ఇల్లరికం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4: పంక్తి 4:
image = illarikam.jpg |
image = illarikam.jpg |
starring = [[అక్కినేని నాగేశ్వరరావు]] (వేణు),
[[జమున]] (రాధ),
[[రమణా రెడ్డి]] (ధర్మయ్య),
starring = [[అక్కినేని నాగేశ్వరరావు]] (వేణు),
[[జమున]] (రాధ),
[[రమణా రెడ్డి]] (ధర్మయ్య),

[[గుమ్మడి]] (జమీందార్),
[[హేమలత]] (సుందరమ్మ) ,
[[రేలంగి వెంకట్రామయ్య|రేలంగి]],
[[పద్మనాభం]],
[[రాజబాబు]],
[[అల్లు రామలింగయ్య]] (పానకాలు),
[[గిరిజ]] (కనకదుర్గ),
[[ఆర్. నాగేశ్వరరావు]] (శేషగిరి),
[[హేమలత]],
[[పేకేటి శివరాం]],
[[చిలకలపూడి సీతారామంజనేయులు]] (గోవిందయ్య),
బాల (సావిత్రి),
టి.జి. కమల (జమీందార్ చెల్లి),
బొడ్డపాటి (డాన్స్ మాస్టర్),
[[సురభి కమలాబాయి]],
[[విజయలక్ష్మి]],
లక్ష్మి,
లీలాబాయి,
పాలడుగు |

[[గుమ్మడి వెంకటేశ్వరరావు]] (జమీందార్),
[[హేమలత]] (సుందరమ్మ) ,
[[రేలంగి వెంకట్రామయ్య|రేలంగి]],
[[పద్మనాభం]],
[[రాజబాబు]],
[[అల్లు రామలింగయ్య]] (పానకాలు),
[[గిరిజ]] (కనకదుర్గ),
[[ఆర్. నాగేశ్వరరావు]] (శేషగిరి),
[[హేమలత]],
[[పేకేటి శివరాం]],
[[చిలకలపూడి సీతారామంజనేయులు]] (గోవిందయ్య),
బాల (సావిత్రి),
టి.జి. కమల (జమీందార్ చెల్లి),
బొడ్డపాటి (డాన్స్ మాస్టర్),
[[సురభి కమలాబాయి]],
[[విజయలక్ష్మి]],
లక్ష్మి,
లీలాబాయి,
పాలడుగు |
story = వెంపటి సదాశివబ్రహ్మం
కోటయ్య ప్రత్యగాత్మ|
story = వెంపటి సదాశివబ్రహ్మం
కోటయ్య ప్రత్యగాత్మ|
screenplay = |
screenplay = |

06:51, 29 మే 2011 నాటి కూర్పు

ఇల్లరికం
(1959 తెలుగు సినిమా)
దర్శకత్వం తాతినేని ప్రకాశరావు
నిర్మాణం అనుమోలు వెంకట సుబ్బారావు,
బి.ఎ. సుబ్బారావు
కథ వెంపటి సదాశివబ్రహ్మం
కోటయ్య ప్రత్యగాత్మ
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు (వేణు),
జమున (రాధ),
రమణా రెడ్డి (ధర్మయ్య),
గుమ్మడి వెంకటేశ్వరరావు (జమీందార్),
హేమలత (సుందరమ్మ) ,
రేలంగి,
పద్మనాభం,
రాజబాబు,
అల్లు రామలింగయ్య (పానకాలు),
గిరిజ (కనకదుర్గ),
ఆర్. నాగేశ్వరరావు (శేషగిరి),
హేమలత,
పేకేటి శివరాం,
చిలకలపూడి సీతారామంజనేయులు (గోవిందయ్య),
బాల (సావిత్రి),
టి.జి. కమల (జమీందార్ చెల్లి),
బొడ్డపాటి (డాన్స్ మాస్టర్),
సురభి కమలాబాయి,
విజయలక్ష్మి,
లక్ష్మి,
లీలాబాయి,
పాలడుగు
సంగీతం టి.చలపతిరావు
నేపథ్య గానం ఘంటసాల,
సుశీల,
జిక్కి,
మాధవపెద్ది సత్యం
గీతరచన ఆరుద్ర,
శ్రీశ్రీ,
కొసరాజు
సంభాషణలు ఆరుద్ర
వెంపటి సదాశివబ్రహ్మం
ఛాయాగ్రహణం ఎ. విన్సెంట్
కూర్పు ఎ. సంజీవి
నిర్మాణ సంస్థ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్
విడుదల తేదీ 1 మే 1959
నిడివి 2 గంటల 32 నిముషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఇల్లరికం , 1959లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఇల్లరికపు అల్లుళ్ళకు తప్పని అగచాట్లు, వారి వల్ల అత్తమామలకు ఎదురయ్యే ఇబ్బందులు నేపథ్యంలో నడచే కథ ఇది. రజతోత్సవం జరుపుకున్న చిత్రం. ఇందులో పఅటలు చాలా కాలంగా తెలుగువారి నోట నానాయి. "ఇల్లరికంలో ఉన్న మజా" అనే పల్లవి సంభాషణలలో భాగమయ్యింది.

కధ

వేణు (నాగేశ్వరరావు) తన మేనమామ సహాయంతో చదువు పూర్తి చేస్తాడు. ఒక జమీందార్ (గుమ్మడి) కూతురైన రాధ (జమున)ను ప్రేమించి, పెళ్ళి చేసుకొని వారింటిలోనే ఉంటాడు. జమీందార భార్య సుందరమ్మ (హేమలత) పెడసరంగా ఉండి అతనిని అవమానిస్తుంది. గోవిందయ్య (సి.ఎస్.ఆర్.) ఆకుంటుంబంలో కలహాలు పెంచడానికి మరింత ప్రయత్నం చేస్తుంటాడు. ఆ సమస్యలను వేణు పరిష్కరించడమే ఈ సినిమా కధాంశం.

ప్రక్క ఇళ్ళలో ఇల్లరికం ఉన్న పేకేటి శివరాం, రేలంగిలు ఈ సినిమాలో హాస్యం పంచుతారు.

పాటలు

పాట రచయిత సంగీతం గాయకులు
ఎక్కడి దొంగలు అక్కడనే గప్ చుప్-ఎవరే పిలిచారు నిన్నెవరే పిలిచారు (ఇది మహమ్మద్ రఫీ పాడిన "తుమ్‌సా నహీ దేఖా"కు అనుకరణ) శ్రీశ్రీ టి.చలపతిరావు ఘంటసాల
నిలువవే వాలు కనులదానా, వయారి హంస నడకదానా కొసరాజు టి.చలపతిరావు ఘంటసాల
నేడు శ్రీవారికి మేమంటే పరాకా, తగని బలే చిరాకా ఎందుకో ఆరుద్ర టి.చలపతిరావు ఘంటసాల, పి.సుశీల
చేతులు కలసిన చప్పట్లు, మనసులు కలసిన ముచ్చట్లు ఆరుద్ర ఘంటసాల, సుశీల, మాధవపెద్ది బృందం
మధుపాత్ర నింపవోయి సుఖయాత్ర సాగవోయి ఆరుద్ర జిక్కి బృందం
భలే ఛాన్సులే ...భలే ఛాన్సులే ... లలలాం లలలాం లకీ ఛాన్సులే, ఇల్లరికంలో ఉన్న మజా, అది అనుభవించితే తెలియునులే కొసరాజు మాధవపెద్ది
అడిగినదానికి చెప్పి ఎదురాడక ప్రశ్నను విప్పి కొసరాజు ఘంటసాల, సుశీల బృందం

విశేషాలు

• ఇది అక్కినేనికి 74వ సినిమా. ఇందులో కె. ప్రత్యగాత్మ, కోగంటి గోపాలకృష్ణలు, తాతినేని రామారావులు సహాయ దర్శకులుగా పని చేశారు. తరువాత వారంతా ప్రసిద్ధ దర్శకులయ్యారు.
• సురభి కమలాబాయి చాలాకాలం తరువాత మళ్ళీ సినిమాలో నటించింది.
• ఆరుద్ర డైలాగులు చిత్ర విజయానికి బాగా తోడ్పడినాయి. పోస్టరులపై బాపు కార్టూనులు తెలుగు సినిమా రంగంలో క్రొత్త ట్రెండ్‌గా చెప్పారు.
• నిలువవే వాలు కనుల దానా, నేడు శ్రీవారికి మేమంటే పరాకా వంటి పాటలు ఎవర్‌గ్రీన్ పాటలుగా ప్రసిద్ధి చెందాయి. 50 యేళ్ళ తరువాత కూడా ఈ పాటలు శ్రోతలనోట నానుతున్నాయి. గోపీచంద్ హీరోగా వచ్చిన "లక్ష్యం" సినిమాలో "నిలువవే వాలుకనుల దానా" పాటను రి-మిక్స్ చేశారు.
• ఈ సినిమా 23 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది.
• ఎల్.వి.ప్రసాద్ ఈ సినిమాను హిందీలో "ససురాల్" అనే సినిమాగా పునర్నిర్మించాడు. అది పెద్ద విజయం సాధించింది. హిందీలో కూడా జమునను కధానాయికగా పెట్టాలనుకొన్నారుగాని కొన్ని కారణాల వలన చివరి క్షణంలో బి. సరోజాదేవిని ఆ పాత్రకు ఎంపిక చేశారు. అందుకు ప్రతిగా జమునకు ఐదు సినిమాలలో హీరోయిన్ పాత్ర ఇచ్చారట.

మూలాలు

• సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.