నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:


{{Infobox_Indian_politician
{{Infobox_Indian_politician
| image=cm.jpg
| image=kirankumar.jpg
| name = నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
| name = నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
| birth_date ={{Birth date and age|1960|09|13|df=y}}
| birth_date ={{Birth date and age|1960|09|13|df=y}}

18:10, 2 జూన్ 2012 నాటి కూర్పు


నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి


ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
పదవీ కాలం
2010-
ముందు కొణిజేటి రోశయ్య
నియోజకవర్గం పీలేరు

వ్యక్తిగత వివరాలు

జననం (1960-09-13) 1960 సెప్టెంబరు 13 (వయసు 63)
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
నివాసం హైద్రాబాద్
మతం హిందూ


నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 1960, సెప్టెంబర్ 13న నల్లారి సరోజమ్మ, అమరనాథరెడ్డిలకు హైదరాబాదులోజన్మించాడు. నిజాం కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయాలలో బీకాం, ఎల్ఎల్‌బీ చదివాడు. నిజాం కళాశాల విద్యార్థి సంఘ నాయకునిగా పని చేశాడు. రాష్ట్రం తరఫున రంజీ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ లకు ప్రాతినిథ్యం వహించాడు. ఈయన కెప్టెన్ గా వున్నప్పుడు జట్టులోని ప్రముఖులలో అజారుద్దీన్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, హర్షా భోగ్లే - ప్రఖ్యాత క్రికెట్ వ్యాఖ్యాత వున్నారు. 2010-నవంబర్ 25 న 16 వ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాడు.

వ్యక్తిగత జీవితం

రమణారెడ్డి కుమార్తె రాధికారెడ్డిని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు కుమార్తె నీహారిక, కుమారుడు నిఖిలేష్ ఉన్నారు.

నందమూరి బాలకృష్ణ, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ క్లాస్‌మేట్.

కిరణ్ కుమార్‌ రెడ్డికి క్రికెట్ అంట్రే మహాప్రాణం. హైదరాబాద్‌ రంజీ జట్టు కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా రాణించాడు. పైపెచ్చు ఎలాంటి వివాదాలకు తావులేని రాజకీయ జీవితం, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని వ్యక్తిగత చరిత్ర, ఏదైనా ముక్కుసూటిగా చెప్పే మనస్తత్వం, కీలక సందర్భాల్లో కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సైతం వెనుకంజ వేయని మనస్తత్వమే ఆయనను ఈ స్థాయికి చేర్చిందని చెప్పొచ్చు.

రాజకీయ ప్రస్థానం

తండ్రి అమరనాథరెడ్డి 1987లో మృతి చెందిన తరువాత,1988లో వాయల్పాడు ఉప ఎన్నికల్లో తల్లి నల్లారి సరోజమ్మ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయింది. 1989 సాధారణ ఎన్నికల్లో కిరణ్ పోటీ చేసి గెలిచాడు. 1994లో భారీ తేడాతో ఓటమి చవిచూచినా, 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ నమోదు చేశాడు. 2004లో ప్రభుత్వ చీఫ్ విప్‌గా, 2009లో అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యాడు. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర నాయకత్వ పగ్గాలు చేపట్టిన తర్వాతే రాష్ట్ర మీడియా దృష్టిని ఆకర్షించారు. గత ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఎన్నికై.. వైఎస్ఆర్‌కు నోట్లో నాలుకలా మెలిగారు. ప్రధానంగా.. అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్య కుడి భుజమైతే.. కిరణ్ కుమార్ రెడ్డి ఎడంభుజంగా ఉన్నారు.

రాజకీయంగా నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డిలతో సన్నిహితంగా వుండేవాడు. వై.యస్.రాజశేఖరరెడ్డితో మొదట్లో విరోధమున్నా, తర్వాత ఆయనకు సన్నిహితమయ్యాడు.


ముఖ్యమంత్రిగా

కిరణ్ కుమార్ రెడ్డి పాలనలో ప్రవేశపెట్టిన పధకాలు.... దరల నియంత్రణకు పర్యవేక్షణ కమిటీ...ఇది మంత్రివర్గ ఉపసంఘం ఆధ్వర్యంలో పని చేస్తుంది... మీ సేవ...ఐటీ పరిజ్ఞానం ద్వారా సామాన్యుడికి పారదర్శకంగా, సులభంగా, వేగంగా సేవలందించే పథకం...12 సేవలతో ప్రారంభమైన ఈ పథకం వచ్చే ఏడాది మార్చి 31 నాటికి 50 సేవలను అందిస్తుంది. రచ్చబండ 1, 2...ఎలాంటి అండ లేని నిరుపేదలకు ప్రభుత్వ పరంగా సహాయం అందేలా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనివల్ల దాదాపు కోటి మంది పేదలకు ప్రయోజనం కలుగుతుంది. విద్యా పక్షోత్సవాలు...రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ధ్యేయంతో రూ.3,500 కోట్ల వ్యయంతో గత జూన్‌ మాసంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజీవ్‌ యువ కిరణాలు (మూడేళ్లలో 15 లక్షల ఉద్యోగాలు)...2014 నాటికి 15 లక్షల మంది యువతకు నైపుణ్యం కల్పించటం, పబ్లిక్‌, ప్రైవేట్‌ రంగాలతో అనుసంధానం చేసి ఉపాధి కల్పించటం, పరిశ్రమలకు అవసరమయ్యే విధంగా పాఠ్యాంశాలను తీర్చిదిద్దటం వంటి లక్ష్యాలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందిర జలప్రభ...రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు చెందిన 10 లక్షల ఎకరాల భూమిని సాగులోకి తీసుకురావటానికి రూ.1,800 కోట్లతో అక్టోబర్‌ రెండు నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఐదు లక్షల కుటుంబాలను పేదరికానికి దూరం చేయాలన్నది సంకల్పం. రూపాయికే కిలో బియ్యం...రాష్ట్రంలో నిరుపేదలందరికీ కడుపు నిండా భోజనం పెట్టాలన్న సంకల్పంతో ప్రారంభించిన ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 7.50 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందని అంచనా. స్టేట్‌ మిల్క్‌ మిషన్‌...రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. సాగురైతుల రక్షణకు చట్టం...కౌలు రైతులకు మేలు చేకూరే విధంగా భూమి లైసెన్సు పొందిన సాగుదారుల ఆర్డినెన్స్‌ను చట్ట రూపంలోకి తెచ్చారు. పంట రుణాలకు జీరో వడ్డీ...లక్ష రూపాయల దాకా రుణం తీసుకున్న రైతులు సకాలంలో దాన్ని చెల్లిస్తే జీరో వడ్డీ పథకం వర్తింపజేస్తారు. దీనివల్ల 95 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. 1.16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌...వచ్చేనెల చివరికల్లా 1,16,000 ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను పూర్తిగా నోటిఫై చేస్తారు. ఏపీపీఎస్సీ, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు, ఉపాధ్యాయుల డీఎస్సీ నియామక సంస్థ వంటివి ఉద్యోగాలను భర్తీ చేస్తాయి... స్ర్తీనిధి మహిళా బ్యాంక్‌...మహిళలు చిన్న చిన్న అవసరాల కోసం మైక్రో ఫైనాన్స్‌ సంస్థలను ఆశ్రయించకుండా తక్కువ వడ్డీతో 24 వాయిదాలలో తీర్చుకునే వెసులుబాటు కల్పించారు..

కాలరేఖ

అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవిని స్వీకరించిన నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఏడాది పాలనలో తనదైన ముద్ర వేయటంలో సఫలమయ్యారు. అధికారం పగ్గాలు చేపట్టిన ప్రారంభంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పటికీ బయటపడకుండా తనదైన శైలిలో పాలన సాగించిన కిరణ్‌ ఇప్పుడిప్పుడే పూర్తిగా కుదురుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నారు. అధిష్టానం వద్ద క్రమంగా తన పలుకుబడి పెంచుకుంటూ జటిలమైన సమస్యలను సైతం పరిష్కరించే స్థాయికి కిరణ్‌ ఎదిగారు. ఈ ఏడాది పాలనలో ఎక్కడా ఆయనపై అవినీతి ఆరోపణలు రాకపోవటం మరో విశేషం.రాజకీయ ప్రత్యర్థులే కాకుండా విపక్షాలు సైతం ఈ విషయంలో ఆయనవైపు వేలెత్తి చూపలేకపోయారు. తెలంగాణ వాదం అతి బలంగా ఉన్న సమయంలోనూ 42 రోజులు సాగిన సకల జనుల సమ్మె సందర్భంగా సైతం కిరణ్‌ ఎక్కడా ఏ విషయంలోనూ రాజీ పడలేదు. తొలి ఘన విజయం14ఎఫ్‌ రద్దు... ఇక ఎన్నటికీ జరగదనుకున్న 14ఎఫ్‌ నిబంధనను కిరణ్‌ కేంద్రాన్ని ఒప్పించి రద్దు చేయించగలగటంతో ఆయన తొలి విజయం ప్రారంభమైంది. పోలీసు నియామకాలకు సంబంధించిన ఈ వివాదాస్పద నిబంధన తెలంగాణ ప్రాంతంలో చిచ్చు రేపింది. ఎసై్స అభ్యర్థులలో ఎంతో ఆందోళన కలిగించిన ఈ నిబంధన రద్దు కావాలని తెలంగాణ ప్రాంతంలో రాజకీయ పార్టీలన్నీ ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నప్పటికీ ఫలితం లేకపోగా కిరణ్‌ దాన్ని రద్దు చేయించగలిగారు.

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అవిశ్వాసాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొని విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం గురుంచి సోమవారం అసెంబ్లీ సుదీర్ఘంగా చర్చ జరిపింది. ఉదయం తొమ్మిది గంటలకు మొదలయిన సభ అర్ధరాత్రి ఒంటి గంట వరకు చర్చ జరుగుతూనే ఉంది. రాత్రి ఒంటిగంటకు మొదలయిన ఓటింగ్ ప్రక్రియలో ఊహించని పరిణామాలేవీ జరగలేదు. అవిశ్వాసానికి అనుకూలంగా 122 మంది ఎమ్మెల్యేలు తమ మద్దతు తెలిపారు. వీరిలో తెలుగుదేశం(85), తెరాస(11), సి.పి.ఐ(4), సి.పి.ఎం(1), బి.జే.పి(2), వై.ఎస్.ఆర్. కాంగ్రెస్(1 + 18 ) అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ప్రభుత్వానికి అనుకూలంగా 160ఓట్లు వచ్చాయి. జగన్ అనుకూలురుగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన 16మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఒక పి.ఆర్.పి ఎమ్మెల్యే, ఒక తెలుగుదేశం ఎమ్మెల్యేను కలుపుకొని వై.ఎస్. జగన్ బలం 19అని అసెంబ్లీ సాక్షిగా తేలిపోయింది. జగన్ వైపు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను పదికి పరిమితం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం, కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. అసెంబ్లీ లాబీలోనే బెదిరింపులు, హెచ్చరికలతో కూడిన బుజ్జగింపులు చేసినప్పటికీ జగన్ కు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలు పట్టు విడవలేదు. ఒకానొక సమయంలో మంత్రి వట్టి వసంత కుమార్ తమ ఎమ్మెల్యేలను ఎందుకు రూములోకి తీసుకెళ్తున్నారంటూ ఎమ్మెల్యే బాలినేని ఆయనతో వాదులాటకు దిగారు. కేవీపీ, ఎంపీ ఉండవల్లి కూడా అసెంబ్లీ పరిసరాల్లోనే జగన్ వర్గం ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఎన్ని ప్రలోభాలు చూపినా, అనర్హత వేటుకు, ఉప ఎన్నికలకు సిద్దమవుతూ జగన్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. తెదాపా ప్రవేశ పెట్టిన ఈ అవిశ్వాస తీర్మానంతో చివరకి తిప్పలు వచ్చి పడ్డది జగన్ కే. తన దయాదాక్షిణ్యాలతో ప్రభుత్వం నడుస్తుందన్న మాటలు ఉత్తవేనని తేటతెల్లమైంది. జగన్ కున్న బలమెంతో తేలిపోయింది కాబట్టి రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి తొలగింది అనే అనుకోవాలి. లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ మాత్రం ఎటూ ఓటు వేయకుండా తటస్థంగా ఉండిపోయారు. జగన్ వర్గం ఎమ్మెల్యేగా ప్రచారంలో ఉన్న పూతలపట్టు రవి ఆఖరి నిమషంలో అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయి గైర్హాజరయ్యారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అయిన కూన శ్రీశైలం గౌడ్ (కుత్బుల్లాపూర్ ) ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయగా, మరో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే సోమారపు సత్యన్నారాయణ ( టి.ఆర్.ఎస్ తో కలిసి ఉంటున్నారు ) అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేశారు.

అవిశ్వాస తీర్మానం

జగన్ ఎమ్మెల్యేలు : ( y.s.r కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విజయమ్మ ) 1.మేకపాటి చంద్రశేఖర రెడ్డి – ఉదయగిరి. 2.చెన్నకేశవ రెడ్డి – ఎమ్మిగనూరు. 3.కొండా సురేఖ – పరకాల. ( తెలంగాణ ప్రాంతం నుంచి జగన్ కు మిగిలిన ఏకైక అనుకూల ఎమ్మెల్యే ) 4.గొల్ల బాబురావు – పాయకరావు పేట. 5.పిల్లి సుభాష్ చంద్ర బోస్ -రామచంద్ర పురం. 6.శ్రీనివాసులు – రైల్వే కోడూరు. 7.సుచరిత – ప్రత్తిపాడు. 8.శ్రీకాంత రెడ్డి - రాయచోటి. 9. కాపు రామ చంద్రా రెడ్డి – రాయదుర్గం. 10.శోభానాగి రెడ్డి - ఆళ్ళగడ్డ. (పి.ఆర్.పి ఎమ్మెల్యే ) 11.బాలరాజు – పోలవరం. 12.ప్రసాద్ రాజు – నరసాపురం. 13.గుర్నాథ్ రెడ్డి – అనంతపురం. 14.బాలనాగిరెడ్డి - మంత్రాలయం(టి.డి.పి). ( అవిశ్వాసం ఎపిసోడ్ లో లక్కీ ఎమ్మెల్యే ఇతనే. అటు చంద్రబాబు విప్ కు అనుకూలంగానూ, ఇటు జగన్ కు అనుకూలంగా ఓటు వేసినట్టు అయ్యింది. ఇతని పై అనర్హత ఓటు పడే అవకాశం లేదు ) 15. బూచే పల్లి శివప్రాసాద్ రెడ్డి - దర్శి. 16.ఆదినారాయణ రెడ్డి – జమ్మల మడుగు. 17.బాలినేని శ్రీనివాసరెడ్డి – ఒంగోలు. 18.అమరనాథ్ రెడ్డి - రాజంపేట.

గుర్తింపులు

- స్వాగతం పలికిన సవాళ్ళు

- కిరణ్ కుమార్ రెడ్డి పాలనతో సుస్థిరత సాధన

- సందిగ్ధతను సృష్టించిన కుల సమీకరణాలు

- సకల జనులసమ్మెకు సంయమనంతో పరిష్కారం

- పాలనపై, పార్టీపై పెరిగిన పట్టు

- ఉద్యమాలకు సంక్షేమాస్త్రంతోనే సమాధానం

- ‘రచ్చబండ’ ఆయుధంగా ప్రజాభిమాన సాధన

- చరిత్ర సృష్టించిన కిలోబియ్యం రూపాయి పథకం

బయటి లింకులు

http://www.facebook.com/CMofAP http://cm.ap.gov.in/cmprofile.asp http://cm.ap.gov.in/contact.asp

మూలాలు