత స్వాతంత్ర్యం రావడానికి ముందు బ్రిటిష్ ఇండియాలోని మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండేవి. మొత్తము కోస్తా జిల్లాలు తొమ్మిది (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా, గుంటూరు, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాలు). బ్రిటీషు ప్రభుత్వము యొక్క పాలన కింద ఉన్న జిల్లాలు కనుక వీటిని సర్కారు జిల్లాలు అని, ఈ ప్రాంతాన్ని సర్కారు అనికూడా వ్యవహరిస్తారు. ఈ తొమ్మిది జిల్లాలూ 1000 కి.మీ. నిడివిగల బంగాళాఖాత తీరాన్ని ఆనుకొని ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని కోస్తా ప్రాంతం అంటారు. గోదావరి, కృష్ణా, పెన్నానదుల సాగరసంగమ స్థానాల్లో ఉన్న ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటిలోను మిక్కిలి సారవంతమైంది. వరి, చెరకు పంటలకు ప్రసిద్ధి గాంచినది.


కోస్తా ప్రజలు 1972లో జై ఆంధ్ర పేరుతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడారు.


ఇంకా చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=కోస్తా&oldid=587680" నుండి వెలికితీశారు