గానుగ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: war:Gilingan
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: eu:Errota
పంక్తి 55: పంక్తి 55:
[[eo:Muelejo]]
[[eo:Muelejo]]
[[es:Molino]]
[[es:Molino]]
[[eu:Errota]]
[[fi:Mylly]]
[[fi:Mylly]]
[[fr:Moulin]]
[[fr:Moulin]]

04:08, 12 మార్చి 2012 నాటి కూర్పు

ప్రాచీన భారతదేశపు నూనె గానుగ
నూనె గానుగ

గానుగ (Mill) బహువచనం గానుగలు మూడు రకాలు. అవి: ఒకటి: చెరుకు గానుగ రెండు: నూనె గానుగ. మూడు.. సున్నం గానుగ.

బ్రౌన్ నిఘంటువు ప్రకారం గానుగ [ gānuga ] gānuga. తెలుగు n. అనగా A mill. An oil mill.[1] చెరుకు గానుగ a mill for sugar cane. కలు గానుగ a stone mill. గానుగ పిండి oil cake: the refuse of the seeds after the oil is pressed out. గానుగ రోలు the bowl or mortar part of such a mill. గానుగాడు to mill or to use a mill.

1. చెరుకు గానుగ

చెరుకు నుండి రసం తీసి దాన్ని మరగబెట్టి బెల్లం తయారు చేయడాని ఉపయోగిస్తారు. అందు లోని భాగాలు.

  • 1. రెండు స్థూపాకార చక్రాలు, ఇవి ఒక అడుగు పైగా కైవారం కలిగి ఉంటాయి.
  • 2. ఒక పైవాటి కన్న కొంత సన్నగా వుండి అంతే ఎత్తు కలిగిన స్థౌపాకార చక్రం. ఇవి మూడు ఒక అడుగు ఎత్తు ఉంటాయి. ఇవి ఇనుముతో చేసినవి. ఈమూడు చక్రాలు ఒకదాని కొకటి అను సందాన పరచబడి ఉంటాయి. వీటిని కడాలు అంటారు. వీటిలొ ఒక దాని ఇరుసు మాత్రం కొంత పొడవుగా పైకి వుంటుంది.
  • 3. బళ్ళ. ఇది కూడ ఇనుము తో చేసినది. దీనికి ఒక పెద్ద కర్ర మానును పెట్టడానికి అనువుగా ఒక పెద్ద్ రంద్రం, క్రిందన కణేల ఇరిసుకు తగిలించ డానికి చతురస్రాకారపు చిన్న రంద్రం ఉంటాయి. దీన్ని బళ్ళ అంటారు.

ఈ మూడు కడాలను కర్ర దిమ్మల చట్రంలో బందించి ఒక స్టాండు లాగ చేసి భూమిలోకి పాతడానికి నాలుగు కర్ర కాళ్ళను కూడ అమర్చుతారు. దీన్ని సమతలంగా భూమిలో పాతి పైన ఉన్న ఇరుసుకు బళ్లను అమర్చి. దానికున్న పెద్ద రంద్రంలో ఒక పెద్ద కర్ర మానును అమర్చి (ఇది సుమారు 20 అడుగులు పొడవుంటుంది) దాని చివరన దారం సాయంతో రెండు ఎద్దులకు కట్టి నడిపిస్తారు. ఎద్దులు గుండ్రంగా తిరుగు తుంటాయి. కర్రమాను ఆదారంగా బళ్ళ, దానికి అనుసందానించిన కణాలు తిరుగుతాయి. ఆ కణాలమద్య అతి సన్నని సందు మాత్రమే ఉంటుంది. వాటి సందులో చెరుకు పెట్టితే ఆ మూడు కణాలమద్యన చెరుకు నలిగి పిప్పి అయి బయటకు వస్తుంది. కారిన రసం కింద వుంచిన పాత్రలో పడుతుంది. ఈ విదంగా చెరుకు రసం తీస్తారు గానుగ సాయంతొ. దీనినే చెరుకు గానుగ అంటారు. వీటి స్థానం లో ఇప్పుడు క్రషెర్ అనె యంత్రాలు వచ్చాయి. ఈ రెండింటి లోని సూత్రం ఒకటే. గానుగ ఎద్దులతో నడస్తె ఇవి కరెంటుతో నడుస్తాయి.

బెల్లం తయారు చేసే విధానం:..... గానుగ నుండి చెరుకు రసం తీసి దాన్ని ఒక పెద్ద పెనంలో పోసి పెద్ద పొయ్యిపై పెట్టి కింద మంట పెట్టతారు. బాగా కాగిన తర్వాత మొదటగా బుడ్డ పగులుతుంది. అంటే చెరుకు రసంలోని మురికి అంతా పైన మందపాటి పొరగా ఏర్పడుతుంది. అది పగులి చెరుకు పాలు తెర్లతాయి. ఆసమయంలో 'తెడ్డు'తో ఆమలినాన్ని తీసివేస్తారు. కాగుతున్న ఆ చెరుకు రసం (చెరుకు పాలు అని కూడ అంటారు) ఒక పొంగు వస్తుంది. దాన్ని చీమల పొంగు అంటారు. ఇందులో చీమల్లాగ కొంత మలినాలు కనబడతాయి. అందుకే దాన్ని చీమల పొంగు అని అంటారు. మరో పది నిముషాల తర్వాత ఇంకో పొంగు వస్తుంది.. దాన్ని పెద్ద పొంగు అంటారు. అన్నిటి కన్నా ఈ పొంగు పెనుములో చాల ఎత్తు వరకు వస్తుంది. అందుకే దీన్ని పెద్ద పొంగు అంటారు. కింద మంట అలా కొనసాగుతుంటే ఆ పొంగు క్రమేణ తగ్గుతుంది. చివరకు ఘాతాలు పడతాయి. అనగా నీళ్లలో పెద్ద చినికులు పడితే ఏర్పడే సందడి లాంటి ది అన్న మాట. ఈ సమయంలో కింద మంట తగ్గించాలి. ఇప్పుడే ఒక తెడ్డుతో ఆ 'పాకాన్ని' కలుపుతూ, మాటిమాటికి పైకి ఎత్తి దాన్నుండి కారుతున్న పాకాన్ని గమనించి అదను కనిపెట్టాలి. తెడ్డు నుండి పాకం జారు తున్నప్పుడు మొదట తీగల్లాగ వుంటుంది. కొంత సేపటికి ఆ తీగలు తెగి పడతాయి. ఇప్పుడు పాకం పక్యానికి వచ్చిందన్న మాట. ఇప్పుడు మంటను పూర్తిగా తగ్గించి ఒక్క నిముషం వుంచి, పెనాన్ని ఇద్దరు మనుషులు పైకి లేపి పక్కనే భూమిలో అమర్చిన రేకు దోనెలో పోస్తారు. దోనెలోని పకాన్ని తెడ్డు తో కలుపుతూ వుండాలి. కొన్ని నిముషాల్లోనె అది గట్టి పడి బెల్లం తయారవుతుంది. దీన్ని అచ్చుల్లో గాని, గుండ్రటి ముద్దల రూపంలో గాని, తాటి ఆకుల బుట్టల్లో గాని, లేదా పొడి పొడిగా గోతాల్లో గాని పొస్తారు.

చెరుకు పండిన భూమిని బట్టి బెల్లం రంగు రుచి వస్తాయి. నల్ల బెల్లం, తెల్ల బెల్లం అని రెండు రకాలు, అలాగె బెల్లం 'జేడు' అని 'రాపు' అని రెండు రకాలు. జేడు అంటే గట్టిగా వుంటుంది, రాపు అంటే బెల్లం సులబంగా పగిలి పొడి అవుతుంది. బెల్లం రకాలను బట్టి రేటు ఉంటుంది. రాయల సేమ ప్రాంతంలో ఎక్కువగా నల్ల బెల్లం తయారవుతుంది. చిత్తూరు జిల్లాలోని అరగొండ ప్రాంతంలో బెల్లం తెల్లగా వుంటుంది. ఇది చాలతీపి. ఆంద్ర ప్రాంతంలోని బెల్లం తెల్లగా వుంటుంది. కాని ఇది కొంత ఉప్పగా వుంటుంది.

బెల్లం తయారు చేసేటప్పుడు సాదించే కొన్ని ఉప పదార్తాలు:.......1. నక్కిళ్లు.....పాకాన్ని దోనిలో పోసె ముందు కొంత పాకాన్ని నీళ్లున్న గిన్నెలో తెడ్డుతొ పొస్తే అది నక్కిళ్లు అవుతుంది. ఇది మెత్తగా వుండి అప్పటికప్పుడు పిల్లలు తినడాని బాగా వుంటుంది. 2. వరంటు. దోని లో పాకం పోసిన తర్వాత కొంత పాకాన్ని పక్కికి జరిపి తెడ్డుతొ అదే పనిగా రుద్దూతూ వూంటే అది గట్టి పడి తెల్లగాగట్టి పడి ముద్ద వుతుంది. దీన్నీ నిలువ వుంచుకొని తింటారు. 3. చెక్క బెల్లం... పళ్లేలలో అడుగున నేయి పోసి, అందులో పక్యానికొచ్చిన పాకం పోసి అందులో వేయించిన ,జీడిపప్పులు, వేరుశనగ పప్పులు యాలకుల, మిరియాల పొడి వేసి బాగా కలిపి గట్టిపడే ముందు చాకుతో బిళ్ళలుగా కోసి నిల్వ వుంచుకొని తింటారు. 4. కలకండ.... పక్యాని కొచ్చిన పాకాన్ని కొత్త మట్టి పాత్రల్లొ పోసి మూతికి గుడ్డ కట్టి ,మూడు నెలెల వరకు ఉట్టి మీద పెట్టి ఆ తర్వాత చూస్తే పాకం పై భాగం లో ఒక అంగుళం మందం గట్టి పొర ఏర్పడి ఉంటుంది, ఇది రంగు తక్కువైనా కలకండ లాగే వుంటుంది. రుచి చాల బాగుంటుది. 5. ఇతరాలు. పచ్చి మామిడికాయలు, వంకాయలకు గాట్లు పెట్టి ఒక దారానికి కట్టి పెద్ద పొంగు రాకముందు పెనంలో వేలాడ గట్టితే, అవి అందులో బాగా వుడికి చల్లారిన తర్వాత తినడానికి చాల రుచిగా వుంటాయి..6. పొరబాటున పొయ్యి మీద పాకం ముదిరి పోతే దాన్ని దోనె లో పోసిన వెంటనే గట్టి పడిపోతుంది. అప్పుడు దాన్ని బయటికి తీయడానికి సుత్తి, స్రావణం కావలసిందే. సుత్తి తో కొడితే పలుగులు పలుగులుగా పగులుతుంది. ఆ ముక్కలు అచ్చం బజారులో అమ్మే టాపి బిళ్లలు లాగే గట్టిగా, తీయగా వుంటాయి. ఈ వ్యహారం పిల్లలకు ఆనందం, పెద్దలకు బాదాకరం. చెరుకు రసం లేదా చెరుకు పాలు:.....గానుగను శుబ్రంగా కడిగి, కడిగిన మంచి చెరుకులను తీసుకొని అందులో నిమ్మకాయలు, పచ్చి మిరపకాయలు, అల్లం, పెట్టి గానుగలో పెట్టి వచ్చిన రసాన్ని ప్రత్యేక పాత్రలో నింపి త్రాగుతారు. ఇదంతా చిత్తూరు జిల్లాలో గానుగ ఆడే సమయంలో జరిగే సర్వ సాదారణ పిల్లల కార్యక్రమం.§07:13, 28 ఏప్రిల్ 2011 (UTC)119.235.54.65

119.235.54.65 07:00, 28 ఏప్రిల్ 2011 (UTC) 119.235.54.65 04:54, 27 ఏప్రిల్ 2011 (UTC)

 నూనె గానుగలు : ఇవి రెండు రకాలు.  ఒకటి మంచి నూనె గానుగ. రెండోది చేదు నూనె గానుగ.  ఇందులో వేప గింజలు, కానుగ లేదా గానుగ వంటి గింజలను అనగా  వంటలకు ఉపయోగించని నూనెలను తీస్తారు.  ఇవి రెండు వేరు వేరు గా వుంటాయి. చేదు నూనె గానుగలో వేరు శనగ, నువ్వులు వంటి గింజలను ఆడించరు. అలా చేస్తే ఆనూనె అంతా చేదుగా అయి పోతుంది. యంత్రాలొచ్చాక వీటి ఉపయోగం కనుమరుగైంది.  ఈ గానుగలు కర్రతో చేసినవి గాన కాల గర్బంలో కలిసి పోయాయి.  కాని ప్రదానమైన గానుగను అనగా నూనె గానుగను రాతి లో మలిచినవి కూడ వుండేవి. అవి అక్కడక్కడా కనిపిస్తున్నాయి. కొన్ని పల్లెలలో   ఊరి బయట,  కొన్ని   పురాతన రాజ కోటలలో ఇవి కనిపిస్తాయి. అవి శిలలై  నందున చిరస్థాయిగా నిలిచి వుంటాయి.  రాబోవు కాలంలో వీటినె గానుగలకు గుర్తుగా  గానుగ అంటే ఇలా వుంటుందా అని వాటిని చూసి తెలుసు కోవలసిందే.

చెరకు గానుకలలో లోహ బాగాలు ఎక్కువ. కాని ఈ నూనె గానుగలలో అన్నీ కలప భాగాలె. ఒక లావు పాటి కర్ర మానును తీసుకొని సుమారు ఐదు అడుగుల ఎత్తున దానిని ఒక అడుగు లోతులో దానిని పాతి పెడ్తారు. పైభాగం మూడు నాలుగడుగుల వ్యాసంతో వృత్తాకారం లో వుంటుంది. దీని మద్యలో ఒక ఆడుగు వ్యాసంతో రెండడుగుల లోతున పెద్ద రంద్రం చేస్తారు. ఇదె రోలు. ఇది ఒక అడుగు వ్యాసం కలిగి వుంటే ఇందులో పెట్టే 'కణెం' వ్యాసం రోలుకన్నా రెండు మూడు అంగుళాలు తక్కువగా వుంటుంది. దీనిని రోలు లో దించగా సుమారు మూడు అడుగులు పొడవు పైకి వుంటుంది. ఇప్పుడు రెండడుగులు వెడల్పు ఒక అడుగు మందం సుమారు పది ఆడుగుల పొడవు గల చెక్కను చెక్కను ప్రదాన గానుగకు క్రింది బాగాన భూమికి ఒక అడుగు ఎత్తున అమర్చు తారు. ప్రదాన గానుగ క్రింది కైవారము పైదాని కన్నా సుమారు ఒక అడుగు చిన్నదై వుంటుంది. ఇప్పుడు గానుగలో వుంచిన కణెం (రోకలి అను కోవచ్చు) పై భాగాన్ని క్రిందనున్న చెక్కకు మరొక కర్ర తో అనుసందానిస్తారు. ఇప్పుడు క్రింద నున్న చెక్క కణేనికి అనుసందానించి వున్నందున ఈ చెక్క బరువంతా కణెం మీద పడి అది రోలులో వున్నందున అది రోలు అంచులకు బాగా వత్తిడి కలిగిస్తుంది. క్రింద నున్న చెక్క చివరన ఆర్థ చంద్రాకారంలో వుండు గానుగ క్రింది బాగానికి ఆనుకొని భూమికి ఒక అడుగు పైకి లేసి వుంటుది. ఇప్పుడు ఈ చెక్క చివరన దారం సాయంతో రెండు ఎద్దులను కట్టి ముందుకు నడిపిస్తారు. ఆ నడిపించే వ్యక్తి ఆ చెక్క మీద కూర్చుంటాడు. ఇలా ఎద్దులు సుమారు పది ఆడుగుల పరిదిలో గుండ్రంగా గానుగ చుట్టు తిరుగుతాయి. అప్పుడు గానుగ రోలులో కొద్ది కొద్దిగా నూనె గింజలను పోస్తారు. ఇలా ఆ రోలు నిండి నంత వరకు పోసి గానుగను తిప్పుతారు. ఇలా ఎంత సేపు తిప్పినా నూనె రాదు. అదను చూసుకొని అందులో కొంత నీరు పోయాలి. దానిని పదను అంటారు. ఇప్పుడు నూనె రావడం ప్రారంబం అవుతుంది. ఒకట్లి రెండుసార్లు గానుక కణాన్ని బయటకు తీసి లోపలున్న పిండిని కిందికి మీదికి కలియ బెట్టాలి. మరలా కణాన్ని రోలు లోనికి దించి తిరిగి క్రింద నున్న చెక్కకు అనుసందానించి తిరిగి గానుకను తోలు తారు ఇక నిదానంగా నూనె రావడం ప్రారంబం అవుతుంది. గానుగ తిరుగు తుంటే పైకి వచ్చిన నూనెను ఒక బట్టతో అద్ది ఒక డబ్బలో సేకరిస్తారు. చివరగా కణాన్ని బయటకు తీసి లోపలవున్న నూనెను కూడ తీసి., గానుగ రోలు అంచులకు అతుక్కుని వున్న చెక్కను ఒలచి బయటకు తీస్తారు. ఇలా గానుగ నుండి నూనె గింజలలోని నూనెను బయటకు తీస్తారు. కొన్ని చోట్ల ప్రధానమైన గానుగ రాతితో చేసి వుంటారు. దానికి రోలు అడుగు బాగం నుండి బయటకు సన్నని రంద్రం వుంటుంది. గానుగ తిరుతు తున్నంత సేపు దాన్ని మూసి వుంచు తారు. నూనె పడగానె దాన్ని తెరువగా నూనె దానంతట అదే బయటకు వస్తుంది. దాన్ని పాత్రలలో సేకరించు కుంటారు. ఇలా వచ్చిన నూనెను పచ్చి నూనె అంటారు. దీన్ని కొన్ని రోజుల పాటు ఎండలో పెట్టాలి. అప్పుడు అది చాల కాలం నిల్వ ఉంటుండి. ప్రస్తుతం ఇటు వంటి గానుగలు ఎక్కడా కనబడడం లేదు. నూనె విధానం యంత్రాల తోనె జరుగు తున్నది. ఈ యంత్రాలలోని సూత్రం కూడ ఈ గానుగలలోని సూత్రమె. కాక పోతె గానుగ లో కణెం రోలు అంచులకు ఒరసు కుంటూ తిరుగు తుంది. యంత్రాలలో రోలు తిరుగుతుంది. అంతె తేడా. గానుగ లో గింజలలోని నూనెను నూటికి నూరు శాతం బయటకు రాదు. యంత్రాలలో మొత్తం నూనెను బయటకి తీస్తారు.

2. నూనె గానుగ

నూనె గానుగలో నాలుడగుల ఎత్తు గల అతి లావుపాటి కర్ర మొద్దును భూమిలో పాతి వుంటారు. దాని మద్యలో 9 అంగుళాల వ్యాసార్థంతో రెండడుగుల లోతు ఒక రంద్రాన్ని రోలు లాగ చెక్కుతారు. దానికి సరిపడా మరొక కర్ర మానును అందులో వేస్తారు. ఇది నాలుడడుగుల పొడవుంటుంది. దీనిని కణెం అంటారు. లేదా రోకలి అంటారు. దీనికి పైభాగాన మరో కర్రను అనుసందానించి ఏట వాలుగా వుంచుటారు. కింద భూమికి ఒక అడుగు ఎత్తులో ఒక లావు పాటి కర్ర మానును దాని చివరన అర్థ చంద్రాకారంలో చెక్కి దాన్ని గానుగ అడుగుభాగాన భూమికి ఒక అడుగు ఎత్తున అమర్చి ఇప్పుడు పైనించి ఏటవాలుగ కిందికి తెచ్చిన కర్రను అనుసందానిస్తారు. ఇప్పుడు ఈ అడ్డ కర్రమాను భూమికి ఒక అడుగు ఎత్తున గానుగ రోట్లో వేసిన కర్రమానును లాగుతు ఏటవాలుగా వున్న కర్ర ఆదారంతో అడ్డమానును భూమికి ఒక అడుగు ఎత్తున వుంచుతుంది. ఇప్పుడు అడ్డంగా అమర్చిన పెద్ద కర్రమాను బరువు అంతా రోట్లో వున్న రోకలి పైపడి దాన్ని రోలు వైపులకు బలంగా నొక్కుతుంది. ఇప్పుడు అడ్డకర్రకు రెండో వైపున రెండు ఎద్దులను కట్టి ముందుకు నడిపిస్తారు. అడ్డ కర్రపైన ఎద్దులను తోలె మనిషి కూడ కూర్చుంటాడు. ఈ బరువంతా రోకలిపై పడి రోలు అంచుల వైపు భలంగా నొక్కు తుంది. ఇప్పుడు రోలులో నూనె గింజలను పోసి ఎద్దులను గుండ్రంగా నడుపుతారు. ఆ బరువుకు నూనె గింజలు నలిగి అందులోని నూనె బయటకు వస్తుంది. వట్టి గింజలనుండి నూనె రాదు. దానికి మొదట్లో పదును వేయాలి. అంటే నీళ్లు చల్లాలి. ఇలా సుమారు ఒక గంట ఆడిస్తే గింజల్లొని నూనె వేరు పడి అడుక్కు చేరుతుంది. రోలు అంచుల చుట్టూ నూనె కారగా మిగిలిన ఛెక్క అంటుకొని వుంటుంది. ఇప్పుడు రోట్లో వున్న రోకలిని పైకి తీసి నూనెను తోడుకొని, అందులోవున్న గింజల చెక్కను కూడ తీసుకొంటారు. ఈ గింజల ఛెక్క పశువులకు చాల ఇష్టమైన, భలమైన ఆహారం. పంటపొలాలకు మంచి ఎరువు. ఈ విదంగా వేరుసనగ, నువ్వులు, ఆముదాలు, కొబ్బరి, ఆవాలు,ఇలా ఏ నూనె గింజలనుండైనా నూనెను తీస్తారు. చెరుకు గానుగ తో చెరుకు రసం తీసి ప్రతి రైతు బెల్లం తయారు చేస్తారు. కాని నూనె గింజల నుండి నూనెను తీయడానికి వేరె ఒక కులం వారున్నారు. వారిని గాండ్ల వారు అంటారు. నూనెను తీయడమే వారి వృత్తి. ఈ గానుగనూనె చాలసుద్దమైనదని ఇప్పటికి ప్రతీతి. ప్రస్తుతం ఈ గానుగలు ఎక్కువగా లేవు. అంతా యంత్రాల తో తీస్తారు. ఈ యంత్రాలలో వున్నది కూడ గానుగ లోని సూత్రమే. కాకపోతే గానుగలు ఎద్దులతో నడుస్తాయి. యంత్రాలు కరెంటు తో నడుస్తాయి.§119.235.54.65 07:16, 28 ఏప్రిల్ 2011 (UTC)

యంత్రాలు కరెంటుతోనడుస్తాయి. ( ఈ.బి.నాయుడు) 119.235.54.65 07:00, 28 ఏప్రిల్ 2011 (UTC)

3. సున్నం గానుగ

సున్నపు గానుగలు ప్రస్తుతం ఎక్కడా లేవు. సిమెంటు రాక పూర్వం ఇండ్లను గచ్చు సున్నంతో కట్టే వారు,. ఆ సున్నాన్ని తయారు చేసేదే సున్నం గానుగ. సుమారు పది అడుగుల వ్యాసార్తంతో ఒక ఆడుగు వెడల్పు, ఒక అడుగు లోతు వున్న కాలువను కింద, పక్కలలో రాతి పలకలతో ఏర్పాటు చేస్తారు. సుమారు రెండు అడుగులు వ్యాసార్థం కలిగి ఒక ఆడుగు మందం కలిగిన చక్రం లాంటి రాతి బండను తయారు చేసి దాన్ని గాడిలో పెడ్తారు. దాని మద్యలో వున్న రంద్రంలో లావు పాటి పొడవైన కర్రను అనుసందానించి దాని రెండో కొసన ఒక ఇనుప కొక్కేన్ని జొప్పించి ......... వృత్తం మద్యలో మరో కర్ర దుంగను పాతి దానికి కూడ ఒక ఇనుప కొక్కేన్ని దిగ్గొట్టి ఈ రెండు ఇనుప కొక్కేలను అను సందానించి రాతి చక్రానికి అమర్చిన దూలానికి చెరొక పక్కన రెండ్లు మోకులు కట్టి వాటిని కాడిమానుకు తగిలించి ఆ కాడిమానును ఎద్దుల మెడలపై వేసి ఎద్దులను ముందుకు తోలితే ఆ రాతి చక్రం గాడిలో గుండ్రంగా తిరుగు తుంది. ఎద్దులు వృత్తాకారంలో వున్న గాడి కిరుపైపులా వుండి చుట్టూ తిరుగు తాయి. అప్పుడు బాగా కాల్చిన సున్నపు రాయిని ఇసుకను ఆ గాడిలో వేసి నీళ్లు పోస్తారు. ఆ చక్రాన్ని ఎద్దుల తో తిప్పుతుంటే సున్నపు రాళ్లు ఇసుక, నీళ్ల తో కలిసి రాతి చక్రం క్రింద నలిగి పొడిగా మారి ఇసుకతో కలిసి ముద్దగా తయారౌతుంది. దాన్నే కట్టడాని కుపయోగిస్తారు. ఇప్పుడున్న పురాతన కట్టడాలు, భవనాలు ఇలాంటి డంగు సున్నంతో కట్టినవే. ఇది సిమెంటు కన్నా బలమైనది పైగా శతాబ్దాల తరబడి మన్నిక కలది. ఈ సున్నపు గానుగ కనుమరుగై చాల కాలమె అయినది. గానుగ చక్రం .... రాతితో చేసినది గాన కొన్ని పల్లెల్లో అదింకా కనబడు తుంది. దాని ఉపయోగం ఈ నాటి పిల్లలకు తెలియదు. ఆ వివరాలు వారి పెద్దల నడిగి తెలుసు కోవలసినదే.

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=గానుగ&oldid=703993" నుండి వెలికితీశారు