రాజన్ - నాగేంద్ర: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: రాజన్ - నాగేంద్ర తెలుగు సినిమాలలో ఒక ప్రముఖ సంగీత దర్శకులు. రాజ...
(తేడా లేదు)

17:43, 10 సెప్టెంబరు 2011 నాటి కూర్పు

రాజన్ - నాగేంద్ర తెలుగు సినిమాలలో ఒక ప్రముఖ సంగీత దర్శకులు. రాజన్ మరియు నాగేంద్ర లు అన్నదమ్ములు. 37 సంవత్సరాల పాటు వీరు తెలుగు సినిమాలకు వీరి సంగీత సేవలను అందించారు. సుమారుగా 60 సినిమాలకు వీరు సంగీతాన్ని సమకూర్చారు. సంఖ్య పరంగా ఛేసినవి తక్కువ సినిమాలైనా, దాదాపుగా అన్ని సినిమాలలోని పాటలు ప్రజల మనసులలో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నాయి.

బాల్యం

రాజన్ - నాగేంద్ర లు ఇద్దరూ మైసూరు కి దగ్గరలోని శివరాంపేట అనే ఊరిలో జన్మించారు. వీరి బాల్యం అంతా ఆ ఊరిలోనే కొనసాగింది. తండ్రి రాజప్ప కూడా సంగీత విద్వాంసుడే, రోజంతా కచేరీలతో క్షణం తీరిక లేకుండా గడిపేవారు. ఆయనలాగే తన కుమారులు కూడా ఈ సంగీత సాగరంలో అలసిపోకుండా యీదాలనేది రాజప్ప కోరిక. ఇంట్లో తీరిక దొరికినప్పుడల్లా హర్మోనియం, వేణువుపై తొలి పాఠాలు చెప్పేవారు. ఆ తరువాత కొన్ని అనివార్య కారణాల వల్ల రాజప్ప బెంగళూరులో జీవితాన్ని గడపవలసి వచ్చింది. అప్పుడు పెద్దవాడైన రాజన్ ను తాతగారింట్లో వదిలేసి నాగేంద్రను తనతో తీసుకువెళ్లిపోయారు. బెంగళూరులో తమ్ముడు, మైసూరులో అన్నయ్య సంగీత సాధన చేయడం మొదలుపెట్టారు.