అభిషేక్ బచ్చన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: or:ଅଭିଷେକ ବଚ୍ଚନ
చి r2.6.5) (యంత్రము కలుపుతున్నది: ko:아비쉑 밧찬
పంక్తి 309: పంక్తి 309:
[[jv:Abhishek Bachchan]]
[[jv:Abhishek Bachchan]]
[[kk:Абишек Баччан]]
[[kk:Абишек Баччан]]
[[ko:아비쉑 밧찬]]
[[mr:अभिषेक बच्चन]]
[[mr:अभिषेक बच्चन]]
[[ms:Abhishek Bachchan]]
[[ms:Abhishek Bachchan]]

10:19, 25 మే 2012 నాటి కూర్పు

అభిషేక్ బచ్చన్
దస్త్రం:AbhishekBachchan.jpg
IIFA పురస్కారాల ప్రధానోత్సవంలో అభిషేక్
జననం (1976-02-05) 1976 ఫిబ్రవరి 5 (వయసు 48)
ముంబై
క్రియాశీలక సంవత్సరాలు 2000- ఇప్పటి వరకు
భార్య/భర్త ఐశ్వర్యా రాయ్ (2007 - present)

అభిషేక్ బచ్చన్ హిందీ: अभिषेक बच्चन ఫిబ్రవరి 5, 1976న మహారాష్ట్రలోని ముంబాయి నగరములో జన్మించిన ఒక భారతీయనటుడు మరియు భారతీయ నటులయిన అమితాబ్ బచ్చన్ మరియు జయా బచ్చన్ ల కుమారుడు. అతను పూర్వపు ప్రపంచ సుందరి అయిన ఐశ్వర్య రాయ్ ని వివాహం చేసుకున్నాడు.

బచ్చన్ J.P.దత్తా యొక్క రేఫ్యుజీ (2000)లో మొదటిసారిగా నటించాడు. 2004వ సంవత్సరములో ఆ నటుడు ధూమ్ మరియు యువ చిత్రాలలో తన నటనకు విమర్శనాత్మక ప్రశంశలతో పాటు విజయాన్ని కూడా సాధించాడు. యువలో అతని నటన మెప్పు పొంది, ఆ సంవత్సరపు మరియు తరువాత రెండు సంవత్సరాలలోనూ ఉత్తమ సహాయ నటుడిగా ఆ విభాగంలో తన తొలి ఫిలిం ఫేర్ పురస్కారము అందుకోవడమే కాక అనేక ఇతర పురస్కారాలు పొందాడు. అప్పటి నుండి, బచ్చన్ వ్యాపారపరంగానూ నటనాపరంగానూ కూడా విజయవంతమైన చిత్రాలలో నటించి, తనను అగ్రనటులలో ఒకనిగా చిత్ర పరిశ్రమలో నమోదు చేసుకున్నాడు.

ప్రారంభ జీవితం

అభిషేక్ బచ్చన్ ప్రముఖ బాలీవుడ్ నటుడయిన అమితాబ్ బచ్చన్ మరియు నటీమణి జయా బచ్చన్ ల యొక్క పుత్రుడు; అతని అక్క శ్వేత బచ్చన్-నందా.(పుట్టిన సంవత్సరము 1974). అతని తాతగారైన హరివంశ్ రాయ్ బచ్చన్, హిందీ సాహిత్యములో ఒక పేరు పొందిన కవి. అతని పూర్వీకుల ఇంటి పేరు శ్రీవాస్తవ్ అయినా, అతను తన కలము పేరు అయిన బచ్చన్ ను మాత్రమే వుంచుకున్నాడు. అయినా తన తండ్రి అయిన అమితాబ్ సినిమాలలోకి వచ్చినాక ఆయన తండ్రి యొక్క కలం పేరును తన పేరుకు జతచేసుకున్నాడు. బచ్చన్ పంజాబీ మరియు సిక్కు వంశాలకు చెందిన తన నాయనమ్మ తేజీ వారసత్వమును మరియు తల్లి తరపు నుండి బెంగాలీ మరియు కులిన్ బ్రాహ్మణ వారసత్వమును కలిగి వున్నాడు.

బచ్చన్ బాల్యంలో ఒక డిస్లెక్షిక్ గా ఉండేవాడు.[1] అతను ముంబై లోని జమ్నబాయ్ నార్సీ స్కూల్ మరియు బోంబే స్కాటిష్ స్కూల్, వసంత్ విహార్, న్యూ ఢిల్లీ లోని మోడరన్ స్కూల్ మరియు స్విట్జార్లాండ్ లోని ఐగ్లోన్ కాలేజీ లోనూ చదివాడు. తరువాత అతను బోస్టన్ యునివర్సిటీలో చదువు పూర్తి చేయడానికి U.S.కు వెళ్లాడు, కానీ తండ్రి యొక్క సంస్థ అయిన ABCL కష్టాల్లో ఉన్నప్పుడు, తన నటనా వృత్తిని ప్రారంబించడానికి చదువు మధ్యలోనే మానివేశాడు.

వృత్తి

సుమారుగా విజయం సాధించిన J.P.దత్తా యొక్క రెఫ్యుజీ (2000) అనే చిత్రంతో బచ్చన్ తన వృత్తిని ప్రారంభించాడు, కరీనా కపూర్ కూడా ఈ చిత్రంలో నటించింది, ఈ చిత్రం ద్వారా కపూర్ కు ఎక్కువ ప్రచారం లభించింది.[2] నాలుగు సంవత్సరాల కాలములో, బచ్చన్ అనేక చిత్రాలలో నటించాడు, కాని అంతగా విజయం లభించలేదు. అతను 2007లో వివాహం చేసుకున్న ఐశ్వర్యా రాయ్ తో కలిసి నటించిన కుచ్ నా కహో (2003) వీటిలో ఒకటి.

2004లో మణి రత్నం యొక్క యువ లో అతని నటనా ప్రదర్శన, అతని నట సామర్ధ్యాన్ని ఋజువు చేసింది.[3] అదే ఏడాది, అతను తన మొదటి విజయవంతమైన చిత్రమైన ధూమ్ లో నటించాడు.[4] 2005లో బచ్చన్ నాలుగు వరుస విజయాలతో గొప్ప కీర్తి సంపాదించాడు: అవి బంటి ఔర్ బబ్లి , సర్కార్ , దస్ , మరియు బ్లఫ్ మాస్టర్ .[5] అతను సర్కార్ లో నటనకి గాను ఉత్తమ సహాయ నటుడుగా తన రెండవ ఫిలింఫేర్ పురస్కారాన్ని అందుకున్నాడు. బచ్చన్ మొదటిసారిగా ఉత్తమ నటుడు పురస్కారానికి ప్రతిపాదించబడ్డాడు.

2006లో విడుదలైన అతని చిత్రాల్లో మొదటిదైన, కభి అల్విదా నా కెహనా అనే చిత్రం, ఆ సంవత్సరములో అత్యధిక వసూళ్లు నమోదు చేసిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.[6] మణి రత్నం యొక్క రంగస్థల ప్రదర్శన అయిన నేట్రు, ఇంద్రు, నాలై లో అతను అనేక ఇతర తారలతో పాటు పాల్గొన్నారు. బచ్చన్ యొక్క రెండవ విడుదల అయిన ఉమ్రావ్ జాన్ వసూళ్ల పరంగా విజయం సాధించలేదు, అయితే ధూమ్ 2 అనే అతని మూడవ చిత్రం, మొదటి ధూమ్ లాగానే గొప్ప విజయం సాధించినప్పటికీ, ప్రత్యర్ధి పాత్రలో నటించిన హృతిక్ రోషన్ ఎక్కువ ప్రసంశలు అందుకున్నాడని విశ్లేషకులు గ్రహించారు.[7]

2007లో, బచ్చన్ గురు లో నటించి, తన ప్రదర్శనకు గొప్ప ప్రశంసలు అందుకున్నాడు, ఆ చిత్రమే అతని మొదటి ఒంటరి విజయంగా నిలిచింది.[8] మే 2007లో విజయవంతమైన షూట్ అవుట్ ఎట్ లోఖండ్వాల అనే చిత్రంలో స్వల్ప సమయం కనిపించే ఒక పాత్రలో నటించారు.[9] అతని తరువాయి విడుదల, జూమ్ బరాబర్ జూమ్ , జూన్ 2007లో విడుదలయింది కాని భారత దేశం[10] లో విజయం సాదించలేదు, అయితే విదేశాల్లో ముఖ్యంగా U.K.లో కొంత సఫలీకృతమైనది.[11] ఈ చిత్రానికి మిశ్రమ సమీక్షలు వచ్చినప్పటికీ, బచ్చన్ అతని నటనా ప్రదర్శనకు గాను గొప్ప ప్రశంసని అందుకున్నాడు.[12]

2008 వేసవిలో బచ్చన్, అతని భార్య, అతని తండ్రి మరియు ప్రీతి జింటా, రితేష్ దేశ్ ముఖ్, మరియు మాధురి దీక్షిత్ వంటి ఇతరలతో కలిసి అన్ ఫర్గెటబుల్ వరల్డ్ టూర్ రంగస్థల ప్రదర్శనలో పాల్గొన్నాడు. మొదటి దశలో, U.S., కెనడా, ట్రినిడాడ్, మరియు లండన్, ఇంగ్లాండ్ లలో పర్యటించారు.

బచ్చన్, మొదట్లో ABCL అని, తరువాత AB కార్ప్. లి. అని పేరు మార్చబడిన తన తండ్రి సంస్థ యొక్క ఆర్ధిక మరియు పాలనాపరమైన నిర్వాహణలో కూడా పాత్ర వహించారు. ఆ సంస్థ, విజ్క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ ఎంటర్టైన్మెంట్ ప్రై.లి., తో కలిసి అన్ ఫర్గెటబుల్ ప్రొడక్షన్ రూపొందించారు.[13]

బచ్చన్ యొక్క 2008 చిత్రాలలో సర్కార్ రాజ్ మరియు దోస్తానా ఉన్నాయి.[14][15] నిర్మాతగా మారిన బాలివుడ్ నటుల యొక్క పొడవైన జాబితాలో, అభిషేక్ కూడా ప్రస్తుతం చేరాడు. నిర్మాతగా అభిషేక్ యొక్క మొదటి ప్రయత్నం, అతని కుటుంబ సంస్థ అయిన AB కార్ప్. లి. కొరకు నిర్మించిన పా అనే హింది చిత్రం. అభిషేక్ పా చిత్రంలో ఒక ముఖ్య పాత్ర వహించడంతో పాటు, చిత్రం యొక్క బడ్జెట్, ప్రచారం, విక్రయం మరియు పూర్తి నిర్మాణం వంటి బాధ్యతలు చేపట్టాడు.[16][17][18]

కలర్స్ కొరకు నేషనల్ బింగో నైట్ అనే ఒక అతి నూతన గేమ్ షో కి అభిషేక్ ఆతిధ్యం ఇవ్వబోతున్నాడు. ఈ కార్యక్రమం, 23 జనవరి, 2010న ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం చాల వినోదంగానూ, స్టూడియోలోనూ మరియు ఇంట్లోనూ ఉన్న ప్రేక్షకులు కూడా ప్రత్యక్షంగా పాల్గొని ఆడే విధంగానూ ఉంటుంది.[19][20]

వ్యక్తిగత జీవితం

దస్త్రం:Abhishek & Aishwarya.jpg
IIFA అవార్డ్స్ (2007)లో తన భార్య ఐశ్వర్య రాయ్ బచ్చన్ తో అభిషేక్ బచ్చన్.

అక్టోబర్ 2002లో ఆమితాబ్ బచ్చన్ యొక్క 60వ జన్మదిన వేడుకలో, అభిషేక్ బచ్చన్ మరియు కరిష్మా కపూర్ తమ నిశ్చితార్ధాన్ని ప్రకటించారు.[21] ఆ నిశ్చితార్ధం జనవరి 2003న రద్దు చేయబడింది.

2006లో, ఈస్టర్న్ ఐ అనే UK పత్రిక, అభిషేక్ ని ఆసియా లోనే గొప్ప శృంగార పురుషుడుగా పేర్కొంది.[22]. చాల కాలముగా భారత దేశములో అతి ఉత్తమ, అర్హుడైన బ్రహ్మచారిగా[23] భావించబడిన ఈ బాలివుడ్ తార, జూలియా రాబర్ట్స్ మరియు ఓప్రా విన్ఫ్రే చే ఈ భూమి మీద ఉన్న అత్యుత్తమ అందాల భామ అని ప్రశంసించబడిన బాలివుడ్ తారైన ఐశ్వర్యా రాయ్ ని వివాహం చేసుకున్నారు.[24] వారి ఇరువురి మధ్య ఉన్న సంబంధాల గురించి అనేక ఊహల అనంతరం, బచ్చన్ మరియు ఐశ్వర్యా రాయ్, తమ నిశ్చితార్దాన్ని జనవరి 2007న ప్రకటించారు.[25] వారు ఇరువరూ 20 ఏప్రిల్ 2007న, రాయ్ యొక్క జాతి అయిన దక్షిణ భారత బంట్ జాతికి చెందిన సాంప్రదాయ హైందవ పద్ధతి ప్రకారం వివాహం చేసుకున్నారు. ఉత్తర భారత మరియు బెంగాలీ సంప్రదాయ వేడుకలు కూడా జరిగినవి. జుహు, ముంబైలో ఉన్న బచ్చన్ నివాసమైన ప్రతీక్షలో ఒక వ్యక్తిగత కార్యక్రముగా వివాహం జరిగింది, అయితే వినోద మీడియా ఈ వివాహానికి భారీగా హాజరైంది. భారత దేశములో ఈ జంటని ఒక సూపర్ జంటగా భావిస్తున్నారు. వీరిని అనేక సార్లు "అభిఐష్" (అభి షేక్ మరియు ఐష్ వర్యా) అనే ఒక పోర్ట్మంట్యు ద్వార సంబోధిస్తున్నారు.[ఆధారం చూపాలి]

బచ్చన్ యొక్క నాయనమ్మ తేజీ బచ్చన్, 21 డిసెంబర్ 2007న మరణించారు.[26] 28 సెప్టెంబర్ 2009, సోమవారం నాడు అభిషేక్, భార్య ఐశ్వర్యా రాయ్ తో కలిసి ది ఓప్రా విన్ఫ్రే షో లో పాల్గొన్నారు.[27]

పురస్కారాలు మరియు ప్రతిపాదనలు

ఫిల్మోగ్రఫీ

align=center కుచ్ న కహొ రాజ్ LOC కార్గిల్యువధూమ్ఫిర్ మిలేంగేసర్కార్దస్బ్లఫ్‌మాస్టర్కభి అల్విద నా కెహనాఉమ్రావ్ జాన్ధూమ్ 2షూట్ అవుట్ ఎట్ లోఖండ్వాలఝూం బరాబర్ ఝూంరామ్ గోపాల్ వర్మ కి ఆగ్ ఓం శాంతి ఓం తనలాగే ప్రత్యేక పాత్ర ద్రోణదోస్తానడిల్లి-6
సంవత్సరం చిత్రం పాత్ర గమనికలు
2000

రెఫ్యూజీ రెఫ్యూజీ ప్రతిపాదన - ఫిలిం ఫేర్ ఉత్తమ ప్రవేశ నటుడి పురస్కారం

ఢయీ అక్షర్ ప్రేమ కే కరణ్ ఖన్నా
తేరా జాదూ చల్ గయా కబీర్ శ్రీవాస్తవ్
2001 బస్ ఇత్నా సా ఖ్వాబ్ హయ్ సూరజ్ చంద్ శ్రీవాస్తవ్
2002

హా మై భీ ప్యార్ కియా

శివ్ కపూర్
షరారత్

రాహుల్ ఖన్నా

ఓం జై జగదీష్ జగదీష్ బాత్ర
దేశ్

అంజాన్

2003

మై ప్రేం కి దివానీ హూ ప్రేం కుమార్ ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారానికి ప్రతిపాదించబడ్డాడు

ముంబై సే ఆయా మేరా దోస్త్ కంజి
జమీన్ ACP జైదీప్ "జై" రాయ్
Lt. విక్రం బాత్ర
2004 రన్ సిద్ధార్థ్
లల్లన్ సింగ్

విజేత , ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడి పురస్కారం

హమ్ తుం సమీర్

అతిధి పాత్ర

ACP జై దీక్షిత్
తరుణ్ ఆనంద్
Rakht: What If You Can See the Future మానవ అతిధి పాత్ర (ఐటం నెంబర్)
నాచ్ అభినవ్
2005

బంటి ఔర్ బబ్లి

రాకేశ్ త్రివేది/బంటి

ఫిలింఫేర్ ఉత్తమ నటుడి పురస్కారానికి ప్రతిపాదించబడ్డాడు.

శంకర్ నగరే

విజేత , ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడి పురస్కారం

శశాంక్ ధీర్
అంతర్ మహల్ బ్రిజ్ భూషణ్
సలాం నమస్తే డా. విజయ్ కుమార్/కధకుడు

ప్రత్యేక పాత్ర

Home Delivery: Aapko... Ghar Tak పిజ్జేరియాలో కొనుగోలుదారుడు

ప్రత్యేక పాత్ర

ఏక్ అజ్నబీ బాడీగార్డ్

ప్రత్యేక పాత్ర

నీల్ న్' నిక్కి మాన్ ఇన్ బార్

ప్రత్యేక పాత్ర

రాయ్ కపూర్
2006

అలగ్

సబ్సే అలగ్ పాటలో ప్రత్యేక పాత్ర

రిషీ తల్వార్

విజేత , ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడి పురస్కారం

లగే రహో మున్నా భాయి సన్నీ ఖురానా

ప్రత్యేక పాత్ర

నవాబ్ సుల్తాన్ ఖాన్
ACP జై దీక్షిత్
2007

గురు

గురుకాంత్ కే. దేశాయ్

ఫిలింఫేర్ ఉత్తమ నటుడి పురస్కారానికి ప్రతిపాదించబడ్డాడు.

అభిషేక్ మహాత్రే

ప్రత్యేక పాత్ర

రిక్కి తుక్రాల్
జిప్సీ గాయకుడు

ప్రత్యేక పాత్ర

లాగ చునారి మే డాగ్ రోహన్ వర్మ కొనసాగించబడిన కామియో
2008

సర్కార్ రాజ్

శంకర్ నగరే

ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారానకి ప్రతిపాదించబడ్డాడు

మిషన్ ఇస్తాన్బుల్

ప్రత్యేక పాత్ర

ఆదిత్య/ద్రోణ
సమీర్

ఫిలింఫేర్ ఉత్తమ నటుడి పురస్కారానికి ప్రతిపాదించబడ్డాడు.

2009

లక్ బై ఛాన్స్ తనలాగే ప్రత్యేక పాత్ర

రోషన్
పా అమోల్ ఆర్టే
2010

రావణ్

నిర్మాణం-అనంతరం

ఖేలేయిన్ హమ్ జీ జాన్ సే సూర్య సేన్

చలన చిత్రం తీయబడుతూ ఉన్నది

క్రూకేడ్

చలన చిత్రం తీయబడుతూ ఉన్నది

ఇవి కూడా చూడండి

ఉపప్రమాణాలు

  1. "Abhishek Bachchan in Taare Zameen Par". Indiafm.com. 2007-12-18. Retrieved 2008-01-06.
  2. "Box Office 2000". Refugee does moderately well at the box office. Retrieved 20 February 2009.
  3. "bbc.co.uk". Bachchan shines in Yuva. Retrieved 4 September 2006.
  4. [1][dead link]
  5. http://www.ibosnetwork.com/asp/topgrossersbyyear.asp?year=2005
  6. "boxofficeindia.com". KANK BO. Retrieved 23 March 2007.
  7. "hindu.com". Dhoom 2 clicks with the audience and the box office. Retrieved 5 December 2006.
  8. "indiafm.com". Guru overtakes S-E-I. Retrieved 14 January 2007.
  9. "boxofficeindia.com". SAL continues to do well. Retrieved 5 December 2006.
  10. "Box Office Top 5 :Top 5: 'J.B.J.' crashes, 'C.K.K.M.K.' poor". Indiafm.com. Retrieved 2008-11-13.
  11. "Bollywood Top Stories | Jhoom Barabar Jhoom | Mixed Overseas Outcome". Entertainment.oneindia.in. Retrieved 2008-11-13.
  12. Rachel Saltz (Published: 16 June 2007). "Jhoom Barabar Jhoom - Movies - Review". The New York Times. Retrieved 2008-11-13. {{cite news}}: Check date values in: |date= (help); Italic or bold markup not allowed in: |publisher= (help)
  13. "Amitabh-Abhishek planning world tour together : India Entertainment". Earthtimes.org. Retrieved 2008-11-13.
  14. IBOS.
  15. IBOS.
  16. బాలీవుడ్ హంగామా, 24 నవంబర్ 2009
  17. ఇండియా టుడే, 1 డిసెంబర్ 2009.
  18. బాలీవుడ్ హంగామా, 10 డిసెంబర్ 2009.
  19. ఇండియన్ టెలివిషన్, 29 డిసెంబర్ 2009.
  20. హిందుస్తాన్ టైమ్స్, 29 డిసెంబర్ 2009
  21. "specials.rediff.com". Abhishek Bachchan announces engagement to Karisma Kapoor. Retrieved 28 June 2007.
  22. http://www.apunkachoice.com/scoop/bollywood/20060925-4.html
  23. http://www.radiosargam.com/features/specialreports/bachchans_koffee.htm
  24. http://www.quotelucy.com/quotes/aishwarya-rai-quotes.html
  25. "behindwoods.com". Abhishek Bachchan and Aishwarya Rai Engaged.
  26. "Zee News: Latest News India, Breaking India News, Current News on Cricket, Sports, Business, Bollywood, Entertainment, Celebrity, World & Science". Zeenews.com. Retrieved 2008-11-13.
  27. రీడిఫ్, 30 సెప్టెంబర్ 2009.

వెలుపటి వలయము

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.