హిమాలయాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: gn:Himalaia
చి r2.7.3) (బాటు: pa:ਹਿਮਾਲਾ వర్గాన్ని pa:ਹਿਮਾਲਿਆకి మార్చింది
పంక్తి 218: పంక్తి 218:
[[nv:Dziłgaiitsoh Honeezkʼazii]]
[[nv:Dziłgaiitsoh Honeezkʼazii]]
[[oc:Imalaia]]
[[oc:Imalaia]]
[[pa:ਹਿਮਾਲਾ]]
[[pa:ਹਿਮਾਲਿਆ]]
[[pl:Himalaje]]
[[pl:Himalaje]]
[[pms:Himalaya]]
[[pms:Himalaya]]

11:36, 27 అక్టోబరు 2012 నాటి కూర్పు

టిబెట్ పీఠభూమి ఆగ్నేయం నుండి ఎవరెస్టు పర్వతం దృశ్యచిత్రం.

హిమాలయాలు లేదా హిమాలయా పర్వతాలు (ఆంగ్లం : Himalaya Range) (సంస్కృతం : हिमालय,), లేదా ఆసియా లోని హిమాలయ పర్వతా పంక్తులు. ఈ పర్వత పంక్తులు భారత ఉపఖండాన్ని టిబెట్ పీఠభూమి ని వేరుచేస్తున్నాయి. ఈ పర్వత పంక్తులలో కారాకోరం, హిందూకుష్, తోబా కాకర్ మరియు చిన్న పర్వతశ్రేణులైన పామిర్ కోట్ వరకూ వ్యాపించి వున్నాయి. హిమాలయాలు అనగా సంస్కృతంలో "తత్పురుష" లేదా మంచుకు నెలవు.[1]

ఈ పర్వత పంక్తులు, ప్రపంచంలోనే ఎత్తైనవి. వీటిలో ఎవరెస్టు పర్వతం, కాంచనగంగ మొదలగు శిఖరములున్నవి. సుమారు నూరు శిఖరములు 7,200 మీటర్ల ఎత్తుకు మించివున్నవి.[2]

ఈ హిమాలయాలు, ఆసియా లోని ఐదు దేశాలలో వ్యాపించి వున్నవి : భూటాన్, చైనా, భారతదేశం, నేపాల్ మరియు పాకిస్తాన్. ఇవి ప్రపంచంలోని అతి పెద్దనదులలో మూడు అయిన సింధు, గంగ-బ్రహ్మపుత్ర మరియు యాంగ్‌ట్‌జీ నదులకు వనరులు. వీటి పరివాహక ప్రాంతాలలో 1.3 బిలియన్ల జనాభా వున్నది. ఇవి చంద్రవంక ఆకారంలో 2,400 కి.మీ.ల పొడవూ మరియు 400 కి.మీ. వెడల్పు ప్రాంతంలో వ్యాపించి వున్నాయి.


హిమాలయాల 6,000 కి.మీ.ల యాత్ర, భారతఫలకం తాకక ముందు.
పాకిస్తాన్ లోని కే-2 దగ్గరలోని గ్లేషియర్ లు.


హిమాలయాలలో కొన్ని ముఖ్యమైన శిఖరాలు

శిఖరం పేరు ఇతర పేర్లు మరియు అర్థం ఎత్తు (మీటర్లు) ఎత్తు (అడుగులు) మొదటి అధిరోహణ నోట్స్
ఎవరెస్టు శిఖరం సాగర్ మాతా, "ఆకాశ నుదురు",
చోమోలాంగ్మా, "విశ్వమాత"
8,848 29,029 1953 ప్రపంచంలోని ఎత్తైన పర్వతం, నేపాల్/టిబెట్ సరిహద్దులో గలదు.
కే-2 చోగో గాంగ్రి 8,611 28,251 1954 ప్రపంచంలోని 2వ ఎత్తైన పర్వతం, ఆజాద్ కాశ్మీరు, పాకిస్తాన్ మరియు చైనాలోని జింజియాంగ్ లో గలదు.
కాంచనగంగ కాంగ్‌చెన్ డ్‌జోంగా, "మంచు యొక్క ఐదు ఖజానాలు" 8,586 28,169 1955 ప్రపంచములోని 3వ ఎత్తైన శిఖరం. సిక్కిం (భారత్) మరియు నేపాల్ లో గలదు.
లోట్‌సే "దక్షిణ శిఖరం" 8,516 27,940 1956 ప్రపంచంలోని 4వ ఎత్తైన శిఖరం. నేపాల్ మరియు టిబెట్ ల మధ్యలో గలదు, ఎవరెస్టు ఛాయలో గలదు.
మకాలూ "మహా నల్లనిది (The Great Black)" 8,462 27,765 1955 ప్రపంచలోని 5వ ఎత్తైన శిఖరం. నేపాల్ లో గలదు.
చో ఓయు ఖోవోవుయాగ్, "నీలి (టర్కోయిస్ ఊదా రంగు) దేవత" 8,201 26,905 1954 ప్రపంచలోని 6వ ఎత్తైన శిఖరం. నేపాల్ లో గలదు.
ధవళగిరి "తెల్లని పర్వతం" 8,167 26,764 1960 ప్రపంచలోని 7వ ఎత్తైన శిఖరం. నేపాల్ లో గలదు.
మానస్లూ కుటాంగ్, "ఆత్మ పర్వతం" 8,156 26,758 1956 ప్రపంచలోని 8వ ఎత్తైన శిఖరం. గూర్ఖా హిమాల్, నేపాల్ లో గలదు.
నంగా పర్వతం దయామీర్, "నగ్న పర్వతం" 8,126 26,660 1953 ప్రపంచలోని 9వ ఎత్తైన శిఖరం. భారత్/పాకిస్తాన్ లో గలదు.
అన్నపూర్ణ "పంటల దేవత" 8,091 26,545 1950 ప్రపంచలోని 10వ ఎత్తైన శిఖరం. మృత్యుకర పర్వతం. నేపాల్ లో గలదు.
గాషెర్‌బ్రమ్ I "అందమైన పర్వతం" 8,080 26,509 1958 ప్రపంచలోని 11వ ఎత్తైన శిఖరం. కారాకోరం పాకిస్తాన్/చైనా లో గలదు.
విశాల శిఖరం ఫైచాన్ కాంగ్రి 8,047 26,401 1957 ప్రపంచలోని 12వ ఎత్తైన శిఖరం. కారాకోరం పాకిస్తాన్/చైనా లో గలదు.
గాషెర్‌బ్రమ్ II - 8,035 26,362 1956 ప్రపంచలోని 13వ ఎత్తైన శిఖరం. కారాకోరం పాకిస్తాన్/చైనా లో గలదు.
షిషాపాంగ్మా జిజియాబాంగ్మా, "గడ్డిమైదానాలపై ఎత్తుప్రాంతం" 8,013 26,289 1964 ప్రపంచలోని 14వ ఎత్తైన శిఖరం. టిబెట్ లో గలదు.
గాషెర్‌బ్రమ్ IV - 7,925 26,001 1958 ప్రపంచలోని 17వ ఎత్తైన శిఖరం. అత్యంత సాంకేతిక అధిరోహణ. కారాకోరమ్ పాకిస్తాన్/చైనా లో గలదు.
మాషెర్‌బ్రమ్ -తెలీదు- 7,821 25,660 1960 ప్రపంచలోని 22వ ఎత్తైన శిఖరం. కారాకోరం పాకిస్తాన్/చైనా లో గలదు.
నందా దేవి "ఆశీర్వదించు-దేవత" 7,817 25,645 1936 ప్రపంచలోని 23వ ఎత్తైన శిఖరం. భారత్ లోని ఉత్తరాఖండ్ లో గలదు.
రాకాపోషి "మెరిసే కుడ్యము" 7,788 25,551 1958 శిఖరాల సముదాయము. కారాకోరం పాకిస్తాన్/చైనా లో గలదు.
గాంగ్‌ఖర్ పుయెన్సుమ్ గాంకర్ పుంజుమ్, "మూడు సోదర పర్వతాలు" 7,570 24,836 అధిరోహించలేదు ప్రపంచంలో అధిరోహించని ఎత్తైన శిఖరం. భూటాన్ లో గలదు.
అమా దబ్లామ్ "తల్లి మరియు ఆమె నెక్లేస్" 6,848 22,467 1961 ప్రపంచంలోనే చాలా అందమైన శిఖరం. నేపాల్ లోని ఖుంబూ లో గలదు.

ధార్మిక స్థానాలు

జమ్మూ లోని వైష్ణోదేవి మందిరం.

హిమాలయాలలో హిందూ మరియు బౌద్ధ ధర్మాలకు చెందిన అనేక ధార్మిక ప్రదేశాలు గలవు. హిందూ ధర్మంలో హిమవత్ శివుని భార్యయైన పార్వతి యొక్క తండ్రి.

ఇవీ చూడండి

నోట్స్

  1. Oracle Education Foundation: Indian Himalayas
  2. "Himalayan Mountain System". Retrieved 2007-08-07.

మూలాలు

The Himalayan Journal published by Himalayan Club

ఇతర పఠనాలు

బయటి లింకులు

చిత్రమాలిక