వికీపీడియా:ఏది వికీపీడియా కాదు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: hi:विकिपीडिया:विकिपीडिया क्या नहीं है
చి యంత్రము కలుపుతున్నది: sah,br,ur,yo మార్పులు చేస్తున్నది: zh:Wikipedia:創建條目精靈/维基百科不是什么
పంక్తి 114: పంక్తి 114:
[[bg:Уикипедия:Какво не е Уикипедия]]
[[bg:Уикипедия:Какво не е Уикипедия]]
[[bn:উইকিপিডিয়া:উইকিপিডিয়া কি নয়]]
[[bn:উইকিপিডিয়া:উইকিপিডিয়া কি নয়]]
[[br:Wikipedia:Ar pezh n'eo ket]]
[[bs:Wikipedia:Šta nije Wikipedia]]
[[bs:Wikipedia:Šta nije Wikipedia]]
[[ca:Viquipèdia:Allò que la Viquipèdia no és]]
[[ca:Viquipèdia:Allò que la Viquipèdia no és]]
పంక్తి 170: పంక్తి 171:
[[ru:Википедия:Чем не является Википедия]]
[[ru:Википедия:Чем не является Википедия]]
[[rue:Вікіпедія:Што Вікіпедія не є]]
[[rue:Вікіпедія:Што Вікіпедія не є]]
[[sah:Бикипиэдьийэ:Бикипиэдьийэ туох буолбатаҕый]]
[[sco:Wikipedia:Whit Wikipedia isna]]
[[sco:Wikipedia:Whit Wikipedia isna]]
[[sh:Wikipedia:Šta Wikipedia nije]]
[[sh:Wikipedia:Šta Wikipedia nije]]
పంక్తి 184: పంక్తి 186:
[[tt:Википедия:Нәрсә түгел]]
[[tt:Википедия:Нәрсә түгел]]
[[uk:Вікіпедія:Чим не є Вікіпедія]]
[[uk:Вікіпедія:Чим не є Вікіпедія]]
[[ur:منصوبہ:ویکیپیڈیا کیا نہیں ہے]]
[[vi:Wikipedia:Những gì không phải là Wikipedia]]
[[vi:Wikipedia:Những gì không phải là Wikipedia]]
[[yi:װיקיפּעדיע:וואס וויקיפעדיע איז נישט]]
[[yi:װיקיפּעדיע:וואס וויקיפעדיע איז נישט]]
[[zh:Wikipedia:维基百科不是什么]]
[[yo:Wikipedia:Kíní Wikipedia kò jẹ́]]
[[zh:Wikipedia:創建條目精靈/维基百科不是什么]]
[[zh-yue:Wikipedia:唔啱維基百科嘅嘢]]
[[zh-yue:Wikipedia:唔啱維基百科嘅嘢]]

13:30, 29 జూలై 2012 నాటి కూర్పు

అడ్డదారి:
WP:NOT
WP:ISNOT

వికీపీడియా ఓ ఆన్‌లైను విజ్ఞాన సర్వస్వము, దానికోసం ఏర్పడిన ఓ ఆన్‌లైను సముదాయం. వికీపీడియాలో ఏమేం ఉండాలి అనేందుకు కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. అంచేత, వికీపీడియా కానివి కూడా కొన్ని ఉన్నాయి. వాటిని గురించిన వివరాలు.

ఏది వికీపీడీయా కాదు

వికీపీడీయా పుస్తక విజ్ఞానసర్వస్వం కాదు

వికీపీడీయా పుస్తక విజ్ఞానసర్వస్వం కాదు. ఇక్కడ వ్యాసాల సంఖ్యకు పరిమితి లేదు.

డయలప్ ఇంటర్నెట్ కనెక్షన్ను దృష్టిలో నుంచుకుని, వ్యాసపు సైజుకు కొన్ని పరిమితులున్నాయి. అలాగే అందరికీ వర్తించేలా చదవడానికి వీలయ్యే కొన్ని పరిమితులున్నాయి. వ్యాసం ఓ స్థాయికి పెరిగాక, దాన్ని వేరువేరు వ్యాసాలుగా విడగొట్టి, ప్రధాన వ్యాసంలో సారాంశాలను ఉంచడం వ్యాసం అభివృద్ధిలో ఓ భాగం. విజ్ఞాన సర్వస్వం పుస్తకాల్లో చిన్నవిగా ఉండే వ్యాసాలు ఇక్కడ విస్తారంగా, మరిన్ని విశేషాలతో కూడుకుని ఉండొచ్చు.

ఓ వ్యాస విషయానికి దగ్గరగా ఉన్న మరో విషయపు వ్యాసానికి దారిమార్పు చెయ్యాల్సిన అవసరం లేదు. దీని కోసం ప్రత్యేకంగా వ్యాసం రాసి, "ఇవి కూడా చూడండి" విభాగంలో రెండో వ్యాసపు లింకు ఇవ్వవచ్చు.

వికీపీడీయా నిఘంటువు కాదు

వికీపీడీయా నిఘంటువు కాదు. పారిభాషిక పదకోశమూ కాదు. దీనికోసం వికీ సోదర ప్రాజెక్టు [1] ఉంది. మీకు ఆసక్తి ఉంటే విక్షనరీలో చేయూత నివ్వండి.సహాయం చేయండి. విక్షనరీ కోసం ఇక్కడ చూడండి పేజీ

వికీపీడియా వ్యాసాలు:
  1. నిర్వచనాలు చెప్పే నిఘంటువు కాదు. వికీపీడియా నిఘంటువు కాదు కాబట్టి, కేవలం పదానికి నిర్వచనం రాసేందుకు గాను పేజీ సృష్టించకండి. కొన్ని విషయాలకు సంబంధించి వ్యాసం నిర్వచనంతోటే మొదలు కావాల్సి రావడం తప్పనిసరి కావచ్చు. నిర్వచనం తప్ప మరేమీ లేని వ్యాసం మీ దృష్టికి వచ్చినపుడు ఆ పేజీలో ఇంకేమైనా రాయగలరేమో చూడండి. సంఖ్యలకు ఇచ్చే సాంస్కృతిక అర్థాలు దీనికి మినహాయింపు.
  2. అలాంటి నిర్వచనాల జాబితా కూడా కాదు. అయితే, అయోమయ నివృత్తి కోసం ఒక పదానికి చెందిన సమానార్థకాల జాబితా పెట్టవచ్చు. కొన్ని ప్రత్యేక రంగాలకు సంబంధించిన పదాల కోశం కూడా వికీపీడియాలో పెట్టవచ్చు.
  3. వినియోగ మార్గదర్శిని గానీ, వాడుకపదాలు, జాతీయాల మార్గదర్శిని గానీ కాదు. వికీపీడియా పదాలను, జాతీయాలను ఎలా వాడాలో చెప్పే మార్గదర్శిని కాదు. ఎలా మాట్లాడాలో ప్రజలకు శిక్షణనిచ్చే స్థలం కాదు.

వికీపీడీయా ఒక వ్యక్తిగత ఆలోచన లేదా అభిప్రాయం కాదు

వికీపీడియా మీ ఆలోచనలు, అభిప్రాయాలు, విశ్లేషణలు ప్రచురించే స్థలం కాదు. వికీపీడియాలో..

  1. ప్రాథమిక (మౌలిక) పరిశోధన కూడదు: కొత్త సిద్ధాంతాలు, పరిష్కారాల ప్రతిపాదన, కొత్త ఉపాయాలు, కొత్త నిర్వచనాలు, కొత్త పదాల సృష్టి వికీపీడియాలో కూడదు. వికీపీడియా:మౌలిక పరిశోధన కూడదు చూడండి. మీవద్ద అలాంటి మౌలిక పరిశోధన ఉంటే సమీక్ష కోసం దాన్ని తగిన పత్రికలు, వేదికలకు సమర్పించండి. సమీక్ష తరువాత అది విజ్ఞానంలో భాగంగా చేరితే అపుడు వికీపీడియా దానిపై వ్యాసాన్ని ప్రచురిస్తుంది.
  2. విమర్శనాత్మక సమీక్షలు: జీవిత కథలు, కళకు, కళాసృష్టికి సంబంధిచిన వ్యాసాలు వికీపీడియాలో ఉండవచ్చు. కళపై విమర్శనాత్మక వ్యాసాలు ఉండవచ్చు, కానీ అవి ఇప్పటికే ప్రచురితమైన విమర్శపై ఆధారితంగా ఉండాలి. కింద 5 వ అంశం చూడండి.
  3. వ్యక్తిగత వ్యాసావళి: వికీపీడియా ఏదైనా విషయంపై మీ అభిప్రాయాలు వెల్లడించే వేదిక కాదు. మీ అభిప్రాయాన్ని చేర్చాల్సిన అసాధారణ అవసరం ఏర్పడితే ఆ పనిని (మీరు వెలిబుచ్చిన అభిప్రాయాన్ని వికీపీడియాలో రాసే పనిని) ఇతరులను చెయ్యనివ్వండి, మీరు చెయ్యకండి.
  4. ప్రస్తుత ఘటనలపై అభిప్రాయాలు: పై విషయానికే చెందిన ఓ ప్రత్యేక సందర్భం ఇది. ప్రస్తుతం జరుగుతున్న ఘటనలపై మీ అభిప్రాయాలు ఇక్కడ వెల్లడించరాదు..
  5. చర్చా వేదికలు: ఇక్కడ మనం చేసే పని విజ్ఞాన సర్వస్వం తయారు చెయ్యడం. దానికి సంబంధించిన చర్చ కోసం సభ్యుల లేదా వ్యాసపు చర్చాపేజీలను వాడండి. అది కూడా వ్యాసాన్ని ఎలా మెరుగు పరచాలనే విషయానికే పరిమితం చెయ్యండి. ఏ చర్చనైనా వ్యాసాల్లో చెయ్యకండి.
  6. జర్నలిజము: వికీపీడియా ఎప్పటికప్పుడు వేడివేడిగా వార్తలందించే వార్తా వెబ్సైటు కాదు.

వికీపీడీయా ప్రచార వాహనం కాదు

వికీపీడియా ప్రచార వాహనం కాదు. కాబట్టి వికీపీడియా..

  1. ప్రచార వేదిక కాదు: వికీపీడియా ఎదైనా విషయాన్ని ప్రచారం చేసే వేదిక కాదు.
  2. సొంత డబ్బా కాదు: మీ గురించి, మీరేం చేసారు, చేస్తున్నారు, ఏయే ప్రాజెక్టుల్లో పని చేస్తున్నారు మొదలైనవి రాసుకునే వీలు వికీపీడియాలో ఉన్నప్పటికీ, అన్ని పేజీలకు లాగానే ఆ పేజీలు కూడా విజ్ఞాన సర్వస్వం ప్రమాణాలు పాటించాలని గుర్తుంచుకోండి. మరీ అతిగా లింకులు ఇచ్చుకోవడం వంటివి చెయ్యరాదు.
  3. వ్యాపార ప్రకటనా స్థలం కాదు: సంస్థలు, ఉత్పత్తుల గురించి వ్యాసాలు రాయవచ్చు. అయితే అవి నిష్పాక్షికంగా, విషయ ప్రధానంగా ఉండాలి. వ్యాసంలోని విషయాలన్నీ నిర్ధారణ చేసుకునేందుకు వీలుగా ఉండాలి. అంచేతనే, చిన్న చితకా సంస్థల గురించి రాసిన వ్యాసాలు ఆమోదయోగ్యం కాకపోవచ్చు. వ్యాస విషయానికి సంబంధించినవైతే సంస్థల వెబ్ సైట్లకు బయటి లింకులు కూడా ఇవ్వవచ్చు. వికీపీడియా ఏ వ్యాపార సంస్థకు గానీ, వ్యాపారానికి గానీ ప్రచారం చెయ్యదు.

వికీపీడియా ఇతర సైట్లకు మిర్రరు గానీ, లింకులు, బొమ్మలు, మీడియా ఫైళ్ళ ఖజానా గానీ కాదు

వికీపీడియా ఇతర సైట్లకు మిర్రరు గానీ, లింకులు, బొమ్మలు, మీడియా ఫైళ్ళ ఖజానా గానీ కాదు. ఇక్కడ తయారయ్యే ప్రతీ వ్యాసంలోను నిర్దాక్షిణ్యంగా మార్పుచేర్పులు చేసి తుది రూపుకు తీసుకురావాలి. ఇక్కడ మీరు ఏది రాసినా, దాన్ని GNU FDL కు అనుగుణంగా విడుదల చేస్తున్నట్లే. వికీపీడియా వ్యాసాలు..

  1. బయటి లింకుల సంగ్రహమో లేక ఇంటర్నెట్ డైరెక్టరీల సంగ్రహమో కాదు: వ్యాస విషయానికి సంబంధించిన లింకులను చేర్చడంలో తప్పేమీ లేదు. అయితే మరీ వ్యాసాన్ని మింగేసే స్థాయిలో ఎక్కువ లింకులు చేర్చకూడదు.
  2. అంతర్గత లింకుల సమాహారం కాదు: అయోమయ నివృత్తి పేజీలు తప్పించి ఏ పేజీ కూడా అంతర్గత లింకుల జాబితా లాగా ఉండకూడదు.
  3. సార్వజనికమైన వనరుల సంగ్రహం కాదు: ఉదాహరణకు చారిత్రక దస్తావేజులు, పుస్తకాలు, ఉత్తరాలు, చట్టాలు మొదలైన వాటి పూర్తి పాఠాల సంగ్రహం కాదు. అలంటి పూర్తి పాఠాలు పెట్టేందుకు అనువైన స్థలం వికీసోర్సు. అయితే ఈ సార్వజనిక వనరుల లోని విషయాలను వ్యాసాల్లో వాడుకోవచ్చు.
  4. ఏ వ్యాసానికీ సంబంధం లేని ఫోటోలు, బొమ్మలు, ఇతర మీడియా ఫైళ్ళ సంగ్రహం కాదు: అలంటి వాటిని వికీమీడియా కామన్స్ లో పెట్టండి.

వికీపీడియా ఉచితంగా స్పేసు ఇచ్చే వెబ్ హోస్టు కాదు

వికీపీడియాలో మీ సొంత వెబ్ సైటు, బ్లాగు, వికీ మొదలైనవి పెట్టరాదు. వికీ టెక్నాలజీ వాడి ఏదైనా చెయ్యాలని మీకు ఆసక్తి ఉంటే దానికి చాలా సైట్లున్నాయి (ఉచితంగా గానీ, డబ్బులకు గానీ). అలాగే మీరే స్వంత సర్వరులో వికీ సాఫ్టువేరును స్థాపించుకోవచ్చు. వికీపీడియా..

  1. మీ వ్యక్తిగత పేజీలు కాదు: వికీపీడియనులకు తమ స్వంత పేజీలున్నాయి. కానీ వాటిని తమ వికీపీడియా పనికి సంబంధించిన వాటికి మాత్రమే వాడాలి. వికీయేతర పనుల కోసం పేజీలు అవసరమైతే ఇంటర్నెట్లో దొరికే అనేక ఉచిత సేవలను వాడుకోండి.
  2. ఫైళ్ళు దాచిపెట్టుకునే స్థలం కాదు: వ్యాసాలకు అవసరమైన ఫైళ్ళను మాత్రమే అప్ లోడు చెయ్యండి; అలా కానివి ఏవైనా సరే తొలగిస్తాం. మీదగ్గర అదనంగా బొమ్మలుంటే వాటిని కామన్స్ లోకి అప్ లోడు చెయ్యండి, అవసరమైనప్పుడు వాడుకోవచ్చు.

వికీపీడియా విచక్షణా రహితమైన సమాచార సంగ్రహం కాదు

వికీపీడియా విచక్షణా రహితమైన సమాచార సంగ్రహం కాదు. నూటికి నూరుపాళ్ళూ నిజమైన ప్రతి విషయమూ వికీపీడియాలో చేర్చదగినదేం కాదు. వికీపీడియా వ్యాసాలు..

  1. తరచూ అడిగే ప్రశ్నల జాబితాలు కాదు. వ్యాసాల్లో తరచూ అడిగే ప్రశ్నల జాబితాలు చేర్చరాదు. దాని బదులు, అదే సమాచారాన్ని ఓ పద్ధతిలో వ్యాసంగా అమర్చండి.
  2. అనేక చిన్న చిన్న విషయాలను గుదిగుచ్చి చూపించే సంగ్రహం కాదు: సూక్తులు, గొప్పవారి ఉటంకింపులు, ఉల్లేఖనలు మొదలైన వాటి ఏరి కూర్చి పెట్టే సంగ్రహం కాదు.
  3. ప్రయాణ మార్గదర్శిని కాదు: విశాఖపట్టణం వ్యాసంలో దాల్ఫిన్స్ నోస్ గురించి, రామకృష్ణా బీచ్ గురించి ఉండొచ్చు. అంతేగానీ, అక్కడ ఏ హోటల్లో గది అద్దెలు తక్కువగా ఉంటాయి, భోజనం ఎక్కడ బాగుంటుంది, ఫలానా చోటికి వెళ్ళాలంటే ఏ నంబరు బస్సెక్కాలి ఇలాంటివి ఉండకూడదు.
  4. జ్ఞాపికలు రాసుకునే స్థలం కాదు: సన్నిహితుల మరణం దుస్సహమే. అంతమాత్రాన వాళ్ళ జ్ఞాపకాలను, సంతాప తీర్మానాలను రాసుకోడానికి వికీపీడీయాను వాడుకోరాదు. వారి గురించి వ్యాసం రాయాలంటే, దానికి తగ్గ ప్రఖ్యాతి కలిగి ఉండాలి.
  5. వార్తా నివేదికలు కాదు: వికీపీడియా వేడివేడిగా వార్తలందించే పత్రిక కాదు.
  6. టెలిఫోను డైరెక్టరీ కాదు: వ్యక్తుల గురించి వికీపీడియాలో రాయాలంటే వారికి అందుకు తగ్గ పేరుప్రఖ్యాతులు, గుర్తింపు ఉండాలి.
  7. వ్యాపార విశేషాలు తెలియజేసే డైరెక్టరీ కాదు: ఏదైనా టెలివిజను చానలు గురించిన వ్యాసం ఉందనుకోండి. ఆ చానల్లో ఏ సమయానికి ఏ కార్యక్రమం వస్తుందో జాబితా తయారు చేసి పెట్టరాదన్న మాట. ముఖ్యమైన కార్యక్రమాల గురించి రాయవచ్చు కానీ మొత్తం కార్యక్రమాల జాబితా ఇవ్వరాదు.

వికీపీడియా భవిష్యత్తు చూసే మాయాదర్పణం కాదు

భావి ఘటనలు విజ్ఞాన సర్వస్వంలో భాగం కావు. జరిగేదాకా అసలవి జరుగుతాయో లేదో చెప్పలేని ఘటనలైతే మరీను.

  1. ఘటనా క్రమాన్ని ముందే నిర్ణయించినంత మాత్రాన ఆ ఘటనలు వ్యాసాలుగా పనికిరావు: ఉదాహరణకు 2028 ఒలింపిక్స్ గురించి ఇప్పటి నుండే వ్యాసం రాయడం సమంజసంగా ఉండదు. వచ్చే సంవత్సరం కూడా సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు అన్నంత ఖచ్చితంగా జరిగే ఘటనల గురించి రాయవచ్చేమోగానీ, ఇలాంటి విషయాల మీద వ్యాసాలు కూడదు.
  2. అలాగే భవిష్యత్తులో ఫలానా ఘటన జరిగితే ఈ పేరు పెడదాం అని ముందే పేర్లు నిర్ణయించుకుని పెట్టే విషయాలు కొన్ని ఉన్నాయి. అలాంటి విషయాలకు వ్యాసాలు రాయరాదు. ఉదాహరణకు తుపానులకు పేర్లు పెట్టే పద్ధతి. 2010లో వచ్చే తుపానులకు ఫలానా పేర్లు పెడదాం అని ముందే పేర్ల జాబితా తయారు చేసి పెట్టుకుంటారు. ఎలాగూ పేర్లు పెట్టేసారు కదా అని వ్యాసాలు రాసెయ్యకూడదు.
  3. భవిష్యత్తు గురించిన లెక్కలు, ఊహలు, "భవిష్యత్తు చరిత్రల" గురించి చెప్పే రచనలు వికీపీడియాలో కూడవు. ఇవి మౌలిక పరిశోధన కిందకి వస్తాయి. అయితే అలాంటి తార్కిక, సంబద్ధ వ్యాసాల గురించి వికీపీడియాలో రాయవచ్చు. స్టార్ వార్స్ గురించి వ్యాసం రాయవచ్చు కానీ "నాలుగో ప్రపంచ యుద్ధంలో వాడబోయే ఆయుధాలు" అనే వ్యాసానికిక్కడ చోటులేదు.

పిల్లల కోసం వికీపీడియాను సెన్సారు చెయ్యం

వికీపీడియాలో ఉండే కొన్ని వ్యాసాలు కొందరు పాఠకులకు అభ్యంతరకరంగా ఉండవచ్చు. ఇక్కడి వ్యాసాలను ఎవరైనా సరిదిద్దవచ్చు. ఆ దిద్దుబాట్లు వెంటనే వ్యాసంలో కనిపిస్తాయి. అంచేత ఆయా వ్యాసాల్లో కనిపించే విషయాలు పిల్లలు చదివేందుకు అనుగుణంగా ఉంటాయని చెప్పలేం. అనుచితమైన విషయాలు దృష్టికి వెనువెంటనే తీసెయ్యడం జరుగుతుంది. అయితే శృంగారం, బూతు మొదలైనవి విజ్ఞాన సర్వస్వంలో భాగమే కాబట్టి, అలాంటి విషయాలపై వ్యాసాలు ఉండే అవకాశం లేకపోలేదు.

ఏది వికీపీడియా సముదాయం కాదు

వికిపీడీయా యుద్ధభూమి కాదు

ప్రతీ సభ్యుడు తన సహసభ్యులతో సంయమనంతో వ్యవహరించాలి. మర్యాదగా, సంయమనంతో, సభ్యతతో వ్యవహరించాలి, సహకరించుకోవాలి. మిగతా సభ్యులతో ఏకీభవించని పక్షంలో సహసభ్యులపై వ్యక్తిగత దాడులు చెయ్యరాదు, దూషించరాదు, పరుషవ్యాఖ్యలు, వ్యక్తిగత నింద చేయరాదు లేదా రాయరాదు. ఏకీభవించని విషయాన్ని చాకచక్యంతో, ఋజువులతో నిరూపించాలి, చర్చించాలి. చర్చించిన విషయం మీద ఒక నిర్ణయానికి రావాలి. కేవలం మీ వాదనను నిరూపించేందుకు వ్యాసాలను సృష్టించడం, ఉన్న వ్యాసాలను మార్చడం వంటివి చెయ్యరాదు. వికీపీడియాపైనా, వికీపీడియనులపైనా, వికీమీడియా ఫౌండేషను పైనా చట్టపరమైన చర్యల బెదిరింపులు చెయ్యరాదు. బెదిరింపులను సహించం. బెదిరించిన సభ్యులు నిషేధానికి గురౌతారు. వికీపీడియా:వివాద పరిష్కారం కూడా చూడండి.

వికిపీడీయా-అరాచకం

వికిపీడీయాలో మార్పులు చేర్పులు చెయ్యడానికి అందరికి అవకాశం ఉంటుంది. కాని కొన్ని సందర్భాలలో మార్పులు చేయడాన్ని నియంత్రించవచ్చు లేదా నిరోధించవచ్చు. ఇది వివాదాస్పద అంశాలకు ప్రత్యేకంగా వర్తిస్తుంది. వికిపీడీయా ఒక స్వయంనియంత్రణ వ్యవస్థ. అయితే ఇది ఒక అంశం లేదా ఒక విషయం మీద సభ్యులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే చర్చావేదిక కాదు. వికిపీడీయాను అందరి సహాయంతో విజ్ఞాన సర్వస్వ భాండాగారం క్రింద తయారు చేసే ఉద్దేశంతో ప్రారంభించాం. చర్చావేదిక కోసమైతే ఇక్కడ చూడండి. వికీఫోర్క్ ను వాడండి. అరాచకపీడియా. ఇది కూడా చూడండి పవర్

వికీపీడీయా - ప్రజాస్వామ్యం

వికీపీడియా ప్రజాస్వామ్యంలో ప్రయోగం లాంటిదేమీ కాదు. ఇక్కడ విస్తృతాభిప్రాయం సాధించే పద్ధతి -చర్చేగానీ, వోటింగు కాదు. అంటే, అధిక సంఖ్యాకుల అభిప్రాయమే నియమం కావాలనేమీ లేదు. నిర్ణయం తీసుకోవడంలో వోటింగు ఒక అంగం మాత్రమే. వోటింగుతోపాటు జరిగే చర్చ, విస్తృతాభిప్రాయం సాధించడంలో కీలకం. ఉదాహరణకు, వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు పేజీలో జరిగే చర్చ.

వికీపీడియా అధికార యంత్రాంగం కాదు

విభేదాలు తలెత్తినపుడు, నియమాలు, పద్ధతులను పట్టుకుని వేళ్ళాడకుండా చర్చ ద్వారా పరిష్కరించుకోవాలి. ఏదైనా పని ఓ పద్ధతి ప్రకారం జరగనంత మాత్రాన, ఆ పనే సరైనది కాదనడం పద్ధతి కాదు. నియమ నిబంధనలు, విధానాలు, మార్గదర్శకాలు మొదలైన వాటి అంతరార్థాలను గ్రహించి ఆచరించాలే గానీ, వాటి ప్రత్యక్షర భావాన్నీ అనుసరించే ప్రయత్నం చెయ్యరాదు.

ఏం చెయ్యాలో అర్థం కానపుడు

  • "ఫలానా" అనే వ్యాసంలో ఏమేం ఉండాలో నిర్ణయించుకోలేని పరిస్థితిలో ఉంటే, ముందు "ఫలానా" వ్యాసంలో ఏమి ఉండాలని పాఠకుడు కోరుకుంటారో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.
  • ఇక్కడి నియమాలను ఉల్లంఘించినట్లు మీరు గమనిస్తే, ఇలా చెయ్యవచ్చు:
    • వ్యాసంలో తగు దిద్దుబాట్లు చెయ్యడం (మామూలు దిద్దుబాటు)
    • పేజీ చరితాన్ని భద్రపరుస్తూ, పేజీని దారిమార్పుగా మార్చడం
    • పేజీ తొలగింపు విధానంకు అనుగుణంగా ఉంటే ఆ పేజీని తొలగించేందుకు ప్రతిపాదించడం.
    • ఇతర సభ్యులతో చర్చించి, ఒక విస్తృతాభిప్రాయానికి వచ్చాక, ఈ పేజీలోని నియమ, నిబంధనలను మార్చడం.


ఇవి కూడా చూడండి