బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: be-x-old:Бутрас Бутрас-Галі
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: az:Butros Butros Qali
పంక్తి 33: పంక్తి 33:
[[ar:بطرس بطرس غالي]]
[[ar:بطرس بطرس غالي]]
[[arz:بطرس بطرس غالى]]
[[arz:بطرس بطرس غالى]]
[[az:Butros Butros Qali]]
[[be:Бутрас Бутрас-Галі]]
[[be:Бутрас Бутрас-Галі]]
[[be-x-old:Бутрас Бутрас-Галі]]
[[be-x-old:Бутрас Бутрас-Галі]]

07:41, 17 ఆగస్టు 2011 నాటి కూర్పు

బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ
బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ


పదవీ కాలం
జనవరి 1 1992 – జనవరి 1 1997
ముందు Javier Pérez de Cuéllar
తరువాత కోఫీ అన్నన్

వ్యక్తిగత వివరాలు

జననం (1922-11-14) 1922 నవంబరు 14 (వయసు 101)
కైరో, ఈజిప్టు
జాతీయత ఈజిప్టు
జీవిత భాగస్వామి లియా మరియా బౌత్రోస్ ఘలీ
మతం కోప్తిక్ కిరస్తాని

బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ (Boutros Boutros-Ghali) 1922, నవంబర్ 14న ఈజిప్టు రాజధాని నగరం కైరోలో జన్మించినాడు. ఇతడు ఈజిప్టునకు చెందిన ప్రముఖ దౌత్యవేత్త మరియు ఐక్యరాజ్య సమితికి 6 వ ప్రధాన కార్యదర్శిగా 1992 జనవరి నుంచి 1996 డిసెంబర్ వరకు పదవిని నిర్వహించినాడు.

బౌత్రోస్ ఘలి 1946లో కైరో విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేశాడు. 1949లో పారిస్ విశ్వవిద్యాలయం నుంచి పి.హెచ్.డి. పట్టా పొందినాడు. 1977 నుంచి ఈజిప్టు విదేశాంగ శాఖ సహాయమంత్రిగా పనిచేసినాడు. ఐక్యరాజ్య సమితి వైపు వెళ్ళడానికి కొన్ని మాసాల ముందు విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రిగా వ్యవహరించినాడు. విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ఈజిప్టు అద్యక్షుడు అన్వర్ సాదత్ కు, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి మెనాచెమ్ బిగిన్ ల మద్య శాంతి ప్రయత్నాలు కొనసాగించినాడు [1]. 1991లో బౌత్రోస్ ఘలీ ఐరాస ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికైనాడు. ఇతని పదవీకాలం సంక్లిష్తంగా గడిచింది. ముఖ్యంగా 1994 లో సంభవించిన ర్వాండా దమనకాండలో 9 లక్షల మందికి పైగా హత్యకు గురైనారు. ఈ విషయంలో బౌత్రోస్ ఘలీ తీవ్రంగా విమర్శల పాలైనాడు. అంగోలా అంతర్యుద్ధం, యుగొస్లావ్ యుద్ధాలు కూడా ఇతని కాలంలోనే జరిగాయి. 1996లో రెండో పర్యాయం కొరకు ఈజిప్టు, గినియా బిస్సౌ, బోట్స్‌వానాతో సహా భద్రతా మండలి లోని 10 తాత్కాలిక దేశాలు ప్రతిపాదించిననూ అమెరికా వీటో ఉపయోగించి మరో పర్యాయం బౌత్రోస్ ఘలీకి అవకాశం ఇవ్వలేదు. రెండో పర్యాయం ఎన్నిక కాని మొదటి వ్యక్తిగా చరిత్రలో నిల్చిపోయినారు. అతని తర్వాత కోఫీ అన్నన్ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి పదవీ బాధ్యతలు చేపట్టినాడు.

మూలాలు

  1. Boutros Boutros-Ghali: The world is his oyster