ఏదో ఏదో అన్నది..ఈ మసక వెలుతురు: కూర్పుల మధ్య తేడాలు
Maheshbandaru (చర్చ | రచనలు) కొత్త పేజీ: ఈ పాట ముత్యాల ముగ్గు (1975) అను తెలుగు సినిమా లోనిది. ఈ పాటకు ఆరుద్... |
(తేడా లేదు)
|
17:52, 17 జూలై 2011 నాటి కూర్పు
ఈ పాట ముత్యాల ముగ్గు (1975) అను తెలుగు సినిమా లోనిది. ఈ పాటకు ఆరుద్ర గారు సాహిత్యాన్ని అందించగా, కె.వి.మహదేవన్ గారు స్వరపరచగా, వి.రామకృష్ణ గారు ఆలపించగా, శ్రీధర్ మరియు సంగీతలు అభినయించారు.
పాట
పల్లవి:
ఏదో ఏదో అన్నది ...ఈ మసక వెలుతురు...
గూటి పడవలో విన్నది.... కొత్త పెళ్లికూతురు..
ఏదో ఏదో అన్నది ...ఈ మసక వెలుతురు...
గూటి పడవలో విన్నది.... కొత్త పెళ్లికూతురు..
చరణం1:
ఒదిగి ఒదిగి కూర్చుంది బిడియ పడే వయ్యారం....
ముడుచుకునే కొలది మరీ మిడిసిపడే సింగారం
సోయగాల విందులకై వేయి కనులు కావాలి
ఉ ఉ ఉ ఊ... ఉ ఉ ఉ ఊ ఊ.. ..ఏదో ఏదో అన్నది ...ఈ మసక వెలుతురు...
గూటి పడవలో విన్నది.... కొత్త పెళ్లికూతురు.
చరణం2:
నింగిలోని వేలుపులు ఎంత కనికరించారో...
నిన్ను నాకు కానుకగా పిలిచి కలిమినొసగేరు...
పులకరించు మమతలతో పూల పాన్పు వేశారు!
ఉ ఉ ఉ ఊ... ఉ ఉ ఉ ఊ ఊ.. ..ఏదో ఏదో అన్నది ...ఈ మసక వెలుతురు...
గూటి పడవలో విన్నది.... కొత్త పెళ్లికూతురు....