సాల్‌సీడ్ నూనె: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:



సాల్ (Sal) చెట్టు గింజలలోని శాకనూనె/కొవ్వు(vegetable oil/fat) ఆహరయోగ్యం (Edible). గింజలలోని తైలం45-50% వరకు సంతృప్త కొవ్వు ఆమ్లాలను కలిగివుండటం వలన 30-35<sup>0</sup>C వద్ద గడ్దకట్టును. అందుచే దీనిని సాల్‌ ఫ్యాట్‌ లేదా సాల్‌ బట్టరు అందురు.
సాల్ (Sal) చెట్టు గింజలలోని శాకనూనె/కొవ్వు(vegetable oil/fat) ఆహరయోగ్యం (Edible). గింజలలోని తైలం45-50% వరకు సంతృప్త కొవ్వు ఆమ్లాలను కలిగివుండటం వలన 30-35<sup>0</sup>C వద్ద గడ్దకట్టును. అందుచే దీనిని సాల్‌ ఫ్యాట్‌ లేదా సాల్‌ బట్టరు అందురు.
సాల్ చెట్టు యొక్క వృక్షశాస్రనామం: సోరియ రొబస్ట(Shorea Robusta).యిది డిప్‌టెరొ కార్పెసియె (Diptero carpaceae) కుటుంబానికి చెందినది.
సాల్ చెట్టు యొక్క వృక్షశాస్రనామం: షోరియ రొబస్టా(Shorea Robusta).యిది డిప్‌టెరొ కార్పెసియె (Diptero carpaceae) కుటుంబానికి చెందినది.
ఉత్తర భారతదేశంలో,మరియు హిందిలో సాల్‌, సాల్వా, రాల్, సాఖు, షాల్ అని పిలుస్తారు సంస్కృతంలో 'అశ్వకర్ణ' అని, తెలుగులో సాలువ, సాల్వ అని పిలుస్తారు. సాల్వ వృక్షం బౌద్ధులకు ఎంతో పవిత్రమైనది. బుద్ధుని జననం, మరణం సాల్వ వృక్షం క్రింద జరిగిందని వారి విశ్వాసం.
ఉత్తర భారతదేశంలో,మరియు హిందిలో సాల్‌, సాల్వా, రాల్, సాఖు, షాల్ అని పిలుస్తారు సంస్కృతంలో 'అశ్వకర్ణ' అని, తెలుగులో సాలువ, సాల్వ అని పిలుస్తారు. సాల్వ వృక్షం బౌద్ధులకు ఎంతో పవిత్రమైనది. బుద్ధుని జననం, మరణం సాల్వ వృక్షం క్రింద జరిగిందని వారి విశ్వాసం.



15:17, 6 సెప్టెంబరు 2011 నాటి కూర్పు

సాల్ (Sal) చెట్టు గింజలలోని శాకనూనె/కొవ్వు(vegetable oil/fat) ఆహరయోగ్యం (Edible). గింజలలోని తైలం45-50% వరకు సంతృప్త కొవ్వు ఆమ్లాలను కలిగివుండటం వలన 30-350C వద్ద గడ్దకట్టును. అందుచే దీనిని సాల్‌ ఫ్యాట్‌ లేదా సాల్‌ బట్టరు అందురు. సాల్ చెట్టు యొక్క వృక్షశాస్రనామం: షోరియ రొబస్టా(Shorea Robusta).యిది డిప్‌టెరొ కార్పెసియె (Diptero carpaceae) కుటుంబానికి చెందినది. ఉత్తర భారతదేశంలో,మరియు హిందిలో సాల్‌, సాల్వా, రాల్, సాఖు, షాల్ అని పిలుస్తారు సంస్కృతంలో 'అశ్వకర్ణ' అని, తెలుగులో సాలువ, సాల్వ అని పిలుస్తారు. సాల్వ వృక్షం బౌద్ధులకు ఎంతో పవిత్రమైనది. బుద్ధుని జననం, మరణం సాల్వ వృక్షం క్రింద జరిగిందని వారి విశ్వాసం.

వునికి,వ్యాప్తి.

ఆసియా దీని జన్మస్దానం. మయన్మారు, బంగ్లాదేశ్‌, నేపాల్‌ మరియు ఇండియాలో వ్యాపించి వున్నవి. ఇండియాలో అస్సాం, బెంగాల్‌, ఒడిస్సా, జార్ఖండ్‌, హర్యానా,మరియు తూర్పు హిమాలయ పాదప్రాంతాలలో వ్యాపించి వున్నది.మధ్యభారతం లోని వింధ్య,సాత్పురా అరణ్యలోయప్రాంతాలలో(మధ్యమరియు ఉత్తర ప్రదేశ్),యమున నది తీరప్రాంతంలలో,తూర్పుకనుమలలో వున్నవి.ఇండియాలో దాదాపు 1.15లక్షల చదరపు కిలో మీటర్ల వైశాల్యంలో విస్తరించి వున్నవి.మధ్యప్రదేశ్‌లో 37,700,జార్ఖండ్‌లో 33,500,ఒడిస్సాలో 28,750,ఉత్తరప్రదేశ్‌లో 5,800,బెంగాల్‌లో 5,250,మరియు అస్సాంలో 2,700 లచదరపుకిలోమీటర్లమేర సాల్వ వృక్షాలున్నాయి(ఆధారం:SEA news circular,june'99).అయితే ఈ మధ్యకాలంలో కలపకై ఈచెట్లను అక్రమంగా నరకడం వలన,ఆదేస్ధాయిలో మొక్కలను నాటకపొవడంవలన వీటి విస్తీర్ణం కొంతమేరతగ్గినది.


చెట్టు

సాల్వవృక్షం 30-35 మీటర్ల ఎత్తు పెరుగుతుంది.బలమైన కాండం,శాఖలు కలిగి వుండును.పెరిగినచెట్టు కాండం వ్యాసం 1.5-2.0 మీ,వుండును.పెరుగుచున్న చెట్టుబెరడు గోధుమ వఋనంలోవుండి,నిలువుగా చీలికలుండి,4-5సెం,మీ.మందముండును.ఆకులు(పత్రాలు)15-20 సెం,మీ,వుండును.ఆకులు అండాకారంగా వుండి,ఆకుతొడిమ వద్ద కొద్దిగా వెడల్పుగా వుండును.వర్షపాతం అధికంగా వున్న ప్రాంతాలలొ సతతహరితంగా,లేని ప్రాంతాలలో ఆకురాల్చును.ఆకులను పూర్తిగా రాల్చదు(మోడుగా మారదు).ఫిభ్రవరి-ఏప్రిల్‌నెలలలో ఆకురాల్చును.ఏప్రిల్‌-మేనెల మొదటి వారంలో చిగుర్చును.చిగిర్చిన వెంటనే పూలుఏర్పడం మొదలై,జులై నెలచివరికల్ల పళ్లు పక్వానికి వచ్చును.పూలు తెల్లగా వుండును.పండిన కాయ 1-1.5 సెం.మీ.వుండును. లోపలి పిక్క ముదురుగోధుమరంగులో(కాఫీగింజ రంగులో)వుండును.కాయలో గింజశాతం 47% వుండును.గింజలో 13-14% వరకు సాల్‌ కొవ్వు(sal fat/butter) వుండును.ఒక ఎకరం వీస్తీర్ణంలో వున్న చెట్లనుండి ఎడాదికి 400 కీజిలవరకు నూనెగింజలను సేకరించె వీలున్నది.కాని ఆస్ధాయిలో సేకరణ జరగడం లేదు.ఆధికమొత్తంలో విత్తనసేకరణకైచేసిన ప్రణాళికలు,అంచనాలకై పరిమితమై,అచరణలో వెనుకబడివున్నారు.ప్రస్తుతం వున్న విస్తీర్ణాన్ని,ఎకరానికి వచ్చు దిగుబడిని లెక్కించిన దాదాపు 5.5మిలియను టన్నుల నూనె గింజల సేకరణ జరగాలి. సేకరణ అనుకున్నట్లుగా జరిగినచో,గింజలలోని కొవ్వుశాతం 13%గా లెక్కించిన 7.15 లక్షలటన్నుల సాల్‌కొవ్వుఉత్పత్తి కావాలి. కాని 1-1.25లక్షల టన్నుల గింజలను మాత్రమే సేకరించగల్గుతున్నారు.అందువలన ఎడాదికి 10-13 వేలటన్నుల సాల్‌కొవ్వును ఉత్పత్తి చేయగల్గుచున్నారు.

నూనె/కొవ్వు

పాడవ్వని,జాగ్రత్తగా నిల్వవుంచిన గింజలనుండి తీసిన కొవ్వులో ఫ్రీఫ్యాటీ ఆమ్లాలశాతం తక్కువగా(3-5%) వుండి,రిపైన్‌చెయ్యుటకు అనుకూలంగా వుండును.ఎక్కువ ఫ్రీఫ్యాటిఆమ్లశాతంవున్న కొవ్వును స్టియరిక్‌ఆసిడ్‌, సబ్బులు చెయ్యుటకు వినియోగించెదరు.కొవ్వు పచ్చనిఛాయవున్నగొధుమరంగులో వుండును.ఒకరకమైన ప్రత్యేక వాసన కల్గివుండును.సాల్‌కొవ్వులోని కొవ్వుఆమ్లాలు,వాటిశాతం ఇంచుమించు కొకొబట్టరు(cocoa butter)లోని కొవ్వుఆమ్లాలనుపోలి వుండటంవలన,దానితో కలిపిలేదా కొకోబట్టరులు ప్రత్నామ్నయంగా చాకొలెట్‌ తయారిలో వుపయోగిస్తారు.సాల్‌కొవ్వులోని ఒలిక్‌ఆసిడ్‌,మరియు స్టియరిక్‌ఆసిడ్‌శాతం,కొకోబట్టరులోని, ఆ ఆమ్లాలశాతంతో ఇంచిమించు సరిపోతున్నది.సాల్‌కొవ్వు ధ్రవీభవన ఉష్ణత 35-370C.కొకోబట్టరు ధ్రవీభవన ఉష్ణత 33-350C.వీటి ధ్రవీభవన ఉష్ణత ఎక్కువ వుండటం వలన వేడి వాతవరణంలోకుడా(35-370C)చాకొలెట్‌లు మెత్తబడిపోకుండగా,గట్టిగా వుండును.అందుచే సాల్‌కొవ్వును కొకోబట్టరులో 20-40% వరకు కలిపెదరు.అయితే కొన్నిరకాల సాల్‌కొవ్వులలో1-1.5% వరకు ఎపొక్సి స్టియరిక్‌ఆసిడులువుండుఅవకాశంవుంది.అలాంటి కొవ్వులలో వాటి ధ్రవీభవన ఉష్ణత కొద్దిగా తక్కువగా వుండును.

సాల్ కొవ్వుయొక్క ఫ్యాటిఆమ్లాల,భౌతిక లక్షణాలపట్టిక

భౌతిక లక్షణాలు మితి
ఐయోడిన్ విలువ 38-43
సపనిఫికెసను విలువ 185-195
అన్‌సఫొనిపియబుల్ పధార్దం 1.2 గరిష్టం
ద్రవీభవన ఉష్ణత 35-370C
ఫ్యాటి ఆమ్లాలు శాతం
పామిటిక్‌ఆసిడ్ 4.5-5
స్టియరిక్‌ఆసిడ్ 44-45
ఒలిక్‌ఆసిడ్ 42-44
లినొలిక్‌ఆసిడ్ 0.1-0.2
అరచిడిక్ ఆసిడ్ 1.0

సాల్‌కొవ్వు మరియు కొకోబట్టరులకున్న సామీప్యం

భౌతిక లక్షణాలు సాల్ కొవ్వు కొకోబట్టరు
ఐయోడిన్‌విలువ 38-43 33-38
సపొనిఫికెసన్‌విలువ 185-195 185-195
అన్‌సపొనిఫియబుల్‌పధార్ధం 1.2% 1.2%
ద్రవీభవన ఉష్ణొగ్రత 35-370C 33-350C
ఫ్యాటి ఆమ్లాలు%
పామెటిక్‌ఆసిడ్ 4-5 25.2
స్టియరిక్‌ఆసిడ్ 44-45 35-40
ఒలిక్‌ఆసిడ్ 42-44 35-40
లినొలిక్‌ఆసిడ్ 0.1-0.2 2.5-3.0
అరచిడిక్ ఆసిడ్ 1.0 6.3

గింజలనుండి నూనె/కొవ్వును సంగ్రహించు విధానం

సాలువ గింజలలో కొవ్వు/నూనెశాతం 12-14% మాత్రమేవున్నది.అందుచే వీటినుండి నూనె/కొవ్వును కేవలం'సాల్వెంట్‌ఎక్స్‌ట్రాక్షనుప్లాంట్(Solvent extraction plant)ద్వారానే తీయుటకు సాధ్యం. సాల్వెంట్‌ఎక్స్‌ట్రాక్షన్‌ప్లాంట్‌ద్వారా గింజలలోని కొవ్వును 99% వరకు పొందేవీలున్నది.నూనె/కొవ్వు తీసిన డి్‌ఆయిల్డ్‌కేకులో ప్రోటిన్‌శాతం,మిగతా అయిల్‌కేకులతో సరిపొల్చిన చాలా తక్కువగా 8-9% మాత్రమే (నూనె తీసిన తవుడులో14-16% వరకు ప్రొటిన్‌వుండును).మిగతా నూనెకేకులలోప్రొటిన్(మాంసకృత్తులు)30-45% వరకు వుండును.అందుచే అతితక్కువ మోతాదులోపాలడైరి పశు,మరియు కోళ్లదాణాలో వినియోగిస్తారు.పిండిపధార్ధంను50-70% కలిగివున్నది.సేంద్రియ ఎరువుగా వాడవచ్చును.

డి్‌ఆయిల్డ్‌కేకు పోషక విలువలు

పోషక పధార్ధం విలువలమితి%
ప్రోటిను 8-9%
పీచుపధార్ధం 4.5-5.0%
పిండిపధార్ధం 55-70%
లైసిన్ 0.42%
మెథియొనిన్ 0.11%
థ్రియొనిన్ 0.42%
మెటబాలిజబుల్‌ఎనర్జి 1483-1803Kcal/Kg

సాల్‌కొవ్వు,డి్‌ఆయిల్డ్‌కేకు ఉత్పత్తి వివరాలు

[SEA 38th annual report,2008-2009 ఆధారం]

1998-99నుండి2008-09 వరకు (10సం.లు)

మొత్తం పాసెస్‌చేసిన సాల్‌విత్తనాలు :3,34,940 టన్నులు

మొత్తం ఉత్పత్తి అయిన కొవ్వు/నూనె :44,877 టన్నులు,

అందులో

అహరయోగ్యం(edible)........ :30,310టన్నులు.

పారిశ్రామిక వినియోగం(non edible) :14,567టన్నులు.

ఉపయోగాలు

  • చాక్‌లెట్‌ తయారిలో,వనస్పతి తయారిలో సాల్ కొవ్వును వాడెదరు.
  • ఫ్యాటిఆసిడ్ల తయారిలోకూడా వాడెదరు. కొవ్వును అంశికరన (fractionation) చేసి స్టియరిన్్‌ను తయారుచేయుదరు.
  • డి్‌ఆయిల్డ్‌ కేకును దాణాగా వినియోగిస్తారు.
  • సాల్‌చెట్టు నుండి కలపను తీసి దూలలు, కిటికి, గుమ్మాల ఫ్రేములు తయారుచేయుదురు. టేకు, దేవదారు తరువాత అంతగా దృడమైనది సాలువ కలప. వాహనాల బాడిలు, బీములు, బళ్ల చక్రాలుతయారుచేయుదురు.
  • పెరుగుచున్న చెట్టు కాండంకు గాటు పెట్టి, రెసిన్(స్రవం)ను సంగ్రహించెదరు. ఈ రెసిన్‌ ధుపంగా, విరేచనాల నిరోధిగా పనిచేయును. చర్మ వ్యాదుల నివారణలేపనాలలో రెసిన్ ను వాడెదరు.
  • సాలువ చెట్టు ఆకుల నుండి ఉత్తరభారతంలో చిన్న దొనెలు (కప్పుల వంటివి) డిస్పొజబుల్ పళ్లెలు, చిన్నబుట్టలు చేయుదురు.
  • ఆయుర్వేదంలో సాలువ గింజల పోడిని, ఆకుల చుర్ణంను ఉపయోగిస్తారు