ఆదాము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: gl:Adán
చి యంత్రము కలుపుతున్నది: ro:Adam
పంక్తి 68: పంక్తి 68:
[[oc:Adam]]
[[oc:Adam]]
[[ps:آدم]]
[[ps:آدم]]
[[ro:Adam]]
[[ru:Адам]]
[[ru:Адам]]
[[rw:Adamu]]
[[rw:Adamu]]

04:00, 28 డిసెంబరు 2012 నాటి కూర్పు

బైబిల్ ప్రకారం ఆదాము సృష్టిలోని మొదటి మానవుడు. ఆదాము అనే మాటకు “మట్టి”, “మనిషి” అని అర్థం. యూదా, ఇస్లాం మతం కూడా ఆదామును సృస్టిలోని తొలి మానవుడిగా పేర్కొంటాయి.

మైఖేల్ ఏంజిలో ప్రసిద్ధ చిత్రం - ఆదాము సృష్టి - సిస్టైన్ చాపెల్ కప్పుపైని చిత్రం. ఈ బొమ్మలో ఎడమ ప్రక్కనున్న వ్యక్తి ఆదాము.

క్రైస్తవ దృక్పథం

ఆదాము ఇతివృత్తాంతం బైబిల్ లోని మొదటి పుస్తకమైన ఆదికాండం లో చెప్పబడింది. ఆదికాండం మొదటి అధ్యాయం లో, రెండో అధ్యాయం లో ఇది వేరు వెరుగా చెప్పబడింది. ఈ కథనాల ప్రకారం ఆదాము దేవుని స్వరూపమందు, దేవుని పోలిక చొప్పున దేవునిచే సృజింప బడ్డాడు. దేవుడైన యెహోవా, నేల మంటినుండి నరుని నిర్మించి అతని నాసికా రంధ్రాలలో జీవ వాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. దేవుడైన యెహోవా తూర్పున ఒక తోట వేసి దానిలో ఇతన్ని ఉంచాడు. అతడు ఆ తోటలో ఉంటూ దేవునితో నడిచాడు. సృష్టిలో జీవం కలిగిన ప్రతిదానికి ఆదాము ఏం పేరు పెట్టాడో ఆ పేరే దానికి కలిగింది. సృష్టిలోని సమస్తానికి ఏలికగా దేవుడతన్ని నియమించాడు.


ఆదాముకు సాటి అయిన సహాయం చెయ్యాలని అనుకున్నప్పుడు దేవుడతనికి గాఢ నిద్ర కలుగజేసి అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసిస్త్రీ గా నిర్మించి అతనికిచ్చాడు. ఆదాముకు సాటి అయిన సహాయంగా ఇవ్వబడ్డ స్త్రీసైతాను చేత శోధింపబడి దేవుడు తినవద్దని ఆజ్ఞాపించిన మంచి చెడుల వివేచనను తెలిపే జ్ఞాన వృక్ష ఫలాన్ని తాను తిని అతనిచేతా తినిపించినందున వారు ఏదేను వనం నుండి వెళ్ళగొట్టబడ్డారు. ఆతర్వాత కష్టపడి, చెమటోడ్చి, శపించబడిన భూమిని సేద్యం చెయ్యటానికి నియుక్తుడయ్యాడు.


ఆదాము పెద్ద కొడుకు కయీను తన తమ్ముడైన హేబేలును చంపి మానవ చరిత్రలో తొలి హంతకుడు గా ముద్ర పడ్డాడు. ఆదాముకు మూడో కుమారుడైన షేతుకు ఎనోషు అనే కొడుకు పుట్టాక యెహోవా నామంలో ప్రార్థన చెయ్యటం మొదలైంది. ఆదాము తొమ్మిది వందల ముఫై ఏళ్ళు బ్రతికాడని బైబిల్ చెపుతుంది.

ఆదాము అనే పేరు కల్గిన ఒక పట్టణం యోర్దాను నదీ పరీవాహక ప్రదేశంలో ఉన్నట్టు యెహోషువా గ్రంధంలో పేర్కొన బడింది. బైబిల్ వెలుపలి చారిత్రకాధారాల ప్రకారం ఆదాము అనే ఈ పట్టణం దగ్గరి కొండ రాళ్ళు దొర్లిపడి యోర్దాను నదీ ప్రవాహం ఆగిందని సరిగ్గా అదే సమయంలో ఇశ్రాయేలీయులు యొహోషువా నాయకత్వంలో యొర్దాను నది దాటి కనాను లోకి వెళ్ళారని తెలుస్తుంది. మూస:Link FA

"https://te.wikipedia.org/w/index.php?title=ఆదాము&oldid=781172" నుండి వెలికితీశారు