పత్రము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ps:پاڼه
చి r2.6.4) (యంత్రము కలుపుతున్నది: mrj:Ӹлӹштӓш (ботаника)
పంక్తి 168: పంక్తి 168:
[[mg:Ravinkazo]]
[[mg:Ravinkazo]]
[[mk:Лист (ботаника)]]
[[mk:Лист (ботаника)]]
[[mrj:Ӹлӹштӓш (ботаника)]]
[[ms:Daun]]
[[ms:Daun]]
[[nah:Izhuatl]]
[[nah:Izhuatl]]

11:27, 14 మే 2011 నాటి కూర్పు

ఈనెల వ్యాపనం స్పష్టంగా ఉన్న రావి ఆకు.

పత్రాలు లేదా ఆకులు (ఆంగ్లం: Leaves) వృక్ష కాండం మీద బహిర్గతంగా కణుపుల దగ్గర అభివృద్ధి చెందే పార్శ్వ ఉపాంగాలు. ఇవి సాధారణంగా బల్లపరుపుగా, ఆకుపచ్చగా ఉండి పరిమిత వృద్ధి కలిగి కాండాగ్రం వరకు అగ్రాభిసారంగా ఏర్పడతాయి. ఆకులు కిరణజన్యసంయోగక్రియ ద్వారా ఆహారాన్ని తయారుచేస్తాయి. కొన్ని రకాల ఆకుల్ని మనం ఆకు కూరలుగా తింటాము.

పత్రం భాగాలు

పత్రంలో నాలుగు భాగాలుంటాయి.

1. పత్రపీఠం (Leaf base): కణుపు వద్ద కాండానికి అతుక్కొని ఉండే పత్రవృంత పీఠభాగం.

2. పత్రపుచ్ఛం (Stipule): పత్రపీఠానికిరువైపులా పెరిగే ఆకుపచ్చని సన్నటి పోచల వంటి నిర్మాణాలు. ఇవి తొలిదశలో గ్రీవపు మొగ్గలకు రక్షణ కలిగిస్తాయి. పత్రదళం విసరించుకునే సమయానికి పత్రపుచ్ఛాలు సాధారణంగా రాలిపోతాయి. వీటిని 'రాలిపోయే పత్రపుచ్ఛాలు' (Deciduous stipules) అంటారు. ఉ. మైకేలియ. ఎక్కువకాలం ఉండే పత్రపుచ్ఛాలను 'దీర్ఘకాలిక పత్రపుచ్ఛాలు' (Persistent stipules) అంటారు. ఉ. రోసా, పైసమ్

3. పత్రవృంతం (Petiole): పత్రదళాన్ని కాండానికి కలిపిఉంచే సన్నని కాడవంటి భాగం. ఇది పత్రాలను కాండం నుంచి నిర్ణీతమైన దూరంలో అమర్చి, వాటికి సూర్యరశ్మి, గాలి సరిగా సోకేటట్లు చేస్తుంది. పత్రం బరువును భరించి, పోషకపదార్ధాలను ఇరువైపులా సరఫరా చేయటంలో తోడ్పడుతుంది.

4. పత్రదళం (Lamina): పత్రవృంతం కొన భాగంలో ఆకుపచ్చగా బల్లపరుపుగా విస్తరించి ఉన్న భాగం. పత్రంలో జరిగే ముఖ్యమైన విధులన్నీ దీనిలోనే జరుగుతాయి.

పత్రం నిర్మాణం

పత్రం యొక్క అంతర్నిర్మాణం.
పత్రం యొక్క అంతర్నిర్మాణం.

పత్రం నిర్మాణంలో మూడు భాగాలు ఉంటాయి.

  • 1. బాహ్యచర్మం (Epidermis) : బల్లపరుపుగా ఉన్న పత్రం యొక్క రెండు తలాలలోనూ బాహ్యచర్మం ఉంటుంది. వీనిలో పైతలంలోని దానిని ఊర్ధ్వ బాహ్యచర్మం (Upper epidermis) అని, అడుగుతలంలోని దానిని అథో బాహ్యచర్మం (Lower epidermis) అని అంటారు.
  • 2. పత్రాంతరం (Mesophyll) : రెండు బాహ్యచర్మాల మధ్య నిండియున్న సంధాయక కణజాలాన్ని పత్రాంతరం అంటారు. దీనిలో హరిత మృదు కణజాలం ఉంటుంది. ఇది ముఖ్యంగా ఆహార పదార్థాల సంశ్లేషణలో పాల్గొంటుంది. ఇందులో రెండు భాగాలుంటాయి. స్తంభ మృదుకణజాలం (Palisade mesophyll) మరియు స్పంజి వంటి మృదుకణజాలం (Sponge mesophyll).
  • 3. నాళికా పుంజాలు (Vascular bundles) : ఇవి పత్రాంతరంలో విస్తరించి ఈనెలుగా ఉంటాయి. ఇవి పత్రం అన్ని వైపులకు నీరు, ఖనిజ లవణాల ప్రసరణలోనూ మరియు పత్రానికి యాంత్రిక ఆధారాన్ని కలుగజేస్తాయి. ప్రతి నాళికా పుంజంలో దారువు (Xylem) మరియు పోషక కణజాలం (Phloem) ఉంటాయి.

పత్రాలు-ఉపయోగాలు

  • వివిధ రకాలైన పత్రాలు మనకు ఆకు కూరలుగా ఉపయోగపడుతున్నాయి. తోటకూర, బచ్చలి, గోంగూర మొదలైనవి.
  • కొన్ని పత్రాల నుండి రంజనాలు తయారుచేసి, అద్దకం పరిశ్రమలో ఉపయోగిస్తున్నారు. తమలపాకు, గోరింటాకు మొదలైనవి.
  • కొన్ని పత్రాలను భోజనం చేయడానికి ఉపయోగిస్తాము. ముఖ్యంగా పర్వదినాలలో కొందరు కంచాలకు బదులు అరటాకులో భోజనం చేయడం హిందూ సంప్రదాయం. విస్తరాకులు, అరటాకు మొదలైనవి.
  • కొన్ని ఆకులను వైద్యంలో విరివిగా ఉపయోగిస్తారు.
  • తాటి మరియు కొబ్బరి లాంటి పెద్ద ఆకులను నీడ కోసం మరియు ఇండ్ల నిర్మాణంలో ఉపయోగిస్తారు.

పత్రాలు రకాలు

సరళ పత్రాలు

సరళపత్రాలు (Simple leaves)లో పత్రవృంతం చివరలో ఒకే పత్రదళం ఉంటుంది. ఈ పత్రదళం అవిభక్తంగాగాని (ఉదా: అనొనా, సిడియం) లేదా విభక్తంగాగాని ఉంటుంది. పత్రదళం విభక్తమై ఉన్నప్పుడు తమ్మెలు పిచ్ఛాకారంగాగాని (ఉదా: బ్రాసికా), లేదా హస్తాకారంగాగాని (ఉదా: గాసిపియమ్, పాసిఫ్లోరా) ఉండవచ్చును.

సంయుక్త పత్రాలు

పత్రదళం పూర్తిగా నడిమి ఈనె వరకు, లేదా పత్రవృంతం అగ్రం వరకూ విభక్తమై అనేక పత్రకాలను (Leaflets) ఏర్పరుస్తుంది. సంయుక్తపత్రాలకు గ్రీవపు మొగ్గలుంటాయి. కానీ పత్రకాలకు ఉండవు. సంయుక్త పత్రాల వృంతాన్ని విన్యాసాక్షం (Rachis) అంటారు. సంయుక్తపత్రాలు రెండు రకాలుగా ఉంటాయి.

  • పిచ్ఛాకార సంయుక్త పత్రాలు (Pinnately compound leaves) :-

దీనిలో పత్రకాలు విన్యాసాక్షానికి ఇరువైపులా అమరి ఉంటాయి.

    • ఏకపక్షవత్ సంయుక్త పత్రం: దీనిలో విన్యాసాక్షం ఒకటే ఉంటుంది. దీనికి శాఖలు ఉండవు. పత్రకాలు విన్యాసాక్షంపై జతలుగా గానీ లేదా ఏకాంతరంగానీ ఉంటాయి. పత్రకాల సంఖ్యను బట్టి ఇవి రెండు రకాలు.
      • సమపిచ్ఛకం (Paripinnate): విన్యాసాక్షంపైన పత్రకాలు సరిసంఖ్యలో ఉంటాయి. ఉదా: చింత.
      • విషమపిఛకం (Imparipinnate) విన్యాసాక్షం ఒకే పత్రకంతో అంతమవటంచేత పత్రకాలు బేసిసంఖ్యలో ఉంటాయి. ఉదా: వేప.
    • ద్విపక్షవత్ సంయుక్త పత్రం: ఈ సంయుక్తపత్రంలో ప్రథమ విన్యాసాక్షం శాఖాయుతంగా ఉంటుంది. ఈ శాఖలను ద్వితీయ విన్యాసాక్షాలు అంటారు. వీటిపైన పత్రకాలు అమరి ఉంటాయి. ఉదా: అకేసియా అరాబికా (తుమ్మ)
    • త్రిపక్షవత్ సంయుక్త పత్రం: దీనిలో ప్రథమ విన్యాసాక్షంనుంచి, ద్వితీయ శాఖలు ఏర్పడతాయి. వీటి నుంచి తృతీయ విన్యాసాక్షాలు వృద్ధిచెంది వీటిమీద పత్రకాలు అమరి ఉంటాయి. ఉదా: మునగ, పున్నాగ.
    • బహుళ సంయుక్త పత్రం: ప్రథమ విన్యాసాక్షం అనేక శ్రేణుల్లో విభజన చెంది ఉంటుంది. చివరి శ్రేణి శాఖలపై పత్రకాలు అమరి ఉంటాయి. ఉదా: కొత్తిమీర
  • హస్తాకార సంయుక్త పత్రాలు (Palmately compound leaves) :-

దీనిలో పత్రకాలన్నీ పత్రవృంతం కొన వద్ద సంలగ్నంగా ఉంటాయి. ఈ పత్రంలో విన్యాసాక్షం ఉండదు. ఇవి పత్రకాల సంఖ్యను బట్టి ఆరు రకాలు.

    • ఏకదళయుత సంయుక్త పత్రం: పత్రవృంతం కొనలో ఒకే పత్రకం ఉంటుంది. ఉదా: సిట్రస్ జాతులు.
    • ద్విదళయుత సంయుక్త పత్రం: పత్రవృంతం కొనలో రెండు పత్రకాలు ఉంటాయి. ఉదా: హార్డ్ వికియ
    • త్రిదళయుత సంయుక్త పత్రం: పత్రవృంతం కొనలో మూడు పత్రకాలు ఉంటాయి. ఉదా: చిక్కుడు.
    • చతుర్దళయుత సంయుక్త పత్రం: పత్రవృంతం కొనలో నాలుగు పత్రకాలు ఉంటాయి. ఉదా: మార్సీలియా.
    • పంచదళయుత సంయుక్త పత్రం: పత్రవృంతం కొనలో ఐదు పత్రకాలు ఉంటాయి. ఉదా: గైనాన్డ్రాప్సిస్.
    • బహుదళయుత సంయుక్త పత్రం: పత్రవృంతం కొనలో ఐదు కంటే ఎక్కువ పత్రకాలు ఉంటాయి. ఉదా: బూరుగ.

పత్ర విన్యాసం

కాండంపైన, శాఖలపైన పత్రాలు అమరి ఉండే విధానాన్ని 'పత్రవిన్యాసం' (Phylotaxy) అంటారు. మొక్కలోని పత్రాలన్నీ సూర్యరశ్మిని పొందటానికి అనుగుణంగా కాండంపై ఒక క్రమపద్ధతిలో, గణితబద్ధంగా, జన్యునిర్దేశితమై ఉంటాయి. కణుపులవద్ద ఏర్పడే పత్రాల సంఖ్యను బట్టి పత్రవిన్యాసం మూడు రకాలుగా ఉంటుంది.

ఏకాంతర పత్రవిన్యాసం

ఈ పత్రవిన్యాసంలో ప్రతి కణుపు వద్ద ఒకే పత్రం ఏర్పడుతుంది. పత్రాలన్నీ కాండం చుట్టూ నిర్ధిష్ట దూరంలో నిర్ధిష్టమైన నిలువు వరుసలలో అమరి ఉంటాయి. ఉదా: మందార.

అభిముఖ పత్రవిన్యాసం

ప్రతీ కణుపు దగ్గర రెండేసి పత్రాలు అభిముఖంగా ఏర్పడతాయి. ఇవి రెండు రకాలు.

  • అభిముఖ ఉపరిస్థిత పత్రవిన్యాసం: ఒక కణుపు దగ్గర ఉండే పత్రాల జత, దానిపై కణుపు దగ్గర ఉండే పత్రాల జతకు సరిగ్గా పైన ఉంటాయి. ఉదా: క్విస్ క్వాలిస్.
  • అభిముఖ డెకుస్సేట్ పత్రవిన్యాసం: ఒక కణుపు దగ్గర ఉండే పత్రాల జత, దానిపై కణుపు దగ్గర ఉండే పత్రాల జతకు సమకోణంలో ఉంటాయి. ఉదా: జిల్లేడు.

వలయ లేదా చక్రీయ పత్రవిన్యాసం

ప్రతీ కణుపు దగ్గర రెండు కంటే ఎక్కువ పత్రాలు చక్రీయంగా ఏర్పడతాయి. ఉదా: గన్నేరు.

ఈనెల వ్యాపనం

పత్ర రూపాంతరాలు

పరిసరాలకు అనుగుణంగా ప్రత్యేకమైన విధులను నిర్వహించడానికి పత్రం పూర్తిగాగాని, లేక కొంతభాగంగాని శాశ్వతమైన మార్పుచెందితే దానిని 'పత్రరూపాంతరం' అంటారు.

నులితీగలు

కొన్ని బలహీనమైన కాండాలు ఉన్న మొక్కలలో పూర్తి పత్రంగానీ, పత్రభాగాలుగానీ రూపాంతరం చెంది సన్నటి నులితీగలుగా ఏర్పడతాయి. ఇవి మొక్కలకు యాంత్రిక ఆధారాన్నిస్తూ, మొక్క ఎగబాకటంలో తోడ్పడతాయి.

  • పూర్తిపత్రం ఉదా: లాథిరస్
  • సంయుక్తపత్రంలో అగ్రపత్రకాలు ఉదా: పైసమ్
  • పత్రాగ్రం ఉదా: గ్లోరియోస
  • పత్రపుచ్ఛాలు ఉదా: స్మైలాక్స్
  • పత్రవృంతం ఉదా: క్లీమాటిస్

కంటకాలు

కొన్ని మొక్కల్లో పత్రాలు రూపాంతరం చెంది వాడిగా, మొనతేలిన కంటకాలలాగా ఏర్పడతాయి. ఇవి ఎడారి మొక్కలలో భాష్పోత్సేక వేగాన్ని తగ్గించి నీటి ఎద్దడిని తట్టుకోవడానికి, పశువుల బారినుంచి మొక్కను రక్షించడానికి తోడ్పడతాయి.

పొలుసాకులు

కొన్ని ఎడారి మొక్కలలోను, భూగర్భ కాండాలలోను పత్రాలు క్షీణించి, ఎండిపోయిన పలుచని పొరవంటి వర్ణరహితమైన నిర్మాణాలుగా ఏర్పడతాయి. వీటిని పొలుసాకులు అంటారు. ఎడారి మొక్కలలో ఇవి భాష్పోత్సేకాన్ని నిరోధిస్తాయి. భూగర్భకాండాలలో ఇవి గ్రీవపు మొగ్గలను, కొన మొగ్గలను రక్షిస్తూ ఉంటాయి. ఉల్లిలో పొలుసాకులు ఆహారపదార్ధాలను నిలువచేస్తాయి.

ప్రభాసనం

పత్రవృంతం గానీ ద్వితీయ విన్యాసాక్షాలు గానీ బల్లపరుపు లేదా రెక్క వంటి ఆకుపచ్చని పత్రం వంటి నిర్మాణంగా మారి కిరణజన్యసంయోగక్రియను జరుపుతాయి. ఉదా: అకేషియా, పార్కిన్ సోనియా

ప్రత్యుత్పత్తి పత్రాలు

కొన్ని మొక్కలలో పత్రాలు పత్రోపరిస్థిత మొగ్గలను ఉత్పత్తి చేసి శాఖీయ ప్రత్యుత్పత్తిలో పాల్గొంటాయి.

  • రణపాల (బ్రయోఫిల్లమ్)లో పత్రపు అంచులలోని గుంటల్లో పత్రోపరిస్థిత మొగ్గలుంటాయి. కాచుగడ్డ (సిల్లా ఇండికా)లో పత్రాల కొనల వద్ద పత్రోపరిస్థిత మొగ్గలుంటాయి. వీటిలో పత్రాలు వంగి నేలను తాకినప్పుడు, వాటినుంచి కొత్త మొక్కలు ఏర్పడతాయి.
  • బెగోనియాలో పత్రోపరిస్థిత మొగ్గలు పత్రాల గాయాల భాగాల నుంచి ఏర్పడతాయి.

బోను పత్రాలు

నత్రజని సంబంధ పదార్ధాలు లోపించిన నేలల్లో పెరిగే కొన్ని మొక్కలు నత్రజని సంబంధ పదార్ధాల కోసం కీటకాలు వంటి సూక్ష్మ జంతువుల మీద ఆధారపడి ఉంటాయి. ఇవి కీటకాలను ఆకర్షించి, భక్షించి, పోషణ జరుపుకోవడానికి వీలుగా వీటిలోని పత్రాలు బోను పత్రాలుగా మార్పుచెందుతాయి. ఇటువంటి మొక్కలను 'కీటకాహార మొక్కలు' అంటారు. బోనులుగా మారిన పత్రాలలో జీర్ణగ్రంధులు ఏర్పడి, జీర్ణరసాలను స్రవిస్తాయి. వీటి సహాయంతో కీటకాలు జీర్ణమై వాటిలోని నత్రజని సమ్మేళనాలు మొక్కచే శోషింపబడతాయి. ఉదా: నెపెంథిస్, డ్రోసిరా, యుట్రిక్యులేరియా.


మూలాలు

  • Leaves: The formation, charactistics and uses of hundred of leaves in all parts of the world by Ghillean Tolmie Prance. 324 photographic plates in black and white, and colour by Kjell B Sandved 256 pages.

ఇవి కూడా చూడండి

మూస:Link FA మూస:Link FA మూస:Link FA

"https://te.wikipedia.org/w/index.php?title=పత్రము&oldid=604326" నుండి వెలికితీశారు