పరవస్తు చిన్నయ సూరి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 34: పంక్తి 34:


==మూలాలు==
==మూలాలు==
* ఆంధ్ర రచయితలు - [[మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి]], [[అద్దేపల్లి అండ్ కొ]], రాజమహేంద్రవరం, 1950.
* శ్రీ పరవస్తు చిన్నయసూరి జీవితము - [[నిడుదవోలు వేంకటరావు]], [[వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్]], చెన్నపురి, 1953.
* శ్రీ పరవస్తు చిన్నయసూరి జీవితము - [[నిడుదవోలు వేంకటరావు]], [[వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్]], చెన్నపురి, 1953.
* పరవస్తు చిన్నయసూరి - [[బూదరాజు రాధాకృష్ణ]] (ఆంగ్లములో) (1995) సాహిత్య ఆకాడెమీ
* పరవస్తు చిన్నయసూరి - [[బూదరాజు రాధాకృష్ణ]] (ఆంగ్లములో) (1995) సాహిత్య ఆకాడెమీ.


==బయటి లింకులు==
==బయటి లింకులు==

00:55, 17 డిసెంబరు 2011 నాటి కూర్పు

పరవస్తు చిన్నయ సూరి (1809-1861) ప్రసిద్ధ తెలుగు రచయిత. గొప్ప పండితుడు. ఇతడు తమిళనాడులోని చెంగల్‌పట్టు జిల్లాలోని పెరంబూరులో జన్మించాడు. మద్రాసు ప్రభుత్వ (పచ్చాయప్ప) కళాశాలలో తెలుగు బోధకుడు. తను జీవితాంతం తెలుగు భాషాభ్యుదయానికి, తెలుగు సాహిత్యానికి పాటుబడ్డాడు. "పద్యమునకు నన్నయ, గద్యమునకు చిన్నయ" అను లోకోక్తి కలదు. చిన్నయ పాండిత్యమునకు మెచ్చి ఆంగ్లేయులు ఆయనకు సీమ నుండి ప్రత్యేకంగా తెప్పించిన గండపెండేరమును , దాని మీద "సూరి" అని వ్రాయించి ఆయన కరములకు అలంకరింప జేశారు. "సూరి" అను బిరుదు ఈయనకు యిచ్చినది ఆంగ్లేయులే. సూరి అనగ పండితుడు అని అర్ధము

చిన్నయ చాలా తరాలకు పూర్వము ఉత్తర ఆంధ్రప్రదేశ్ నుండి మద్రాసు వలసవెళ్ళిన వైష్ణవ కుటుంబములో జన్మించాడు. వీరి పూర్వీకులు పరవస్తు మఠం శిష్యులు. వీరు సాతాని కులానికి చెందినా బ్రాహ్మణ ఆచారవ్యవహారాలు పాటించేవారు. తాము అసస్థంభ సూత్రము, గార్గేయ గోత్రానికి చెందిన యజుశ్శాఖాధ్యాయులని చెప్పుకున్నారు. చిన్నయ 1809 (ప్రభవ)లో జన్మించాడు. కానీ కొందరు పండితులు ఈయన 1806లో జన్మించాడని భావిస్తున్నారు..

చిన్నయ తండ్రి వెంకటరంగ రామానుజాచార్యులు తిరువల్లిక్కేని (ట్రిప్లికేన్) లోని రామానుజమఠంలో మతాధికారి. చిన్నయ తండ్రి సంస్కృత, ప్రాకృత, తెలుగు మరియు తమిళాలలో మంచి పండితుడు. అక్కడే ఈయన్ను ప్రతివాదభయంకరం శ్రీనివాసాచార్యులనే వైష్ణవ పండితుడు చూసి రామానుజాచార్యుల జన్మస్థానమైన శ్రీపెరంబుదూరులోని ఆలయములో వైష్ణవ తత్వాన్ని ప్రచారము చేసేందుకు ఆహ్వానించాడు. పండు ముదుసలి వయసు వరకు ద్రవిడవేదాన్ని పారాయణం చేస్తూ, మతాధి కార్యాలు నిర్వహిస్తు ఇక్కడే నివసించాడు. ఈయన 1836లో నూటపదేళ్ళ వయసులో మరణించాడు.

వెంకటరంగ రామానుజాచార్యులుకు ఒక చిన్న వయసులోనే విధవరాలైన కూతురు, ఆమె కంటే చిన్నవాడైన చిన్నయ, ఇరువురు సంతానము. చిన్నయను గారాబముగా పెంచటం వలన 16 యేళ్ళ వయసు వరకు చదువుసంధ్యలను పట్టించుకోలేదు.


రచనలు

మూలాలు

బయటి లింకులు