వేరుశనగ: కూర్పుల మధ్య తేడాలు
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
పంక్తి 50: | పంక్తి 50: | ||
==ఉపయోగాలు== |
==ఉపయోగాలు== |
||
* వేరుశనగ విత్తనాల నుంచి లభించే [[నూనె]] వంటకాలలో ఉపయోగిస్తారు. |
* వేరుశనగ విత్తనాల నుంచి లభించే [[వేరుశెనగ నూనె]] వంటకాలలో ఉపయోగిస్తారు. దీని నుంచి డాల్డా లేదా [[వనస్పతి]]ని తయారుచేస్తారు. ఈ నూనెలను [[సబ్బు]]లు, సౌందర్యపోషకాలు, కందెనలుగా వాడతారు. |
||
* వేరుశనగ విత్తనాలు బలమైన [[ఆహారం]]. వీటిల్లో ప్రోటీన్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి. |
* వేరుశనగ విత్తనాలు బలమైన [[ఆహారం]]. వీటిల్లో ప్రోటీన్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి. |
||
* నూనె తీయగా మిగిలిని పిండిని [[ఎరువు]]గా, పశువులకు, కోళ్ళకు దాణాగా వాడతారు. |
* నూనె తీయగా మిగిలిని పిండిని [[ఎరువు]]గా, పశువులకు, కోళ్ళకు దాణాగా వాడతారు. |
14:43, 20 సెప్టెంబరు 2011 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
వేరుశనగ | |
---|---|
Peanut (Arachis hypogea) | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Subfamily: | |
Tribe: | |
Genus: | |
Species: | అ. హైపోజియా
|
Binomial name | |
అరాచిస్ హైపోజియా |
వేరుశనగ (ఆంగ్లం : Groundnut) : వేరుశనగ బలమైన ఆహారము. ఇవి నూనెగింజలు. ఈ గింజలలో నూనె శాతం ఎక్కువ. వంటనూనె ప్రధానంగా వీటి నుండే తీస్తారు. భారత్ యావత్తూ పండే ఈ పంట, ఆంధ్రలో ప్రధాన మెట్ట పంట. నీరు తక్కువగా దొరికే రాయలసీమ ప్రాంతంలో ఇది ప్రధాన పంట.
ప్రాధమిక లక్షణాలు
- ఏక వార్షిక గుల్మం
- విపరీత అండాకారంలో ఉన్న 4 పత్రకాలు గల పిచ్ఛాకార సంయుక్త పత్రం.
- గ్రీవస్థంగా సమూహాలుగా ఏర్పడిన పసుపు రంగు పుష్పాలు.
- 1-4 విత్తనాలు గల దీర్ఘవృత్తాకార ద్వివిదారక ఫలాలు.
వేరుశెనగ పంట
వేరుశనగ విత్తన మొలక సమయంలో 14-16 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం. తొలకరి వర్షాలు అయ్యాక విత్తడం ఆంధ్రలో పరిపాటి. ఆంధ్ర ప్రదేశ్ లో రాయల సీమలో వేరుశనగ సాగు అధికము.పంట కాయకొచ్చు సమయంలో ఉష్ణోగ్రత 23-25 సెంటిగ్రేడ్ డిగ్రీలు వున్నచో పంట దిగుబడి పెరుగును. పంటకాలంలో వర్షపాతం 12.5-17.5 సెం.మీ.వున్నచో మంచిది.పంటను విత్తు సమయములో 12.5-17.5 సెం.మీ.,పంట పెరుగు నప్పుడు 37-60 సెం>మీ. వర్షపాతం వున్నచో మంచిది. వేరుశనగను అన్ని సీజనులలో సాగు చెయ్యవచ్చును.కాని వర్షకాలంలోని ఖరిప్ సీజనులో 80% సాగుచెయ్యడం జరుగుచున్నది. అందులో 90% పంటను కేవలం వర్షం మీదనే ఆధార పడి సాగుచెయ్యడం జరుగుచున్నది. దక్షిణ భారతములో ఖరీప్,మరియు రబీ రెండు సీజనులలో వేరుశనగ పంటను సాగు చెయ్యుదురు. నీటి సదుపాయం గల ప్రాంతాలలో వేసవి కాలంలో జనవరి-మార్చి మధ్య తక్కువ సమయంలో పంటకోతకు వచ్చే రకాలను సాగుచెయ్యుదురు. వేరుశనగలో నూనె, ప్రోటీనులు, కార్బోహైడ్రెట్లు, మరియు విటమిన్లు అధిక ప్రమాణములో వుండును. అందుచే వేరుశనగ బలవర్దకమైన ఆహరం. వేరుశనగ గింజలో (Kernel) 43-50% వరకు నూనె,25-30% వరకు ప్రోటిన్లు వుండును. వేరుశనగ విత్తనంల నుంది నూనె తీసిన తరువాత ఆయిల్ కేకులో (నూనె తీసిన వేరుశనగ విత్తనంల పిండి) ప్రోటీన్ శాతం పెరుగును. వేరుశనగ పంటకాలము, విత్తనం వైరైటిని బట్టి 90-150 రోజులు వుండును. గుత్తిరకము (Bunch type) పంటకాలము 90-120 రోజులు. వ్యాప్తి (spreading Type) రకము విత్తనము అయ్యినచో పంటకాలం 130-150 రోజులు వుండును. పై రెండు రకాలను ఎక్కువగా వర్షకాలం (ఖరీప్)లోనే సాగు చెయ్యుదురు. చీడ, పీడలను తట్టుకునే శక్తి గల సంకరజాతి (Hybride) వంగడాలను సాగు చెయ్యడం వలన 20% ఎక్కువ దిగుబడి సాధించవచ్చును. మాములు రకము ఎకరానికి 500-600 కేజిలు దిగుబడి యివ్వగా, హైబ్రిడ్ రకము 900-1200 కేజిలు గిగుబడి యిచ్చును. వేరుసనగ కాయ (pod)లో పొట్టు (shell) 25-30%, గింజ (Kernel) 70-75% వుండును.
హైబ్రిడ్ వేరుశెనగ రకాలు
కొన్నిరకాల హైబ్రిడ్ రకాలను దిగువన పెర్కొనడ జరిగినది.
1. ICGS 11: యిది ఎక్కువ దిగుబడి యిచ్చు రకము. చీడపీడలను వర్షాభావ పరిస్దితులను బాగా తట్టుకునే రకము.ఎక్కువగా ఖరిప్‌లో సాగుచెయ్యుదురు.పంటకాలం 120 రోజులు.మహరాష్ట్రలో 1.5 టన్నులు,హెక్టారుకు దిగుబడి వచ్చినది.ఆంధ్ర,కర్నాటకలో ట్రయల్‌రన్‌లో 2.5 టన్నుల దిగుబడి వచ్చినది.కాయలో 70% గింజ వుండును.
2. ICGS 44: యిది కూడా ఎక్కువ దిగుబడి యిచ్చు రకం.పంటకాలం 120 రోజులు.వేసవి కాలంలో ఈ పంటను సాగు చెయ్య వచ్చును.వర్షాభావ పరిస్దితులను తట్తుకొగలదు.సరిగా సాగు చెసిన 3-4 టన్నులు,హెక్టారుకు దిగుబడి యిచ్చును.కాయలో గింజ 70%,పొట్టు 30% వుండును.
3.ICGV 86590: యిది బంచ్ రకమునకు చెందినది. పంటకాలము 96-123 రోజులు. చేడ, పీడలను తట్టుకోగలదు.దిగుబడి హెక్టారుకు 3 టన్నుల వరకు వున్నది. ఈ రకమును ఎక్కువగా ఆంధ్ర, కర్నాటక, కేరళ, మరియు తమిళనాడు లలో సాగు చెయుచున్నారు.
4.ICGV 91114 : యిదికూడా బంచ్ రకమునకు చెందిన వంగడము.పంటకాలము 100 రోజులు.తీవ్రమైన వర్షాభావ పరిస్దితులను తట్టుకోగల వంగడం.పంట దిగుబడి 2.5-3 టన్నులు/హెక్టారుకు.గింజ పెద్దదిగా వుండును.
5.ICGV 89104: బంచ్‌రకమునకు చెందినది.పంటకాల్ము 110-120 రోజులు.అప్లొటాక్షిన్,అస్పరిగిల్లస్,ఫంగస్ వంటి వ్యాధులను నిలువరించ గలదు.దిగుబడి 2.0 టన్నులు/హెక్టరుకు.కాయలో 68% గింజ వుండును.
ఉపయోగాలు
- వేరుశనగ విత్తనాల నుంచి లభించే వేరుశెనగ నూనె వంటకాలలో ఉపయోగిస్తారు. దీని నుంచి డాల్డా లేదా వనస్పతిని తయారుచేస్తారు. ఈ నూనెలను సబ్బులు, సౌందర్యపోషకాలు, కందెనలుగా వాడతారు.
- వేరుశనగ విత్తనాలు బలమైన ఆహారం. వీటిల్లో ప్రోటీన్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి.
- నూనె తీయగా మిగిలిని పిండిని ఎరువుగా, పశువులకు, కోళ్ళకు దాణాగా వాడతారు.