బిధాన్ చంద్ర రాయ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: sa:बिधाचन्द्रः रायः
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: as:বিধান চন্দ্ৰ ৰয়
పంక్తి 23: పంక్తి 23:
[[ta:பிதான் சந்திர ராய்]]
[[ta:பிதான் சந்திர ராய்]]
[[ml:ബി.സി. റോയ്]]
[[ml:ബി.സി. റോയ്]]
[[as:বিধান চন্দ্ৰ ৰয়]]
[[bn:বিধানচন্দ্র রায়]]
[[bn:বিধানচন্দ্র রায়]]
[[fr:Bidhan Chandra Roy]]
[[fr:Bidhan Chandra Roy]]

05:11, 12 జనవరి 2013 నాటి కూర్పు

బిధాన్ చంద్ర రాయ్ (ఆంగ్లం: Bidhan Chandra Roy) (1882 జూలై 1 - 1962 జూలై 1) పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా పని చేసారు. కాంగ్రెస్ పార్టీ సభ్యుడైన ఆయన ఈ పదవిలో 14 ఏళ్ళు ఉన్నారు. వృత్తిరీత్యా వైద్యుడైన ఈయన స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు.

వీరు బీహార్ రాష్ట్రం, పాట్నా జిల్లాలోని బంకింపూర్ లో జన్మించాడు. ఇతని తండ్రి ప్రకాశ్ చంద్ర. ఇంగ్లండ్ లోని సెంట్ బెర్త్ లోమో కళాశాలలో 1909-1911 మధ్యకాలంలో M.R.C.P. మరియు F.R.C.S. డిగ్రీలను పొందారు. 1911 సంవత్సరంలో స్వదేశానికి తిరిగివచ్చి కలకత్తా వైద్య కళాశాలలో కొంతకాలం అధ్యాపకునిగా పనిచేశారు.

వీరు జాదవపూర్ టి.బి.హాస్పిటల్, ఆర్.జి.ఖార్ వైద్య కళాశాల, కమలా నెహ్రూ హాస్పిటల్, విక్టోరియా ఇన్స్ స్టిట్యూట్, చిత్తరంజన్ కాన్సర్ హాస్పిటల్ మొదలైన సంస్థలను నెలకొల్పాడు. ప్రత్యేకంగా మహిళలు మరియు పిల్లల కోసం చిత్తరంజన్ సేవాసదన్ అనే వైద్యశాలను ఏర్పాటుచేశాడు. మహిళలకు నర్సింగ్ శిక్షణ కోసం ఒక సంస్థను కూడా ప్రారంభించాడు. 1922-1928 మధ్యకాలంలో కలకత్తా మెడికల్ జర్నల్ కు సంపాదకత్వ బాధ్యతలను నిర్వహించాడు.

1925 సంవత్సరంలో రాజకీయ రంగంలో ప్రవేశించి, బారక్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసి సురేంద్రనాథ్ బెనర్జీని ఓడించాడు. 1928లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యుడైనాడు. 1933లో కలకత్తా నగరానికి మేయగ్ గా ఎన్నికైనాడు. 1942లో కలకత్తా విశ్వవిద్యాలయానికి ఉప కులపతిగా, 1943లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కు అధ్యక్షునిగా నియమించబడినాడు. 1948 సంవత్సరంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్య మంత్రి పదవిని చేపట్టాడు.

సంస్మరణం