యయాతి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.6.5) (యంత్రము కలుపుతున్నది: es:Yayāti
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: ne:ययाति
పంక్తి 20: పంక్తి 20:
[[id:Yayati]]
[[id:Yayati]]
[[mr:ययाति]]
[[mr:ययाति]]
[[ne:ययाति]]
[[ru:Яяти]]
[[ru:Яяти]]
[[uk:Яяті]]
[[uk:Яяті]]

14:27, 3 ఏప్రిల్ 2012 నాటి కూర్పు

యయాతి చక్రవర్తి (సంస్కృతం: ययाति) నహుషుడి కుమారుడు. పాండవుల పూర్వీకులలో ఒకడు. అపజజమన్నదే ఎరుగని వాడు. సర్వ శాస్త్రాలననుసరించి అనేక పుణ్యకార్యక్రమాలు చేపడుతూ, పితృదేవతలకు పూజిస్తూ, ప్రజలను జనరంజకంగా పరిపాలిస్తున్నాడు. కానీ యయాతి తన మామగారైన శుక్రాచార్యుని శాపాన్ని అనుసరించి వయసు మీరక ముందే వృద్ధుడైపోతాడు. ఆ విధంగా వృద్ధుడైన యయాతి ఐహిక సుఖములపై మమకారం వీడక కోరికలతో భాదపడుతుంటాడు.

వివాహం

వృషపర్వుడనే వాడు దానవులకు రాజు. ఆయన కుమార్తె శర్మిష్ట. శుక్రాచార్యుని కూతురు దేవయాని. శుక్రాచార్యుడు రాక్షసులకు గురువు కనుక వీరిద్దరూ ప్రాణ మిత్రులయ్యారు. ఒక నాడు వారిరువురూ నదిలో స్నానం చేయడానికి వెళ్ళగా వాళ్ళను అనుసరించిన దేవేంద్రుడు వారి దుస్తులను మార్చి వేస్తాడు. ముందుగా స్నానం ముగించుకుని వచ్చిన శర్మిష్ట జరిగిన సంగతి తెలియక దేవయాని దుస్తులను ధరిస్తుంది. దాన్ని చూసిన దేవయాని కోపోద్రిక్తురాలవుతుంది. మా తండ్రి మీ తండ్రికి గురువు కనుక, నీవు నాకంటే తక్కువ స్థాయి గలదానివి. నా బట్టలు ఎలా ధరిస్తావు? అని ప్రశ్నించింది. అది విన్న శర్మిష్ట కూడా అంతే కోపంతో నా తండ్రి ఈ రాజ్యానికి ప్రభువు. నీ తండ్రే నా తండ్రి కింద పని చేస్తున్నాడు కాబట్టి నువ్వే నాకన్నా తక్కువ స్థాయిలో ఉన్నావంటుంది. అలా జరిగిన జగడంలో శర్మిష్ట దేవయానిని ఒక బావిలో పడదోసి వెళ్ళి పోతుంది.

భార్యా పిల్లలు

ఇతనికి ఇద్దరు భార్యలు, దేవయాని మరియు శర్మిష్ఠ. దేవయాని రాక్షస గురువైన శుక్రాచార్యుని కుతురు. శర్మిష్ఠ రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె. యయాతికి శర్మిష్ట యందు పూరుడును, దేవయాని యందు యదువు మరియు తుర్వసుడు జన్మించిరి.

బయటి లింకులు

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=యయాతి&oldid=709046" నుండి వెలికితీశారు