Coordinates: 16°56′N 82°13′E / 16.93°N 82.22°E / 16.93; 82.22

కాకినాడ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము మార్పులు చేస్తున్నది: sr:Kakinadasr:Какинада
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: ms:Kakinada
పంక్తి 170: పంక్తి 170:
[[it:Kakinada]]
[[it:Kakinada]]
[[mr:काकिनाडा]]
[[mr:काकिनाडा]]
[[ms:Kakinada]]
[[new:काकिनडा]]
[[new:काकिनडा]]
[[no:Kakinada]]
[[no:Kakinada]]

13:34, 29 డిసెంబరు 2012 నాటి కూర్పు

  ?కాకినాడ
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 16°56′N 82°13′E / 16.93°N 82.22°E / 16.93; 82.22
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
జిల్లా (లు) తూర్పు గోదావరి జిల్లా
జనాభా
జనసాంద్రత
ఆడ-మగ నిష్పత్తి
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
5,50,000 (2011 నాటికి)
• 2,658/కి.మీ² (సమాసంలో (Expression) లోపం: "," అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను./చ.మై)
• 0.98
• 75.20
• 80.14
• 70.38
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్

• 5330xx
• ++91 884

కాకినాడ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లా యొక్క ముఖ్యపట్టణం. కాకినాడ తూర్పు గోదావరి జిల్లాలో ప్రధాన పట్టణమే కాక భారత దేశ తూర్పు తీర ప్రాంతములోముఖ్యమైన రేవు పట్టణం. న్యూయార్క్ నగరము మాదిరిగా వీధులు రూళ్ళకర్రతో గీసినట్టు సమాంతరంగా ఉండి, కూడళ్ళలో ఒకదానికొకటి లంబంగా ఉండడం ఈ నగర ప్రత్యేకత. ప్రణాళికా బద్ధంగా ఉన్న కారణంగా కో-కెనడా గానూ, ప్రముఖమైన ఓడరేవుగా ఉన్న కారణం చేత రెండవ మద్రాసుగానూ, చమురు అన్వేషణ, వెలికితీత కార్యక్రమాలు అధికంగా ఉన్న కారణంచేత మినీ ముంబయిగానూ, పిలుస్తూ ఉంటారు. ప్రశాంత వాతావరణానికి మారుపేరైన కాకినాడని పెన్షనర్స్‌గా పేరొందింది. ఆంధ్రప్రదేశ్ పెట్రోలియం రసాయనాలు పెట్రోరసాయనాల పెట్టుబడి ప్రాంతం పరిధి కాకినాడని ఆనుకొనే మొదలవుతుంది. ఈ మధ్యకాలంలో కె.జి బేసిన్ రాజధానిగా విదేశాలలో ప్రాముఖ్యతని సంతరించుకొంటోంది.

నైసర్గిక స్వరూపము

కాకినాడ 16.93° ఉత్తర అక్షాంశం (lattitude)దగ్గర, 82.22° తూర్పు రేఖాంశం (longitude) దగ్గర ఉంది. భారతీయ ప్రామాణిక కాలమానానికి (Indian Standard Time) అధారభూతమైన 82.5 ఉత్తర రేఖాంశం కాకినాడ మీదుగా పోవటం గమనార్హం. కాకినాడ ఊరంతా సముద్రమట్టానికి 2 మీటర్లు ఎత్తులోనే ఉంది.

కాకినాడ పేరు వెనుక ఇతిహాసం

  • కాకినాడ పేరు మొదట కాకి నందివాడ అని ఉండేదని, అది కాలక్రమముగా కాకినాడ గా నామాంతరం చెందిందని చెబుతారు. స్వాతంత్ర్యం రాక ముందు కొంతకాలం కాకినాడ పేరు కొకనాడగా చలామణి అయ్యింది.
  • ఇక్కడకి మొదట డచ్ వారు వర్తకం చేసుకొనడానికి వచ్చి వారి స్థావరం ఏర్పరచుకొన్నారు. వారి తరువాత ఆంగ్లేయులు వారి స్థావరం ఏర్పాటు చేసుకొన్నారు.తరువాత కెనడియన్‌ బాప్తిస్టు క్రైస్తవ మిషనరీలు ఇక్కడకి వచ్చారు. వారు కాకినాడ నగరాన్ని చూసి ఇది అచ్చు వారి కెనడ నగరాన్ని తలపించడంతొ వారు ఈ నగరాన్ని కోకెనడ అని పిలిచెవారు అది కాలక్రమంగా కాకినాడగా వాడుకలోకి వచ్చింది.
  • భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక పేరు కాకినాడగా మార్చబడింది. అయితే స్వాతంత్ర్యం రాక మునుపు బ్రిటిషు వారి పరిపాలన సమయం లో స్థాపించబడిన సంస్థల పేర్లు కొకనాడ గానే ఉన్నాయి. ఉదాహరణ- కొకనాడ చేంబర్ ఆఫ్ కామర్స్, జె ఎన్ టి యు లోని కొన్ని శిలాఫలకాలు.
  • కాకినాడ లోని రహదార్లు ప్రణాళిక ప్రకారము వెయ్యడం వల్ల రహదార్లు ఒకదానికి ఒకటి సమాంతరం గా, రూళ్ళ కర్ర తో గీసినట్టుగా ఉంటాయి. కాకినాడ ని రెండవ మద్రాసు అని పిలుస్తారు.

కాకినాడ కు ఆ పేరు ఎలా వచ్ఛిందంటే పూర్వం త్రేతాయుగం లొ ఇది పెద్ద అరణ్యం దీన్నీ కాకాసురుడు అనే రాక్షసుడు పరిపాలిస్తూ ఉండే వాడు వనవాసం చేస్తున్న సీతను కాకి రూపంలో వేధించినపుడు రాముడు అతనిని సంహరించినాడు, అతని పేరున ఈ వనమ్ వెలిసినది.

కాకినాడ ప్రత్యేకతలు

కాకినాడ ఊరు పేరు చెప్పగానే నోరూరే విషయాలు రెండు. ఒకటి కోటయ్య కాజాలు. ఇవి తాపేశ్వరం మడత కాజాల వంటి కాజాలు కావు. సన్నంగా, కోలగా దొండకాయలాగా ఉంటాయి. , కొరగ్గానే లోపల ఉన్న పాకం జివ్వున నోట్లోకి వస్తుంది. వీటిని గొట్టం కాజాలని కూడా అంటారు. తరువాత చెప్పుకోవలసినది నూర్జహాన్ కిళ్ళీ. ఇది తుని తమలపాకులతో చేసే మిఠాయి కిళ్ళీ. అలాగే కాకినాడలోని సుబ్బయ్య హోటలు. సంప్రదాయబద్ధంగా అరటి ఆకులో వడ్డించే ఇక్కడి అద్భుతమయిన భోజనానికి చాల ప్రశస్తి ఉంది. ఆసియా లో మొదటి బయో డీజల్ తయారి ఇక్కడ కలదు. కొట్లాటలు, కక్షలతొ కాక చక్కని ప్రశాంత వాతావరణం తొ పెన్ష్ నర్స్ పారడైస్ అని పిలుస్తారు.దీనినె రెండవ మద్రాసు అని కూడా పిలుస్తారు. కాకినాడలో వున్న ప్రఖ్యాత మెక్లారెన్ స్కూలు వంద సంవత్సరాల చరిత్ర గలది.

రవాణా సదుపాయాలు

రైలు సదుపాయం

కాకినాడ మిగిలిన పట్టణాలతో సామర్లకోట -కాకినాడ లూప్-లైన్ ద్వారా కలుపబడి ఉన్నది. కాకినాడ స్టేషన్లలో రైలుబళ్ళన్నీ కాకినాడ నుండే బయలుదేరుతాయి. కాకినాడ నగరంలో నాలుగు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. కాకినాడ పోర్ట్, కాకినాడ న్యూపోర్ట్, కాకినాడ టౌన్, సర్పవరం. ఇందులో కాకినాడ పోర్ట్ స్టేషన్ పూర్తిగా గూడ్స్ బళ్ళకు కేటాయించబడినది. కాకినాడ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకి 564 కి మీ ల దూరంలో ఉన్నది. చెన్నై - కోల్కతా రైలు మార్గం లో సామర్లకోట దగ్గర బండి మారాలి. ఈ మార్గంలో వెళ్లే బళ్ళలో సుమారుగా అన్నీ సామర్లకోట వద్ద ఆగుతాయి. సామర్లకోట నుండి కాకినాడ ప్రధాన బస్టాండ్ కి ఆం.ప్ర.రా.రో.ర.సం బస్సులు అన్ని వేళలా ఉంటాయి. దూరం 10 కి.మీ. కాకినాడ నుండి ఇతర ప్రాంతాలకు దూరాలు, కిలోమీటర్లలో:

ప్రస్తుతం హైదరాబాదు, చెన్నై (మద్రాసు), షిర్ది, ముంబాయి, బెంగుళూరు లకు నేరుగా రైలు సదుపాయముంది.

కాకినాడ నుంచి కోనసీమ అందాలను చూపుతూ కోటిపల్లి వరకు పోయే రైలు బస్సు మరొక ఆకర్షణ.

విమాన సదుపాయం

కాకినాడ కు 65 కి మీ దూరంలో రాజమండ్రి విమానాశ్రయం ఉంది. ఇది చెన్నై, హైదరాబాద్, విజయవాడ, బెంగుళూర్ లకు విమానయాన సేవలను కలిగి ఉంది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్, జెట్ ఎయిర్ వేస్ మరియు స్పైస్ జెట్ ఇక్కడ ఆపరేటింగ్ ఎయిర్ లైన్స్. ఇతర సమీప ప్రధాన విమానాశ్రయం కాకినాడ నుండి 145 కి మీ దూరంలో విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది.

పట్టణ చరిత్ర

ఇది రాష్ట్రములోని ప్రధానమైన ఓడరేవులలో ఒకటి. రెండు శతాబ్దాల క్రితం ఈ రేవు నుండి మల్లాది సత్యలింగ నాయకర్‌ అనే ఆసామీ ఓడ వ్యాపారం చేసేవాడు. ఆయన వారసులు మల్లాది సత్యలింగ నాయకర్‌ ఛారిటీస్ (MSN Charities) అనే స్వచ్ఛంద సంస్థని స్థాపించి ఇప్పటికీ విద్యారంగంలో ఎన్నో ప్రజోపయోగమైన పనులు చేస్తున్నారు.

భారతదేశంలో వాసయోగ్యమైన బహుకొద్ది నగరాలలో కాకినాడ ఒకటిగా ఉండేది. తిన్నటి విశాలమైన వీధులు, విద్యుచ్చక్తి, నీటి సరఫరా, ఈశ్వర పుస్తక భాండాగారం వంటి గ్రంథాలయాలు, కళాశాలలు మొదలైన హంగులన్నీ ఈ ఊళ్ళో దరిదాపు 1900 సంవత్సరం నుండీ ఉన్నాయి. 1901 జనాభా లెక్కల ప్రకారం కాకినాడ జనాభా 48000. మద్రాసు రాష్ట్రంలోని అచ్చతెలుగు ప్రాంతాలలో అతి పెద్ద నగరం ఇదే. ఇప్పుడు కొత్త కొత్త కళాశాలలు, పరిశ్రమలు, వ్యాపార సంస్థలు కూడ రావటంతో ఇంకా బాగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడి జె ఎన్ టి యు కళాశాల భారదేశంలోని అతి పురాతనమైన, అత్యుత్తమమైన ఏలెక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్ శాఖలను కలిగి ఉంది.

ప్రశాంతమయిన పరిసరాలు కలిగి ఉండడము చేత రాష్ట్రం నలు మూలల నుంచి రిటైర్డ్ ఉద్యొగులు ఎందరో వచ్చి కాకినాడలో స్థిరపడుతున్నారు. అందుకే ఈ నగరాన్ని "పెన్షనర్స్ ప్యారడైజ్" అని కూడా పిలుస్తారు. అయితే ఇప్పుడు పరిస్థితి చాలా మారింది.అడ్డు ఆపు లేని నగరీకరణం వలన పర్యావరణం పైన విపరీతమైన భారం కలిగి ఉష్ణోగ్రతలు విపరీతం గా పెరుగుతున్నాయి. ముఖ్యంగా వేసవి లొ పరిస్థితి భరించలేని రీతిలొ ఉంది. చెట్లు విపరీతం గా నరకడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని చాలా మంది భావిస్తున్నారు.

37 పరిసర గ్రామాలను కాకినాడలో విలీనం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. తద్వారా నగర జనాభా 8 లక్షలకు చేరే అవకాశం ఉంది. ఆ గ్రామాలు[1] 1 రమణయ్యపేట 2 తిమ్మాపురం 3 వి వెంకటాపురం 4 పండూరు 5 నేమాం 6 పెనుమర్తి 7 తమ్మవరం 8 సూర్యారావుపేట 9 వాకలపూడి, 10 వలసపాకల 11 ఉప్పలంక, 12 గురజనాపల్లి, 13 చొల్లంగి, 14 చొల్లంగిపేట, 15 పెనుగుదురు, 16 కొరుపల్లి 17 నడకుదురు 18 జడ్‌ భావవరం, 19 అరట్లకట్ట 20 గొడ్డటిపాలెం, 21 కొవ్వూరు, 22 తూరంగి 23 కాకినాడ రెవెన్యూ విలేజ్‌, 24 కాకినాడ మేడలైన్‌, 25 ఇంద్రపాలెం, 26 చీడిగ, 27 కొవ్వాడ, 28 రేపూరు, 29 రామేశ్వరం, 30 గంగనాపల్లి, 31 స్వామినగర్‌, 32 ఎస్‌ అచ్యుతాపురం, 33 మాధవపట్నం, 34 సర్పవరం, 35 పనసపాడు, 36, అచ్చంపేట, 37 కొప్పవరం

హోప్ ఐలాండ్

కాకినాడ తీర ప్రాంతం అంతా హోప్ ఐలాండ్ (హోప్ ద్వీపం) (వికీమాపియాలో హోప్ ఐలాండ్) చేత పరిరక్షింపబడుతున్నది. సముద్రపు (బంగాళా ఖాతము) ఆటుపోట్ల నుండి తీరము కోత కొయ్యబడకుండా ఐదు వందల సంవత్సరాల క్రితం నుండి ఈ హోప్ ఐలాండ్ ఏర్పడిందని తెలుస్తున్నది. ఈ హోప్ ఐలాండ్ తీరం వెంబడి 23 కి.మీల మేర విస్తరించి ఉన్నది. కాకినాడ సముద్రతీరంలో ఓడలు నిలిచినప్పుడు ఈ హోప్ ఐలాండ్ వల్ల ఓడలు లంగరు వేసినప్పుడు స్థిరంగా ఉండగల్గుతున్నాయి. మహలక్ష్మ tourism chollangipeta వారు బొటు లొ హోప్ ఐలాండ్ విహరా యత్ర matlapalem yanam road లొ కలదు

విద్యాసంస్థలు

కాకినాడలో ఉన్న విద్యా పీఠాలు:

  • పిఠాపురం రాజావారి కళాశాల (P. R. College), ఇది చాల రోజులబట్టి ఉన్న కళాశాల. రఘుపతి వెంకటరత్నంనాయుడు, వేమూరి రామకృష్ణారావు వంటి ఉద్దండులు ఇక్కడ పని చేసేరు. పిఠాపురం రాజావారి కళాశాల అత్యంత ప్రాచీనమైన కళాశాలగా ప్రాముఖ్యత సంతంరించుకున్నది. ఈ కళాశాలలో ఇంటర్,డిగ్రీ,పి.జి.విభాగాలలో అభ్యసించవచ్చును.
  • ఆంధ్రా పాలీటెక్నిక్‌
  • జవాహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఇంజనీరింగు కళాశాల (JNTU Engineering College). ఇది ఆంధ్రాలో మొట్టమొదటి ఇంజనీరింగు కళాశాల. మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్రా విడిపోయినప్పుడు, విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో పెట్టాలన్న ఉద్దేశ్యంతో గిండీ ఇంజనీరింగు కాలేజీ నుండి దీనిని విడదీసేరు. మొదట్లో గిండీ లో ఉన్న ఆచార్యబృందాన్నే ఇక్కడికి బదిలీ చేసేరు. కాని వాల్తేరులో వనరులు లేక కాకినాడలో తాత్కాలికంగా పెట్టేరు. అది అలా అక్కడే 'ప్రభుత్వ ఇంజనీరింగు కళాశాల, కాకినాడ' (Government College of Engineering, Kakinada)అన్న పేరుతో స్థిరపడి పోయింది. తరువాత జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (Jawaharlal Nehru Technological University) స్థాపించిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఇంజనీరింగు కళాశాలలన్నిటిని ఈ కొత్త విశ్వవిద్యాలయానికి అనుబంధించేరు.


  • ఆంధ్ర విశ్వవిద్యాలయం - స్నాతకోత్తర విద్యా కేంద్రం (Andhra University - Post-graduate Extension Center)
  • రంగరాయ మెడికల్‌ కాలేజి
  • కాకినాడ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (KIET)
  • ఐడియల్ కళాశాలలు(Ideal College)
  • ఐడియల్ ఇంజినీరింగ్ కళాశాల
  • ప్రగతి ఇంజనీరింగు కాలేజి
  • ఆదిత్య ఇంజనీరింగు కాలేజి
  • సాయి ఆదిత్య ఇంజనీరింగు కాలేజి
  • శ్రీ ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల
  • చైతన్య ఇంజనీరింగు కాలేజి
  • శ్రీ రామక్రిష్ణా పబ్లిక్ స్కూల్
  • ఆశ్రమ్ పబ్లిక్ స్కూల్
  • కాకినాడ పబ్లిక్ స్కూల్,వలసపాకల
  • Gandhi Centinary School
  • MSN English Medium School (Nehru Convent)
  • Seahorse Academy of Merchant Navy
  • Rajiv Gandhi Institute of Management and Science

నగరం లో షాపింగ్

కాకినాడ నగరం ఈ మధ్య కాలంలో అత్యంత వేగవంతంగా వృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటి. పెరుగుతున్న జనాభాతో పాటు పెరుగుతున్న అవసరాలకు అణుగుణంగా నగరంలో పలు షాపింగ్ మాల్స్ వెలిశాయి. ప్రముఖంగా చందన బ్రదర్స్ ఎప్పటి నుంచో నగర వాసులకు వస్త్ర రంగంలొ తమ సేవలను అందజేస్తుండగా ఆ పైన సరికొత్తగా సర్పవరం జంక్షన్ లో స్పెన్సర్స్ వెలసింది. ఆంధ్ర ప్రదేశ్ లో హైదరాబాదు, విశాఖపట్టణం, విజయవాడ నగరాల తరువాత కాకినాడలొనే ఇది ఉన్నది. అలాగే విజయవాడ వారి ఎం అండ్ ఎం మరొకటి ఇది స్దాపింఛి రెండేళ్ళు కావస్తోంది. అలాగే నగరంలోని రాజు భవన్, ఇంకా సోనా షాపింగ్ మాల్స్ నగర వాసులకు సేవలను అందజేస్తున్నాయి. ఇంకా మరెన్నో యూనివెర్ సెల్ మొబైల్స్, ది మొబైల్ స్టొర్, బిగ్ సి వంటి ప్రముఖ మొబైల్ షాపులు మొబైల్ వినియొగదారులకు తమ తమ సేవలను అందజేస్తున్నాయి. బంగారు నగల కొరకు దక్షిణ భారత దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన ఖజానా జ్యువెల్లరి కాకినాడలో వెలసి తమ సేవలను అందిస్తుండగా టాటా వారి గోల్డ్ ప్లస్, చందన జ్యువెల్లరిస్, రాజ్ జ్యువెల్లరి మాల్ ,మహ్మద్ ఖాన్ అండ్ సన్స్ జ్యుయలర్స్ ఇంకా స్దానికంగా ఉన్న మరెన్నొ నగల దుకాణాలు నగర వాసుల అవసరాలను తీరుస్తున్నాయి. నగర ప్రజలను ఎక్కువగా స్దానికంగా ఉన్న హొల్ సేల్ షాపులు వారి తక్కువ ధరలతో ఆకర్షిస్తూ ఉంటాయి. ఇక నగరంలో కట్టుబాటులను గురించి వారి వస్త్రధారణ గురించి చెప్పుకుంటే మగవారు ఎక్కువగా ఇంటిలో ఉన్నప్పుడు లుంగీలను కట్టుకుంటారు. ఆడవారు నైటీలను, కాటన్ చీరలను, పంజాబి దుస్తులను ధరిస్తూ ఉంటారు. ఇక బట్టల దుకాణాల విషయానికి వస్తె వైభవ్ షాపింగ్ నూతనంగా స్థాపించబడి విశెష ఆదరణను పొందుతున్నది.

దర్శనీయ స్థలాలు

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

మూలాలు

  1. "గ్రామాల విలీన ప్రతిపాదన". ఆంధ్ర ప్రభ. Retrieved 2012-05-03.
"https://te.wikipedia.org/w/index.php?title=కాకినాడ&oldid=781522" నుండి వెలికితీశారు