ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.5.2) (యంత్రము కలుపుతున్నది: ca, cy, de, eo, es, et, fa, fi, fr, he, hr, hu, id, it, ja, ko, la, nl, no, pl, pt, ru, sv, ta, th, tr, vi, zh, zh-min-nan, zh-yue
పంక్తి 61: పంక్తి 61:


[[en:The Sound of Music (film)]]
[[en:The Sound of Music (film)]]
[[ta:த சவுண்ட் ஆப் மியூசிக் (திரைப்படம்)]]
[[ca:Somriures i llàgrimes]]
[[cy:The Sound of Music (ffilm)]]
[[de:Meine Lieder – meine Träume]]
[[eo:The Sound of Music]]
[[es:The Sound of Music]]
[[et:Helisev muusika (film)]]
[[fa:اشک‌ها و لبخندها (فیلم)]]
[[fi:Sound of Music]]
[[fr:La Mélodie du bonheur (film, 1965)]]
[[he:צלילי המוזיקה]]
[[hr:Moje pjesme, moji snovi (1965)]]
[[hu:A muzsika hangja]]
[[id:The Sound of Music (film)]]
[[it:Tutti insieme appassionatamente]]
[[ja:サウンド・オブ・ミュージック (映画)]]
[[ko:사운드 오브 뮤직 (영화)]]
[[la:The Sound of Music (pellicula)]]
[[nl:The Sound of Music (film)]]
[[no:Sound of Music (film)]]
[[pl:Dźwięki muzyki (film)]]
[[pt:The Sound of Music]]
[[ru:Звуки музыки]]
[[sv:Sound of Music (film)]]
[[th:มนต์รักเพลงสวรรค์]]
[[tr:Neşeli Günler (film, 1965)]]
[[vi:Giai điệu hạnh phúc (phim)]]
[[zh:音乐之声 (电影)]]
[[zh-min-nan:The Sound of Music (tiān-iáⁿ)]]
[[zh-yue:仙樂飄飄處處聞]]

05:36, 26 జూలై 2011 నాటి కూర్పు

ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్
ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్ సినిమా పోస్టర్
దర్శకత్వంరాబర్ట్ వైజ్
రచనHoward Lindsay
Russel Crouse (Libretto)
Maria von Trapp (Autobiography)
Ernest Lehman
నిర్మాతరాబర్ట్ వైజ్
తారాగణంJulie Andrews
Christopher Plummer
Eleanor Parker
Richard Haydn
Peggy Wood
Charmian Carr
ఛాయాగ్రహణంTed D. McCord
కూర్పుWilliam H. Reynolds
సంగీతంRichard Rodgers (music/lyrics)
Oscar Hammerstein II (lyrics)
Irwin Kostal (Score)
పంపిణీదార్లు20th Century Fox
విడుదల తేదీs
March 2, 1965 (US)
March 29, 1965 (UK)
సినిమా నిడివి
174 minutes
దేశంమూస:Film US
భాషEnglish
బడ్జెట్$8.2 million[1]
బాక్సాఫీసు$286,214,286[2]

ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్ (“The Sound of Music”) 1965లో “38వ ఆస్కార్ బెస్ట్ పిక్చర్”గా అవార్డ్ అందుకున్న ఈ సంగీత భరితమైన ఆంగ్ల చిత్రం. ఇది ఏభైఏళ్లగా సినీసంగీత ప్రేమికులను ఆకట్టుకుంటూనే ఉంది. 1959లో అప్పటి ప్రముఖ సంగీతరూపకకర్తలైన రిచర్డ్స్ రోడ్జర్స్ (Richards Rodgers) మరియు ఆస్కార్ హేమర్స్టీన్ (Oscar hammerstein II) బ్రాడ్వే మ్యూజికల్ థియేటర్ కోసం సంయుక్తంగా రచించిన సంగీతరూపకం The Sound of Music. “జార్జ్ లుడ్విగ్ వోన్ ట్రాప్” (Georg Ludwig von Trapp) అనే మిలిటరీ కేప్టెన్ జీవిత కథ ఈ సంగీతరూపకానికి ఆధారం. ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకున్న ఈ సంగీతరూపకాన్ని 1965లో రాబర్ట్ వైజ్ (Robert Wise) తానే దర్శక నిర్మాణ బాధ్యతలు చేపట్టి సినిమాగా తీసి 20th century fox ద్వారా విడుదల చేసారు. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు చేస్తూ ఈ సినిమా అఖండ విజయాన్ని చవిచూసి కాసుల వర్షం కురిపించింది. అంతర్జాతీయ ప్రఖ్యాతిని సంపాదించుకున్న ఈ సినిమా వందేళ్ళ ప్రపంచ సినీ చరిత్రలో నూరు గొప్పచిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

చిత్రకథ

దక్షిణ జర్మనీ కి చెందిన ఆస్ట్రియాలోని “సాజ్బర్గ్” అనే పట్టణంలోని “వోన్ ట్రాప్” అనే మిలిటరీ కెప్టెన్ జీవితకథ ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్ చిత్ర కథకు ఆధారం. ఆస్ట్రియన్ నేవీ నుండి రిటైరైన కమాండర్ జార్జ్ లుడ్విగ్ వోన్ ట్రాప్. భార్యను పోగొట్టుకున్న అతనికి ఏడుగురు సంతానం. ఆర్మీ కెప్టెన్ కావటం వల్ల పిల్లలను కూడా క్రమశిక్షణతో కట్టుదిట్టంగా పెంచుతూ ఉంటాడు. అయితే అతని కట్టుదిట్టమైన పెంపకం ఇష్టం లేక అల్లరిగా తయారైన అతని ఏడుగురు పిల్లలను చూసుకోవటానికి కెప్టెన్ తీసుకువచ్చే గవర్నెస్ లు ఎవ్వరూ ఆ పిల్లల అల్లరిని భరించలేక పారిపోతూ ఉంటారు. కొత్త గవర్నెస్ కోసం ఒక మొనాస్ట్రీ లోని మదర్ కు లెటర్ పంపుతాడు కెప్టెన్.

నన్ గా మారటానికి ఆ మొనేస్ట్రీ లో చేరుతుంది మరియా. కానీ అక్కడి కట్టుబాట్లతో ఇమడలేకపోతూ ఉంటుంది. అమెదొక స్వేచ్ఛా ప్రపంచం. ఆమె మనసుని అర్ధం చేసుకున్న మదర్ మార్పు కోసం ఆమెను కెప్టెన్ ఇంటికి కొత్త గవర్నెస్ గా పంపిస్తుంది. అక్కడ పిల్లలు ఆమెను బెదరగొట్టడానికి పెట్టే తిప్పలు నవ్వు తెప్పిస్తాయి. నెమ్మదిగా తన సంగీతంతో, వాత్సల్యంతో పిల్లలకు దగ్గరౌతుంది మరియా. వారిలో ఒకరిగా కలిసిపోయి కెప్టెన్ నియమించిన రూల్స్ అన్నింటినీ మార్చేసి, పిల్లలకు స్వేచ్ఛాపూరిత ప్రపంచాన్ని చూపిస్తుంది మరియా. ఆమెలో మాతృత్వ వాత్సల్యంతో పాటూ తాము ఎన్నడూ చూడని సరదాలను, కొత్త అనుభూతులను చవిచూస్తారు పిల్లలు. ఆమె వల్లనే పిల్లలు క్రమశిక్షణ తప్పుతున్నారని మరియాను మందలిస్తాడు కెప్టెన్. అయితే ఆమెలోని చలాకీతనానికీ, సంగీత పరిజ్ఞానానికీ అతడు ముగ్ధుడౌతాడు. ఎల్సా తో ఎంగేజ్మెంట్ అవబోతున్న కెప్టెన్ పై తన మనసు మళ్ళుతోందని అర్ధమైన మరియా అది నన్ గా మారాలనుకుంటున్న తన నిర్ణయానికి విరుధ్ధమని భావించి ఇల్లు విడిచి తిరిగి మొనాస్ట్రీకు వెళ్పోతుంది.

మరియా వెళ్లిపోయాక తన మనోభావాలను స్పష్టం చేసుకున్న కెప్టెన్ తాను ఎల్సాకు తాను మరియాను ప్రేమిస్తున్నట్లుగా చెప్పి ఎంగేజ్మెంట్ రద్దు చేసుకుంటాడు. మరియా కోసం మొనాస్ట్రీ కు వెళ్తాడు కెప్టెన్. మనసు చలించే చోటికి తానిక వెళ్లనని అంటుంది మరియా. కానీ మదర్ బలవంతం మీద కొత్త గవర్నెస్ వచ్చేదాకా ఉండటానికి ఒప్పుకుని బయల్దేరుతుంది. కెప్టెన్ ఆమెను పెళ్ళికి ఒప్పించగలుగుతాడా? ఆర్మీ నుంచి వచ్చిన పిలుపును తప్పించుకోవటానికి కెప్టెన్ ఏం చేసాడు? సజ్బర్గ్ మ్యూజిక్ ఫెస్టివల్ లో వోన్ ట్రాప్ కుటుంబం పాల్గొనగలిగారా? నాజీ ఆర్మీ నుంచి తప్పించుకుని ఆ కుటుంబం ఎలా ఆస్ట్రియా దాటి వెళ్తారు అన్నది మిగిలిన కథ.

సంగీతం

సినిమలో ప్రధాన ఆకర్షణ సంగీతం. 1959లో Richards Rodgers మరియు Oscar hammerstein II సంయుక్తంగా బ్రాడ్వే మ్యూజికల్ థియేటర్ కోసం రూపొందించిన సంగీతరూపకం "ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్" లోని పాటల బాణీలనే సినిమాలో కూడా వాడుకున్నారు. అయితే సినిమా రిలీజయ్యే సమయానికి Hammerstein చనిపోవటంతో మరో రెండు పాటలను చిత్రం కోసం Rodgers తానే రాసి బాణీ కట్టారు.

  • టైటిల్ సాంగ్ "With songs they have sung for a thousand years, The hills fill my heart with the sound of music, My heart wants to sing every song it hears, The hills are alive with the sound of music"
  • వెస్ట్రన్ సంగీత స్వరాలను వర్ణించే "Doe, a deer, a female deer Ray, a drop of golden sun Me, a name I call myself Far, a long, long way to run Sew, a needle pulling thread"
  • మరియా ఫేవరేట్ థింగ్స్ "Raindrops on roses and whiskers on kittens, Bright copper kettles and warm woolen mittens, Brown paper packages tied up with strings, These are a few of my favorite things"
  • మదర్ ఎబెస్ పాడే "Climb every mountain, Search high and low, Follow every byway, Every path you know"
  • కెప్టెన్ ప్రేమని తెలిపినప్పుడు మరియా పాడే “Perhaps I had a miserable youth, But somwhere in my wicked, miserable past, There must have been a moment of truth,For here you are, standing there, loving me; Whether or not you should, So somewhere in my youth or childhood, I must have done something good, Perhaps I had a wicked childhood”,
  • "I am sixteen going on seventeen", “Edelweiss” మొదలైన అన్ని పాటలు కూడా సంగీతం, సాహిత్యం రెండింటిలోనూ వేటికవే సాటి.

ఇతర విశేషాలు

1965లో ఐదు ఆస్కార్ పురస్కారాలు గెలుచుకున్న ఈ సినిమా మరెన్నో చోట్ల నామినేషన్లు, ప్రశంసలు పొందింది. సినిమాలో కెప్టెన్ గా “క్రిష్టఫర్ ప్లమ్మర్” నటించారు. మదర్ ఎబెస్ గా “పెగ్గి వుడ్” నటించారు. మరియాగా నటించిన “జూలీ ఏండ్రూస్” సినిమాలో పాటలు స్వయంగా పాడిన గాయని కూడా కావటంతో సినిమాకు జూలీ ఏండ్రూస్ సగం ప్రాణం. Ted D.McCord చేసిన సినిమాటోగ్రఫీ కూడా గొప్పగా ఉంటుంది. అప్పట్లోనే 70 mm లో తీసిన ఈ చిత్రంలోని లొకేషనల్ అందాలు మనసు దోస్తాయి. సినిమా మొదట్లో స్క్రీనంతా నిండుకున్నట్లున్న పచ్చని కొండలు, గ్రీనరీ నుంచీ సినిమా చివర్లో కనిపించే ఆల్ఫ్ మంచు కొండలు వరకూ ప్రతి ఫ్రేమ్ అందమైనదే.

భారతీయ సినిమాలు

ఈ సినిమా కథ ఇన్స్పిరేషన్ తో పాతిక ఆంగ్లేతర భాషల్లో మరో పాతిక సినిమాలు విడుదలయ్యాయి. తెలుగులో శాంతి నిలయం (1969), తరువాత తీసిన “రావుగారిల్లు” (1988) సినిమా, రాజా చిన్ని రోజా (డబ్బింగ్ సినిమా), హిందీలో గుల్జార్ తీసిన “పరిచయ్” (ఇందులో టీచర్ జీతేంద్ర) మొదలైన సినిమాలకు సౌండ్ ఆఫ్ మ్యూజిక్ సినిమా కథే ఆధారం. ఇళయరాజా, ఏ.ఆర్. రెహ్మాన్ కూడా ఈ పాటల బాణిలను తమ సొంత బాణిలల్లో వాడుకున్నారు.

మూలాలు

  1. "The Sound of Music (1965)". Box Office Mojo. Retrieved 16 November 2010.
  2. "The Sound of Music (1965)". The Numbers. Retrieved 18 January 2011.

బయటి లింకులు