సనత్ జయసూర్య: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: bn:সানাথ জয়াসুরিয়া
చి r2.7.3) (బాటు: bn:সানাথ জয়াসুরিয়া వర్గాన్ని bn:সনাথ জয়াসুরিয়াకి మార్చింది
పంక్తి 210: పంక్తి 210:
[[ta:சனத் ஜயசூரிய]]
[[ta:சனத் ஜயசூரிய]]
[[ml:സനത് ജയസൂര്യ]]
[[ml:സനത് ജയസൂര്യ]]
[[bn:সানাথ জয়াসুরিয়া]]
[[bn:সনাথ জয়াসুরিয়া]]
[[de:Sanath Jayasuriya]]
[[de:Sanath Jayasuriya]]
[[fr:Sanath Jayasuriya]]
[[fr:Sanath Jayasuriya]]

13:19, 19 జనవరి 2013 నాటి కూర్పు

సనత్ జయసూర్య
మూలం: [1], 2007 14 అక్టోబర్

1969 జూన్ 30 న జన్మించిన సనత్ జయసూర్య (Sanath Teran Jayasuriya) శ్రీలంక కు చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు.1989 నుంచి శ్రీలంక జట్టు తరఫున మంచి ఆల్‌రౌండర్ గా పేరుత్తెచ్చుకున్నాడు. వన్డే క్రికెట్ లో 12,000 పరుగులు మరియు 300 వికెట్లు సాధించిన ఏకైక క్రికెటర్. 403 వన్డేలలో ప్రాతినిద్యం వహించి మొత్తం 12207 పరుగులు చేసినాడు. టెస్టులలో కూడా 107 మ్యాచ్‌లు ఆడి 6791 పరుగులు, 96 వికెట్లు సాధించాడు.

క్రీడా జీవితం, సాధించిన ఘనతలు

1996 ప్రపంచ కప్ క్రికెట్ లో శ్రీలంక విజయానికి అనేక ప్రణాళికలు వేసి కప్ ను గెలిపించిన రికార్డు జయసూర్యది. ఆ ప్రపంచ కప్ లో మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంటు అవార్డు జ్యసూర్యకే వరించింది. 1997 లో విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపైకయ్యాడు. 1999 నుంచి 2003 వరకు శ్రీలంకకు 38 టెస్టు మ్యాచ్ లలో నాయకత్వం వహించాడు. బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండింటిలోనూ ప్రతిభ ప్రదర్శించి మంచి ఆల్‌రౌండర్ గా పేరుతెచ్చుకున్నాడు.

340 పరుగుల ఇన్నింగ్స్ తో శ్రీలంక తరఫున టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాట్స్‌మెన్ గా జయసూర్య రికార్డు స్థాపించాడు. 1997 లో భారత్ పై ఈ ఘనత సాధించాడు. ఇదే సమయంలో రెండో వికెట్ కు రోషన్ మహానామా తో కల్సి 576 పరుగుల పాట్నర్‌షిప్ రికార్డు సృష్టించాడు. ఇది టెస్ట్ క్రికెట్ లో రెండో వికెట్ కే కాదు ఏ వికెట్ కైనా అత్యధిక పరుగుల పాట్నర్‌షిప్ రికార్డు గా ఉండింది. కాని 2006 లో ఈ రెండు రికార్డులు మహేలా జయవర్థనే 374 పరుగుల మహా ఇన్నింగ్స్ తో పటాపంచలై పోయాయి. దక్షిణాఫ్రికా పై మహేలా జయవర్థనే , కుమార సంగక్కర తో కల్సి సాధించిన 624 పరుగుల పాట్నర్‌షిప్ రికార్డు ప్రస్తుతం ప్రపంచ రికార్డుగా కొనసాగుతోంది.

వన్డే లో కూడా 189 పరుగులు చేసి శ్రీలంక తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రికార్డు స్థాపించాడు. అంతేకాదు ఇతను వెస్ట్‌ఇండీస్ కు చెందిన వివియన్ రిచర్డ్స్ తో కల్సి వన్డే లో అత్యధిక స్కోరు సాధించిన బ్యాట్స్‌మెన్ లలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. శ్రీలంక తరఫున అత్యధిక వన్డే స్కోర్లలో నలుగూ ఇతనివే కావడం గననార్హం.

వన్డే క్రికెట్ లో ప్రస్తుతం అతివేగంగా సెంచరీ సాధించిన వాడిగా (17 బంతుల్లో) రికార్డు ఇతని పేరనే ఉంది. 48 బంతుల్లో సెంచరీ సాధించి అతి వేగంగా సెంచరీ సాధించిన రికార్డు సృష్టించిననూ పాకిస్తాన్ కు చెందిన షాహిద్ ఆఫ్రిది అధికమించాడు. వన్డేలలో మొత్తం 241 సిక్సర్లు సాధించి ఇందులోనే ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.వన్డేలలో 10,000 పరుగులు పూర్తిచేసిన వారిలో ప్రపంచంలో నాలుగవ బ్యాట్స్‌మెన్ కాగా శ్రీలంక తరఫున తొలి బ్యాట్స్‌మెన్. 2005 లో 100 టెస్టులు పూర్తి చేసి ఈ ఘనత సాధించిన తొలి శ్రీలంక క్రికెటర్ గానూ రికార్డు నెలకొల్పాడు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఇతను ఈ ఘనత సాధించిన 33 వ క్రికెటర్. ఒకే వన్డే ఓవర్ లో 30 పరుగులు చేసి ఓవర్ లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు కూడా సృష్టించిననూ దక్షిణాఫ్రికా కు చెందిన హర్షెల్ గిబ్స్ ఒకే ఓవర్ లో 36 పరుగులు చేసి ఇతడిని అధికమించాడు.

నాట్‌వెస్ట్ ట్రోఫీలో శ్రీలంక హాలెండ్ పై 438 పరుగులు సాధించి ప్రపంచ రికార్డు స్థాపించగా అందులో 157 పరుగులను (104 బంతుల్లో ) జయసూర్య చేశాడు. వన్డే లో జయసూర్య 150 పరుగుల స్కోరును దాటడం నాల్గవ సారి. ఇందులోనూ ఇతనిదే రికార్డు. 2007 ప్రపంచ కప్ లో ఇతను 2 సెంచరీలు, 2 అర్థ సెంచరీలు సాధించాడు. 2007 లో ఇంగ్లాండు తో జర్గిన కాండీ టెస్టుతో టెస్ట్ క్రికెట్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించాడు. అయిననూ వన్డే లలో కొనసాగుతున్నాడు. అతని చివరి టెస్టులో జేమ్స్ అందెర్సన్ బౌలింగ్ లో ఒకే ఓవర్ లో 6 బౌండరీలు సాధించాడు.

టెస్ట్ సెంచరీలు

సనత్ జయసూర్య సాధించిన టెస్ట్ సెంచరీల వివరాలు

జయసూర్య టెస్ట్ సెంచరీలు
పరుగులు మ్యాచ్ ప్రత్యర్థి నగరం/దేశం స్టేడియం సం.
[1] 112 17 ఆస్ట్రేలియా అడిలైడ్, ఆస్ట్రేలియా ఓవల్ 1996
[2] 113 23 పాకిస్తాన్ కొలంబో, శ్రీలంక సింహళీస్ స్పోర్ట్స్ క్ల బ్ గ్రౌండ్ 1997
[3] 340 26 భారత దేశం కొలంబో ప్రేమదాస స్టేడియం 1997
[4] 199 27 భారత దేశం కొలంబో సింహళీస్ స్పోర్ట్స్ క్ల బ్ గ్రౌండ్ 1997
[5] 213 38 ఇంగ్లాండు లండన్, ఇంగ్లాండు ఓవల్ 1998
[6] 188 50 పాకిస్తాన్ కాండీ, శ్రీలంక అస్గిరియా స్టేడియం 2000
[7] 148 51 దక్షిణాఫ్రికా గాల్లే, శ్రీలంక గాల్లే స్టేడియం 2000
[8] 111 60 భారత దేశం గాల్లే గాల్లే స్టేడియం 2001
[9] 139 68 జింబాబ్వే కాండీ, శ్రీలంక అస్గిరియా స్టేడియం 2002
[10] 145 74 బంగ్లాదేశ్ కొలంబో ముత్తు స్టేడియం 2002
[11] 131 85 ఆస్ట్రేలియా కాండీ అస్గిరియా స్టేడియం 2004
[12] 157 87 జింబాబ్వే హరారే, జింబాబ్వే హరారే స్పోర్ట్స్ క్లబ్ 2004
[13] 253 93 పాకిస్తాన్ ఫైసలాబాదు, పాకిస్తాన్ ఇక్బాల్ స్టేడియం 2004
[14] 107 94 పాకిస్తాన్ కరాచి, పాకిస్తాన్ నేషనల్ స్టేడియం 2004

వన్డే క్రికెట్ సెంచరీలు

వన్డే క్రికెట్ లో సనత్ జయసూర్య చేసిన సెంచరీల వివరాలు

జయసూర్య వన్డే సెంచరీలు
పరుగులు మ్యాచ్ ప్రత్యర్థి నగరం/దేశం స్టేడియం సం.
[1] 140 71 న్యూజీలాండ్ బ్లోయెమ్‌ఫోన్టీన్, దక్షిణాఫ్రికా స్ప్రింగ్‌బక్ పార్క్ 1994
[2] 134 107 పాకిస్తాన్ సింగపూర్ పడాంగ్, సింగపూర్ 1996
[3] 120* 111 భారత దేశం కొలంబో, శ్రీలంక ప్రేమదాస స్టేడియం 1996
[4] 151* 129 భారత దేశం ముంబాయి వాంఖేడే స్టేడియం 1997
[5] 108 136 బంగ్లాదేశ్ కొలంబో సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ 1997
[6] 134* 143 పాకిస్తాన్ లాహోర్ గడాఫీ స్టేడియం 1997
[7] 102 150 జింబాబ్వే కొలంబో సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ 1998
[8] 105 200 భారత దేశం ఢాకా, బంగ్లాదేశ్ బంగబంధు స్టేడియం 2000
[9] 189 217 భారత దేశం షార్జా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ షార్జా స్టేడియం 2000
[10] 103 226 న్యూజీలాండ్ ఆక్లాండ్, న్యూజీలాండ్ ఏడెన్ పార్క్ 2001
[11] 107 232 న్యూజీలాండ్ షార్జా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ షార్జా స్టేడియం 2001
[12] 112 260 ఇంగ్లాండు లీడ్స్, ఇంగ్లాండు హెడింగ్లీ స్టేడియం 2002
[13] 102* 271 పాకిస్తాన్ కొలంబో ప్రేమదాస స్టేడియం 2002
[14] 122 284 ఆస్ట్రేలియా సిడ్నీ, ఆస్ట్రేలియా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ 2003
[15] 106 285 ఇంగ్లాండు సిడ్నీ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ 2003
[16] 120 288 న్యూజీలాండ్ బ్లోయెమ్‌ఫోన్టీన్, దక్షిణాఫ్రికా గుడ్‌ఇయర్ పార్క్ 2003
[17] 107* 319 బంగ్లాదేశ్ కొలంబో ప్రేమదాస స్టేడియం 2004
[18] 130 320 భారత దేశం కొలంబో ప్రేమదాస స్టేడియం 2004
[19] 114 347 ఆస్ట్రేలియా సిడ్నీ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ 2006
[20] 122 359 ఇంగ్లాండు లండన్ ఓవల్ క్రికెట్ గ్రౌండ్ 2006
[21] 152 362 ఇంగ్లాండు లీడ్స్, ఇంగ్లాండు హెడింగ్లీ 2006
[22] 157 363 నెదర్లాండ్స్ ఆంస్టెల్వీన్, నెదర్లాండ్ VRA గ్రౌండ్ 2006
[23] 111 371 న్యూజీలాండ్ నేపియర్, న్యూజీలాండ్ మెక్ లీన్ పార్క్ 2006
[24] 109 381 బంగ్లాదేశ్ పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ట్రినిడాడ్ క్వీన్స్ పార్క్ ఓవల్ 2007
[25] 115 384 వెస్ట్‌ఇండీస్ గుయానా ప్రొవిడెన్స్ స్టేడియం 2007

సాధించిన ప్రపంచ రికార్డులు

  • వన్డే క్రికెట్ లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన రికార్డు (17 బంతుల్లో)
  • ఒకే వన్డే లో అత్యధిక సిక్సర్లు సాధించిన రికార్డు (11) పాకిస్తాక్ చెందిన ఆఫ్రిది (11) తో కల్సి సంయుక్తంగా ప్రథమ స్థానంలో
  • వన్డే క్రికెట్ లో అత్యధిక సార్లు 150 పరుగులకు పైగా చేయడం (4 సార్లు)
  • వన్డే క్రికెట్ లో వరుసగా రెండు సార్లు 150 పరుగులకు పైగా చేయడం
  • వన్డే క్రికెట్ లో అతి వేగంగా 150 పరుగులు చేసిన రికార్డు
  • వన్డే క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు
  • ఒకే ఓవర్ లో రెండు సార్లు 30 పరుగులు చేసిన రికార్డు
  • 400 వన్డేలు ఆడిన తొలి క్రికెటర్ గా రికార్డు.