రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: en:Rallapalli Anantha Krishna Sharma
పంక్తి 25: పంక్తి 25:
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:తెలుగు సాహితీకారులు]]
[[వర్గం:తెలుగు సాహితీకారులు]]
[[వర్గం:సంగీత కళానిధి పురస్కార గ్రహీతలు]]


[[en:Rallapalli Anantha Krishna Sharma]]
[[en:Rallapalli Anantha Krishna Sharma]]

07:52, 19 మే 2011 నాటి కూర్పు

దస్త్రం:450px-RaaLLapalli anaMta kRshNa.jpg
తిరుపతిఅన్నమాచార్య ప్రాజెక్టు నందలి రాళ్ళపల్లి ఫోటో.

తెలుగు సాహిత్యపు ఆధునిక వచన శైలీ నిర్మాతలలో అనంతకృష్ణశర్మ అగ్రేసరుడు. విమర్శనా రీతులలో వీరు మార్గదర్శకుడు. అన్నమాచార్యులు వారి కృతులను - కొన్ని వందల కృతులను - ఆయన స్వరపరచి తెలుగువారికి అందించాడు. వేమనపై సాధికారమైన విమర్శ గ్రంధాన్ని వెలువరించాడు. సంగీత సాహిత్యాలు రెండింటిలోనూ సమ స్కందులు. మైసూరు మహారాజా కళాశాలలో ముప్పైఎనిమిది సంవత్సరాలు అధ్యాపకత్వం నిర్వహించేరు. ఏకసంథాగ్రాహిగా పేరు పడినవాడు.

బాల్యం

జీవనకాలం: జనవరి 23, 1893 - మార్చి 11, 1979. తల్లిదండ్రులు: అలమేలు మంగమ్మ, కర్నమడకల కృష్ణమాచార్యులు. జన్మస్థలం: అనంతపురం జిల్లా రాళ్లపల్లె గ్రామం. తండ్రి వద్దనే సంస్కృతాంధ్ర భాషలలో ప్రావీణ్యత సంపాదించి, మైసూరు పరకాల మఠంలో ఉన్నత సంస్కృత విద్యను అభ్యసించాడు. ఆయన తల్లి అలివేలు మంగమ్మ సంగీత గురువులు. ఆమె సంస్కృతం, తెలుగు, కన్నడం, తమిళ భాషలలోని భజన కీర్తనలు, పెళ్ళి పాటలు, జోలపాటలు, పూజ పాటలు కథా గేయాలు చిన్ననాడే శర్మగారికి నేర్పింది. మేనమామ గారి ప్రోత్సాహంతో ఫిడేలు వాయించడం నేర్చుకున్నాడు.

సంగీత సాహిత్యాలు

రేఖాచిత్రం

చామరాజునగరం రామశాస్త్రిగారి వద్ద 'శాకుంతలం', 'ఉత్తరరామ చరిత్ర', 'ముద్రా రాక్షసం', అనర్ఘరాఘవం', 'కాదంబరి' వాటిని చదివాడు. సామాజిక స్పృహ వాదులైన నేటి సమాజానికి ఆదర్శప్రాయుడైన వేమన గురించి శర్మగారు తమ వేమనోపన్యాసాలలో అనేక విషయాలు ఆవిష్కరించాడు. 'నిగమశర్మ అక్క', 'నాచన సోముని నవీన గుణములు', 'తిక్కన తీర్చిన సీతమ్మ', 'రాయలనాటి రసికత' అనే ఆయన వ్యాసాలు బాగా ప్రసిద్ధమైనవి. కట్టమంచి రామలింగారెడ్డి గారితో పరిచయం కలిగి, వారి ఆహ్వానం మీద 1912లో మొట్టమొదటిసారిగా ఏర్పరచిన తెలుగు పండిత పదవిని అలంకరించాడు. అప్పటి నుండి తెలుగులో రచనా వ్యాసంగాలను మొదలుపెట్టాడు. కాళిదాసు రచించిన రఘువంశం ఆంధ్రీకరించాడు. 'పెద్దన పెద్దతనము' అను విమర్శనాత్మక వ్యాసాన్ని రాశాడు.

సంగీతప్రియులైన శర్మ కృష్ణప్పగారి వద్ద నాలుగైదు సంవత్సరాలు శాస్తీయసంగీతాన్ని అభ్యసించారు. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి చెలికాని అన్నారావు తాళ్ళపాక కవుల కీర్తనల పరిష్కరణ కార్యం నిర్వహించవలసిందిగా ఆయన్ను కోరారు. ఆయన ఏడు సంవత్సరాలు (1950-57) సంకీర్తనలను పరిశీలించి కొన్నింటికి స్వరకల్పన గావించి వాటి గొప్పతనాన్ని చాటాడు. రేడియోకు 'ఆకాశవాణి'యని పేరు పెట్టినది ఆయనే.

సత్కారాలు

మైసూరులో జరిగిన 4వ సంగీత సమ్మేళనంలో 'గాన కళాసింధు' బిరుదుతో సత్కరించారు. బెంగుళూరు గాయక సమాజం ' సంగీత కళారత్న' బిరుదుతో సత్కరించింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ 1970లో పెలోషిప్ నిచ్చి సత్కరించింది. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డి.లిట్. పట్టంతో గౌరవించింది.

రాళ్ళపల్లివారు 1979, మార్చి 11న పరమపదించాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుర్లు.

వనరులు

  • అక్కిరాజు రమాపతిరావు రాసిన 'ప్రతిభామూర్తులు', విజ్ఞాన దీపిక ప్రచురణ, 1991
  • 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.