డాక్టర్ చక్రవర్తి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7: పంక్తి 7:
story = [[కోడూరు కౌసల్యాదేవి]]
([[చక్రభ్రమణం]] నవల ఆధారంగా)|
story = [[కోడూరు కౌసల్యాదేవి]]
([[చక్రభ్రమణం]] నవల ఆధారంగా)|
music = [[సాలూరి రాజేశ్వరరావు]]|
music = [[సాలూరి రాజేశ్వరరావు]]|
starring = [[అక్కినేని నాగేశ్వరరావు]],
[[సావిత్రి]],
[[జగ్గయ్య]],
[[షావుకారు జానకి]],
[[కృష్ణకుమారి]],
[[గుమ్మడి]],
[[సూర్యకాంతం]],
[[గీతాంజలి]],
[[పద్మనాభం]],
[[చలం]],
[[జయంతి]]|
starring = [[అక్కినేని నాగేశ్వరరావు]],
[[సావిత్రి]],
[[జగ్గయ్య]],
[[షావుకారు జానకి]],
[[కృష్ణకుమారి]],
[[గుమ్మడి వెంకటేశ్వరరావు]],
[[సూర్యకాంతం]],
[[గీతాంజలి]],
[[పద్మనాభం]],
[[చలం]],
[[జయంతి]]|
dialogues = [[ఆచార్య ఆత్రేయ]] |
dialogues = [[ఆచార్య ఆత్రేయ]] |
producer = [[డి.మధుసూదనరావు]]|
producer = [[డి.మధుసూదనరావు]]|

12:55, 29 మే 2011 నాటి కూర్పు

డాక్టర్ చక్రవర్తి
(1964 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు
నిర్మాణం డి.మధుసూదనరావు
కథ కోడూరు కౌసల్యాదేవి
(చక్రభ్రమణం నవల ఆధారంగా)
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
సావిత్రి,
జగ్గయ్య,
షావుకారు జానకి,
కృష్ణకుమారి,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
సూర్యకాంతం,
గీతాంజలి,
పద్మనాభం,
చలం,
జయంతి
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
నేపథ్య గానం బి.వసంత,
ఎస్.జానకి,
పి.బి.శ్రీనివాస్,
ఘంటసాల,
మాధవపెద్ది సత్యం,
పి.సుశీల
సంభాషణలు ఆచార్య ఆత్రేయ
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

డాక్టర్ చక్రవర్తి, 1964లో విడుదలైన ఒక తెలుగు సినిమా. తెలుగులో నవలల ఆధారంగా వచ్చిన చిత్రాలలో ఇది ఒక ప్రసిద్ధి చెందిన సినిమా. కోడూరు కౌసల్యాదేవి రచించిన "చక్ర భ్రమణం" ఆధారంగా ఈ సినిమా నిర్మింపబడింది. ఇందులో చాలా పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుకా, నీవు లేక వీణ పలుకలేనన్నది నీవు రాక రాధ నిలువలేనన్నది, పాడమని నన్నడగవలెనా పరవశించి పాడనా, మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము వంటి పాటలు దశాబ్దాలుగా సినిమా సంగీత ప్రియులను అలరించాయి.

కుటుంబ స్నేహంలో వచ్చే అపార్ధాలను ఈ సినిమాలో సున్నితంగా చూపించారు. డాక్టర్ చక్రవర్తి (అక్కినేని) తన స్నేహితుని (జగ్గయ్య) భార్య (సావిత్రి)లో తన మరణించిన చెల్లెలును చూసుకొని ఆమెపట్ల అనురాగం పెంచుకొంటాడు. కాని వారి మధ్యనున్న ఆప్యాయతను ఇతరులు అపార్ధం చేసుకొంటారు. ఫలితంగా వారిమధ్య ఏర్పడిన కలతలే ఈ సినిమా కధాంశం.

సంక్షిప్త చిత్రకథ

డాక్టర్ చక్రవర్తి (అక్కినేని), డాక్టర్ శ్రీదేవి (కృష్ణకుమారి) పూర్వాశ్రమంలో ప్రేమికులు. చక్రవర్తి సోదరి సుధ (గీతాంజలి) క్యాన్సర్ వ్యాధి వల్ల చనిపోతూ నిర్మల (షావుకారు జానకి) ను పెళ్ళిచేసుకోవలసిందిగా కోరుతుంది. దానిని మన్నించి చక్రవర్తి నిర్మలను పెళ్ళి చేసుకుంటాడు.

చక్రవర్తికి ఆప్తమిత్రుడు రవీంద్ర (జగ్గయ్య). అతని భార్య మాధవి (సావిత్రి) రచయిత్రి. వారిద్దరిదీ అనుకూల దాంపత్యం. మరణించిన చెల్లెలు సుధను మాధవిలో చూసుకుంటాడు చక్రవర్తి. దీనికి చిలవలు పలవలు కల్పించి సుర్యకాంతం వారి కాపురాల్లో జ్వాలను రగిలిస్తుంది. ఫలితంగా రవీంద్ర మిత్రుడు చక్రవర్తిని అనుమానించి అవమానిస్తాడు. పతాక సన్నివేశంలో రవీంద్ర జరిగిన పొరపాటును గ్రహించగా, డాక్టర్ శ్రీదేవి మరియు చక్రవర్తిల సహాయంతో మాధవి పండంటి బిడ్డకు జన్మనిస్తుంది.

పాటలు

పాట రచయిత సంగీతం గాయకులు
ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుకా ఆరుద్ర సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల పి.సుశీల
ఎవరో జ్వాలను రగిలించారు వేరెవరో దానికి బలియైనారు ఆత్రేయ సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల
ఓ ఉంగరాల ముంగురుల రాజ నీ హంగు చూసి మోసపోను లేర దాశరథి సాలూరు రాజేశ్వరరావు పి.సుశీల, మాధవపెద్ది సత్యం
నీవు లేక వీణ పలుకలేనన్నది నీవు రాక రాధ నిలువలేనన్నది ఆత్రేయ సాలూరు రాజేశ్వరరావు పి.సుశీల
పాడమని నన్నడగవలెనా పరవశించి పాడనా ఆత్రేయ సాలూరు రాజేశ్వరరావు పి.సుశీల
మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము శ్రీశ్రీ సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల
నిజం చెప్పవే పిల్లా ఎలా ఉంది ఈవేళ
ఒంటిగ సమయం చిక్కిందా

ఇతర విశేషాలు

• 1962లో ఆంధ్రప్రభ వారపత్రిక నిర్వహించిన పోటీల్లో ప్రథమ బహుమతి పొందిన నవల కోడూరి కౌసల్యాదేవి రచించిన "చక్రభ్రమణం". బహుళ పాఠకాదరణ పొందిన ఈ నవలను సినిమాగా తీయాలని సంకల్పించిన దుక్కిపాటి మధుసూధనరావు నవలలో ఏ పాత్ర ఎవరు ధరిస్తే బాగుంటుందని పాఠకులకు క్విజ్ నిర్వహించి, ఆ వచ్చిన ఫలితాల ఆధారంగా ప్రధాన పాత్రల్ని ఎంపికచేశారు.
• డాక్టర్ చక్రవర్తి సినిమాకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1964లో మొదలుపెట్టిన నంది అవార్డుల్లో బంగారు నంది గెలుచుకున్నది. దానిద్వారా లభించిన 50,000 రూపాయల పెట్టుబడితో అక్కినేని-ఆదుర్తి 'చక్రవర్తి చిత్ర' పతాకంపై సుడిగుండాలు, మరో ప్రపంచం అనే ప్రయోజనాత్మక చిత్రాల్ని నిర్మించారు.
• ఈ చిత్రం విడుదలైన తర్వాత, అమెరికా ప్రభుత్వ ఆహ్వానంపై భారతదేశ సాంస్కృతిక రాయబారిగా సందర్శించారు. తన విదేశీ పర్యటన అనుభవాల్ని "నేను చూసిన అమెరికా" అనే గ్రంధంలో వివరించారు.

మూలాలు

• బంగారు నంది నందుకొన్న తొలిచిత్రం "డాక్టర్ చక్రవర్తి", నాటి 101 చిత్రాలు, ఎస్.వి.రామారావు, కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006, పేజీలు 205-6.
• డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
• సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.