విక్రమ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 47: పంక్తి 47:
# [[అక్కా బాగున్నావా]] (1996)
# [[అక్కా బాగున్నావా]] (1996)
# [[కుర్రాళ్ళ రాజ్యం]] (1997)
# [[కుర్రాళ్ళ రాజ్యం]] (1997)
# [[9 నెలలు]] (2001
# [[అపరిచితుడు]] (2005)
# [[అపరిచితుడు]] (2005)
# [[మజా]]
# [[మజా]]

17:04, 22 అక్టోబరు 2011 నాటి కూర్పు

విక్రమ్
జననం1966
వృత్తినటుడు

విక్రమ్ (ఆంగ్లం: Vikram) దక్షిణ భారతదేశానికి చెందిన ప్రముఖ నటుడు. పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటించాడు. తెలుగు సినిమా శివపుత్రుడు తమిళ మూలమైన పితామగన్ చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు.

తమిళనాడు లోని రామనాథపురం జిల్లా పరమకుడి ఆయన స్వస్థలం. [1]ఇదే ఊరు నుంచి ముగ్గురు జాతీయ ఉత్తమ నటులుండటం విశేషం. వారు చారుహాసన్, కమల్‌హాసన్, సుహాసిని. అయితే విక్రమ్ కు ఆ అవార్డు రావడం వెనుక ఇరవయ్యేళ్ళ నిర్విరామమైన కృషి ఉంది. ఆయన చదువుకున్నది యార్కాడ్ లో. చెన్నై లోని లయోలా డిగ్రీ కళాశాల నుంచి బీఏ ఆంగ్ల సాహిత్యంలో పట్టా పుచ్చుకున్నాడు. ఎంబీఏ కూడా అక్కడే చదివాడు. అలా చదువుకోసం చెన్నై లో ఉన్నప్పుడు హాలీవుడ్ సినిమాలు పిచ్చిగా చూసేవాడు. చిన్నప్పటి నుంచి చదువు మీద కన్నా ఇతర వ్యాపకాల మీద ఎక్కువగా సమయం గడిపేవాడు. కరాటే, ఈత పోటీల్లో ప్రథముడిగా నిలిచేవాడు. గిటార్, పియానో వాయించడం నేర్చుకున్నాడు. తరచూ నాటకాల్లో నటించేవాడు. వాటిలో చాలా భాగం ఆంగ్ల నాటకాలే. విక్రమ్ తండ్రి వినోద్ నటుడు కావాలనుకున్నారు కానీ చివరకు ఇంజనీరుగా స్థిరపడ్డారు.

ఇష్టాలు

విక్రమ్ కు బైక్ మీద స్వారీ అంటే చాలా ఇష్టం. ఆయనకు బాగా ఇష్టమైన బైక్ రాజ్‌దూత్.

సినిమాలు

తెలుగులో ఆయన మొదటి సినిమా చిరునవ్వుల వరమిస్తావా. అయితే ఆ సినిమా కొన్ని కారణాల వలన ఇప్పటికీ విడుదల కాలేదు. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన బంగారు కుటుంబం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు తో కలిసి నటించడం ఒక గొప్ప అనుభూతి నిచ్చిందని చెబుతారాయన.

  1. చిరునవ్వుల వరమిస్తావా (1993)
  2. బంగారు కుటుంబం (1994)
  3. ఆడాళ్ళా మజాకా (1995)
  4. అక్కా బాగున్నావా (1996)
  5. కుర్రాళ్ళ రాజ్యం (1997)
  6. 9 నెలలు (2001
  7. అపరిచితుడు (2005)
  8. మజా
  9. శివపుత్రుడు
  10. మల్లన్న
  11. నాన్న (2011)

మూలాలు

  1. జూన్ 7, 2009 ఈనాడు ఆదివారం అనుబంధం సంచిక ఆధారంగా
"https://te.wikipedia.org/w/index.php?title=విక్రమ్&oldid=658334" నుండి వెలికితీశారు