ఎ. ఆర్. రెహమాన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము మార్పులు చేస్తున్నది: ca:A. R. Rahman
చి r2.7.1) (యంత్రము మార్పులు చేస్తున్నది: nl:A.R. Rahman
పంక్తి 135: పంక్తి 135:
[[ms:A. R. Rahman]]
[[ms:A. R. Rahman]]
[[nds:Allah Rakha Rahman]]
[[nds:Allah Rakha Rahman]]
[[nl:A. R. Rahman]]
[[nl:A.R. Rahman]]
[[no:A.R. Rahman]]
[[no:A.R. Rahman]]
[[pl:A.R. Rahman]]
[[pl:A.R. Rahman]]

18:26, 15 ఫిబ్రవరి 2012 నాటి కూర్పు

ఏ.ఆర్. రెహమాన్
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంఏ.ఎస్. దిలీప్ కుమార్
ఇతర పేర్లుఎ.ఆర్. రెహ్మాన్
సంగీత శైలిFilm score, Theatre, World Music
వృత్తిComposer, record producer, music director, singer, instrumentalist, arranger, programmer
వాయిద్యాలుకీబోర్డు
క్రియాశీల కాలం1992 – present
లేబుళ్ళుK.M. Music
వెబ్‌సైటుఎ.ఆర్.రహ్మాన్.కామ్

ఏ.ఆర్. రెహమాన్ ప్రసిద్ద సంగీత దర్శకుడు, గాయకుడు. 1967 జనవరి 6వ తేదీన రెహ్మాన్‌ జన్మించాడు. తండ్రి ఆర్‌.ఎ. శేఖర్‌. మయాళి సినిమా సంగీత దర్శకుల దగ్గర ఆర్కెష్ట్రా నిర్వాహకుడు.

జీవితం

రెహ్మాన్‌ అసలు పేరు ఎ. ఎస్‌. దిలీప్‌ కుమార్‌. తొమ్మిది సంవత్సరాల ప్రాయంలోనే తండ్రి మరణించాడు. తల్లి, ముగ్గురు అక్కచెల్లెళ్ళు- పేదరికం. శేఖర్‌ సంగీత వాయిద్యాలను అద్దెకిచ్చి వచ్చిన ఆ డబ్బుతో జీవితం సాగించడం మొదలు పెట్టాడు. 11 సంవత్సరాల ప్రాయంలో కుటుంబ బాధ్యతలు నెత్తిపై వేసుకొని తల్లికి చేదోడుగా ఉంటూ గిటార్‌, హార్మోనియం, పియానో, కీబోర్డు ప్లేయర్‌గా ఇళయరాజా ట్రూప్‌లో జీవితం ప్రారంభించాడు. 1989వ సంవత్సరంలో కుటుంబమంతా హిందూ మతం నుంచి ఇస్లామ్‌లోకి మారిపోయింది. ఈయన కడప లోని పెద్ద దర్గా, కసుమూరు దర్గా, నెల్లూరు జిల్లాలోని వేనాడు దర్గాలను తరచూ సందర్శిస్తారు.

సంగీత ప్రస్థానం

తన సంగీత జీవితాన్ని రాజ్ - కోటి లాంటి కొందరి వద్ద అసిస్టెంటుగా ప్రారంభించి, కొన్ని ప్రకటనలకు జింగిల్స్ సమకూర్చి, తదనంతరం మలయాళ దర్శకద్వయం సంతోష్-శివన్ ల దర్శకత్వంలో మోహన్ లాల్ కధానాయకునిగా నటించిన యోధ సినిమాతో పరిచయం అయ్యాడు. అయితే ప్రఖ్యాత తమిళ దర్శకుడు మణిరత్నం ] సినిమా రోజా ద్వార మొత్తం భారతదేశమంతటా పేరు పొందాడు. "స్లమ్‌డాగ్ మిలియనీర్" అనే చిత్రంలో 'జై హో' అనే పాటకు సమకూర్చిన సంగీతానికి ప్రతిష్టాత్మకమైన "గోల్డెన్ గ్లోబ్ అవార్డు"ను కైవసం చేసుకున్న రెహ్మాన్ ఈ గౌరవం తనకు మాత్రమే దక్కలేదని, వంద కోట్ల భారతీయులందరికీ లభించిన అరుదైన గౌరవం అన్నారు. ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయుడు రెహ్మాన్. రెహ్మాన్ ప్రభావానికి తనుకూడా లోనుకాక తప్పలేదని తనకు రెహ్మాన్ అంటే భయమనీ, జలసీ అని ప్రఖ్యాత స్వరకర్త ఎస్ ఎల్ వైద్యనాథన్ అన్నాడు. రెహ్మాన్‌లా తను కూడా వేర్వేరు ప్లేన్స్‌లో, లేయర్స్‌లో, సకాలంలో వచ్చేకౌంటర్స్‌తో బాణీలు కట్టాలని ప్రయత్నించి చాలా సార్లు విఫలమైనానని ఒప్పుకున్నాడు. కర్నాటక సంగీతాన్ని, ఖవ్వాలీ సంప్రద్రాయాన్ని, రెగే, హిప్-హాప్, ర్యాప్, రాక్, పాప్, జాజ్, ఒపెరా, సూఫీ ఆఫ్రికన్, అరేబియన్, పాశ్చాత్య సంగీతాన్ని శ్రావ్యంగా మిళితం చేయగలిగాడు రెహ్మాన్. అలా చేస్తూ కూడా పూర్తి స్థాయి ఒరిజినల్ బాణీలను తయారుచేశాడు.

గౌరవాలు బిరుదులు

టైమ్ మ్యాగజైన్ రెహ్మాన్‌ కు "మొజార్త్ ఆఫ్ మద్రాస్" బిరుదు ఇచ్చింది. ఆయన పాటలు ఆస్కార్ కు నామినేట్ అయ్యాయి. "స్లమ్‌డాగ్ మిలియనీర్" అనే చిత్రంలో 'జై హో' అనే పాటకు సమకూర్చిన సంగీతానికి ప్రతిష్టాత్మకమైన "గోల్డెన్ గ్లోబ్ అవార్డు", రెండు ఆస్కార్ అవార్డులను అందుకొన్న తొలి భారతీయుడు. రెండు ఆస్కార్‌ అవార్డులను గెలుచుకొని భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లిన ఘనత రెహ్మాన్‌కే దక్కుతుంది. జాతీయ స్థాయి లో నాలుగుసార్లు ఉత్తమ సంగీత దర్శకుడుగా హిందీ, తమిళ చిత్రాలకు 19 సార్లు ఫిలిమ్‌ఫేర్‌ అవార్డులను, తమిళ ప్రభుత్వ అవార్డులను అందుకున్నాడు. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును స్వీకరించాడు. భార్య సైరా బాను, ముగ్గురు పిల్లలు ఖతీజా, రహీమ్‌, అమన్‌ .

సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు

కొన్ని పాటలు

  • నీ నమాజులో ఓనమాలు నేర్చా
  • అది అరబిక్ కడలి అందం
  • అచ్చొచ్చేటి వెన్నెలలు
  • కాకి ఎంగిలిలా ఓ పండే తిందామా
  • కలమేలుకున్నది ఇలనేలుతున్నది
  • నిద్దురలోన చెమటలు పడితే నక్షత్రాలతో తుడిచేస్తా
  • నీ అడుగల చెరగని గురుతులే ప్రేమ చరితలు అంటానే
  • కన్నులతో చూసేది గురువా కనులకు సొంతమవునా
  • అతిశయమే అచ్చెరువొందే
  • ఉట్టిమీది కూడు ఉప్పు చేపతోడు

తెలుగు చిత్రాలు

రెహ్మాన్ సంగీతం అందించిన చిత్రాలు

1992 లో

  • రోజా (తమిళం)
 బిరుదులు- ఉత్తమ సంగీత దర్శకునిగా జాతీయ పురస్కారం, తమిళనాడు ప్రభుత్వ పురస్కారం, ఫిల్మ్ ఫేర్ అవార్డు, 2005 లో మొదటి 10 సినిమాలలో ఎప్పటికి  ఉత్తమ చిత్రంగా శబ్ధ విభాగానికిగాను   టైమ్స్ పత్రికచే గుర్తింపు.
  • యోధ (మళయాళం)

1993 లో

  • పుదియ ముగం (తమిళం)
  • జెంటిల్మేన్ (తమిళం)
  బిరుదులు- తమిళనాడు ప్రభుత్వ పురస్కారం, ఫిల్మ్ ఫేర్ అవార్డు
  • కిళక్కు సీమయిలే (తమిళం)
  • ఉళవన్ (తమిళం)
  • తిరుడా తిరుడా ( తమిళం తెలుగులో దొంగా దొంగా)

1994 లో

  • వండిచోళై చిన్నరాసు (తమిళం)
  • సూపర్ పోలీస్ (తెలుగు)
  • డ్యూయెట్ ( తమిళం)
  • మే మాధం(తమిళం)
  • కాదలన్ ( తమిళం తెలుగులో ప్రేమికుడు)
బిరుదులు- తమిళనాడు ప్రభుత్వ పురస్కారం, ఫిల్మ్ ఫేర్ అవార్డు
  • పవిత్ర (తమిళం)
  • కరుత్తమ్మ(తమిళం)
  • పుదియ మన్నర్గళ్( తమిళం)
  • మనిదా మనిదా (తమిళం)
  • గ్యాంగ్ మాస్టర్ (తెలుగు)

1995లో

  • బొంబాయి (తమిళం మూల భాష)
బిరుదులు- తమిళనాడు ప్రభుత్వ పురస్కారం, ఫిల్మ్ ఫేర్ అవార్డు
  • ఇందిరా (తమిళం)
  • రంగీలా (హిందీ)
బిరుదులు- ఫిల్మ్ ఫేర్ అవార్డు , ఫిల్మ్ ఫేర్ ఆర్.డి. బర్మన్ అవార్డు యువ సంగీత దర్శకుడిగా
  • ముత్తు (తమిళం)
   ఎంతో విజయవంతమైన చిత్రంగా  శబ్ద విభాగంలో జపాన్ దేశంచే గుర్తించబడెను.

హిందీ చిత్రాలు

అదా రొబొ,నాయక్,బొస్స్