బాలరాజు: కూర్పుల మధ్య తేడాలు
Mukteshvari (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 14: | పంక్తి 14: | ||
released = ఫిబ్రవరి 26| |
released = ఫిబ్రవరి 26| |
||
production_company = [[ప్రతిభా పిక్చర్స్]]| |
production_company = [[ప్రతిభా పిక్చర్స్]]| |
||
art = [[ఎస్.వి.ఎస్. రామారావు]] | |
|||
}} |
}} |
||
'''బాలరాజు''' తెలుగు సినిమా మార్కెట్ స్థాయి ఎంతో తొలిసారి చూపించి అనూహ్యమైన సంచలనాన్ని రేపిన చిత్రం. అప్పటి వరకూ మూడు పదుల వయసు దాటిన కథానాయకుల చిత్రాలే ఎక్కువగా వచ్చాయి. అంతా ఓ '''సంప్రదాయ''' పద్ధతిలో వెళ్లే కథలే. 'బాలరాజు' ఆ ధోరణిని మార్చింది. ఈ సినిమా [[అక్కినేని నాగేశ్వరరావు]], [[కస్తూరి శివరావు]]ల సినీ జీవితాన్ని మలుపు తిప్పింది. |
'''బాలరాజు''' తెలుగు సినిమా మార్కెట్ స్థాయి ఎంతో తొలిసారి చూపించి అనూహ్యమైన సంచలనాన్ని రేపిన చిత్రం. అప్పటి వరకూ మూడు పదుల వయసు దాటిన కథానాయకుల చిత్రాలే ఎక్కువగా వచ్చాయి. అంతా ఓ '''సంప్రదాయ''' పద్ధతిలో వెళ్లే కథలే. 'బాలరాజు' ఆ ధోరణిని మార్చింది. ఈ సినిమా [[అక్కినేని నాగేశ్వరరావు]], [[కస్తూరి శివరావు]]ల సినీ జీవితాన్ని మలుపు తిప్పింది. |
18:16, 26 అక్టోబరు 2011 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
బాలరాజు (1948 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఘంటసాల బలరామయ్య |
---|---|
నిర్మాణం | ఘంటసాల బలరామయ్య |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వరలక్ష్మి, కస్తూరి శివరావు, అంజలీదేవి |
సంగీతం | గాలిపెంచల నరసింహారావు (సహాయకులు: ఘంటసాల, సి.ఆర్.సుబ్బరామన్) |
గీతరచన | సముద్రాల రాఘవాచార్య (సహాయకులు: మల్లాది రామకృష్ణశాస్త్రి) |
సంభాషణలు | సముద్రాల రాఘవాచార్య (సహాయకులు: మల్లాది రామకృష్ణశాస్త్రి) |
కళ | ఎస్.వి.ఎస్. రామారావు |
నిర్మాణ సంస్థ | ప్రతిభా పిక్చర్స్ |
విడుదల తేదీ | ఫిబ్రవరి 26 |
భాష | తెలుగు |
బాలరాజు తెలుగు సినిమా మార్కెట్ స్థాయి ఎంతో తొలిసారి చూపించి అనూహ్యమైన సంచలనాన్ని రేపిన చిత్రం. అప్పటి వరకూ మూడు పదుల వయసు దాటిన కథానాయకుల చిత్రాలే ఎక్కువగా వచ్చాయి. అంతా ఓ సంప్రదాయ పద్ధతిలో వెళ్లే కథలే. 'బాలరాజు' ఆ ధోరణిని మార్చింది. ఈ సినిమా అక్కినేని నాగేశ్వరరావు, కస్తూరి శివరావుల సినీ జీవితాన్ని మలుపు తిప్పింది.
కథ
ఒక యక్ష కన్య ఓ యక్షుడితో ప్రేమలోపడుతుంది. వీళ్ల గురించి తెలుసుకొని మహేంద్రుడు శపిస్తాడు. దాంతో భూలోకంలో మానవులుగా పుడతారు. ఆ యక్షుడు బాలరాజవుతాడు. ఆ కన్య సీతగా కనిపిస్తుంది. బాలరాజుకి తన ప్రేమ గుర్తుండదు. అతని వెంటపడుతూ గతం గుర్తు చేయాలని సీత తపిస్తుంది. ఈ ప్రేమ కథ పలు మలుపులు తిరుగుతుంది. అప్పటి వరకూ వచ్చిన చిత్రాల్లో - కథానాయకుడు ప్రేమించమంటూ కథానాయకి వెంటపడతాడు. కథానాయకుడు అంటే ధీరోదాత్తుడు. ఇలాంటి 'సినీ ప్రాథమిక సూత్రాల'కు భిన్నంగా వెళ్లిన చిత్రమిది.
విశేషాలు
- అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఏడో చిత్రమిది.
- ఈ చిత్రానికి ముందు ప్రతిభ పిక్చర్స్ ఘంటసాల బలరామయ్య అక్కినేని కథానాయకుడుగా ముగ్గురు మరాఠీలు అనే జానపద చిత్రాన్ని తీశారు. ఆ చిత్రం వంద రోజులు ఆడిన విజయోత్సాహంతో బాలరాజు చిత్రానికి శ్రీకారం చుట్టారు.
- ఈ సినిమాలో 20 పాటలున్నాయి.
- అక్కినేనికి తొలిసారి నేపథ్యగానం చేసే అవకాశం ఘంటసాల వెంకటేశ్వరరావుకి ఈ సినిమాతోనే దక్కింది. వీళ్లిద్దరూ మద్రాసులో రూమ్మేట్స్. అప్పట్లో అక్కినేని స్వయంగా పాడుకొనేవారు. ఇందులో 'చెలియా కనరావా...' పాట పాడేటప్పుడు పక్కన ఎస్.వరలక్ష్మిదీ, తనదీ ఒకే శ్రుతిలో ఉండటం; పైగా తన గాత్రంలో స్త్రీత్వం వినిపించడం అక్కినేనికి నచ్చలేదు. దాంతో బలరామయ్య దగ్గరకు వెళ్లి 'నేపథ్య గానం సదుపాయం వచ్చింది. ఈ పాటను ఘంటసాలతో పాడించండి' అనడంతో ఈ సినిమాలో పాడే అవకాశం ఘంటసాలకు దక్కింది.
- అప్పటి వరకూ చిన్న వేషాలు వేసిన కస్తూరి శివరావు 'యలమంద' పాత్ర వేసి ఎంతో పేరు తెచ్చుకొన్నారు.
- తీయని వెన్నెల రేయి అనే పాటకు నర్తించిన అంజలీదేవి ఆ తరవాతి కాలంలో కథానాయికగా ఎదిగింది.
- అప్పట్లో చిన్న కేంద్రాలైన మదనపల్లి, ప్రొద్దుటూరుల్లో రజతోత్సవాలు జరిగాయి. అలాంటి కేంద్రాలెన్నింట్లోనో బాలరాజు వందాడింది. ఈ సినిమా కురిపించిన వసూళ్లు చూసి చిత్రశాలల నిర్మాణానికి చాలా మంది ఉత్సాహం చూపించారు.
- ఆ రోజుల్లో నాగేశ్వరరావుని చూసి పొడుగాటి జుట్టుని పెంచిన మగాళ్లెందరో! ఆ కేశాలంకరణ, మీసకట్టు 'బాలరాజు స్టైల్'గా పేరొందాయి.
- ఇది విడుదలయ్యాక చాన్నాళ్లు నాగేశ్వరరావుని బాలరాజు అనే పిలిచేవారు.
- నాగేశ్వరరావు అర్థాంగి అన్నపూర్ణగారు పెళ్లిచూపులు చూసింది బాలరాజు సినిమా చూసే.