ఎం. ఎం. కీరవాణి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: fi:M. M. Keeravani
పంక్తి 230: పంక్తి 230:


[[en:M. M. Keeravani]]
[[en:M. M. Keeravani]]
[[fi:M. M. Keeravani]]

00:29, 30 జూలై 2012 నాటి కూర్పు


కోడూరి మరకతమణి కీరవాణి ప్రముఖ తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు మరియు గాయకుడు. తెలుగులో సినీ రంగంలో ఎం. ఎం. కీరవాణిగా, తమిళంలో మరకతమణిగా, హిందీలో ఎం. ఎం. క్రీమ్ గా ప్రసిద్ధుడు.[1] తొలినాళ్లలో రాజమణి, చక్రవర్తి వంటి ప్రసిద్ధ సంగీత దర్శకుల వద్ద సహాయకునిగా పనిచేసాడు. ప్రముఖ సినిమా నిర్మాణ సంస్థ ఉషా కిరణ్ మూవీస్ వారు 1989లో నిర్మించిన మనసు - మమత తెలుగు చిత్రం ద్వారా ఎం. ఎం. కీరవాణి తెరనామంతో సంగీత దర్శకునిగా వెండి తెరకు పరిచయమయ్యాడు. అప్పటినుండి తెలుగు, తమిళ, హిందీ భాషలలో నూరు వరకూ చిత్రాలకు సంగీతాన్ని అందించాడు. 1997 లో వచ్చిన అన్నమయ్య చిత్రానికి గాను జాతీయస్థాయిలో ఉత్తమ సంగీతదర్శకునిగా పురస్కారాన్ని అందుకున్నాడు.

కీరవాణి సంగీతం సమకూర్చిన సినిమాలలో చెప్పుకోదగినవి సీతారామయ్యగారి మనవరాలు, క్షణ క్షణం, అల్లరి మొగుడు, మేజర్ చంద్రకాంత్, అల్లరి ప్రియుడు, అన్నమయ్య, శ్రీరామదాసు, నేనున్నాను, స్టూడెంట్ నంబర్ 1, ఛత్రపతి, సింహాద్రి, అనుకోకుండా ఒక రోజు, ఆపద్బాంధవుడు, శుభ సంకల్పం, పెళ్లి సందడి మరియు సుందరకాండ.

కీరవాణి కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన 15 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించాడు.

ఇతరములు

  • ఎక్కువగా నాగార్జున నటించిన చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించాడు.
  • ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన అన్ని చిత్రాలకూ సంగీతం సమకూర్చాడు.
  • ఎస్.రాజేశ్వరరావు, కె.వి.మహదేవన్ వంటి ఉద్ధండుల నిష్క్రమణానంతరం నేటి తరం తెలుగు సంగీత దర్శకులలో సంగీత ప్రధాన చిత్రాలకు సంగీతం సమకూర్చగల ఒకే ఒకనిగా పేరొందాడు.
  • వ్యాపారాత్మక సినిమాల్లోనూ సంగీత విలువలతో రాగాలు కట్టి మెప్పించగల దిట్ట (ఉదా: నేనున్నాను చిత్రంలోని ఏ శ్వాసలో చేరితే పాట).
  • గాయకునిగానూ పలు తెలుగు, హిందీ చిత్రాల్లో తన గొంతు వినిపించాడు.
  • కీరవాణి స్వరపరచి ఆలపించిన రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే (మాతృదేవోభవ) పాటకుగాను గీత రచయిత వేటూరి సుందరరామమూర్తి జాతీయ స్థాయిలో ఉత్తమ సినీ గీతం అవార్డునందుకున్నారు.
  • ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి కి కీరవాణి అన్నయ్య వరుస.
  • ప్రముఖ సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖ కీరవాణికి చెల్లెలు వరుస (బాబాయ్ కూతురు).
  • ఐతే, ఆంధ్రుడు, బాస్ చిత్రాలకు సంగీతాన్నందించిన వర్ధమాన సంగీత దర్శకుడు కల్యాణి మాలిక్ కీరవాణికి స్వయానా తమ్ముడు.
  • కీరవాణి తండ్రి శివ శక్తి దత్త. ఈయన అర్ధాంగి, చంద్రహాస్ అనే రెండు తెలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు.

కీరవాణి సంగీత దర్శకత్వం వహించిన సినిమాలు

కీరవాణి స్వరపరచిన కొన్ని విజయవంతమైన గీతాలు

చిత్రం పాటలు
సీతారామయ్యగారి మనవరాలు "కలికి చిలకల కొలికి", "పూసింది పూసింది పున్నాగ"]]
క్షణక్షణం "జామురాతిరి జాబిలమ్మా", "చలి చంపుతున్న చమక్కులో"
సుందరకాండ "నవ్వవే నవమల్లిక", "అరె మామ ఇల్లలికి పండగ చేసుకుందామా", "ఉలికి పడకు కుకుకుకు"
అంతం "గుండెల్లో దడ దడలాడే"
క్రిమినల్ "తెలుసా మనసా", "హల్లో గురూ"
అల్లరి అల్లుడు "నిన్ను రోడ్డు మీద చూసినది లగాయతు"
రక్షణ "ఘల్లుమంది బాసు గలాసు"
అన్నమయ్య "ఏలే ఏలే మరదలా", "తెలుగు పదానికి" (ఈ చిత్రంలోని చాలా పాటలు అన్నమాచార్య స్వరపరచిన కీర్తనలు)
శ్రీరామదాసు "చాలు చాలు చాలు" (ఈ చిత్రంలోని చాలా పాటలు రామదాసు స్వరపరచిన కీర్తనలు)
నేనున్నాను "ఏ శ్వాసలో చేరితే", "చీకటితో వెలుగే చెప్పెను నేనున్నాని", "శీతాకాలం ఎండల్లాగ"
ఆపద్బాంధవుడు "ఔరా అమ్మకచల్ల", "చుక్కల్లారా, చూపుల్లారా, ఎక్కడమ్మా జాబిలి"
ఘరానా మొగుడు "బంగారు కోడిపెట్ట", "ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్లు"
శుభసంకల్పం "హరిపాదాన పుట్టావేమో గంగమ్మా", [[హైలెస్సో హైలెస్స", "సీతమ్మ అందాలు"
మాతృదేవోభవ "రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే"
మొండి మొగుడు-పెంకి పెళ్లాం "నాటకాల జగతిలో జాతకాల జావళి", "లాలూ దర్వాజ లష్కర్"
అన్న "గురుగురు పిట్ట గోగుల గుట్ట మీద"
ఖతర్నాక్ "లవ్వు చేసే వాళ్లకేమో కోలాటం"
అల్లరి బుల్లోడు "త్రిషా, అసలు సిసలు తళుకులొలుకు రూపమా"
ఒకరికి ఒకరు "ధిరననన ధిరననన ధిరనననా"
ఒక్కడున్నాడు "అడుగడుగున", "ఇవ్వాళ నా గెలుపు"
అనుకోకుండా ఒక రోజు "ఐ వన్నా సింగ్", "ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని", "నీడల్లే తరుముతూ ఉంది గతమేదో వెంటాడి"
స్టూడెంట్ నంబర్ 1 "ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి", "పడ్డానండీ ప్రేమలో మరి"
సింహాద్రి "చిరాకు అనుకో పరాకు అనుకో", "ఏదేదో చెయ్యమాక సందెకాడ"
సై "నల్లా నల్లాని కళ్ల పిల్లా"
ఛత్రపతి "గుండు సూదీ గుండు సూదీ", "మన్నేలదింటివిరా కృష్ణా", "ఎ వచ్చి బి పై వాలె"
విక్రమార్కుడు "కాలేజి పాపల బస్సు", "వస్తవా వస్తవా ఒక్కసారి వస్తవా", "డమ్మారె డమ్మ డమ్మ"
యమదొంగ "రబ్బరు గాజులు", "యంగ్ యమా"
రాజహంస "రోసా రోసా రోసా"
పెళ్లిసందడి "నవ మన్మధుడా అతి సుందరుడా", "మా పెరటి జాంచెట్టు పళ్లన్నీ కుశలం అడిగె", "సౌందర్యలహరి స్వప్నసుందరి"
పరదేశి "చందన చర్చిత"
బొంబాయి ప్రియుడు "పరువమా మరుమల్లె పూలతోటలో ఘుమఘుమా", "రాజ్ కపూర్ సినిమాలోని హీరోయిన్లా ఉంది ఫిగరు"
అల్లరి మొగుడు "నా పాట పంచామృతం", "బాత్ టబ్ షవరులో కాలుజారి పడ్డవేళ"
అల్లరి ప్రియుడు "రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వా", "ఉత్తరాల ఊర్వశి ప్రేమలేఖ ప్రేయసి"
మనీ "చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ"
పాతబస్తీ "వేటూరి పాట వేగం, సాలూరి వారి రాగం"

మూలాలు

  1. తెలుగుసినిమా.కాంలో కీరవాణి ఇంటర్వ్యూ