చంద్రశేఖర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.5.4) (యంత్రము మార్పులు చేస్తున్నది: sa:चन्द्रशेखरः
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ur:چندرا شیکھر
పంక్తి 66: పంక్తి 66:
[[sa:चन्द्रशेखरः]]
[[sa:चन्द्रशेखरः]]
[[sv:Chandra Shekhar]]
[[sv:Chandra Shekhar]]
[[ur:چندرا شیکھر]]
[[zh:錢德拉·謝卡爾]]
[[zh:錢德拉·謝卡爾]]

16:15, 2 ఏప్రిల్ 2012 నాటి కూర్పు

చంద్రశేఖర్

పదవిలో
నవంబర్ 10, 1990 – జూన్ 21, 1991
మునుపు వి.పి.సింగ్
తరువాత పి.వి.నరసింహారావు

జననం జూలై 1, 1927
ఇబ్రహీంపట్టీ, ఉత్తరప్రదేశ్,
Flag of British India బ్రిటీషు ఇండియా
మరణం జులై 8, 2007
కొత్త ఢిల్లీ,
India భారత దేశం
రాజకీయ పార్టీ జనతా పార్టీ

చంద్రశేఖర్ సింగ్ (హిందీ: चन्द्रशेखर सिंह) (జులై 1, 1927 - జులై 8, 2007) భారత దేశపు 11వ ప్రధానమంత్రి.


సోషలిస్టు పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా జీవితాంతం పనిచేసిన రాజకీయ యోధుడు చంద్రశేఖర్. పాదయాత్ర ద్వారా దేశ ప్రజలను ఆకర్షించి చివరి వరకు ప్రజాసమస్యల కోసమే పనిచేసిన వ్యక్తిగా చరిత్రలో నిల్చొపొయాడు. ప్రజా సోషలిస్టు పార్టీ నుండి కంగ్రెస్ లో చేరి జవహర్ లాల్ నెహ్రూ కు అండగా నిలబడి, ఆ తర్వాత ఇందిరా గాంధీకి పలు పర్యాయాలు క్లిష్ట సమయాల్లో మద్దతుగా నిల్చి ఇందిర వ్యక్తి ఆరాధన పెర్గుతున్న సమయంలో దానిని సూటిగా ఖండించడం చంద్రశేఖర్ కే చెల్లింది. పలుమార్లు ముక్కుసూటితనం ప్రదర్శించి యాంగ్రీ యంగ్ టర్క్ గా గుర్తింపు పొందాడు. కాంగ్రెస్ లోనే ఉంటూ జయప్రకాశ్ నారాయణ్ కు ఆథిత్యం ఇచ్చి ఇందిర ఆగ్రహానికి గురైనాడు. జయప్రకాశ్ నారాయణ తో సయోధ్య కుదుర్చుకోమని ఇందిరకే సలహా ఇచ్చి దేశ రాజకీయవేత్తలనే ఆశ్చర్యపర్చినాడు. ఆ తర్వాత అత్యవసర పరిస్థితి సమయంలో జైలు జీవితం గడిపి కేంద్రంలో తొలి నాన్-కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి ప్రముఖపాత్ర వహించాడు. 1989 ఎన్నికలలో సైతం జీలకపాత్ర వహించి మరో పర్యాయం నాన్-కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు కారకుడయ్యాడు. ప్రధాన మంత్రి పీఠాన్కి అతి సమీపంలోకి వచ్చినా దేవీలాల్ తదితర నేతల వల్ల ఆ అవకాశం కోల్పోయి, తర్వాత కాంగ్రెస్ మద్దతుతో ప్రధాన మంత్రి పదవిని అధిష్టించి అతి తక్కువ కాలంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తనకు బలం లేకపోయినా పూర్తి బలం ఉన్న తరహాలో ప్రభుత్వాన్ని కొనసాగించడం విశేషం.

తొలి జీవితం

1927వ సంవత్సరంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఇబ్రహీంపట్టి అనే గ్రామంలోని ఒక రైతు కుటుంబంలో ఆయన జన్మించారు. అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ చదివారు. విద్యార్థి స్థాయి రాజకీయాల్లో ఎంతో చురుకైనవాడుగా పేరుతెచ్చుకున్నాడు. చదువు ముగిసిన తరువాత సోషలిస్టుగా రాజకీయ రంగ ప్రవేశం చేశాడు.[1]

రాజకీయ జీవితం

1962 నుండి 1967 వరకు రాజ్యసభ మెంబరుగా ఉన్నాడు. దేశాన్ని తెలుసుకోగోరుతున్నానని తెలిపి 1984వ సంవత్సరములో దేశవ్యాప్తంగా పాదయాత్రను చేసాడు, ఇది అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి వణుకు తెప్పించింది. తన ముందు ప్రధాని వి.పి.సింగ్ రాజీనామా చేసిన తరువాత జనతాదళ్ నుండి విడిపోయి సమాజ్‌వాది జనాతాదళ్ పార్టీను స్థాపించాడు. జాతీయ కాంగ్రెస్ పార్టీ అతనికి వెలుపలి నుండి మద్దతు ప్రకటించింది. అతనికి కొద్దిపాటి మెజారిటీ మాత్రమే కలదు. రాజీవ్ గాంధీ మీద కుట్రపన్నుతున్నడన్న కారణం మీద త్వరలోనే ఆ కూటమి కుప్పకూలిపోయింది. శేఖర్ కూటమిలో కేవలం 60 ఎంపీలు మిగిలారు.

చంద్రశేఖర్ ప్రధాన మంత్రిగా ఉన్నా కాలం 7 నెలలు. కాంగ్రెసు మద్దతు కోల్పోయిన తరువాత మార్చి 6, 1991న రాజీనామా చేశాడు, ఆ తరువాతి సంవత్సరంలో ఎన్నికలు జరిగేంత వరకు ప్రధానిగా కొనసాగాడు.

పార్లమెంటులో ఉన్న సమయంలో చక్కటి నడవడిక కలిగి ప్రవర్తించినందున, 1995వ సంవత్సరపు ఉత్తమ పార్లమెంటేరియన్‌గా అవార్డును గెలుపొందాడు.

జూలై 8, 2007 నాడు 80ఏళ్ళ వయసులో న్యూఢిల్లీలో మరణించారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు.[2]

సంతకము

మూలాలు

  1. The Hindu, "Former Prime Minister Chandra Shekhar dies" July 8, 2007
  2. [www.andhranews.net/India/2007/July/8-Former-Prime-Minister-7286.asp AndhraNews.net, "Former Prime Minister Chandra Shekhar passes away" July 8, 2007]

బయటి లింకులు


ఇంతకు ముందు ఉన్నవారు:
వి.పి.సింగ్
భారత ప్రధానమంత్రి
నవంబర్ 10, 1990—జూన్ 21, 1991
తరువాత వచ్చినవారు:
పి.వి.నరసింహారావు