బ్రహ్మ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: war:Brahma
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: or:ବ୍ରହ୍ମା
పంక్తి 113: పంక్తి 113:
[[nn:Brahma]]
[[nn:Brahma]]
[[no:Brahma]]
[[no:Brahma]]
[[or:ବ୍ରହ୍ମା]]
[[pl:Brahma]]
[[pl:Brahma]]
[[pnb:برہما]]
[[pnb:برہما]]

16:24, 10 ఫిబ్రవరి 2012 నాటి కూర్పు

కర్ణాటకలోని హళిబీడులో ఉన్న బ్రహ్మ శిల్పం

హిందూ సంప్రదాయంలో స్థానం

సృష్టి, స్థితి, లయకారకులైన త్రిమూర్తుల్లో బ్రహ్మ ఒకడు. బ్రహ్మ విష్ణువు బొడ్డు నుంచి పుట్టుకొచ్చిన కమలంలో ఆవిర్భవించాడు. అందుకే విష్ణువును కమలనాభుడు, పద్మనాభుడు అని, బ్రహ్మను కమలసంభవుడు అని అంటారు. త్రిమూర్తుల్లో బ్రహ్మ సృష్టికర్త. ఈయన 432 కోట్ల సంవత్సరాల పాటు సృష్టిని కొనసాగిస్తాడు. ఈ కాలాన్ని కల్పం అంటారు. ఇది బ్రహ్మకు ఒక పగలు. కల్పం ముగిశాక గొప్ప ప్రళయం వచ్చి సృష్టి యావత్తూ తుడిచిపెట్టుకుని పోతుంది. అది కల్పాంతం. కల్పాంతం 432 కోట్ల సంవత్సరాలపాటు కొనసాగుతుంది. అది బ్రహ్మకు రాత్రి. ఒక కల్పం, కల్పాంతం కలిస్తే బ్రహ్మకు ఒక రోజు. ఇలాంటి రోజులు 360 గడిస్తే అది బ్రహ్మకు ఒక సంవత్సరం. ఇలాంటి సంవత్సరాలు వంద గడిస్తే బ్రహ్మకు ఆయుర్ధాయం తీరిపోతుంది. అప్పుడు ఇప్పుడున్న బ్రహ్మ స్థానంలో ఇంకొకరు బ్రహ్మత్వం పొందుతారు. హనుమంతుడిని కాబోయే బ్రహ్మగా చెబుతారు.

బ్రహ్మ మానస పుత్రులు

మరీచి, అంగీరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు

ప్రధాన కధ

భాషా విశేషాలు

తెలుగు భాషలో బ్రహ్మ పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1] బ్రహ్మ n. The god Brahma, the operative creator of the world బ్రహ్మ దేవుడు. ఇది బ్రహ్మ భేద్యముగా నున్నది this is invincible even to Brahma. వాడు వట్టి యంబ్రహ్మ he is a mere simpleton. నవబ్రహ్మలు There are said to be nine Brahmas, viz., భృగువు, పులస్త్యుడు, పులహుడు. అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి. బ్రహ్మము n. The deity, పరమాత్మ. The Veda, వేదము. Meditation, తపము. బ్రహ్మకమ్మి n. అనగా The seam that goes down the middle of a sheet. బ్రహ్మచర్యము n. The bachelor state. Abstinence from sexual intercourse. బ్రహ్మచారి n. A bachelor or novice: the title borne by a Brahmin during the period of religious instruction, which extends from childhood up to manhood, when he is married. బ్రహ్మచారిణి n. A maiden that remains unmarried, a female novice: a woman leading a life of continence. బ్రహ్మచర్యమును అనుష్ఠించు స్త్రీ. బ్రహ్మదారువు, గంగరావి చెట్టు, బ్రహ్మ విశేషణముగా adj. Relating to, or connected with a Brahmin. బ్రాహ్మణహితము. బ్రహ్మహత్య n. Brahmin-slaying, బ్రాహ్మణుని చంపడము. బ్రహ్మత్వము n. Identification with Brahma, or God. Godhead. బ్రహ్మసాయుజ్యము, బ్రహ్మభూయము or బ్రహ్మసాయుజ్యము n. Brahmanhood, బ్రహ్మత్వము, బ్రహ్మస్వరూపము. బ్రహ్మదండి n. అనగా The Mexican or Prickly Poppy. (Watts); a plant called Argemone mexicana. (Wight.) వారాహి. బ్రహ్మనాడి n. The cerebral nerves. బ్రహ్మనాభుడు n. An epithet of Vishnu. బ్రహ్మపుత్రము n. The river Brahmaputra బ్రహ్మపుత్ర నది. A sort of poison. మకరాక్షజాతి సర్ప విషము. బ్రహ్మపుత్రుడు n. A name of Narada. నారదుడు. Kētu, కేతుగ్రహము. బ్రహ్మబంధువు n. అనగా A wretch, a miscreant infamous as a false witness. అబద్ధపుసాక్ష్యము పలికినందువల్ల నిందింపబడ్డవాడు, కూటసాక్షి అయిన నిందితుడు. బ్రహ్మబిందువు n. A drop of Saliva లాలాజలపు చుక్క. బ్రహ్మభూతుడు n. One who has become one with the Supreme Spirit. బ్రహ్మత్వము పొందినవాడు. బ్రహ్మయజ్ఞము n. The name of a certain rite among Brahmins. వేదపాఠము. బ్రహ్మరథము n. A vehicle or car borne on the shoulders of Brahmins. P. i. 14. Vulgarly, a bier. పాడె, శవ వాహనము. బ్రహ్మరంధ్రము n. The fontanella, in anatomy: the quadrangular aperture found betwixt the os frontis and ossa sincipittis, in children just born; మాడపట్టు, నడినెత్తి. At death the soul is supposed by the Hindus to quit the body by this crevice. బ్రహ్మరాకాసి చెట్టు n. The giant-aloe used in fences. బ్రహ్మరాక్షసి n. A ghoul, ogre or she-sprite. కోతిపుండు బ్రహ్మరాక్షసి అయినది this made matters worse than before. బ్రహ్మరాక్షసుడు n. A fiend of the Brahminical class: a priest's ghost. బ్రహ్మలిపి, బ్రహ్మవ్రాత లేదా బ్రహ్మవ్రాలు n. An unintelligible scrawl, a bad scribble. Originally applied to the lines or the sutures of the skull, which are supposed to be hieroglyphics, the mysterious writing of destiny. తలపుర్రె మీది వ్రాత, తలవ్రాత, చిక్కుగానుండే వ్రాలు. బ్రహ్మవాది n. A Vedantist, వేదాంతి. బ్రహ్మ విద్వాంసుడు n. An illustrious doctor or professor. బ్రహ్మవేళ n. Dawn. అరుణోదయ కాలము. బ్రహ్మసూత్రము n. The sacred thread worn by Brahmins. యజ్ఞోపవీతము, జందెము. బ్రహ్మసువు n. Manmadha, మన్మధుడు. బ్రహ్మస్వము n. A Brahmin's property or wealth. బ్రాహ్మణ సొత్తు. బ్రహ్మాంజలి n. Joining both hands together while reading the Vedas. వేదాధ్యయన కాలమందలి మ్రొక్కు. బ్రహ్మాండము n. The globe, the universe, the world. adj. Huge, vast, immense, awful. బ్రహ్మాండముగా adv. Vastly, prodigiously. బ్రహ్మణి n. The female energy of Brahma. సరస్వతి. బ్రహ్మానందము n. Divine bliss. Great joy. మహా సంతోషము. బ్రహ్మరణ్యము n. A place where the Veda is studied. వేదపాఠభూమి. బ్రహ్మవర్తము n. Brahmāvarta, the land first occupied by the Brahmins to the north-west of Delhi. బ్రహ్మాసనము A sacred seat. బ్రహ్మ్యము n. Divineness. నాదబ్రహ్మ్యము divine harmony, heavenly tones.

మత సంప్రదాయాలు

పేర్లు, అవతారాలు

గ్రంధాలూ, పురాణాలూ

దేవాలయాలు

పుష్కర్ లోని బ్రహ్మదేవుడు
చతుర్ముఖ బ్రహ్మ విగ్రహం.

బ్రహ్మదేవున్ని సుమారు అన్ని హిందూ యజ్ఞాలలో ప్రార్ధించినా, బ్రహ్మను పూజించే దేవాలయాలు చాలా తక్కువ. వీటిలోకెల్లా ప్రఖ్యాతిచెందినది అజ్మీర్ దగ్గరలోని పుష్కర్ (Pushkar) వద్దనున్న బ్రహ్మ దేవాలయం. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ పెద్ద ఉత్సవం జరుగుతుంది. వేలకొలదీ భక్తులు ఇక్కడి సరస్సులో పుణ్యస్నానాల కోసం వస్తారు.

శ్రీకాళహస్తిలో బ్రహ్మకు దేవాలయం ఉన్నది. రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాలో ఒక బ్రహ్మ గుడి ఉన్నది. దీనిని ఖేతేశ్వర బ్రహ్మధామ్ తీర్థం (Kheteshwar Brahmadham Tirtha) అంటారు. తమిళనాడులోని కుంభకోణంలోను, కేరళలోని తిరుపత్తూర్ లోను, మహారాష్ట్రలోని సోలాపూర్ లోను బ్రహ్మ దేవాలయాలు ఉన్నవి.

బ్రహ్మ దేవాలయాలన్నింటిలోకి పెద్దది కంబోడియా లోని ఆంగ్‌కోర్ వాట్ దేవాలయం.

కర్ణాటక సంగీతం

కర్ణాటక సంగీతంలోని మేళకర్త రాగాలలో తొమ్మదవ చక్రం పేరు బ్రహ్మ చక్రాల పేర్లు వాటితో సంబంధమున్న సంఖ్యను సూచిస్తాయి. ఇక్కడ నవబ్రహ్మలు అనగా తొమ్మిదవ చక్రం అని అర్ధం.[2] [3]

ఆచారాలు, పండగలు

ప్రార్ధనలు, స్తోత్రాలు

ఇవి కూడా చూడండి


మూలాలు

  1. బ్రౌన్ నిఘంటువు ప్రకారం బ్రహ్మ పదప్రయోగాలు.
  2. South Indian Music Book III, by Prof. P Sambamoorthy, Published 1973, The Indian Music Publishing House
  3. Ragas in Carnatic music by Dr. S. Bhagyalekshmy, Pub. 1990, CBH Publications

వనరులు

బయటి లంకెలు

"https://te.wikipedia.org/w/index.php?title=బ్రహ్మ&oldid=694911" నుండి వెలికితీశారు