కులగోత్రాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7: పంక్తి 7:
production_company = [[ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ ప్రై. లిమిటెడ్]]|
production_company = [[ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ ప్రై. లిమిటెడ్]]|
music = [[ఎస్. రాజేశ్వరరావు]]|
music = [[ఎస్. రాజేశ్వరరావు]]|
starring = [[అక్కినేని నాగేశ్వరరావు]],
[[ కృష్ణకుమారి]],
[[ గుమ్మడి]],
[[ రేలంగి వెంకట్రామయ్య]],
[[ పద్మనాభం]],
[[ సూర్యకాంతం]],
[[ గిరిజ]],
[[నిర్మలమ్మ]],
మద్దాలి కృష్ణమోహనరావు,
[[సంధ్య]],
[[ జి. వరలక్ష్మి]],
[[మిక్కిలినేని]],
[[అల్లు రామలింగయ్య]]|
starring = [[అక్కినేని నాగేశ్వరరావు]],
[[ కృష్ణకుమారి]],
[[ గుమ్మడి వెంకటేశ్వరరావు]],
[[ రేలంగి వెంకట్రామయ్య]],
[[ పద్మనాభం]],
[[ సూర్యకాంతం]],
[[ గిరిజ]],
[[నిర్మలమ్మ]],
మద్దాలి కృష్ణమోహనరావు,
[[సంధ్య]],
[[ జి. వరలక్ష్మి]],
[[మిక్కిలినేని]],
[[అల్లు రామలింగయ్య]]|
imdb_id= 0213784
imdb_id= 0213784

08:05, 29 మే 2011 నాటి కూర్పు

కులగోత్రాలు
(1962 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ప్రత్యగాత్మ
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
కృష్ణకుమారి,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
రేలంగి వెంకట్రామయ్య,
పద్మనాభం,
సూర్యకాంతం,
గిరిజ,
నిర్మలమ్మ,
మద్దాలి కృష్ణమోహనరావు,
సంధ్య,
జి. వరలక్ష్మి,
మిక్కిలినేని,
అల్లు రామలింగయ్య
సంగీతం ఎస్. రాజేశ్వరరావు
నిర్మాణ సంస్థ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ ప్రై. లిమిటెడ్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

సంక్షిప్త చిత్రకథ

కామందు భూషయ్య (గుమ్మడి) కొడుకు రవి (అక్కినేని) విశాఖపట్నంలో చదువుకుంటున్నాడు. కళాశాల వార్షికోత్సవంలో శకుంటల దుష్యంతుడు నాటకంలో తనతోపాటు కధానాయిక వేషంలో పాల్గొన్న సరోజ (కృష్ణకుమారి)ను రవి ప్రేమిస్తాడు. సరోజ తల్లి చలపతి వల్ల మోసపోతుంది. అతడు ఒకరోజున కూతురు మెడలో నగ దొంగిలించి అనుకోని పరిస్థితుల్లో భార్యను కలుసుకుంటాడు. ఆమె హెచ్చరించగా బాధతో వెళ్ళిపోతాడు.

కులగోత్రాల పట్టింపు గల భూషయ్య రవి ప్రేమను అంగీకరించడు. సరోజకు యిచ్చిన మాట ప్రకారం రవి ఇల్లు వదలి తండ్రి అభీష్టానికి వ్యతిరేకంగా సరోజను గుడిలో పెళ్ళి చేసుకుంటాడు. రవికి పోలీస్ ఇన్ స్పెక్టరుగా ఆ వ్రిలోనే వుద్యోగం వస్తుంది. రవి తన బావ (రేలంగి) స్నేహితులతో కలిసి పేకాడుతుంటే అరెస్టు చేస్తాడు. తండ్రి పట్టింపుల వల్ల రవి తన చెల్లెలు పెళ్ళికి కూడా వెళ్ళలేక బయటనుంచే అక్షింతలు వేస్తాడు.

రవిని తలుచుకొని అతని తల్లి బాధపడి అనారోగ్యంతో మంచం పట్టి మరణిస్తుంది. భార్య గతించాక భూషయ్యలో మార్పు వస్తుంది. రవికి కొడుకు పుడతాడు. భూషయ్య మమతను చంపుకోలేక దొంగచాటుగా వెళ్ళి మనవణ్ణి చూసి ఎత్తుకొని ముచటపడి వాడి మెడలో బంగారు గొలుసు కానుకగా వేస్తాడు. చలపతి భూషయ్య యింట్లో దొంగతనం చేసే ప్రయత్నంలో వుండగా రవి వచ్చి రక్షిస్తాడు. పంతాలు పట్టింపులు వదలి భూషయ్య కొడుకు, కోడలు, మనవణ్ణి యింట్లోకి ఆహ్వానిస్తాడు.

పాటలు

పాట రచయిత సంగీతం గాయకులు
అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే కొసరాజు సాలూరు రాజేశ్వరరావు మాధవపెద్ది సత్యం బృందం
చిలిపి కనుల తీయని చెలికాడా నీ నీడను నిలుపుకొందురా వెల్గుల మేడ సి.నారాయణరెడ్డి సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల, పి.సుశీల
చెలికాడు నిన్నేరమ్మని పిలువా చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా సి.నారాయణరెడ్డి సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల, పి.సుశీల
మామా శతృభయంకర నామ అందానికి చందమామ సాలూరు రాజేశ్వరరావు మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు
రావయ్యా మా యింటికి రమ్మంటే రావేల మా యింటికి కృష్ణయ్యా సాలూరు రాజేశ్వరరావు సత్యారావు, స్వర్ణలత
రావే రావే బాలా, హలో మైడియర్‌ లీలా సాలూరు రాజేశ్వరరావు పి.బి. శ్రీనివాస్
సఖీ శకుంతల రెక్కలు ధరించి ప్రియునిచెంత వాలగలేవా సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల, పి.సుశీల
అయ్యయ్యో, చేతిలో డబ్బులు పోయెనే,
అయ్యయ్యో, జేబులు ఖాళీ ఆయనే!
ఉన్నది కాస్తా వూడింది, సర్వమంగళం పాడింది.
పెళ్ళాం మెళ్లో నగలతో సహా తిరుక్షవరమై పోయింది! ।।

ఆ మహా మహా నలమహారాజుకే తప్పలేదు భాయి, ఓటమి...।।

మరినువ్‌ చెప్పలేదు భాయి...!...అది నా తప్పుగాదు భాయి
తెలివి తక్కువగ చీట్లపేకలో దెబ్బతింటివోయి.
బాబూ నిబ్బరించవోయి!

నిలువుదోపిడి దేవుడికిచ్చిన ఫలితం దక్కేది, ఎంతో పుణ్యం దక్కేది!
గోవింద, గోవిందా! చక్కెర పొంగలి చిక్కేది!

ఎలక్షన్లో ఖర్చుపెడితే ఎం.ఎల్‌.ఏ. దక్కేది!..మనకు అంతటి లక్కేది? ।।

గెల్పూ ఓటమీ దైవాధీనం. చెయ్యితిరగవచ్చు... మళ్ళీ ఆడి గెల్వవచ్చు!

ఇంకా పెట్టుబడెవడిచ్చు?.....
ఇల్లు కుదవ బెట్టవచ్చు!
ఛాన్సు తగిలితే యీ దెబ్బతో మన కరువు తీరవచ్చు!

పోతే.... అనుభవమ్ము వచ్చు!....చివరకు జోలె కట్టవచ్చు! ।।

మూలాలు

• సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.