పారో తక్త్సంగ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.6.4) (యంత్రము మార్పులు చేస్తున్నది: uk:Такцанг-лакханг
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: fi:Tiikerin pesä
పంక్తి 16: పంక్తి 16:
[[eo:Taktŝango]]
[[eo:Taktŝango]]
[[es:Taktshang]]
[[es:Taktshang]]
[[fi:Tiikerin pesä]]
[[fr:Taktshang]]
[[fr:Taktshang]]
[[gl:Mosteiro de Taktshang]]
[[gl:Mosteiro de Taktshang]]

20:26, 20 డిసెంబరు 2011 నాటి కూర్పు

పారో తక్త్సంగ్ లేక తక్త్సంగ్ పాల్ఫుగ్ మొనాస్టరీ లేక ద టైగర్స్ నెస్ట్ అనునది ప్రముఖ హిమాలయా బౌద్ధ పుణ్యక్షేత్రం మరియు గుడుల సమాహారం. ఇది భూటాన్ దేశంలోని పారో నగరం వద్దనున్న లోయలో కలదు. 8వ శతాబ్దంలో గురు పదమసంభవ మూడు నెలలు ఇక్కడ ధ్యానం చేసిన స్మృత్యర్థం 1692 లో ఈ గుడుల సమాహారం నిర్మింపబడ్డది. బౌద్ధ మతాన్ని భూటాన్ దేశానికి పరిచయం చేసిన ఘనత పదమ సంభవునికే దక్కుతుంది. ఈ గుడుల సమాహారం గ్యాల్సే తెంజిన్ రబ్గ్యే చే నిర్మించ బడ్డవి.

చరిత్ర

నేపథ్యం

టిబెటన్ భాష లో తక్త్సంగ్ అనగా పులులను సంహరించువాడు అని అర్థం. పదమసంభవుడు (గురు రిన్పోచే) టిబెట్ నుండి ఎగిరే పులిపై ఇక్కడకు వచ్చి ఒక దుష్ట వ్యాఘ్రాన్ని సంహరించాడని ఒక నమ్మకం.

యెషె త్సోగ్యెల్ అను ఒక రాణి, టిబెట్ లో తనకు తానుగా గురు రిన్పోచే శిష్యరికం స్వీకరించినదని మరొక నమ్మకం. ఆమె ఒక పులిగా మారి రిన్పోచే ని ఇక్కడి వరకు మోసుకు వచ్చిందనీ, ఈ గుహల్లో ఆయన ధ్యానం చేశాడనీ, తర్వాత తాను ఎనిమిది రూపాల్లోకి మారిపోయాడని ప్రతీతి.

సాక్షాత్తూ పదమసంభవుడే తెంజిన్ రబ్గ్యే గా పునర్జన్మ ఎత్తాడనీ, 1692 లో ఆయనే ఇచ్చట గుడుల సమాహారం నిర్మించాడని మరొక నమ్మకం.