గున్నార్ మిర్థాల్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: uk:Гуннар Мюрдаль
చి r2.7.1+) (యంత్రము కలుపుతున్నది: he:גונאר מירדאל
పంక్తి 26: పంక్తి 26:
[[fr:Gunnar Myrdal]]
[[fr:Gunnar Myrdal]]
[[gd:Gunnar Myrdal]]
[[gd:Gunnar Myrdal]]
[[he:גונאר מירדאל]]
[[hu:Gunnar Myrdal]]
[[hu:Gunnar Myrdal]]
[[id:Gunnar Myrdal]]
[[id:Gunnar Myrdal]]

08:30, 22 ఆగస్టు 2011 నాటి కూర్పు

గున్నార్ మిర్థాల్

స్వీడిష్ ఆర్థికవేత్త అయిన గున్నార్ మిర్థాల్ డిసెంబర్ 6 , 1898 లో జన్మించాడు. స్టాక్‌హోమ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించాడు. 1930 ప్రాంతంలో తన భార్య ఆల్వా మిర్థాల్ తో కల్సి సాంప్రదాయ ఆర్థిక సిద్ధాంతాల గురించి గ్రంథం రచించాడు. 1945 లో గున్నార్ మిర్థాల్ వాణిజ్య కార్యదర్శిగా స్వీడిష్ కేబినేట్ లో ప్రవేశించాడు. 1947 నుంచి 1957 వరకు అతడు ఐక్యరాజ్య సమితి ఐరోపా ఆర్థిక కమీషన్ కు చైర్మెన్ గా వ్యవహరించాడు. దక్షిణాసియాలో 10 సంవత్సరాల పాటు ఆర్థిక, సాంఘిక పరిస్థితులను పరిశోధించి 1968 లో Asian Drama: An Inquiry into the Poverty of Nations గ్రంథం రచించాడు. ఈ గ్రంథంలో మిర్థాల్ ఆసియా దేశాలలోని పేదరికాన్ని వర్ణించాడు. 1960 నుంచి 1967 మిర్థాల్ స్టాక్‌హోమ్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ అర్థశాస్త్రపు ఉపన్యాసకుడిగా పనిచేశాడు. 1961లో స్టాక్‌హోమ్ విశ్వవిద్యాలయంలో Institute for International Economic Studies ప్రారంభించినాడు. అతడు అర్థశాస్త్రానికి చేసిన సేవలకు గాను 1974 సంవత్సరంలో ఫ్రెడరిక్ వాన్ హేయక్ తో కల్సి సంయుక్తంగా అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. మిర్థాల్ స్టాక్‌హోమ్ స్కూల్ను బాగా ప్రభావితం చేసినాడు. ప్రాథమిక దశలో అతను చేసిన ఆలోచనలను తర్వాత జాన్ మేనార్డ్ కీన్స్ సిద్ధాంతీకరించినాడు. ఇతను మే 17, 1987 న మరణించాడు. అతని యొక్క మరో ప్రముఖ గ్రంథం An American Dilemma: The Negro Problem and Modern Democracy.

బయటి లింకులు