నూతన్ ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6: పంక్తి 6:
| caption =
| caption =
| birthname = వర ప్రసాద్
| birthname = వర ప్రసాద్
| birthdate = {{birth date and age|1950|10|10}}
| birthdate = [[డిసెంబర్ 12]], [[1945]]
| birthplace =
| birthplace =
| deathdate = [[మార్చి 30]], [[2011]]
| deathdate = [[మార్చి 30]], [[2011]]

13:52, 30 మార్చి 2011 నాటి కూర్పు

నూతన్ ప్రసాద్

జన్మ నామంవర ప్రసాద్
జననం డిసెంబర్ 12, 1945
మరణం మార్చి 30, 2011
ప్రముఖ పాత్రలు ముత్యాల ముగ్గు
రాజాధిరాజు

నూటొక్క జిల్లాల అందగాడుగా ప్రసిద్ధి చెందిన నూతన్ ప్రసాద్ అసలు పేరు వరప్రసాద్. 1970వ మరియు 80వ దశకములో తెలుగు సినిమా రంగములో ప్రసిద్ది చెందిన హాస్య నటుడు మరియు ప్రతినాయకుడు. మార్చి 30, 2011 బుధవారం హైదరాబాదులో అనారోగ్యంతో కన్ను మూశాడు.

హైదరాబాదులో ప్రభుత్వోద్యోగం చేస్తున్న ఆయన 1973 లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి అక్కినేని నాగేశ్వరరావు నటించిన అందాల రాముడు చిత్రంతో చిత్రరంగ ప్రవేశము చేశాడు. ఆ తరువాత నీడలేని ఆడది మొదలైన చిత్రాలలో నటించినా, ఈయనకు తొలి గుర్తింపు ముత్యాల ముగ్గు చిత్రంలో రావుగోపాలరావు తో పాటు ప్రతినాయకునిగా నటించడముతో వచ్చినది. ఈ చిత్రము విజయముతో తదుపరి అనేక చిత్రాలలో ప్రతినాయకుని పాత్రలు వచ్చాయి. అవన్నీ ఈయన తనదైన శైలిలో పోషించాడు. ఈయన తనదైన శైలిలో పలికే సంభాషణలతో ప్రతినాయక పాత్రలకు హాస్యవన్నె లద్దారు.అనేక చిత్రాలలో అగ్ర నటులైన నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఘట్టమనేని కృష్ణ, చిరంజీవి సరసన హాస్య, ప్రతినాయక, సహాయ మొదలైన విభిన్న పాత్రలు పోషించాడు. ఒక చిత్రంలో కథానాయకునిగా కూడా నటించాడు.

నూతన్ ప్రసాద్ సైతాన్ గా నటించిన రాజాధిరాజు చిత్రముతో ఈయన నట జీవితము తారాస్థాయికి చేరుకొన్నది. 1984 లో సుందరి సుబ్బారావు చిత్రంలో నటనకు ఆయనకు నంది పురస్కారం లభించింది. 2005 లో ఎన్టీఆర్ పురస్కారం లభించింది. 'బామ్మమాట బంగారుబాట' చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రమాదంలో గాయపడి కొంతకాలం నటజీవితామనికి దూరంగా ఉన్నా తిరిగి కోలుకుని నటించడం మొదలెట్టారు. కాళ్ళు అచేతనావస్థలో ఉండిపోయిన కారణంగా పరిమితమైన పాత్రలనే పోషించగలిగాడు.

కొద్ది రోజులు రవీంద్ర భారతి కి ఇన్‌ఛార్జ్ గా ఉన్నాడు. వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ అభిమాని.[1]

పేరు తెచ్చిన సంభాషణలు


చిత్ర సమాహారం

  1. ఆవారాగాడు (2000)
  2. మాస్టర్ (1997)
  3. బిగ్ బాస్ (1995)
  4. ఘరానా బుల్లోడు (1995)
  5. తాజ్ మహల్ (1995)
  6. కర్తవ్యం (1991) .... (ఎ.ఎస్.పి. రామమోహనరావు)
  7. బామ్మమాట బంగారుబాట (1990)
  8. రుద్రనేత్ర (1989)
  9. చలాకీ మొగుడు చాదస్తపు పెళ్లాం (1989)
  10. యుద్ధభూమి (1988)
  11. త్రినేత్రుడు (1988)
  12. ఖైదీ నెం. 786 (1988)
  13. ఆఖరి పోరాటం (1988)
  14. చిన్నోడు పెద్దోడు (1988)
  15. చూపులు కలసిన శుభవేళ (1988) .... (నాగలింగం)
  16. దొంగ కోళ్ళు (1988)
  17. ఘాయల్ షేరినీ (1988)
  18. కానూన్ కీ హథకడీ (1988)
  19. అహ! నా పెళ్ళంట ! (1987)
  20. నాకూ పెళ్ళాం కావాలి (1987)
  21. ప్రెసిడెంటు గారి అబ్బాయి (1987)
  22. సంసారం ఒక చదరంగం (1987)
  23. వేట (1986)
  24. కిరాతకుడు (1986) .... Baby
  25. కారు దిద్దిన కాపురం (1986)
  26. విజేత (1985) .... (నారాయణరావు, నరసింహరావు రెండవ కొడుకు)
  27. అడవి దొంగ (1985)
  28. ఒక రాధ ఇద్దరు కృష్ణులు (1985)
  29. రక్త సింధూరం (1985) .... (దామోదరం)
  30. చిరంజీవి (1985)
  31. దొంగ (1985)
  32. చట్టంతో పోరాటం (1985) .... (జైలర్ హిట్లర్ శర్మ)
  33. ముచ్చటగా ముగ్గురు (1985)
  34. రుస్తుం (1984)
  35. ఇంటిగుట్టు (1984)
  36. మహానగరంలో మాయగాడు (1984)
  37. రోజులు మారాయి (1984)
  38. గూండా (1984)
  39. బొబ్బిలి బ్రహ్మన్న (1984)
  40. శ్రీవారికి ప్రేమలేఖ (1984) .... (భాస్కరం)
  41. మంత్రిగారి వియ్యంకుడు (1983)
  42. ఖైదీ (1983) .... (మునసబు)
  43. మగ మహారాజు (1983)
  44. ఆడవాళ్లే అలిగితే (1983)
  45. పట్నం వచ్చిన పతివ్రతలు (1982)
  46. గడసరి అత్త సొగసరి కోడలు (1981)
  47. తాతయ్య ప్రేమలీలలు (1980)
  48. రాజాధిరాజు (1980) .... (సైతాన్)
  49. ఇంటింటి రామాయణం (1979)
  50. నా ఇల్లు నా వాళ్ళు (1979)
  51. సమాజానికి సవాల్ (1979) .... (నిలన్)
  52. ప్రాణం ఖరీదు (1978) .... (కరణం బుల్లబ్బాయి)
  53. ముత్యాల ముగ్గు (1975) .... (కృష్ణ - నిత్య పెళ్ళికొడుకు)
  54. అందాల రాముడు (1973) .... (గిరిబాబు)

మూలాలు