భారత ఉపఖండం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.6.5) (యంత్రము మార్పులు చేస్తున్నది: hy:Հնդստան
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: vi:Tiểu lục địa Ấn Độ
పంక్తి 90: పంక్తి 90:
[[uk:Індійський субконтинент]]
[[uk:Індійський субконтинент]]
[[ur:برصغیر]]
[[ur:برصغیر]]
[[vi:Tiểu lục địa Ấn Độ]]
[[wo:Ron-goxu End]]
[[wo:Ron-goxu End]]
[[zh:印度次大陸]]
[[zh:印度次大陸]]

05:44, 15 మార్చి 2012 నాటి కూర్పు

భారత ఉపఖండం భౌగోళిక పటము

భారత ఉపఖండము (ఆంగ్లం Indian Subcontinent) ఆసియా ఖండంలోని భాగము. ఈ ఉపఖండంలో దక్షిణ ఆసియా లోని భారతదేశం, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక మరియు మాల్దీవులు కలిసివున్నాయి.

కొన్ని ప్రత్యేకమైన భౌగోళిక మరియు రాజకీయ స్వతంత్ర ప్రతిపత్తి కలిగి వుండటం మూలాన "ఉపఖండం" అనే పదం ఉపయోగంలోకి వచ్చింది.[1] [2]

పద ప్రయోగం

భారత ఉపఖండం మరియు దక్షిణ ఆసియా సుమారు ఒకేలాంటి పదాలైనా, భారత ఉపఖండం భౌగోళికంగా ఉపయోగిస్తే, టిబెట్ మరియు మయన్మార్ తో కలిపి దక్షిణాసియా అని పొలిటికల్ గా ఉపయోగిస్తారు. ఈ ఉపఖండం మూడు వైపులా నీటితో చుట్టి వుంటుంది, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం మరియు అరేబియా సముద్రం. నాలుగవవైపు హిమాలయా పర్వతాలు ఉన్నాయి.

భౌగోళికం

భౌగోళికంగా, భారత ఉపఖండము ఒక ద్వీపకల్పం. హిమాలయాలకు మరియు కుయెన్ లున్ పర్వతశ్రేణులకు దక్షిణాన, సింధూ నది మరియు ఇరాన్ పీఠభూమి కి తూర్పున, నైఋతి దిశన అరేబియా సముద్రం మరియు ఆగ్నేయాన బంగాళాఖాతం కలిగి వున్నది. దీని విస్తీర్ణం 4,480,000 చ.కి.మీ. (1,729,738 చ.మైళ్ళు) లేదా ఆసియాఖండంలో 10 శాతం భాగాన్ని కలిగివున్నది. అలాగే జనాభా ఆసియాఖండపు జనాభాలో 40 శాతం జనాభా కలిగి వున్నది.

భౌగోళికంగా ఈ ప్రాంతం ఒక ఉపఖండం: ఇది టెక్టానిక్ ఫలకంపైనున్నది. భారత ఫలకం (ఇండో-ఆస్ట్రేలియన్ ఫలకానికి ఉత్తర భాగం) యూరేషియా కు వేరు చేస్తున్నది, యూరేషియా ఫలకాన్ని ఢీకొనక మునుపు, ఇదీ ఒక చిన్న ఖండంలా వుండేది. ఇలా ఢీకొన్న కారణంగానే హిమాలయా పర్వత శ్రేణులు మరియు టిబెట్ పీఠభూమి ఏర్పడ్డాయి. ఈ ఫలకం నేడు ఉత్తరాన చలిస్తూ వుండడం కారణాన హిమాలయాల ఎత్తు పెరుగుతూ పోతున్నది. ఈ ఉపఖండపు పశ్చిమ సరిహద్దు యూరేషిన ఫలకానికి సరిహద్దు కలిగి వున్నది. అంతేగాక, ఈ ఉపఖండం, అనేకానేక భౌగోళికాంశాలైన గ్లేషియర్లు, వర్షారణ్యాలు, లోయలు, ఎడారులు మరియు గడ్డి మైదానాలకు నెలవు.

వాతావరణం

ఈ ఉపఖండంలోని వాతావరణాన్ని ప్రధానంగా ఋతుపవనాలు నిర్దేశిస్తాయి. వేసవికాలం తేమగా ఉండి చలికాలంలో పొడిగా ఉంటుంది. ఈ ప్రాంతాలలో ఋతుపవనాల ప్రభావం వలన కురిసే వర్షాల మూలంగా నార, తేయాకు, వరి మరియు వివిధ రకాల కాయగూరలు పండుతాయి.

భౌగోళిక చరిత్ర

ఇయోసీన్ కాలంలో భారత ఉపఖండం ఒక ద్వీపఖండం లాగ హిందూ మహాసముద్రంలో ఉండేది. అంతకు పూర్వం ఈ భాగం గోండ్వానా భూభాగం తో కలిసి ఉండేది. ఈ భాగం ఆసియా ప్రధాన భూభాగంతో కలిసినప్పుడు ఏర్పడ్డవే హిమాలయాలు.

రాజకీయాలు

ఈ ఉపఖండంలో భారతదేశం ప్రధానమైన రాజకీయంగా శక్తివంతమైన దేశం.[3] ఇది అన్ని దేశాల కంటే పెద్దదిగా నాలుగింట మూడు వంతుల భూభాగాన్ని కలిగివున్నది.[4] జనాభా పరంగా మిగిలిన దేశాలన్నీ కలిపిన జనసాంద్రత కన్నా మూడు రెట్లు అధికంగా కలిగివున్న దేశం.[5] భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం.[6]

ఈ ప్రాంతంలో విస్తీర్ణంలోను, జనాభాలోను రెండవ అతిపెద్ద దేశం పాకిస్థాన్. ఇది జనాభా ప్రకారం ప్రపంచంలో ఆరవ స్థానంలో ఉన్నది.[7]

ఇది కూడా చూడండి

మూలాలు