నవ్వు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1+) (యంత్రము కలుపుతున్నది: zh:微笑
చి r2.6.5) (యంత్రము కలుపుతున్నది: mzn:ریک
పంక్తి 58: పంక్తి 58:
[[ko:미소]]
[[ko:미소]]
[[ms:Senyum]]
[[ms:Senyum]]
[[mzn:ریک]]
[[nn:Smil]]
[[nn:Smil]]
[[no:Smil]]
[[no:Smil]]

05:07, 29 ఆగస్టు 2011 నాటి కూర్పు

A laughing smile with teeth showing and mouth open.

నవ్వు లేదా మందహాసం (Smile) ఒక విధమైన ముఖ కవళిక. నవ్వులో ముఖంలోని వివిధ కండరాలు, ముఖ్యంగా నోటికి రెండువైపులా ఉండేవి సంకోచిస్తాయి. మానవులలో నవ్వు సంతోషం, ఆనందానికి బాహ్య సంకేతం. కొందరు నిశ్శబ్దంగా నవ్వుకుంటే, కొంత మంది బయటకు శబ్దం వచ్చేటట్లుగా నవ్వుతారు. సాధారణంగా చలోక్తులు, కితకితలు మరికొన్ని రకాల ప్రేరేపణల వలన నవ్వొస్తుంది. నైట్రస్ ఆక్సైడ్ పీల్చడం వలన మరియు కొన్ని మాదక ద్రవ్యాలు వాడడం వలన బిగ్గరగా నవ్వుతారు. బిగ్గరగా నవ్వినప్పుడు కొన్నిసార్లు కన్నీరు రావచ్చును.


మానవులలో నవ్వడాన్ని మెదడు నియంత్రిస్తుంది. సంఘంలోని వ్యక్తుల మధ్య సంబంధాలలో మరియు సంభాషణలలో ఉత్తేజాన్ని కలిగిస్తుంది. నవ్వు ఇతరుల నుండి కలయికను కాంక్షిస్తుంది. కొన్ని సార్లు ఇదొక అంటువ్యాధి లాగా ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది.[1].

నవ్వు కోపానికి విరుగుడు.

మానవులలో నవ్వు మరియు హాస్యానికి సంబంధించిన మానసిక మరియు శరీరధర్మ శాస్త్ర ప్రభావాల్ని గురించి తెలిపే శాస్త్ర విజ్ఞానాన్ని "జెలోటాలజీ" అంటారు.

నవ్వులలో రకాలు

కితకితలు పెట్టి నవ్విస్తున్న బాబు

నవ్వుతో మరో ఏడేళ్ల ఆయుష్షు

మనస్ఫూర్తిగా నవ్వే వ్యక్తులు ఎక్కువ కాలం జీవిస్తారు. నోరు పెద్దగా చేసుకొని నవ్వడం, కళ్ల కింద ముడతలు ఉన్న వ్యక్తులు జీవితం పట్ల సానుకూల దృక్పథంతో ఉంటారు. ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతారు. జీవితంలో ఎన్నడూ నవ్వని ఆటగాళ్లు సరాసరిన 72.9 ఏళ్లు అప్పుడప్పుడూ మాత్రమే నవ్విన వాళ్లు 75 ఏళ్లు, బిగ్గరగా నవ్వేవాళ్లు 79.9 ఏళ్లు జీవించినట్లు పరిశోధనల్లో తేలింది. మొహమాటం కోసం ఉత్తుత్తి నవ్వులు చిందించేవారు ఆయుష్షులో ఎలాంటి మార్పులేదట. బిగ్గరగా నవ్వే వారి ముఖంపై ఉండే కండరాలు సంకోచ, వ్యాకోచం చెంది కాంతివంతమైన వర్ఛస్సుతో ఉంటారు.

మూలాలు

  1. Camazine, Deneubourg, Franks, Sneyd, Theraulaz, Bonabeau, Self-Organization in Biological Systems, Princeton University Press, 2003. ISBN 0-691-11624-5 --ISBN 0-691-01211-3 (pbk.) p. 18

Gallery

"https://te.wikipedia.org/w/index.php?title=నవ్వు&oldid=638286" నుండి వెలికితీశారు