పాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: so:Caano
చి r2.5.4) (యంత్రము మార్పులు చేస్తున్నది: cs:Mléko (savci)
పంక్తి 114: పంక్తి 114:
[[ckb:شیر]]
[[ckb:شیر]]
[[cr:ᒎᒎᔑᓈᐴ]]
[[cr:ᒎᒎᔑᓈᐴ]]
[[cs:Mléko]]
[[cs:Mléko (savci)]]
[[csb:Mlékò]]
[[csb:Mlékò]]
[[cv:Сĕт]]
[[cv:Сĕт]]

07:25, 23 మార్చి 2012 నాటి కూర్పు

పాలతో నింపిన గాజు లోటా

పాలు లేదా క్షీరము (Milk) శ్రేష్ఠమయిన బలవర్ధక ఆహారము. ఇందులో అన్ని రకాలైన పోషక విలువలు ఉన్నాయి. కొద్దిగా విటమిన్ సి, ఇనుము తక్కువ. అన్ని వయసులవారూ తీసుకోదగ్గ ఉత్తమ ఆహార పదార్ధము. పాలను ఉత్పత్తి చేసే జంతువులు ఆవులు, గేదెలు, మేకలు మరియు గొర్రెలు. హిందువులు పవిత్రంగా పూజించే ఆవు యొక్క పాలు అన్ని రకాల పూజా కార్యక్రమాలలోనూ వాడతారు.

భాషా విశేషాలు

తెలుగు భాషలో పాలు అనే పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1] పాలు నామవాచకంగా పాలు మరియు పాలవంటి ద్రవాలకు ఉపయోగిస్తారు,

సంస్కృతంలో క్షీరము [ kṣīramu ] అనగా n. Milk, పాలు.[2] The milky sap of plants. జిల్లేడు మొదలైన వాటి పాలు. Water ఉదకము. క్షీరాన్నము rice and milk boiled together. పరమాన్నము. క్షీరోదక న్యాయము intimate union as milk and watesr mixed with each other. నీళ్లును పాలును కలిసినట్లు ఒక్కటిగా కలిసియుండు ధర్మము. వారు క్షీరోదక న్యాయముగా నున్నారు they are intimately associated or related. క్షీరాబ్ధి or క్షీర సాగరము kshīr-ābdhi. n. The sea of milk పాల సముద్రము. క్షీరాబ్ధి తనయ the goddess who sprung from this sea, i.e., Lakshmi. పాల సముద్రం నుండి జన్మించిన లక్ష్మి.

పోషక విలువలు


మనిషి పాలలో 71 కిలో కేలరీలు , ఆవు పాలలో 69 కిలోకేలరీలు, గేదె పాలలో 100 కిలో కేలరీలు మరియు మేక పాలలో 66 కిలో కేలరీలు శక్తి ఉంటుంది.

పాల ఉత్పత్తులు

  • మనం ప్రతిరోజూ తాగే టీ, కాఫీ లను పాలను ఉపయోగించి తయారుచేస్తారు.
  • పాలును తోడుపెట్టినచో పెరుగు తయారవుతుంది.
  • పెరుగును పలుచగా నీటితో బాగా కలిపితే మజ్జిగ, లస్సీ తయారవుతాయి.
  • మరిగించిన పాలు మీద, తోడుపెట్టిన పెరుగుమీద మీగడ తయారవుతుంది.
  • మజ్జిగను బాగా చిలికితే వెన్న తయారవుతుంది.
  • వెన్నను మరగబెట్టిన నెయ్యి వస్తుంది.
  • పాలుతో కోవా మొదలైన అనేక రకాల మిఠాయిలు తయారుచేస్తారు.
  • ఇంకా బిస్కెట్లు, చాక్లెట్లు, ఐస్ క్రీములు, రొట్టెలు మొదలైన వాటి తయారీలో పాలను విరివిగా ఉపయోగిస్తారు.

పాలు ఉత్పాదకత

అత్యధిక పాల ఉత్పాదకులు — 2005
(1000 టన్నులు)
 భారతదేశం 91,940
 United States 80,264.51
 China 32,179.48
 Russia 31,144.37
 పాకిస్తాన్ 29,672
 జర్మనీ 28,487.95
 France 26,133
 Brazil 23,455
 United Kingdom 14,577
 New Zealand 14,500
World Total 372,353.31
Source: UN Food & Agriculture Organisation [1]

పాడి పరిశ్రమలో ఆవుపాలు మరియు గేదెపాలు ఉత్పత్తి చేసినా ప్రపంచ వ్యాప్తంగా ఆవు పాలు మాత్రమే అధిక స్థాయిలో ఉత్పత్తిచేస్తున్నారు. ఇదే ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. అమెరికా, బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలలో 90 శాతం పాలు జెర్సీ ఆవులనుంచే తయారౌతుంది. పాల ఉత్పత్తిలో భారతదేశం, అమెరికా మొదటి, రెండు స్థానాలలో ఉన్నాయి.[3] భారతదేశంలో అమూల్ సహకార సంస్థ అత్యంత విస్తృతమైనది.

పాలవెల్లువ

గ్రామాల్లో గతంలో ఏ ఇంట చూసినా పాడిగేదెల పోషణ ఉండేది. గ్రామీణ ప్రాంతాల్లో అప్పట్లో కొనేవారు తక్కువగా ఉండేవారు. అప్పట్లో పాలు, పెరుగు అమ్ముకోవడం నామోషిగా భావించేవారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కూడా గేదెల పెంపకం తగ్గిపోవడంతో పాలకు కొరత ఏర్పడుతోంది. అమ్మకాలకు అనుగుణంగా పాల ఉత్పత్తికావడం లేదు.లీటరు పాల ధర రూ. 45లకు విక్రయిస్తేనే గిట్టుబాటవుతుందని ఉత్పత్తిదారులు వాపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గేదెలను పోషించే వారు తాము వినియోగించుకోగా మిగిలిన పాలను విక్రయిస్తున్నందువలన గిట్టుబాటు ధర గురించి ఆలోచించడం లేదు. అయితే వ్యాపార ధోరణితో ఈ వృత్తిని చేపట్టినవారు గిట్టుబాటు కాకపోవడంతో ఆ వృత్తిని వదిలేస్తున్నారు.గ్రామీణ ప్రాంతాల్లోని పాల కేంద్రాల వద్ద ప్రస్తుతం పాలు పోసేవారి కంటే పాలు కొనేవారే ఎక్కువ సంఖ్యలో క్యూ కడుతున్నారు.

పురాణాలలో

  • విష్ణువు పాల సముద్రములో శేషపానుపు మీద పవళిస్తాడు.
  • శ్రీకృష్ణుడు వినాయక వ్రతకల్పము లో పాలభాండములో చవితి నాడు చంద్రున్ని చూడడం వల్ల నీలాపనింద కలిగింది.

ఇవి కూడా చూడండి

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

మూలాలు

మూస:Link FA

"https://te.wikipedia.org/w/index.php?title=పాలు&oldid=706275" నుండి వెలికితీశారు