నండూరి రామమోహనరావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30: పంక్తి 30:
==అవార్డులు==
==అవార్డులు==


1. అభినందన (హైదరాబాదు) సంస్థ నుంచి ముట్నూరి కృష్ణారావు అవార్డు (1988).
* అభినందన (హైదరాబాదు) సంస్థ నుంచి ముట్నూరి కృష్ణారావు అవార్డు (1988).
2. జూలూరి నాగరాజారావు (హైదరాబాదు) స్మారక అవార్డు (1989)
* జూలూరి నాగరాజారావు (హైదరాబాదు) స్మారక అవార్డు (1989)
3. మద్రాసు తెలుగు అకాడెమీ “ఉగాది వెలుగు” అవార్డు (1989)
* మద్రాసు తెలుగు అకాడెమీ “ఉగాది వెలుగు” అవార్డు (1989)
4. కళాసాగర్ (మద్రాసు) అవార్డు
* కళాసాగర్ (మద్రాసు) అవార్డు
5. అభిరుచి (ఒంగోలు) సంస్థ వారి “పాత్రికేయ రత్న” అవార్డు.
* అభిరుచి (ఒంగోలు) సంస్థ వారి “పాత్రికేయ రత్న” అవార్డు.
6. “జమీన్ రైతు” వజ్రోత్సవంలో నెల్లూరి వెంకట్రామానాయుడు స్మారక అవార్డు (1990)
* “జమీన్ రైతు” వజ్రోత్సవంలో నెల్లూరి వెంకట్రామానాయుడు స్మారక అవార్డు (1990)
7. ఆలూరి నారాయణరావు స్మారక ట్రస్టు (విజయవాడ) వారి సి.వై.చింతామణి అవార్డు
* ఆలూరి నారాయణరావు స్మారక ట్రస్టు (విజయవాడ) వారి సి.వై.చింతామణి అవార్డు
8. తెలుగు యూనివర్సిటీ వారి ఆనరరీ డాక్టరేట్ (1991)
* తెలుగు యూనివర్సిటీ వారి ఆనరరీ డాక్టరేట్ (1991)
9. అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారి “శిరోమణి” అవార్డు (1992)
* అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారి “శిరోమణి” అవార్డు (1992)
10. క్రాంతి విద్యా సంస్థల (విజయవాడ) నుంచి ఉత్తమ జర్నలిస్టు అవార్డు (1994)
* క్రాంతి విద్యా సంస్థల (విజయవాడ) నుంచి ఉత్తమ జర్నలిస్టు అవార్డు (1994)
11. రామకృష్ణ జైదయాళ్ హార్మొనీ అవార్డు (1994)
* రామకృష్ణ జైదయాళ్ హార్మొనీ అవార్డు (1994)
12. సిద్ధార్త కళా పీఠం (విజయవాడ) వారి విశిష్ట వ్యక్తి అవార్డు (1994)
* సిద్ధార్త కళా పీఠం (విజయవాడ) వారి విశిష్ట వ్యక్తి అవార్డు (1994)
13. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వపు ఉత్తమ జర్నలిస్టు అవార్డు (1996)
* ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వపు ఉత్తమ జర్నలిస్టు అవార్డు (1996)
14. తెలుగు యూనివర్సిటీ వారి “తాపీ ధర్మారావు స్మారక అవార్డు” (1997)
* తెలుగు యూనివర్సిటీ వారి “తాపీ ధర్మారావు స్మారక అవార్డు” (1997)
15. అప్పాజోస్యుల విష్ణుభొట్ల ఫౌండేషన్ వారి “ప్రతిభామూర్తి” అవార్డు (1998)
* అప్పాజోస్యుల విష్ణుభొట్ల ఫౌండేషన్ వారి “ప్రతిభామూర్తి” అవార్డు (1998)


==రిఫరెన్సులు/సంప్రదింపు లంకెలు==
==రిఫరెన్సులు/సంప్రదింపు లంకెలు==

21:03, 2 సెప్టెంబరు 2011 నాటి కూర్పు

నండూరి రామమోహనరావు (24 ఏప్రిల్ 1927-2 సెప్టెంబర్ 2011) తెలుగు పాత్రికేయరంగ ప్రముఖులు. పాత్రికేయునిగానే కాక, రచయితగా కూడా ప్రసిద్ధులు. చాలాకాలం పాటు ఆంధ్రజ్యోతి పత్రిక సంపాదక బాధ్యతలు నిర్వహించారు. "బాల" అన్న పత్రికలోనూ, ఆంధ్రపత్రికలోనూ 1940వ దశకంలో వీరి రచనలు ఎన్నో ప్రచురింపబడ్డాయి. "నరావతారం", "విశ్వరూపం" ఈయన ప్రముఖ రచనలు. సామాన్య జనాలకు సైన్సు సంగతులు పరిచయం చేయడంలో వీరి కృషి ఎన్నదగ్గది. ఇవికాక వీరు ఆంధ్రపత్రికలో మార్క్ ట్వేన్ నవలలకు తెలుగు అనువాదాలు కూడా చేసారు.

జీవితం

నండూరి రామ్మోహనరావు కృష్ణాజిల్లా విస్సన్నపేట లో 1927 ఏప్రిల్ 24న జన్మించారు.1937-42 మధ్య నూజివీడు, మచిలీపట్నం లలో హైస్కూలు విద్యనభ్యసించారు. రాజమండ్రి గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో 1942-47 మధ్య చదువుకున్నారు. 1944 ఏప్రిల్ 30వ తేదీన మేనమామ కూతురు రాజేశ్వరిని వివాహమాడారు. కొన్నాళ్ళు ఋషీకేశంలో ఉన్నారు. ఆ తరువాత 1947లో కొన్ని నెలలు ఉదయభారతి గురుకులంలో పనిచేశాక, "జన్మభూమి" అన్న పత్రికలో సబెడిటర్ ఉద్యోగంలో చేరారు. 1948-1960 మధ్యలో వివిధ స్థాయుల్లో "ఆంధ్రపత్రిక"లో పనిచేశారు. 1960-1994 దాకా ఆంధ్రజ్యోతి పత్రికలో వివిధ స్థాయుల్లో పని చేసి, సంపాదకులు గా పదవీ విరమణ చేశారు. ఈ మధ్యలో "జ్యోతిచిత్ర", "వనితాజ్యోతి", "బాలజ్యోతి" వంటి పత్రికలకు వ్యవస్థాపక సంపాదకులుగా ఉన్నారు.

రచనలు

  • నరావతారం
  • విశ్వరూపం
  • విశ్వదర్శనం - భారతీయ చింతన
  • విశ్వదర్శనం - పాశ్చాత్య చింతన
  • అనుపల్లవి (ఆంధ్రజ్యోతి సంపాదకీయాల సంకలనం)
  • చిరంజీవులు (ఆంధ్రజ్యోతి సంపాదకీయాల సంకలనం)
  • వ్యాసావళి (ఆంధ్రజ్యోతి సంపాదకీయాల సంకలనం)
  • అక్షరయాత్ర (సాహిత్య, సాహిత్యేతర వ్యాససప్తతి)
  • ఉషస్విని (కవితా సంపుటి)
  • చిలక చెప్పిన రహస్యం (పిల్లల నవల)
  • మయూర కన్య (పిల్లల నవల)
  • హరివిల్లు (పిల్లలగేయాలు)

అనువాదాలు

  • కాంచన ద్వీపం (ఆర్.ఎల్.స్టీవెన్సన్ ట్రెజర్ ఐలాండ్ కి తెలుగు అనువాదం)
  • కథాగేయ సుధానిధి (మూలం:ఏసోప్స్ ఫేబుల్స్)
  • టామ్ సాయర్ (మూలం: మార్క్ ట్వేన్ నవల - అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్)
  • హకిల్బెరీ ఫిన్ (మూలం: మార్క్ ట్వేన్ నవల - అడ్వెంచర్స్ ఆఫ్ హకిల్బెరీ ఫిన్)
  • రాజు-పేద (మూలం: మార్క్ ట్వేన్ రచన - ప్రిన్స్ అండ్ పాపర్)
  • టామ్ సాయర్ ప్రపంచయాత్ర (మూలం: మార్క్ ట్వేన్ రచన - టామ్సాయర్ అబ్రాడ్)
  • విచిత్ర వ్యక్తి (మూలం: మార్క్ ట్వేన్ రచన - మిస్టీరియస్ స్ట్రేంజర్)
  • బాలరాజు (ఆస్కార్ వైల్డ్ కథలు తెలుగు అనువాదం)

అవార్డులు

  • అభినందన (హైదరాబాదు) సంస్థ నుంచి ముట్నూరి కృష్ణారావు అవార్డు (1988).
  • జూలూరి నాగరాజారావు (హైదరాబాదు) స్మారక అవార్డు (1989)
  • మద్రాసు తెలుగు అకాడెమీ “ఉగాది వెలుగు” అవార్డు (1989)
  • కళాసాగర్ (మద్రాసు) అవార్డు
  • అభిరుచి (ఒంగోలు) సంస్థ వారి “పాత్రికేయ రత్న” అవార్డు.
  • “జమీన్ రైతు” వజ్రోత్సవంలో నెల్లూరి వెంకట్రామానాయుడు స్మారక అవార్డు (1990)
  • ఆలూరి నారాయణరావు స్మారక ట్రస్టు (విజయవాడ) వారి సి.వై.చింతామణి అవార్డు
  • తెలుగు యూనివర్సిటీ వారి ఆనరరీ డాక్టరేట్ (1991)
  • అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారి “శిరోమణి” అవార్డు (1992)
  • క్రాంతి విద్యా సంస్థల (విజయవాడ) నుంచి ఉత్తమ జర్నలిస్టు అవార్డు (1994)
  • రామకృష్ణ జైదయాళ్ హార్మొనీ అవార్డు (1994)
  • సిద్ధార్త కళా పీఠం (విజయవాడ) వారి విశిష్ట వ్యక్తి అవార్డు (1994)
  • ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వపు ఉత్తమ జర్నలిస్టు అవార్డు (1996)
  • తెలుగు యూనివర్సిటీ వారి “తాపీ ధర్మారావు స్మారక అవార్డు” (1997)
  • అప్పాజోస్యుల విష్ణుభొట్ల ఫౌండేషన్ వారి “ప్రతిభామూర్తి” అవార్డు (1998)

రిఫరెన్సులు/సంప్రదింపు లంకెలు

నండూరి రామ్మోహనరావు జీవిత విశేషాలు - పుస్తకం.నెట్ వ్యాసం (http://pustakam.net/?p=8125)