అహల్య: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{ఇతరవాడుకలు}}
{{ఇతరవాడుకలు}}
{{good article}}

{{Hdeity infobox <!--Wikipedia:WikiProject Hindu mythology-->
| Image =Ahalya.jpg
| Image_size = 200px
| Caption =
| Name = Ahalya
| Affiliation = [[Rishi]] (sage)
| Devanagari = अहल्या
| Sanskrit_Transliteration = Ahalyā
| Abode = Gautama's hermitage
| Consort = [[Gautama Maharishi|Gautama]]
}}
'''అహల్య''' ([[సంస్కృతం]]: अहल्या) [[గౌతముడు|గౌతమ మహర్షి]] భార్య.
'''అహల్య''' ([[సంస్కృతం]]: अहल्या) [[గౌతముడు|గౌతమ మహర్షి]] భార్య.



05:18, 23 అక్టోబరు 2011 నాటి కూర్పు

Ahalya
దేవనాగరిअहल्या
సంప్రదాయభావంRishi (sage)
ఆవాసంGautama's hermitage
భార్యGautama

అహల్య (సంస్కృతం: अहल्या) గౌతమ మహర్షి భార్య.

ఈమె వృత్తాంతము రామాయణములో పేర్కొనబడినది. శాపము వలన రాయిగా మారిన అహల్య, రాముని పాదధూళి సోకి శాప విమోచనమై తిరిగి స్త్రీ రూపము ధరించిందని కొన్ని రామాయణ వృత్తాంతాలలో పేర్కొనబడినది. వీరికి నలుగురు కుమారులు, వారిలో జేష్టుడు శతానంద మహర్షి.

పుట్టుక

బ్రహ్మ అహల్యను అత్యంత సౌందర్యవతిగా సృష్టించాడు. దేవతలందరూ ఆమెను పరిణయమాడాలనుకున్న వారే. అప్పుడు బ్రహ్మ త్రిలోకాలను ఎవరైతే ముందుగా చుట్టి వస్తారో ఆమెను వివాహమాడడానికి అర్హులని ప్రకటిస్తాడు. ఇంద్రుడు తన శక్తులన్నింటినీ ఉపయోగించి ముల్లోకాలను తిరిగి వచ్చి అహల్యను ఇచ్చి వివాహం జరిపించమని బ్రహ్మను కోరుతాడు. అప్పుడు నారదుడు వచ్చి గౌతముడు ఇంద్రుడికంటే ముందుగా ముల్లోకాలను చుట్టి వచ్చాడని చెపుతాడు. గౌతముడు తన దైనందిన పూజలో భాగంగా గోవు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాడని. ఒకరోజు అలా ప్రదక్షిణ చేస్తుండా ఆవు లేగ దూడకు జన్మనిచ్చిందనీ, శాస్త్రాల ప్రకారం శిశువును ప్రసవిస్తున్న ఆవు ముల్లోకాలతో సమానమనీ అందుకే అతనికి ఆ ఫలితం దక్కిందనీ తెలియజేస్తాడు. కాబట్టి అహల్యను గౌతముడికే ఇచ్చి పెళ్ళి చేయమని చెపుతాడు.

శాపము

రాముని పాదము రాయిని తాకిన తరువాత అహల్యగా మారుచున్నరాయి

ఒకరోజు అహల్య భర్తయైన గౌతముడు ఉదయాన్నే నదీ స్నానానికి వెళ్ళగా ఆమె మీద కోరికతో దేవేంద్రుడు ఆమె భర్త రూపంలో వచ్చి కోరిక తీర్చమని అడుగుతాడు. ఇంద్రుడి మోసం తెలియని అహల్య అందుకు అంగీకరిస్తుంది. అదే సమయానికి గౌతముడు తిరిగివచ్చి ఆమెని రాయిరా మారిపొమ్మని శపిస్తాడు. తరువాత ఆమె మోసపోయిందని గ్రహించి , త్రేతా యుగంలో మహా విష్ణువు రాముని అవతారమెత్తి ఆయన పాదదూళిచే ఆమెకు శాపవిమోచనం అవుతుందని తెలియబరుస్తాడు. అలాగే ఇంద్రుణ్ణి తన శరీరమంతా స్త్రీ జననేంద్రియాలతో నిండిపోయేలాగా శపిస్తాడు. వృషణాలు నేలరాలిపోయేటట్లు చేస్తాడు. కానీ ఇంద్రుడు ఇతర దేవతల సాయంతో ఒక జీవాన్ని బలి ఇచ్చి దాని వృషణాలను అతికించేటట్లు చేస్తాడు. అమ్మవారిని గురించి తపస్సు చేసి తన శరీరంపై ఉన్న స్త్రీ జననేంద్రియాలను కన్నులులాగా కనిపించేటట్లు వరం పొందుతాడు. అందుకనే ఆయన్ను సహస్రాక్షుడు అని కూడా వ్యవహరిస్తారు.

విమోచనం

దస్త్రం:Ahalya curse released by Rama.jpg
అహల్య శాపవిమోచనం - హజారరామ మందిరం దేవాలయంలో శిల్పం

గౌతముడు చెప్పినట్లుగానే త్రేతాయుగంలో శ్రీరాముడు తమ గురువైన విశ్వామిత్రుడు మరియు లక్ష్మణుడితో కలిసి గౌతమ మహర్షి ఆశ్రమం గుండా సీతా స్వయంవరానికి వెళుతుంటారు. నిర్మానుష్యమైన, కళావిహీనమైన ఆ ఆశ్రమాన్ని చూచి అది ఎందుకు అలా ఉంది? అని రాముడు విశ్వామిత్రుని ప్రశ్నించగా , ఆయన వారి వృత్తాంతాన్ని రాముడికి వివరిస్తాడు. వెంటనే రాముడు తన పాదాన్ని ఆ రాయికి తగిలించి అహల్యకు శాపవిముక్తి కలుగ జేస్తాడు. గౌతముడు కూడా వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యి సీతా స్వయంవరంలో జయం కలిగేలా దీవిస్తాడు.

"https://te.wikipedia.org/w/index.php?title=అహల్య&oldid=658596" నుండి వెలికితీశారు