ఆముదము నూనె: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 99: పంక్తి 99:
*నైలాన్,ప్లాస్టిక్‌పరిశ్రమలోను,
*నైలాన్,ప్లాస్టిక్‌పరిశ్రమలోను,
*హైడ్రాలిక్‌ఫ్లుయిడ్స్‌లలో,విమానయంత్రాలలో కందెనగా వినియోగిస్తారు.
*హైడ్రాలిక్‌ఫ్లుయిడ్స్‌లలో,విమానయంత్రాలలో కందెనగా వినియోగిస్తారు.
{{Navbox
|name= నూనెగింజలు
|titlestyle=background:#BADBAD;
|title= [[ నూనెలు]]
|state ={{{state|}}}
|list1=
<div>[[వేప నూనె]]{{•}}[[కానుగ నూనె]]{{•}}[[చింతపిక్కల నూనె ]]{{•}}[[సాల్‌సీడ్ నూనె ]]{{•}}[[కొకుం నూనె]]{{•}}[[మామిడిపిక్కనూనె]]{{•}}[[ధూప నూనె]]{{•}}[[నాగకేసరి నూనె]]{{•}}[[రబ్బరుగింజల నూనె]]{{•}}[[ఇప్పనూనె]]{{•}}[[మోదుగనూనె]]{{•}}[[పొన్ననూనె]]{{•}}[[అడవిఆముదం నూనె]]{{•}}[[జట్రొఫా నూనె]]{{•}}[[బాదం నూనె]]{{•}}[[పిలు నూనె]]{{•}}[[హహొబ నూనె]]{{•}}[[కుసుమ్ నూనె]]{{•}}[[ఆప్రికాట్ నూనె]]{{•}}[[ఫల్వార నూనె]]{{•}}[[ఆముదం]]{{•}}[[పామాయిల్]]{{•}}[[ఆలివ్ నూనె]]{{•}}[[కొబ్బరి నూనె]]{{•}}[[ఆముదము నూనె]]{{•}}[[ఆవ నూనె]]{{•}}[[కుసుమ నూనె]]{{•}} [[నువ్వుల నూనె]]{{•}} [[వేరుశెనగ నూనె]]{{•}} [[సోయా నూనె]]{{•}} [[పొద్దుతిరుగుడు నూనె]] {{•}} [[పత్తిగింజల నూనె ]] {{•}} [[పొగాకుగింజల నూనె]] {{•}} [[బాదం నూనె]] {{•}}[[పుచ్చగింజల నూనె]]{{•}} [[వెర్రిపుచ్చగింజల నూనె]]{{•}} [[ఖర్బుజగింజల నూనె ]]{{•}} [[టమాటోగింజల నూనె]]{{•}} [[మిరపగింజల నూనె]]{{•}} [[బెండగింజల నూనె]] </div>
}}

<noinclude>[[వర్గం:వృక్ష శాస్త్రము]]</noinclude>




[[వర్గం:నూనెలు]]
[[వర్గం:నూనెలు]]

16:25, 26 డిసెంబరు 2012 నాటి కూర్పు

ఆముదపు నూనె ఆముదపు గింజల నుండి తీయు నూనె ఖాద్యతైలం కాదు.కాని పారీశ్రామిక రంగంలో దీని వాడకం విసృతంగా కలదు. శాస్త్రీయనామము రిసినస్ కమ్మినిస్ (Ricinus communis), యుపెర్బెసియె కుటుంబానికి చెందినది. ఆముదపు మొక్కలను కేవలం నూనె గింజల ఉత్పత్తికై సాగుచేయుదురు. తూర్పుఆఫ్రికాలోని యిథోఫియా అముదం మొక్క ఆవిర్భవ స్దానం. అముదపు మొక్క ఏపుగా, ఎత్తుగా పెరగడం వలన ఆముదపు చెట్టు అని కూడా అంటారు.

ఆముదపుమొక్క

ఎక్కువగా ఏక వార్షికంగానే సాగు చేయుదురు.మొక్క2-5 మీ.ఎత్తుపరుగును.కొమ్మలు కలిగి వుండును.మొక్కపెరిగినతరువాత మొక్క కాండంలోపలి భాగం గుల్లగా మారును.హస్తాకారంగా చీలికలున్న ఆకులు5-10 అంగుళా లుండును.ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 12.5 లక్షలటన్నుల విత్తానాలు,5.5లక్షలటన్నుల ఆముదంనూనె ఉత్పత్తీగువున్నది.

'ఆముదంను ఎక్కువగా సాగుచేయుచున్న దేశాలు:

ఇండియా,బ్రెజిల్,చీనా,పరాగ్వే,యుథోఫియా,పిలిఫ్ఫిన్స్,రష్యా,మరియు థాయ్‌లాండ్‌.ఆముదపుపంట వుత్పత్తిలో ఇండియా అగ్రస్దానంలో వున్నది.ఇండియాలో ఆముదపు వుత్పత్తి ఏడాదికి 8.0లక్షల టన్నులు(3లక్షలన్నులనూనె).ఆ తరువాతస్దానం చీనా మరియు బ్రెజిల్‌లది.ఇండియాలో ఆముదపుపంటను ఎక్కువగా సాగుచెయ్యు రాష్టాలు:గుజరాత్‌,ఆంద్రప్రదేశ్‌,రాజస్దాన్, కర్నాటక, ఒడిస్సా, తమిళనాడు మరియు మహరాష్ట్రాలు. ఆంధ్రరాష్ట్రంలో ఇంచుమించు అన్నిజిల్లాలలో ఆముదంపైరుసాగులో వున్నప్పటికి కరీంనగర్‌,వరంగల్‌,మెదక్‌, నల్గొండ,మహబూబ్‌నగర్‌, గుంటూరు,ప్రకాశం,మరియు రంగారెడ్ది జిల్లాలలో ఎక్కువగా సాగులోవున్నది.హెక్టరుకు సగటుదిగుబడి విదేశాలపంట దిగుబడికన్న చాలాతక్కువ వున్నది.విదేశాలలో హెక్టరుకు 1200-1300 కేజిలుండగా,ఇండియాలో 350-400కీజిలు/హెక్టరుకు.దిగుబడిశాతం తక్కువగా వున్నప్పటికి ఎక్కువశాతంలో ఆముదంను వుత్పత్తిచేస్తున్నదేశంగా ఇండియా అగ్రస్దానంలోవున్నది.

కాయ(pod): కాయగోళాకారంగా వుండి,పైనక్రిందనిక్కబడివుండును.నిలువుగా మూడుగదులుగా విభజింపబడివుండి,ప్రతిగదిలోఒకవిత్తనం ఎర్పడును.కాయమీదమృదువైన ముళ్ళవంటివి వుండును.కాయలోని విత్తనాలు (seeds) సాగినఅండాకారంగా వుండును.పైన పెలుసుగావుండె గొధుమవర్ణపుపెంకు(hull)వుండును.పెంకుచారలను కల్గివుండును.పెంకులోపల మెత్తటి గింజ/పిక్క(kernel) వుండును,పిక్కరెండు బద్దలను కల్గివుండును.ఈపిక్కలోనే నూనెవుండును.విత్తనం10-10.5మి .మి.పొడవు,6-7మి.మీవెడల్పు,4.5-5.0మి.మీ.మందం వుండును.

ఆముదపువిత్తనంలోని సమ్మేళన పదార్థాల పట్టిక

పోషక పదార్థములు శాతం
తేమ 6-6.5%
విత్తనంలో గింజ% 64-75%
నూనె% 45-55%
ప్రోటిన్% 17-25%
పేచుపదార్థము% 18-26%
కాల్చినఎర్పడుబూడిద 2-3%

నూనెను తయారుచేయడం

విత్తనంలనుండి నూనెను 'ఎక్సుపెల్లరు'లనబడునూనెతీయుయంత్రాలద్వారా తీయుదురు.40-50 సంవత్సరంలక్రితం,ఆముదంను కేశనూనెగా వాడుటకై 'వంటాముదం'పేరుతో నూనెను ప్రత్యేకంగా చేసెవారు.ఆముదంగింజలకు కొద్దిగానీరును కలిపి మెత్తగా దంచి,ఇకపెద్దపాత్రలోవేసి,తగినంతగా నీరుచేసిబాగా వేడిచేయుదురు,వేడికి నీటిపైభాగంలో ఆముదంచేరును.ఆలాపైకితేరిన నూనెను వేరేపాత్రలో వేసి,తేర్చెవారు.విత్తనంపై పెంకును తొలగించిలేదా,విత్తానాన్ని యదావిధిగా యంత్రాలలో ఆడించి నూనెను తీయుదురు.కేకులో వుండిపోయిన నూనెను సాల్వెంట్‌ప్లాంట్‌ ద్వారా తీయుదురు.

నూనె

ఆముదపునూనె లేతపసుపు రంగులో వుండును.ఒకరకమైన ప్రత్యేకమైన వాసన వుండి,'ఆముదపువాసన'అనే జననానుడి వచ్చినది.ఆముదంలో వున్నకొవ్వుఆమ్లాలలో 75-85% వరకు రిసినొలిక్‌కొవ్వు ఆమ్లమున్నది.ఈకొవ్వు ఆమ్లం ఒలిక్‌ ఆమ్లం వలె ఎకద్విబంధంను 9-వకార్బనువద్దకల్గివుండి,18కార్బనులను కల్గివున్నప్పటికి,12-వకార్బనువద్ద అదనంగా ఒకహైడ్రొక్షిల్(OH)ను కలిగివుండటం వలన దానిభౌతిక,రసాయనిక ధర్మాలలో వత్యాసం వచ్చినది.రిసినొలిక్‌ ఆమ్లం జీవవిషగుణం(toxic)మనుషులమీదచూపించును.తక్కువమోతాదులో రిసినొలిక్‌ఆసిడ్‌ను ఆహారంగా తీసుకున్న జీర్ణవ్యవస్దమీద ప్రతికూల ప్రభావంచూపించి,విరోచనాలు కల్గును.ఎక్కువ ప్రమాణంలోతీసుకున్నదేహంలో నిర్జలీకరణజరిగి సృహతప్పె ప్రమాదముంది.విరేచనాలకై పిల్లలకు ఆముదంను త్రాగించడం ప్రమాదకరం.శాకతైలంలలో ఎక్కువ సాంద్రత,స్నిగ్థతవున్ననూనె ఆముదం.అముదంను పలుపారీశ్రామిక ఉత్పత్తులలో విరివిగా వుపయోగిస్తున్నారు.

ఆముదం భౌతిక,రసాయనిక గుణాలపట్టిక

లక్షణము విలువల మితి
సాంద్రత.20/250C 0.957-0.962
వక్రీభవనగుణకంnD 1.476-1.479
ఐయోడిను విలువ 82-88
సపోనిఫికెసను విలువ 175-187
హైడ్రొక్షిల్‌విలువ 160-168
స్నిగ్థత.250C 6.3-8.8 St
అన్‌సపొనిఫియబుల్‌మేటరు 0.3-0.
వెలుగు(flash) ఉష్ణోగ్రత 229.40C
స్వీయదహన ఉష్ణొగ్రత 448.90C

ఆముదంలోని కొవ్వుఆమ్లాలశాతం

కొవ్వు ఆమ్లం శాతం%
రిసినొలిక్‌ ఆమ్లం 80-90
ఒలిక్‌ ఆమ్లం 2-6
లినొలిక్‌ ఆమ్లం 1-5
లినొలెనిక్‌ ఆమ్లం 0.5-1.0
స్టియరిక్‌ ఆమ్లం 0.5-1.0
పామిటిక్‌ ఆమ్లం 0.5-1.0
డై హైడ్రొక్షి స్టియరిక్‌ ఆమ్లం 0.3-0.5
  • ఐయోడిన్‌విలువ:ప్రయోగశాలలో 100 గ్రాములనూనెచే శోషింపబడిన(గ్రహింపబడిన)ఐయోడిన్ గ్రాముల సంఖ్య.ప్రయోగసమయంలో నూనెలోని,ఫ్యాటి ఆమ్లంల ద్విబంధంవున్న కార్బనులతో ఐయోడిన్ సంయోగం చెంది,ద్విబంధాలను తొలగించును.ఐయోడిన్‌విలువ నూనెలోని అసంతృప్త కొవ్వుఆమ్లంల వునికిని తెలుపును.నూనె ఐయోడిన్‌విలువ పెరుగు కొలది,నూనెలోని అసంతృప్త కొవ్వుఆమ్లంల శాతం పెరుగును.
  • సపొనిఫికెసన్‌విలువ:ఒక గ్రాము నూనెలో వున్న కొవ్వుఆమ్లాలన్నింటిని సబ్బుగా(సపొనిఫికెసను)మార్చుటకు అవసరమగు పొటాషియం హైడ్రాక్సైడు,మి.గ్రాములలో.
  • అన్‌సపొనిఫియబుల్ మేటరు: నూనెలో వుండియు,పోటాషియంహైడ్రాక్సైడ్‌తో చర్యచెందని పదార్థములు.ఇవి అలిఫాటిక్‌ఆల్కహల్‌లు,స్టెరొలులు(sterols),వర్ణకారకములు(pigments),హైడ్రోకార్బనులు,మరియు రెసినస్(resinous)పదార్థములు.

ఆముదం నూనె ఉపయోగాలు

  • అముదంనూనెను ఆనాదిగా బళ్లచక్రాల ఇరుసుకు కందెనగా వాడకంలో వున్నది.అలాగే కండారాలబెణకునొప్పులకు ఆముదంనూనెతో మర్దనచెయ్యడం ఇప్పటికి గ్రామీణప్రాంతాలలో కొనసాగుచున్నది.అలాగే కేశతైలంగా కూడా వినియోగించెదరు.
  • విద్యుతులేని గ్రామాలలో దీపాలను వెలిగించుటకు వాడెదరు.ఆముదంనూనె ఎక్కువ స్నిగ్థత కలిగి వున్నందువలన నెమ్మదిగా ఎక్కువ సమయం వెలుగును.
  • పారిశ్రామికంగా పలుపరిశ్రమలలో ఆముదంను వాడెదరు.ద్రవ మరియు ఘనకందెనలు చేయుటకు,ముద్రణ సీరాలను,సబ్బులను చేయుటకు(లైఫ్‌బాయ్‌సబ్బులవంటివి),ఔషద తయారిలో(ఆయింట్‌మెంట్‌లలో బేస్‌గా హైడ్రొజెనెటెడ్‌ ఆయిల్)ఉపయోగిస్తారు.
  • మెచిన్‌కటింగ్‌ఆయిల్స్‌,రంగులతయారి(paints&dyes),వస్తువులను అతికించు జిగురుల(adhesives),రబ్బరు,వస్త్రపరిశ్రమలలొ వినియోగిస్తారు.
  • నైలాన్,ప్లాస్టిక్‌పరిశ్రమలోను,
  • హైడ్రాలిక్‌ఫ్లుయిడ్స్‌లలో,విమానయంత్రాలలో కందెనగా వినియోగిస్తారు.