Coordinates: 11°23′N 76°54′E / 11.38°N 76.90°E / 11.38; 76.90

ఉదగమండలం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.6.4) (యంత్రము కలుపుతున్నది: ne:ऊटी
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: sa:ऊटी
పంక్తి 75: పంక్తి 75:
[[ro:Ootacamund]]
[[ro:Ootacamund]]
[[ru:Ути]]
[[ru:Ути]]
[[sa:ऊटी]]
[[simple:Ooty]]
[[simple:Ooty]]
[[sv:Utakamand]]
[[sv:Utakamand]]

06:41, 17 జూలై 2012 నాటి కూర్పు

  ?ఉదకమండలం
తమిళనాడు • భారతదేశం
ఉదకమండలం చిత్రం
ఉదకమండలం చిత్రం
ఉదకమండలం చిత్రం
అక్షాంశరేఖాంశాలు: 11°23′N 76°54′E / 11.38°N 76.90°E / 11.38; 76.90
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 2,719 మీ (8,921 అడుగులు)
జిల్లా (లు) నీలగిరి జిల్లా
జనాభా 93,921 (2001 నాటికి)
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్
వాహనం

• 643 00x
• +0423
• TN 43

ఊటీ తమిళనాడులో నీలగిరి పర్వతాలపై నెలకొని ఉన్న ఒక ప్రసిద్ది గాంచిన పర్యాటక కేంద్రం మరియు పట్టణం. నీలగిరి జిల్లాకు ప్రధాన పట్టణం. ఉదకమండలం అనేది దీని అధికారిక నామం. వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి ఇది మంచి వేసవి విడిది కేంద్రంగా ప్రసిద్ధి గాంచింది. వేసవిలో ఇక్కడికి ఎక్కువ మంది పర్యాటకులు విచ్చేస్తుంటారు.

చరిత్ర

ఉదకమండల క్లబ్బు ముందరిభాగం, 1905.

ప్రాచీన కాలంలో నీలగిరి పర్వతాలు చేర సామ్రాజ్యంలో భాగంగా ఉండేవి. తరువాత గంగ వంశ రాజుల ఆధీనంలోకి మారాయి. తరువాత 12వ శతాబ్దంలో హోయసాల వంశ రాజైన విష్ణువర్థనుడి స్వాధీనంలో ఉన్నాయి. చివరకు టిప్పు సుల్తాన్ అధీనంలోకి వచ్చి, 18వ శతాబ్దంలో ఆంగ్లేయులకు అప్పగించబడ్డాయి.

పక్కనే ఉన్న కోయంబత్తూర్ ప్రావిన్సు కు గవర్నరుగా ఉన్న జాన్ సుల్లివాన్ ఊటీ చల్లటి వాతావరణం, మరియు అడవులను చూసి ముచ్చటపడి, అక్కడ నివసిస్తున్న కోయజాతి తెగలకు అతి తక్కువ పైకాన్ని చెల్లించి చాలా స్థలాన్ని కొన్నాడు.

నెమ్మదిగా ఈ స్థలాలు ఆంగ్ల ప్రైవేటు వ్యక్తుల పరం కావడంతో త్వరత్వరగా అభివృద్ధి చెందడం మొదలుపెట్టింది. మద్రాసు సంస్థానానికి వేసవి రాజధానిగా మారింది. మద్రాసు సంస్థానం సహకారంతో ఇక్కడ ప్రముఖ ఆంగ్లేయులు కొండల మద్య మెలికలు తిరిగే రహదారులు, సంక్లిష్టమైన రైలు మార్గాల్ని నిర్మించారు. ఈ పట్టణం సముద్ర మట్టం నుంచి 2,240 మీటర్ల ఎత్తులో ఉండటంతో ప్రముఖ వేసవి విడిది కేంద్రంగా ప్రసిద్ధి గాంచింది.[1]. దీని అద్భుత సౌదర్యం, ఎటు చూసిన కనిపించే పచ్చదనం, ముచ్చటగొలిపే లోయలు మొదలైన వాటికి ముగ్ధులైన ఆంగ్లేయులు దీన్ని క్వీన్ ఆఫ్ హిల్స్ అని పిలుచుకునే వారు.

పర్యాటకం

చూడవలసిన ప్రదేశాలు

  • బొటానికల్ గార్డెన్స్
  • దొడ్డబెట్ట శిఖరం
  • ఊటీ బోట్‌హౌస్
  • కాఫీ తోటలు

రవాణా సౌకర్యాలు

సంస్థలు

మూలాలు

  1. www.ooty.com

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=ఉదగమండలం&oldid=744033" నుండి వెలికితీశారు