కాఫీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: sa:काफीपेयम्
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: om:Buna
పంక్తి 146: పంక్తి 146:
[[nv:Ahwééh]]
[[nv:Ahwééh]]
[[oc:Cafè]]
[[oc:Cafè]]
[[om:Buna]]
[[os:Къофи]]
[[os:Къофи]]
[[pap:Koffie]]
[[pap:Koffie]]

17:57, 9 ఫిబ్రవరి 2012 నాటి కూర్పు


కాఫీ
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
జాతులు

Coffea arabica - Arabica Coffee
Coffea benghalensis - Bengal coffee
Coffea canephora - Robusta coffee
Coffea congensis - Congo coffee
Coffea dewevrei - Excelsa coffee
Coffea excelsa - Liberian coffee
Coffea gallienii
Coffea bonnieri
Coffea mogeneti
Coffea liberica - Liberian coffee
Coffea stenophylla - Sierra Leonian coffee

కాఫీ అనేది ఒక ఉత్సాహపానీయము. కాఫీ చెట్ల పండ్ల నుండి లభించే గింజలను ఎండబెట్టి వేగించి పొడి చేసి కాఫీ తయారీకి ఉపయోగిస్తారు. కాఫీగింజలను దాదాపు 70 దేశాలలో పండిస్తున్నారు. కాఫీ పంటను ముఖ్యముగా లాటిన్ అమెరికా, దక్షిణా ఈశాన్య ఆసియా మరియు ఆఫ్రికాదేశాలలో విస్తారంగా పండిస్తున్నారు. వేగించని పచ్చి కాఫీ గింజల వాణిజ్యము ప్రపంచంలో అత్యధికంగా జరిగే ప్రసిద్ధ వాణిజ్యాలలో ఒకటి. కాఫీ గింజలలో ఉన్న కాఫి అనే పదార్ధము మానవులను ఉత్సాహపరుస్తుందని ఊహించబడుతుంది. కాఫీ ప్రపంచంలో అత్యధికంగా సేవించే ఉత్తేజపూరితమైన పానీయము. కాఫీ అనేది ఒక ప్రసిద్ద పానీయం. ప్రపంచ వ్యాప్తంగా అన్నిప్రాంతాలలో దొరికే ఈ పానీయం. పెద్దల నుండి పిన్నల వరకు అనేకంగా అలవాటు పడిన ఉత్తేజాన్ని కలిగించే పానీయము. కాఫీ గింజలను సువాసన వచ్చేవరకు వేగించి పొడిచేసి దానిని నీటితో మరిగంచి ఆ నీటిని వడకట్టి కాఫీ డికాషన్ తయారు చేస్తారు. కాఫీ డికాషన్ లో పంచదారను చేర్చి పానీయంగా వేడిగా త్రాగుతారు. మనదేశంలో కాఫీ డికాషన్ లో పాలను చేర్చి త్రాగే అలవాటు కాని అమెరికా మరియు యూరప్ లాంటి దేశాలలో పాలను చేర్చకుండా అధికంగా త్రాగుతుంటారు. కాఫీని అతి వేడిగానూ, అతి చల్లగానూ త్రాగడం చాలా మందికి అలవాటు. కాఫీ ఒక ఉత్సాహ పానీయం. దీనిని అనేకంగా ఉదయపు వేళలో ఉట్టిది గానూ మిగిలిన సమయాలలో అల్పాహారంతోనూ త్రాగడం అలవాటు. ప్రస్తుతం స్నేహితులు బంధువులు వచ్చినపుడు కాఫీతో సత్కరించడం సాదారణం అయింది. విందులు వినోదాలలో కాఫీలు అతి ముఖ్యం అయ్యాయి. ఉత్తర అమెరికాలో 1688లో కాఫీ సేవించిన ఘటన పేర్కొనబడింది. కాఫీ అనేక సమాజాలలో వారి సంస్కృతిలో ప్రధాన పాత్ర వహిస్తూ జీవిత ఆహారపు శైలిలో ఒక భాగం అయింది.

A cup of coffee.

పేరు చరిత్ర

కాఫీ ఇధియోపియా గొర్రెల కాపరులచే యదేచ్చగా 9వ శతాబ్ధములో కనిపెట్టబడినది. ఇధియోపియా కొడ ప్రాంతాలలో మేతమేస్తున్న గొర్రెలు ఒక విధమైన మొక్కలలో ఉన్న పండ్లలను తిని ఉత్సాహంతో గంతులు వేస్తున్న గొర్రెలను గమనించి ఆపండ్లలో ఏదో వింతైన శక్తి ఉన్నట్లు గ్రహించి వాటిని ఉపయోగించడము ప్రారంభించి దానికి కాల్ది అని నామకరణము చేశారు. తరవాతి కాలంలో ఇది ఈజిప్ట్, యేమన్ దేశాలలో వ్యాప్తి చెందింది. 15 వ శతాబ్ధానికి ఇది మధ్య తూర్పు దేశాలైన ఉత్తర ఆఫ్రికా, పర్షియా, టర్కీలని చేరింది. 1585 వ సంవత్సరములో లెయాన్ హార్డ్ ర్యూవుల్ఫ్ (Leonhard Rauwolf) అనే జర్మన్ డాక్టర్ తన పది సంవత్సరాల తూర్పు దేశ వాసము చేసి తిరిగి జర్మనీ చేరుకున్న తరవాత కాఫీని నరాల బాధా నివారిణిగా తీసుకొమ్మని రోగులకు సలహా ఇచ్చాడు. ఇదీ దాని సారాంశము

బున్ను అనే మొక్కల పండ్లతో నీటిని చేర్చి తయారుచేసిన ఇంకులా ఉండే నల్లని ద్రవము ఉదయము ఒక పార్సిలియన్ కప్ నిండా త్రాగాలి. ఇది నరాల బలహీనతను ముఖ్యముగా కడుపుకి సంబధించిన బాధని దూరము చేయటానికి ఉపయోగంగా ఉంటుంది

ముస్లిమ్ దేశాలనుండి కాఫీ ఇటలీ దేశానికి వ్యాప్తి చెందింది.క్రమంగా కాఫీ ఉత్తర ఆఫ్రికా, వెనిస్, ఈజిప్ట్, మధ్యప్రాచ్యదేశాల మధ్య ముఖ్యమైన వాణిజ్య వస్తువైంది. వెనిస్ నుండి మిగిలిన యూరప్ ఖండములో ఇది వ్యాప్తి చెందటము ప్రారంభించింది. 8వ పోప్ క్లెమెన్ట్ దీనిని క్రైస్తవ పానీయంగా గుర్తించడంతో ఇది క్రైస్తవుల అంగీకారాన్ని పొంది వారి సంప్రదాయ పానీయంగా చోటు చేసుకుంది. యురోపియన్ మొట్టమొదటి కాఫీశాల 1645 లో ఇటలీలో ప్రారంభించబడినది. కాఫీని పెద్ద మొత్తంగా డచ్ దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. అరబ్ దేశాలు కాఫీ మొక్కలను, పచ్చి కాఫీ గింజలను ఎగుమతి చేయడంపై నిషేధం విధించడంతో డచి కాఫీ మొక్కల పెంపకాన్ని జావా,సిలోన్ లలో ప్రారంభించింది.ఈస్టిండియా కంపనీ వలన కాఫీ ఇంగ్లండ్ లో వ్యాప్తి చెందింది తరవాత ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, పోలెండ్, వియన్నాలలో వ్యాప్తి చెందింది.ఉత్త్రర అమెరికాలలో కాలనీల కాలంలో ప్రారభమైన కాఫీ వాడకము యూరప్ లా ప్రారంభంలో అమెరికన్లను ఆకర్షించకపోయనా కాఫీకి అమెరికన్ల మధ్య కొంత చోటు మాత్రం లభించింది.తరవాతి కాలంలో అవసరానికి కావలసినంత సరుకు లభించని కారణంగా వ్యాపారులచే కాఫీ ధర విపరీతంగా పెరగసాగింది. 1812 లో జరిగిన యుద్ధానంతరము టీ దిగుమతులు ఇంగ్లండ్ తాత్కాలికంగా నిలిపి వేయడంతో అమెరికాలో కాఫీ వాడకం ఊపందుకుంది. కాఫీ పొడి తయారీలో సాకేతిక నైపుణయము మెరుగుపడసాగింది. తరవాతి కాలంలో అమెరికన్ల మధ్య కాఫీ తప్పనిసరి ఆహార పానీయాలలో ఒకటిగా మారింది.

కాఫీ యథియోపియన్ల ద్వారా కాకతాళీయంగా కనిపెట్టబడినదే అయినా దీనిని పంటలుగా పండిండించి అభివృద్ధిచేసిన ఘనత మాత్రము అరేబియనులదే. 15వ శతాబ్ధ మధ్యకాలంలో కాఫీని సేవించినట్ల ఆధాలు లభ్యమౌతున్నాయి. దక్షిణా అరేబియా ఏమన్ చెందిన సూఫీలు దీనిని సేవించినట్లు ఆధారాలు లభ్యమౌతున్నాయి. ముస్లిమ్ దేశాల నుండి ఇది ఇటలీకి విస్తరించింది. తరువాత ఇండోనేషియా, తూర్పు యూరప్ మరియూ అమెరికాలకు విస్తరించింది.

కాఫీ తోటలు

1820లో వాణిజ్య పరంగా బ్రిటిష్‌ ప్రభుత్వపాలనా కాలంలో ప్రారంభించారు. 19వ శతాబ్ధం చివరికంతా పడమటి కనుమల్లో కాఫీ తోటలు విస్తరించాయి. ప్రస్థుత కాలంలోనూ ఇవి భారత కాఫీ పరిశ్రమలో ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. సంప్రదాయ రీతుల్లో పండించే తమిళనాడు, కేరళ మరియు కర్నాటక రాష్ట్రాలు దేశంలో కాఫీ పంటలో 98% పంటను అందిస్తాయి. దేశీయ కాఫీ ఉత్పత్తులలో 68% కర్నాటక రాష్ట్రంలో పండిస్తారు. ఇటీవలి కాలంలో ఆంధ్రా, ఒరిస్సాకు చెందిన గిరిజనులు తూర్పు కనుమల్లో కాఫీ తోటల పెంపకం ప్రారంభించారు. కొన్ని ఈశాన్య రాష్ట్రాలు నూతనంగా కాఫీతోటల పెంపకం ప్రారంభించారు. ఇవి వ్యాపార సంస్థలు పెద్ద మొత్తంలోనూ మరికొన్ని చిన్నచిన్న తోటల్లోనూ కాఫీ గింజలు పండిస్తున్నారు. అమెరికాలో 1720లో కాఫీ తోటల పెంపకం ఆరంభించినట్లు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా కాఫీ ఉత్పత్తి బ్రెజిల్ దేశంలో జరుగుతుంది. ప్రస్తుతం కాఫీ పంటను 60 దేశాలు పండిస్తున్నాయి. వీటిలో అధికం వర్ధమాన దేశాలే కావడం విశేషం. ప్రపంచంలో కాఫీ వినియోగంలో అమెరికా ప్రధమ స్థానంలో ఉండగా తరవాతి స్థానాలలో జపాన్, యురేపియన్ దేశాలున్నాయి.

కాఫీతోటలలో రకాలు

కాఫీతోటలు ప్రధానంగా రెండు రకాలు.ఒకటి అరేబియా రెండవది రోబస్టా.అరేబియా రకం ఎత్తైన ప్రాంతాలలోనూ రోబస్టా రకం దిగువ ప్రాంతాలలోనూ బాగా పెరుగుతాయి.

Roasted coffee beans

కాఫీ షాపులు

ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి కాఫీ షాపు వెనిస్ నగరంలో 1683లో స్థాపించబడింది. మక్కాలో స్థాపించబడిన కాఫీ షాపులను "కవే కేన్స్" అని పిలువబడ్డాయి. చదరంగం ప్రదేశాలలో, ముచ్చటించుకునే బహిరంగ ప్రదేశాలలో, విహార సమయాలలో కాఫీ షాపులు విజయం సాధించాయి. పాతకాలంనుండి కాఫీ షాపులను అందంగా అలంకరించడం అలవాటు. కాఫీ షాపులలో సామాజిక మరియు వాణిజ్య సమావేశాలు చోటు చేసుకున్నాయి.ప్రపంచంలో పెద్దది లండన్ కి చెందినది అయిన ఇన్సూరెన్స్ మార్కెట్ లాయిడ్స్ సంస్థ కాఫీ షాపులో రూపు దిద్దుకున్నట్లు కధనం.

మూస:Link FA మూస:Link FA మూస:Link FA మూస:Link FA

"https://te.wikipedia.org/w/index.php?title=కాఫీ&oldid=694526" నుండి వెలికితీశారు