Coordinates: 42°19′53.76″N 83°2′51″W / 42.3316000°N 83.04750°W / 42.3316000; -83.04750

డెట్రాయిట్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (బాటు: ar:ديترويت، ميشيغان వర్గాన్ని ar:ديترويتకి మార్చింది
పంక్తి 210: పంక్తి 210:
[[af:Detroit]]
[[af:Detroit]]
[[an:Detroit]]
[[an:Detroit]]
[[ar:ديترويت]]
[[ar:ديترويت، ميشيغان]]
[[ast:Detroit]]
[[ast:Detroit]]
[[az:Detroyt]]
[[az:Detroyt]]

01:43, 6 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు

డెట్రాయిట్ నగరం
Flag of డెట్రాయిట్ నగరం
Flag
Official seal of డెట్రాయిట్ నగరం
Seal
ముద్దు పేరు: The Motor City, Motown, Hockeytown, Rock City, The D
నినాదం: "Speramus Meliora; Resurget Cineribus"
(Latin for, "We Hope For Better Things; It Shall Rise From the Ashes")
Location in Wayne County, Michigan
Location in Wayne County, Michigan
Location in Wayne County, Michigan
అక్షాంశరేఖాంశాలు: 42°19′53.76″N 83°2′51″W / 42.3316000°N 83.04750°W / 42.3316000; -83.04750
Country United States
State Michigan
County Wayne
Founded 1701
Incorporation 1806
ప్రభుత్వం
 - Type Mayor-Council
 - Mayor Kenneth Cockrel Jr.
 - City Council
వైశాల్యము
 - City 143.0 sq mi (370.2 km²)
 - భూమి 138.8 sq mi (359.4 km²)
 - నీరు 4.2 sq mi (10.8 km²)
 - పట్టణ 1,295 sq mi (3,354 km²)
 - మెట్రో 3,913 sq mi (10,135 km²)
ఎత్తు [1] 600 ft (183 m)
జనాభా (2007)[2]
 - City 9,16,952
 - సాంద్రత 6,856/sq mi (2,647/km2)
 - పట్టణ 39,03,377
 - మెట్రో 44,67,592
 - CSA 5,405,918
కాలాంశం EST (UTC-5)
 - Summer (DST) EDT (UTC-4)
Area code(s) 313
FIPS code 26-22000[3]
GNIS feature ID 1617959[4]
వెబ్‌సైటు: detroitmi.gov

డెట్రాయిట్ అమెరికాలోని మిషిగాన్ రాష్ట్రంలోని పెద్ద నగరం. అమెరికాలోని మిడ్‌వెస్ట్ ప్రాంతంలో డెట్రాయిట్ నగరం డెట్రాయిట్ నదిపైన ఉన్న ముఖ్యరేవు పట్టణం. కెనడా దక్షిణప్రాంతంలో ఉన్న అమెరికా నగరాలలో డెట్రాయిట్ ఒక్కటీ గుర్తించ తగినంత పెద్ద నగరం. 1701లో ఫ్రెంచ్‌ దేశస్తుడైన ఫ్రెంచ్‌ మాన్ ఆంటోనీ డీ లా మోత్ కాడిలాక్చే స్థాపించబడింది.

డెట్రాయిట్ నగరం అమెరికాలోని సంప్రదాయక ఆటోమోటివ్ కేంద్రం. మోటర్ సిటీ మరియు మోటోటౌన్ డెట్రాయిట్ నగరానికున్న అతి ముఖ్యమైన మారు పేర్లు. 2007లో డెట్రాయిట్ నగరం జనసాంద్రతలో 916,952 మంది నివాసితులతో పదకొండవ స్థానంలో ఉంది. 1.8 మిలియన్ల జనాభాతో డెట్రాయిట్ నగరం అమెరికాలో నాల్గవ స్థానంలో ఉండేది ఆతరవాత నగర ప్రధాన జనవాహిని నగర పురాలను దాటి విస్తరించింది.

డెట్రాయిట్ అనే పేరు కొన్నిసార్లు డెట్రాయిట్ మహానగరానికి వర్తిస్తుంది. 2007 సెన్సస్ బ్యూరో అంచనాల ప్రకారం తొమ్మిది కౌంటీలతో కలసి 5,405,918 జనసంఖ్య కలిగిన మహానగరం అమెరికాలో పదకొండవ స్థానంలో ఉంది. 57,00,000 జనాభా కలిగిన డెట్రాయిట్-విండ్సర్ ప్రదేశం అమెరికా కెనడా దేశాలమద్య ఉన్న కీలక వాణిజ్య కేంద్రం.

చరిత్ర

డెట్రాయిట్ నగరానికి ఈ పేరు డెట్రాయిట్ నది కారణంగా వచ్చింది. ఈ నగరం డెట్రాయిట్ నదీతీరంలో స్థాపించబడి విస్తరించింది. డెట్రాయిట్ నదిపై లీ గ్రిఫిన్ నౌకలో ఫాదర్ హెన్నెపిన్ నదికి ఉత్తర తీరాన ఉన్న ఈ ప్రాంతం ఒప్పందం మూలంగా అభివృద్ధిపరచడానికి అనుకూలమైనదిగా భావించాడు. 1701లో ఆంటోనీ డీ లా మోత్ కాడిలాక్ 51 మంది కెనడా దేశానికి చెందిన ఫ్రెంచ్ దేశస్థులను వెంట పెట్టుకుని పోర్ట్ పంచార్‌ట్రెయిన్ డ్యూ డెట్రాయిట్ పేరుతో ఒప్పందం కుదుర్చుకొని డెట్రాయిట్ నగరానికి పునాది వేశాడు. ఈ ఒప్పందం తరవాత కాలంలో కోమ్ట్ డీ పంచార్‌ట్రియన్ గా నామాంతరం చెందింది. నౌకాదళ మంత్రి 14వ లూయిస్ నాయకత్వంలో ఫ్రెంచ్ దేశస్థులు డెట్రాయిట్‌లో ఉచితంగా స్థలంకేటాయించి ప్రజలను డెట్రాయిట్ వైపు ఆకర్షించారు. ఈ కారణంగా ఇక్కడి జనసంఖ్య 800 నుండి 1765 కు అభివృద్ధి చెందింది. ఫ్రాంకోయిస్ మారీ పికోట్,సియూర్ డీ బెలెస్ట్రే ఫోర్ట్ డెట్రాయిట్ యొక్క ఆఖరి సైకాధికారి(మిలటరీ కమాండర్)(1758-1760)1760 నవంబర్ 29న ఈ ప్రాంతాన్ని బ్రిటిష్‌ ప్రభుత్వానికి అప్పగించాడు.

ఫ్రెంచ్ మరియు ఇండియన్ యుద్ధసమయంలో (1760) బ్రిటిష్ సైన్యం ఈ నగరాన్ని స్వాధీన పరచుకుని దీనికి డెట్రాయిట్ నామాన్ని ధృవీకరించారు. పలు ఓత్వా నాయకుడు చీఫ్ పోంటియాక్ నాయకత్వంలో పోంటియాక్ రిబెల్లియన్ రూపుదిద్దుకుని సైజ్ ఆఫ్ ఫోర్ట్ డేట్రాయిట్ పేరుతో జరిగిన దాడి అనంతరం అనధికారిక ఇండియన్ భూమి మీద అంక్షలతో చేర్చి రాయల్ ప్రొక్లెమేషన్ 1963గా ప్రకటన వెలువడింది. జయ్ ట్రీటీ (1796)పేరుతో జరిగిన ఒప్పందం మూలంగా డెట్రాయిట్ అమెరికా ప్రభుత్వ వశమైంది. ఈ ఒప్పందం ద్వారా పొందిన డెట్రాయిట్ నగరం దాదాపు నగరమంతా మంటలపాలైంది. నదీతీరంలో ఉన్న గోడౌన్ ఒకటి చెక్క ఇళ్ళ ఇటుకల చిమ్నీలు మాత్రమే అవశేషాలలా మిగిలిన నిర్మాణాలు.

డెట్రాయిట్ 1805నుండి 1847 డెట్రాయిట్ మిషిగాన్ రాష్ట్ర రాజధానిగా ఉంది. అగస్టస్ బి వుడ్‌వార్డ్ రూపకల్పనలో నగరాభివృద్ధి జరిగింది. వా ఆఫ్ 1812 సమయంలో డెట్రాయిట్ తిరిగి బ్రిటిష్ సైన్యం వశమైంది. ఈ ఆక్రమణకు సయిజ్ జ్ ఆఫ్ డెట్రాయిట్ అని నామకరణం చేశారు. 1813 నాటికంతా డెట్రాయిట్ నగరాన్ని తిరిగి అమెరికా ప్రభుత్వం స్వాధీనపరచుకుని 1815 నాటికి అమెరికా ప్రభుత్వం కార్పొరేషన్‌గా చేసి నగర హోదాను ఇచ్చింది. వ్యూహాత్మకంగా గ్రేట్ లేక్స్ జలమార్గం వెంట ఉండటం మరొక ప్రత్యేకత. డెట్రాయిట్ నగరం ప్రముఖ రవాణా కేంద్రంగా రూపుదాల్చింది.

సివిల్ వార్‌కు ముందు కెనడా సరిహద్దులను చేరటానికి డెట్రాయిట్ నగర భూగర్భ రైలు మార్గం ప్రధాన కేంద్రం. ఆ సమయంలో లెఫ్టినెంట్ ఉలిసెస్ ఎస్ గ్రాంట్ ఈ నగరంలో నివసించాడు. ఆ తరవాత కాలంలో ఆయన అమెరికాదేశ ప్రెసిడేంట్ హోదాకు చేరుకున్నాడు. ఆయన నివసించిన ఇల్లు ఇంకా ఈ నగరంలో మిచిగాన్ రాష్ట్రం ఫైర్ గ్రౌండ్స్‌లో ఉంది. ఈ అనుబంధం కారణంగా సివిల్ వార్ సమయంలో అనేక డెట్రాయిట్ నగరవాసులు స్వచ్చందంగా సైన్యంలో చేరి యుద్ధంలో పాల్గొన్నారు. సివిల్ వార్ ప్రారంభంలో ఐరన్ బ్రిగేడ్ పేరుతో వాషింగ్టన్ డి.సిని రక్షించారు. అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ ప్రత్యేకంగా మిషిగాన్ రాష్ట్రానికి కృతజ్ఞతలు చెప్పటం ఈ రాష్ట్రవాసులకు గర్వకారణం. అబ్రహాం లింకన్ మరణానంతరం మార్టియస్ పార్క్ ఆవరణలో అక్కడకు చేరిన వేలకొలది శ్రోతల సమీపంలో జార్జ్ ఆర్మ్ స్ట్రాంగ్ కస్టర్ అంజలి ఘటించాడు. వాల్వరిన్స్‌ పేరుతో పిలువబడిన మిషిగాన్ బ్రిగేడ్‌కు కస్టర్ నాయకత్వం వహించాడు.ఆతరవాత వీరిని వాల్వరిన్స్ అని పిలిచేవారు.

1800 ఆఖరి కాలం 1900 ఆరంభకాలంలో గిల్డెడ్ ఏజ్ మాన్‌షన్స్(పురుషుల వసతి గృహాలు)మరియు భవనాలు రూపుదిద్దుకున్నాయి. పడమటి తీర పారిస్‌గా డెట్రాయిట్ నగరం నిర్మాణ సౌందర్యం మరియు సరికొత్తగా థామస్ ఆల్వా ఎడిసన్ ఆధ్వర్యంలో విద్యుత్ దీపాలంకరణ చేయబడిన వాషింగ్టన్ వ్యూహాత్మకంగా గ్రేట్ లేక్స్ తీరంలో నిర్మించిన వాషింగ్టన్ డి.సి బౌల్‌వర్డ్ ప్రత్యేకత సాధించింది.1830 నుండి నౌకలు మరియు నౌకానిర్మాణం అభివృద్ధి చెందడంతో డెట్రాయిట్ నగరం స్థిరంగా అభివృద్ధి చెందుతూ ఉంది. నగరంలో నూతనంగా కర్మాగారాలు స్థాపించడం అభివృద్ధికి మరొక కారణం. 1896లో అత్యధికంగా అభివృద్ధి చెందిన హెన్రీ ఫోర్డ్ వాహన వాణిజ్యం ఇచ్చిన ప్రేరణతో ఒక మ్యాక్‌ అవెన్యూలోఅద్దెకు తీసుకున్న ప్రదేశంలో ఆటోమొబైల్(వాహన) కర్మాగారం ప్రారంభించాడు. 1904లో హెన్రీ ఫోర్డ్ ఈ నగరంలో ఫోర్డ్ మోటర్ కంపెనీని స్థాపించాడు. అలాగే విలియమ్ సి డ్యురాంట్ స్థాపించిన జెనరల్ మోటర్ కంపెనీ మరియు చెవర్లెట్ కంపెనీ,ది డాడ్జి బ్రదర్స్, పాకర్డ్ మరియు వాల్టర్ క్రిస్లర్‌లు డెట్రాయిట్ నగరాన్ని ఆటోమొబైల్ రాజధానిగా మార్చారు.అలాగే గార్బోస్కై మరియు రాపిడ్‌ల ట్రక్ తయారీ కంపెనీల స్థాపనకు ప్రేరణ కలిగించింది.

మధ్యపాన నిషేధం అమలులో ఉన్న కాలంలో అక్రమ రవాణాదారులు ఈ నదిని ముఖ్యమార్గంగా ఉపయోగించుకున్నారు. అప్రతిష్టాకరమైన కెనెడియన్లు అధికంగా కలిగిన పర్పుల్ గ్యాంగ్ రూపుదిద్దుకుని వారు సాగించిన అక్రమ కార్యకలాపాలు చరిత్రలో బాధాకరమైన గుర్తులుగా మిగిలాయి. లో యునైటెడ్ ఆటో వర్కర్స్ డెట్రాయిట్ ఆటో తయారీదారుల మధ్య చెలరేగిన వివాదాలనంతరం లేబర్ సమస్యలు 1930 నాటికి ముగింపుకు వచ్చాయి. ఆ సమయంలో చెలరేగిన లేబర్ సమ్మె కార్యకలాపాలు యూనియన్ లీడర్లైన జిమ్మీ హోఫా మరియు వాల్టర్ ర్యూథర్ లకు కొంత అపకీర్తిని తెచ్చాయి. 1940 లో నగరంలో ప్రపంచంలోని మొదటి ఫ్రీవే(రహదారి)ది డేవిషన్నిర్మాణం జరిగింది.డెట్రాయిట్ నగరంలో రెండవ ప్రపంచయుద్ధ సమయంలో జరిగిన పారిశ్రామికాభివృద్ధితో నగరానికి ఆర్సనల్ ఆఫ్ డెమాక్రసీ అనే మరొక మారు పేరు రావడానికి కారణం అయింది.

20వ శతాబ్ధపు మొదటి సగభాగంలో నగరంలో విస్తరించిన పరిశ్రమల కారణంగా డెట్రాయిట్ నగరానికి వచ్చి అనేక వేలమంది వచ్చి స్థిరపడసాగారు. వీరిలో ప్రత్యేకంగా దక్షిణామెరికా కార్మికులు ఉన్నారు. ఆ కారణంగా ఆసమయంలో డెట్రాయిట్ అమెరికాలో నాలగవ పెద్ద నగరంగా గుర్తించబడింది. అదేసమయంలో అనేక వేల యురేపియన్లు డెట్రాయిట్ నగరానికి ప్రవాహంలా వచ్చి చేరారు. ఈ అసాధారణ అభివృద్ధి కొంత సాంఘిక ఉద్రిక్తలకు దారి తీసాయి. 1950 నాటికి ఆటోమబైల్ రంగంలో ఉద్యోగాలకు పోటీ పెరిగింది. 1950 మరియు 1960 వరకూ నిర్మించబడిన ఫ్రీవే(రహదారి) ఉద్యోగుల రాకపోకలను సులభతరం చేసింది. 1967 లో జరిగిన ట్వెల్త్ స్ట్రీట్ రాయిట్ తరవాత వెలువడిన న్యాయస్థాన ఆదేశాలు శ్వేతజాతీయులు నగరం వెలుపలకు వెళ్ళి నివాసాలు ఏర్పరుచుకోవడానికి దారితీసాయి. ఈ వలసలు నగరంలో గణనీయమైన మార్పులు తీసుకు వచ్చాయి. ప్రజలు ఉద్యోగాలు నగరం వెలుపలకు వెళ్ళడంతో నగర జనసంఖ్య సగానికి దిగివచ్చింది.

డెట్రాయిట్ నగరంలో 1973 నుండి 1979 వరకూ కొనసాగిన చమురు(గ్యాసో లైన్) కొరత విదేశీ లఘు వాహనాలను(చిన్న కార్లు) అమెరికా రోడ్లపై పయనించేలా చేసింది. బచ్ జోన్స్, మసెరాటి రిక్ మరియు చాంబర్స్ బ్రదర్స్ ప్రభావంతో నగరంలో క్రాక్ కోకైన్ మరియు హెరాయిన్ లాంటి మత్తు పదార్ధాల వినియోగం ఎక్కవై యువతపై దుష్ప్రభావం చూపించింది. నిరంతరంగా సాగుతున్న బృహత్ నిర్మాణాలవైపు నగర పెద్దలదృష్టి పడటంతో 1970 లో రినైసెన్స్ సెంటర్ నిర్మించడానికి దోహదమైంది. ఇది నగరంలో మరొక నగరం వర్ణించబడిన బృహత్తర ఆకాశహర్మ్యాల సముదాయం. ఆ తరవాతి కాలంలో 1990 నగరపురాల వలస అనివార్యంగా సాగినా వలసలు చాలావరకు నెమ్మదించాయి అన్నది వాస్తవం.

డెట్రాయిట్ నగరంలో 1980 నిర్వహించబడిన రిపబ్లికన్ నేషనల్ కాన్‌వెన్‌షన్ మహాసభలో రోనాల్డ్ రీగన్ ప్రెసిడెంట్‌గా ప్రతిపాదించబడిన ప్రతిపాద విజయయవంతమై రోనాల్డ్ రీగన్ ను అమెరికా ప్రెసిడెంట్‌ను చేసింది. ఆ తరవాత చాలినంత పోలీస్ బలం లేని కారణంగా మూడు దశాబ్ధాల కాలం మత్తుపదార్ధాల వినియోగం మరియు నేరాలు నగరంలో స్వైర విహారం చేసి ఎల్మ్ హర్స్ట్ బ్లాక్ లాంటి ప్రదేశాలను నిర్మూలించడానికి దారితీసాయి.1980 సమయంలో నిరాదరంగా వదిలివేయబడిన కట్టడాలను పడగొట్టి మత్తుపదార్ధాల అమ్మకందారుల దారులను మూసివేసే ప్రయత్నాలకు ఊపిరి పోసారు. ఇలాంటి ప్రదేశాలు అర్బన్ ప్రెయరీ(నిర్మాణాలను పడగొట్టడం ద్వారా ఏర్పడిన బయలు) లుగా మారాయి.

1990 లో డౌన్‌టౌన్ కేంద్రాంలో అధికంగా కలిగిన చైతన్యం నగర ప్రజలను ఆనందపరచింది. కొమెరికా సెంటర్ ఎట్ డెట్రాయిట్ సెంటర్ 1990 డౌన్ టౌన్‌లో ఆకాశసౌధాల జాబితాలో చేరింది.ఆతరవాత నగరంలో ఎమ్‌జి్‌ఎమ్ కాసినో ,మోటర్సిటీ కాసినో మరియు గ్రీక్ టౌన్ కాసినో ల నిర్మాణం జరిగింది.వాటిలో 2007,2008 లలో వసతిగృహాలు నిర్మించి అదనపు సౌకర్యాలను చేర్చారు.2000 నుండి 2002 వరకు డెట్రాయిట్ టైగర్స్ మరియు డెట్రాయిట్ లైన్స్ కొరకు స్టేడియమ్‌లు నిర్మించబడ్డాయి.1974 తరవాత డెట్రాయిట్ లయిన్స్ కు స్వస్థలంలో స్టేడియమ్ వసతి కలిగింది.డెట్రాయిట్ నగరం 2005 లో ఎమ్‌ఎల్‌బి ఆల్‌స్టార్ గేమ్ ,2006 లో సూపర్ బౌల్ ఎక్స్‌ఎల్ ,2006 వరల్డ్ సీరీస్ మరియు 2007 లో రెస్టెల్ మానియా 23 క్రీడలకు ఆతిధ్యం ఇచ్చింది.ఈ క్రీడలు డౌన్ టౌన్ ప్రదేశంలో అత్యంత అభివృద్ధిని తీసుకువచ్చింది.

డెట్రాయిట్ నగర నదీతీరాలు అభివృద్ధి చేయడానికి తగిన కేంద్రాలయ్యాయి.నదీ తీరంలోని కొన్ని మైళ్ళ పొడవున ఉద్యానవనాలు మరియు ఫౌంటెన్లతో చేరిన డెట్రాయిట్ రివర్ వాక్ నిర్మించబడింది.నగరపురాలలో అర్బన్ డెవలప్‌మెంట్ ఇన్ డెట్రాయిట్ పేరొతో ఆరంభించిన ఈ అభివృద్ధి నగరానికి పర్యాటకుల ద్వారా ఆదాయం కలిగేలా చేసింది.నదీతీరం వెంట అత్యంత ఖరీదైన వాటర్ మార్క్ డెట్రాయిట్ లాంటి కట్టడాలను నగరవాసులు ఇదివరకు చూడని విధంగా నిర్మించడం ఆరంభమైంది.వెల్‌కమ్ టు డెట్రాయిట్,ది రీనైసెన్స్ సిటీ ఫౌండెడ్ 1701 ఫలకం అందంగా నగరంలోకి వచ్చేవారికి అతిధిలా స్వాగతం ఇస్తుంది.

నగర ఉపస్థితి

డెట్రాయిట్ నదీతీరం

డెట్రాయిట్ నగర విస్తీర్ణం యునైటెడ్ స్టేట్ సెన్సస్ బ్యూరో గణాంకాలననుసరించి 143 చదరపు మైళ్ళు ఉంటుంది. అందులో 138.8 చదరపు మైళ్ళు భూభాగం,4.2 చదరపు మైళ్ళు జలభాగం. నగరానికి వాయవ్య భాగంలో ఉన్న యూనివర్శిటీ డిస్ట్రిక్ నగర పరిసర ప్రాంతంలోని ఎత్తైన భూభాగం. డెట్రాయిట్ మరియు ఆగ్నేయ మిచిగాన్ భూభాగం కలిపి డెట్రాయిట్ మహానగరంగా పరిగణిస్తారు. నగరానికి వాయవ్యంలో ఉన్న యూనివర్శిటీ భూభాగం ఎత్తు 670 అడుగులు. డెట్రాయిట్ నదీతీర భూభాగం నగరంలో లోతట్టు ప్రాంతం. దాని ఎత్తు 579 అడుగులు. నగరంలోని హామ్ట్రాక్ మరియు హైలాండ్ పార్కుల ప్రాంతాలను పూర్తిగా చుట్టి డెట్రాయిట్ ప్రవహిస్తూ ఉంది. నగరానికి ఈశాన్యంలో సంపన్నులు అధికంగా నివాసమున్న గ్రాస్ పాయింట్ ఉంది. ది డెట్రాయిట్ రివర్ ఇంటర్నేషనల్ విల్డ్ లఫ్ రెఫ్యూజ్ ప్రాంతం ఉత్తర అమెరికాలోని ఒకే ఒక అంతర్జాతీయ వన్యమృగ సంరక్షణ భూభాగం. మహానగర కేంద్రంలో ప్రతిష్టితమై ఉన్న ఈ సంరక్షణ కేంద్రం దీవులు, నదీతీర చిత్తడి నేలలు, పచ్చిక బయళ్ళు, జలచరాలతో సమ్మిశ్రితమై 48 నది మరియు వెస్ట్రన్ లేక్ ఎర్రీ తీరం వెంట వ్యాపించి ఉన్న సుందర ప్రాంతం. నగరాన్ని కలుపుతూ మూడు రహదార్లు దాటి పోతుంటాయి. అమెరికా మరియు కెనడాల సరహద్దులలో ఉన్న ప్రధాన అమెరికా నగరం డెట్రాయిట్ మాత్రమే. నగరంలో సరిహద్దులు దాటటానికి నాలుగు మార్గాలు ఉన్నాయి. ది అంబాసిడర్ బ్రిడ్జ్ మరియు డెట్రాయిట్ వండ్సర్ టన్నెల్ గుండా వాహనాలలో వెళ్ళే సదుపాయం ఉంది. 'మిచిగాన్ సెంట్రల్ రైల్వే టన్నెల్ మార్గంలో రైలుద్వారా కెనడాను చేరుకోవచ్చు. నాల్గవ మార్గంలో విండ్సర్ సాల్ట్ మైన్ మరియు జంగ్ ఇలాండ్ ప్రాంతం నుండి డెట్రాయిట్ విండ్సర్ ట్రక్ ఫెర్రీ లద్వారా కెనడాను చేరుకోవచ్చు. 15,00 ఎకరాలలో విస్తరించి ఉన్న విండసర్ సాల్ట్ మైన్ సముద్ర తీరానికి 1,100 అడుగుల లోతు వరకు ఉంటుంది.డెట్రాయిట్ సాల్ట్ మైన్ రోడ్ల పొడవు 100 మైళ్ళు.

వాతావరణం

నగరంలోని వాతావరణం నదీ మరియు సరస్సు ప్రభావంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. చలికాలంలో స్వల్పమైన హిమపాతంతో కూడిన చలి ఉంటుంది. చలికాలంలో కొన్ని సమయాలలో ఆకస్మికంగా ఉష్ణోగ్రత పడిపోవడం, అలాగే వేసవిలో కొన్ని సమయాలలో హెచ్చుతూ ఉండటం సహజమే. చలికాలంలో అత్యల్పంగా మైనస్ 10 డిగ్రీల సెంటీగ్రేడ్ వేసవి కాలంలో 90 డిగ్రీల సెంటీ గ్రేడ్ అత్యధిక ఉష్ణం కలిగిన వాతావరణం ఉంటుంది. నవంబర్ నుండి ఏప్రిల్ మాస ప్రారంభం వరకు హిమపాతం ఉంటుంది. హిమపాతం 1 నుండి 10 అంగుళాలు పడుతుంది.

భవన నిర్మాణం

డెట్రాయిట్ నగర జలతీరాలలో విభిన్న సుందర భవన సముదాయాలు చోటు చేసుకున్నాయి.ఆధినిక నిర్మాణాలకు కొంచం ముందుగా నిర్మించబడిన నియోగోతిక్ గోపురాలు కలిగిన డెట్రాయిట్ సెంటర్లో కోమెరికా టవర్ ఆఫ్ డెట్రాయిట్ సెంటర్ ఆర్ట్ డికో సంస్థ ఆధ్వైర్యంలో1993 లో రూపుదిద్దుకున్నాయి. రినైసెన్స్ సెంటర్‌తో చేర్చి వారు ప్రత్యేకత కలిగిన గుర్తించతగిన ఆకాశసౌధాల నిర్మాణం చేసారు.ఉదాహరణగా డౌన్ టౌన్‌లో ఉన్న ఆర్ట్ డికో శైలిలో నిర్మించబడిన గార్డియన్ బిల్డింగ్ మరియు పెనోబ్‌స్కాట్ బిల్డింగ్ అలాగే వేన్‌సెంటర్‌ డిస్ట్రిక్ లో న్యూ సెంటర్‌లో ప్రదేశంలో ఫిషర్ బిల్డింగ్ మరియు కాడిలాక్ ప్యాలెస్ ప్రధానమైన బృహత్తర నిర్మాణాలు.నగర ప్రముఖ భవనాల మద్య దేశంలోనే బృహత్తర నిర్మాణాలైన ఫాక్స్ ధియేటర్ ,ది డెట్రాయిట్ ఒపేరా హౌస్ మరియు డెట్రాయిట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ భవనాలు చోటు చేసుకున్నాయి.

ఒకవైపు డౌన్ టౌన్ మరియు న్యూసెంటర్‌లో ఆకాశసౌధాలు ఉన్నట్లే నగరమంతా సాధారణమైన ఎత్తులో నిర్మించిన నివాసగృహాలతో నిండి ఉన్నాయి.నగరవెలుపలి ప్రాంతాలలో ఎత్తైన నివాసగృహ సముదాయాలు ఉన్నాయి.తూర్పుతీరాలలో గ్రాస్ పాయింట్ మరియు పాలమర్ పార్క్ వరకు విస్తరించి ఉన్న భవన సముదాయాలు వీటిలో కొన్ని.ఈ భవన సముదాయాలు రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు శ్రామిక వర్గం నిర్మించుకున్నవి.ఈ గృహాలు కలపతో చేసిన చట్రాలూ ఇటుక రాళ్ళు వాడి కట్టబడి ఆకాల నిర్మాణ శైలికి అద్దం పడుతున్నాయి.మద్యతరగతి వారు నివసించే పెద్ద పెద్ద ఇటుకరాళ్ళ గృహాలు మరియు పురుషుల వసతి గృహాలూ కలిగిన ప్రాంతాలూ నగరంలో ప్రసిద్ధం.ఇవి బ్రష్ పార్క్,ఉడ్ బ్రిడ్జ్,ఇండియన్ విలేజ్ ,పాల్మర్ ఉడ్స్,షర్ ఉడ్ ఫారెస్ట్ మరియు ఇతరాలు.పడమటి తీరంలో దూరంగా 8 మైళ్ళ రోడ్డు సమీపంలో 1950 లో శ్రామిక వర్గ గృహనిర్మాణాలు ఉడ్ వార్డ్ మరియు జఫర్సన్ సమీపంలో ఉన్న క్రాక్‌ టౌన్ లో తమ ప్రాచీనతను ప్రతిబింబిస్తూ ఉన్నాయి.ప్రస్థుతం ఐరిష్ మరియు బ్రష్ పార్క్ ప్రాంతాలలో అనేక మిలియన్ల డాలర్లతో నిర్మించబడుతున్న నివాస గృహసముదాయాలు ఉన్నాయి.

నగరంలోని ప్రత్యేకంగా కళాత్మక విలువలు కలిగిన భవనాలు జాతీయ చారిత్రక భవనాలుగా గుర్తించబడి సంరక్షించ బడుతున్నాయి.నగరంలో పంతొమ్మదవ శతాబ్ధం ఆఖరి దశలో మరియు ఇరవై ప్రారంభ దశలో నిర్మించబడిన భవనాలు అనేకం ఇంకా సజీవంగా ఉన్నాయి.వాటిలో సెంయింట్ జోసెఫ్ కాథలిక్ చర్చి ,సెయింట్ అన్నే డీ డెట్రాయిట్ కాథలిక్ చర్చ్ లాంటి చర్చీలు అనేకం ఉన్నాయి.

నదీ తీరంలో మూడున్నర మైళ్ళ వరకు విస్తరించి ఉన్న డెట్రాయిట్ ఇంటర్‌నేషనల్ రివర్ ఫ్రంట్ నివాస గృహాలు ఉద్యానవనాల కలయికతో సుందరంగా ఉంటుంది.

పరిసరాలు

డెట్రాయిట్ నగరానికి వైవిధ్యం కలిగిన పరిసరప్రాంతాలు ఉన్నాయి. పునరుద్ధరించబడిన డౌంటౌన్, మిడ్ టన్ మరియు న్యూ సెంటర్ ప్రాంతంలో చారిత్రాత్మకమైన పలు భవనాలతో జనసాంధ్రతను కలిగి ఉన్న తరుణంలో నగర వాయవ్య భాగంలో మరియు నగర సరిహద్దులలో ఖాళీ భూములు పలు సమస్యలు సృష్టిస్తున్నాయి. వాటికి అనేక పరిష్కార మార్గాలు కూడా సూచించబడ్డాయి. 2007 డౌన్‍ టౌన్ ఉత్తమ నగరంగా గుర్తింపు పొందింది.

నగర తూర్పుప్రాంతాలలో ఉన్న లఫయేట్ పార్క్ పునరుద్ధరించబడింది. లుడ్విగ్ మియాస్ వాన్ రోహి రెసిడెంషియల్ జిల్లా 78 ఎకరాల పూర్వం గ్రాటియట్ పార్క్ అని పిలువబడుతుంది. మీస్ వాన్ డర్ రోహె, లుడ్విగ్ హిల్బర్ సియామర్ మరియు ఆల్ఫర్డ్ కాల్డ్వెల్ చేత రూపుదిద్దబడిన ఈ ప్రదేశాంలో 19 ఎకరాలలో వాహనాలకు ప్రవేశం లేని పలు సుందర దృశ్యాలతో ఎత్తు తక్కువైన నివాసగృహాలు నిర్మించబడ్డాయి. ప్రత్యేకంగా నగర ఆగ్నేయ ప్రాంతంలో వలసనివాసితులు నగర పునరుద్ధరణలో తమవంతు సేవలను అందజేసారు. సమీప సంవత్సరాలలో డెట్రాయిట్ నగరం ఆర్ధికంగా అభివృద్ధి చెందుతున్న ఫలితంగా కొత్త నివాసగృహాలు, వ్యాపారంలో అభివృద్ధికి అవకాశాలు అలాగే మెక్సికన్ ఇంటర్నేషనల్ వెల్కం సెంటర్ ప్రాంరంభించబడింది.

నగరంలో ఖాళీ ఆస్తులు కలిగిన పలు పరిసరప్రాంతాలు ఉన్నాయి. అవి నగర ప్రభుత్వరంగ నిర్మాణాలు మరియు సేవలను పొడిగించేలా చేసాయి. 2009లో వస్తురవాణా పరిశోధనలు నగరంలోని నాల్గవవంతు అభివృద్ధి లోపం మరియు ఖాళీగా ఉన్నాయని 10% నగర నివాస గృహాలు ఖాళీగా ఉన్నాయని తెలిపాయి. ఈ పరిశీలనలో నగరంలోని 86% నివాసగృహాలు మంచిస్థితిలో ఉన్నాయని, 9% నివాసగృహాలు కొంచెం మరమ్మత్తు చేయవలసిన స్థితిలో ఉన్నాయని తెలిసింది. ఖాళీ నివాసాల సమస్య పరిష్కారం కొరకు జీర్ణావస్థలో ఉన్న నివాస గృహాలు పడగొట్టబడుతున్నాయి. 2010లో 10,000 గృహాలలో 3,000 గృహాల వరకు పడగొట్టబడ్డాయి. జనసాంద్రతా లోపం నగర ప్రభుత్వ నిర్మాణాల సేవలకు కొంచెం శ్రమను అధికం చేసాయి. ఈ సమస్యకు పరిష్కారంగా సూచించబడిన పలు మార్గాలలో అక్కడి ప్రజలను తరలించి ఆ ప్రాంతాలను వ్యవసాయ భూములుగా మార్చడం ఒకటి.

పరిసరప్రాంతాలలోని ప్రజలను తరలించడానికి ప్రభుత్వ నిధులు మరియు ప్రభుత్వేతర సంస్థలు కావలసిన విశ్వాసం కలిగిస్తున్నారు. 2008 ఏప్రిల్ నగరపాలన వ్యవస్థ ఉపాధి అవకాశాల అభివృద్ధికి మరియు పరిసర ప్రాంతాల పునరుద్ధరణకు 300 మిలియన్ల అమెరికన్ డాలర్లు మంజూరు చేసింది. పరిసరప్రాంతాలలోని బ్రైట్‍మూర్ తూర్పు ఇంగ్లీష్ విలేజ్, గ్రాండ్ నది / గ్రీన్ఫీల్డ్, ఉత్తర-ఎండ్, మరియు ఒస్బోర్న్ పునరుద్ధరణ ప్రణాళికలోని భాగాలు. ఈ ప్రయత్నం కొరకు ప్రభుత్వేతర సంస్థలు నిధులను సమకూర్చే ప్రయత్నాలు కొనసాగాయి. అదనంగా నగరంలోని 1,200 ఎకరాల భూములు పునరుద్ధరిం చబడ్డాయి. ఫార్ ఈస్ట్ సైడ్ ప్లాన్ పేరుతో బృహత్తర ప్రణాళికతో పరిసర ప్రాంత నిర్మాణాలు చేపట్ట బడ్డాయి. మేయర్ పరిసరప్రాంతాలను వాటీ అవసరాలకు అనుగుణంగా వర్గీకరించారు.

నగర సంస్కృతి

డెట్రాయిట్ ప్రజలలో యువ ఉద్యోగుల సంఖ్య క్రమంగా అభివృద్ధి చెందుతున్న కారణంగా చిల్లర వాణిజ్యం కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. అనేకమైన విలాసవంతమైన భనాల నిర్మాణాలు జరుగుతున్నాయి. తూర్పు నది అభివృద్ధి పధకాలు రెండు దేశల మధ్య జరుగుతున్న సహకార అభివృద్ధి పథకాల జాబితాలోకి చేరింది. ఈ పథకాలు డౌన్ టౌన్ లో నదీ తీరంలో పునరుద్దరించబడిన మిడ్ టౌన్ మరియు న్యూ సెంటర్ లోని యువ ఉద్యోగులను ఊరిస్తూ ఉన్నాయి. 2007 గణాంకాలు కొత్త డౌన్ టౌన్ నివాసితులలో 57% ప్రజలు 24-34 మద్య వయసున్న యువత అని వీరు కళశాల పట్టభద్రులని, 34% ప్రజలు ఉన్నత కళాశాల పట్టభద్రులని తెలుపుతున్నాయి. నగరానికి కొంచెం వెలుపల వసతి గృహాలలో నివసిస్తున్న యువతకు డౌన్ టౌన్ కు సమీపంలో నివసించాలన్న కోరికకు ఈ పథకాలు కొత్త ఆశను చిగురింపజేసాయి. డెట్రాయిట్ నగరంలో మద్యపానం సేవించడానికి కనీసం 19 సంవత్సరాల వయోపరిమితి ఉన్న కారణంగా ఒంటారియో మరియు నిన్డ్సర్ ప్రాంత యువకులకు రాత్రి జీవితం అందుబాటులో ఉంది. 2011 అధ్యయనాలు డెట్రాయిట్ ప్రజలలోమూడింట రెండు వంతుల ప్రజలు తరచుగా రాత్రి విందులు వినోదాలలో పాల్గొంటారని తెలుపుతున్నాయి. అలాగే వీరు సంయుక్త రాష్ట్రాలలో అధికంగా నడవగలిగిన శక్తి కలిగిన వారని కూడ తెలుపుతున్నాయి.


== నుండి డెట్రాయిట్ నగరంలో సంగీత కచేరీలకున్న ప్రాముఖ్యం ఈ నగరానికి 'మోటౌన్' అన్న ముద్దు పేరు వచ్చేలా చేసింది. మహానగర ప్రాంతం మొత్తంలో అనేక దేశాలకు చెందిన సంగీత వేదికలున్నాయి. లైవ్ నేస్హన్ చేత నిర్వహించబడే కన్సర్ట్ కార్యక్రమాలు డెట్రాయిట్ నగరమంతా నిర్వహించబడుతునాయి. డి టి ఈ మ్యూజిక్ దియేటర్ మచ్ఫ్రియు ప్యాలెస్ ఆఫ్ అబర్న్ హిల్స్లో బృహత్తర కన్సర్ట్ కచేరీలు జరుగుతుంటాయి. సంయుక్త రాష్ట్రాలలో రెండవ స్థానంలో ఉన్న డెట్రాయిట్ థియేటర్ లో బ్రాడ్ వే కచేరీలు జరుగుతుంటాయి. నగరంలోని ప్రధాన థియేటర్లు 5174 ఆసన వసతి కలిగిన ఫాక్స్ థియేటర్, 1,770 ఆసన వసతి కలిగిన మ్యూజిక్ హాల్, 445 ఆసన వసతి కలిగిన జర్,అన్ థియేటర్, 4,404 ఆసన వసతి కలిగిన, మసోనిక్ టెంపుల్ థియేటర్, 2,765 ఆసన వసతి కలిగిన ది డెట్రాయిట్ ఒపేరా హౌస్,2,089 ఆసన వసతి కలిగిన ది ఫిస్హర్ థియేటర్, 2,220 ఆసన వసతి కలిగిన, ది ఫిల్మోర్ డెట్రాయిట్, సెయింట్ ఆండ్రూస్ హాల్, ది మెజెస్టిక్ థియేటర్ మరియు 2,286 ఆసన వసతి కలిగిన ది ఆర్కెస్ట్రా హాల్ ఉన్నాయి. డెట్రాయిట్ సింఫోనీ ఆర్కెట్రాక్కు ప్రేక్స్హకుల ఆదరణ అధికంగా ఉంది. న్యూయార్క్ నగరంలో బ్రాడ్ వే కార్యక్రాల మీద ఆధిక్యత కలిగి ఉన్న నెదర్లాండ్ ఆర్గనైజేస్హన్ 1922 లో డెట్రాయిట్ ఒపేరా హాల్ ను కొనుగోలు చేసింది.

530,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న మోటౌన్ మోస్హన్ పిక్చర్ స్టూడియోలు డెట్రాయిట్ మరియు దాని పరిసర ప్రాంతాలలో చలన చిత్రాలను చిత్రీకరిస్తూ ఉన్నది. పాన్టియాక్ చెంటర్ పాయింట్ కేంపస్ 4,000 మందికి చలన చిత్ర పరిశ్రమ్ సంబంధిత ఉపాధి కల్పించగలదని ఎదురు చూస్తున్నారు.

డెట్రాయిట్ నగరానికి సుసంపన్నమైన సంగీత వారసత్వం ఉన్నది. కొన్ని దశాబ్ధాలుగా అనేక ప్రదర్శనలు ఇచ్చి కొత్త దశాబ్దంలోకి అడుగు పెట్టింది. నగరంలో ప్రధాన సంగీత ఉత్సవాలు డెట్రాయిట్ అంతర్జాతీయ జాజ్ ఫెస్టివల్, డెట్రాయిట్ ఎలెక్ట్రానిక్ మ్యూజిక్ ఫెస్టివల్, ది మోటర్ సిటీ మ్యూజిక్ కాన్ఫరెన్స్, ది అర్బన్ ఆర్గానిక్ మ్యూజిక్ కాన్ఫరెన్స్, ది సెంటర్ ఆఫ్ కలర్స్ మరియు ది హిప్ హాప్ సమ్మర్ జాజ్.


1940 నుండి నగరంలో నివసిస్తున్న జాన్ లీ హూకర్ నగరంలో దీర్ఘకాలంగా సంగీత కళాకారుడిగా పేరు తెచ్చుకున్నాడు. హూకర్ నగరానికి పొరుగున ఉన్న డెలరీలో నివసిస్తూ ఉన్నాడు. ఉత్తర అమెరికా నగరాలలో డెట్రాయిట్ బ్లూస్ తీసుకురావడానికి డెట్రాయిట్ తీసుకు రాబడిన సంగీత కళాకారులలో హూకర్ ఒకడు. హూకర్ ఫర్చ్యూన్ రికెఎర్డ్స్, ది బిగ్గెస్ట్ ప్రి-మోటన్/సౌల్ లెబుల్ గీతాలు రికార్డుల రూపంలో వెలువడ్దాయి. 1950 నాటికి నగరం జాజ్ సంగీతానికి కేంద్రం అయింది. ఉన్నత కళాకారులు బ్లాక్ బాటం లో కార్యక్రామాలు అందించారు. 1960 ప్రధానంగా వెలుగులోకి వచ్చిన కళాకారులు ట్రమ్ఫెట్ ప్లేయర్ డోనాల్డ్ బైర్డ్ ఒకడు. ఈయన కాస్ టెక్ ఆర్ట్ బ్లేకీ మరియు జాజ్ మెసెంజర్స్ చేసి ఈ రంగంలో ప్రవేశించాడు.

అలాగే బైర్డ్ వెంట పని చేసిన సాక్సోఫోనిస్ట్ పెప్పర్ ఆడమ్స్ గుర్తింపు పొందిన కళాకారులలో ఒకడు. డెట్రాయిట్ లో అంతర్జాతీయ జాజ్ మ్యూజియం, జాజ్ దస్తావేజులు ఉన్నాయి.

1950-1960 మద్య కాలంలో నగరంలో ఉన్న ఇతర ఆర్ &బి ప్రధాన సంగీత కళా కారులు ఆండ్రే విలియంస్ మరియు నథానియేల్ మేయర్. ఈ యన ఫార్చ్యూన్ లేబుల్ మీద ప్రంతీయ జాతీయ మైన విజయవంతమైన గీతాలను అందించాడు. స్మోకీ రాబిన్సన్ అభిప్రాయం ప్రకారం ఒక టీనేజర్ గా స్ట్రాంగ్ తన స్వరంతో ప్ర్స్ధానంగా ఆధిపత్యం సాధించాడు. డెట్రాయిట్ మూడవ అవెన్యూలో నివసిస్తున్న నెదర్లాండ్ దంపతులైన జాన్ బ్రౌన్ మరియు డివోరా బ్రౌన్ చేత నడుపబడుతున్న ఫార్చ్యూన్ లేబుల్ క్రింద గోస్పెల్ రక్ బెల్లీ ఎల్ పి లు మరియు 45స్ వెలువడ్డాయి.


జూనియర్ బెర్రీ గార్డీ మోటౌన్ రికార్డ్స్ సంస్థను స్థాపించాడు. 1960-1970 మధ్య ఈ సంస్థ స్టెవీ వండర్ చర్యల వలన ఉన్నత స్థితికి చేరుకుంది. ది టెంటేస్హన్స్, ది ఫ్zఒర్ టాప్స్, స్మోకీ రాబిన్సన్ & ది మిరాకిల్స్, డైనా రాస్& ది సుప్రీంస్, ది జాక్సన్ 5, మార్తా మరియు ది వందిల్లాస్, ది స్పిన్నర్స్, గ్లేడీస్ నైట్ & ది పస్ మార్విన్ గ్రీ మొదలైనవి వంటి గ్

ఇతాలను వెలువరించి 1960-1970 కాలంలో ఈ సం స్థ చరిత్రను సృస్హ్ట్Mచింది. 2002 మోస్హన్ హౌస్ బ్యాండ్ క్రింద పౌల్ జస్ట్ మన్ డాక్యుమెంటరీ మోటౌన్ నేపధ్యంలో చిత్రించబడింది. ఈ డాక్యుమెంటరీ ఆలన్ స్లట్స్కీ పుస్తకం ఆధారితంగా నిర్మించబడింది. ఆఫ్రికన్ అమెరికన్ కళాకారుల సహకార!తో నడుపబడుతున్న ఆఫ్రికన్ అమెరికన్లకు స్వంతమైన మోటన్ సౌండ్ ప్రసిద్ధ మైన సంగీతంతో సంగీత ప్రపంచంలో సంచలనం సృస్హ్టించింది. 1972 లో గార్డీ చలన చిత్ర నిర్మాణం కొరకు డెట్రాయిట్ నుండి లాస్ ఏంజిల్ కు వెళ్లి తిరిగి డెట్రాయిట్ కు తిరిగి వచ్చాడు. ఆర్&బి యొక్క మరొక కళాకారిణి ఆర్థా ఫ్రాంక్లిన్ మోటౌన్ సౌండ్ కు తీసుకురాబడినా ఆమె దాని కొరకు ఎప్పుడూ పాడనే లేదు.

1960-1970 మద్యకాలంలో ప్రాంతీయ కళాకారులు రాక మొదలైంది. ది ఎమ్ సి5, ది స్టూజెస్, బాబ్ సేగర్, అంబాయ్ డ్యూక్స్ మొదలైన వారు టెడ్ నగ్లెట్, మిట్చ్ రైడర్, ది డెట్రాయిట్ వీల్స్, రేర్ ఎర్త్, అలైస్ కూపర్ మరియు సుజీ క్వాట్రో లలో పని చేసారు. 1999 లో నిర్మించబడిన గ్రూప్ కిస్ చిత్రం డెట్రాయిట్ నగరానికి రాక్ సంగీతానికి ఉన్న అనూబంధం వెలుగులోకి వచ్చింది. 1980 ల్ ఒ హార్డ్ కోర్ పంక్ రాక్ సంగీతానికి డెట్రాయిట్ కేంద్ర బిందువు అయింది. నరం నుండి దాని పర్రిసర ప్రాంతాల నుంది అనేక ప్రాంతీయ మరియు జాతీయ బ్రాండు సంస్థలు నెక్రాస్, ది మీట్ మెన్ మరియు నెగేటివ్ అప్రోచ్ వంటివి తలెత్తాయి.

1990 మరియు కొత్త మైలేనియం నగరం అనేక హిప్ హాప్ ఆర్ట్స్టులను తయారు చేసింది. హిప్ హాప్ నిర్మాతలైన జె.డిల్లా, రేపర్ మరియు ఎస్తం మరియు హిప హాప్ డ్యూ లు ఎమినంది హిప్-హాప్ సంగీతంతంతో అత్యధిక అమ్మకాలను సాధించింది. డెట్రాయిట్ తెక్మ్యూజిక్ పుట్తిల్లు. జాన్ అట్కిన్స్, డెర్రిక్ మే మరియు కెమిన్ సౌడర్సన్ వంటి వారు తెక్ మ్ఞూజిక్ లో తమ ప్రతిభను చాటుకున్నారు.

పర్యాటక రంగం

నగరంలోని అనేక పురాతన వస్తు ప్రదర్శన శాలలు కల్చరల్ సేటర్ పక్కన ఉన్న "స్టేట్ యూనివర్సిటీ " మరియు " ది కాలేజ్ ఫర్ క్రియేటివ్ స్టడీస్" చుట్టు పక్కల ఉన్నాయి. పురాతన వస్తు ప్రదర్శన శాలలు వరుసగా ది డెట్రాయిట్ ఇన్స్టిత్యూట్ ఆఫ్ ఆర్ట్స్ , ది డెట్రాయిట్ హిస్టారికల్ , చార్లెస్ ఎః. రైట్ మ్యూజియం ఆఫ్ ఆఫ్రికన్ అమెరికన్ హిస్టరీ, ది డెత్రాయిట్ సైన్స్ సెంటర్ అలాగే డెట్రాయిట్ ప్రభుత్వ గ్రంధాలయ ప్రధాన లార్యాలయం మొదలైనవి. ఇతర సాంస్కృతిక పురాతన వస్తు ప్రదర్శన శాలలు మోటౌన్ హిస్టారికల్ మ్యూజియం, ది పివాదిక్ పాటరీ స్టూడియో అండ్ స్కూల్, ది టస్క్జీ అయిర్ మ్యూజియం, ఫోర్ట్ వేన్, ది డోసిన్ గ్రేట్ లేక్స్ మ్యూజియం, ది మ్యూజియం ఆఫ్ కాంటెంపరరీ ఆర్ట్ డెత్రాయిట్, ది కాంటెంపరరీ ఆర్ట్స్ ఇన్స్టియూట్ ఆఫ్ డెట్రాయిట్ మరియు బిల్లీ ఇస్లే కన్సర్వేటరీ. 2010 లో మిడ్ టౌన్ లో 1600 చదరపు అడుగుల విస్తీర్ణంలో గి.ఆర్ ఎన్' నండీ ప్రదర్శన శాల తెరవబంది. అమెరికా మరియు డెట్రాయిట్ ముఖ్యమైన చరిత్ర సంయుక్త రాస్హ్ట్రాల అతి పెద్ద ప్రదఋఅనశాల కూడై లోని హెన్రీ ఫోర్డ్ లో ప్రదర్శించబడుతుంది. ది డెట్రాయిట్ హిస్టారికల్ సొసైతీ ప్రంతీయ చర్చిల గురించిన సమాచారం అందిస్తుంది. స్లైసర్స్ మరియు మేన్స్హన్ మొదలైన ప్రదేశాల పర్యటన సమాచారం అందిస్తుంది. అదే సయంలో డెట్రాయిట్ లోపల అతిథి పర్యటనలు, విద్య సంబంధిఅత కార్యక్రమాలు మరియు డౌన్ టౌన్ స్వాగత కేంద్రం ఉన్నాయి. డెట్రాయిట్ ఓ ఉన్న ఇతర పర్యాటక ఆకర్స్హణలు రాయల్ ఓక్ లో ఉన్న జంతుప్రదర్శన శాల, బ్లూం ఫీల్డ్ హిల్స్ లో ఉన్న్ క్రాన్ బ్రూక్ ఆర్ట్ మ్యూజియం, బిలె ఇస్లే లో ఉన్న ది అన్నా స్క్రిప్స్ వైట్ కోబ్ అబ్సర్వేటరీ, అబర్న్ హిల్ల్స్ లో ఉన్న వాటర్ పి.క్రిస్లర్ లో మొదలైనవి.


నగర వినోద కేంద్రాలుగా ది సిటి గ్రీక్ టౌన్ మరియు త్రీ డౌన్ డౌన్ టౌన్ కాసినో రిసార్ట్ హోటెల్స్ వంతివి ఉన్నాయి. 150 కంటే అధికంగా ఆహార సంబంధిత విక్రయశాలలు ఉన్న ది ది ఈస్టర్న్ మార్కెట్ ఫార్మర్స్ డిస్ట్రిబ్యూస్హన్ సెంటర్ సంయుక్త రాస్హ్ట్రాలలో పెద్ద ఫ్లవర్ బెడ్ మార్కెట్ గా గుర్తింపు పొందింది. శనివారాలలో దాదాపు 45,000 వేల మంది ఈస్టర్న్ మార్కెట్లో కొనుగోలు చేస్తారు. వేన్ స్టేట్ యూనివర్సిటీ మరియు హెన్రీ ఫోర్డ్ హాఇటల్ లకు మిడ్ zతౌన్ మరియు న్యూ టౌన్ సెంటర్ కేంటర్ మద్యలో ఉంటాయి. దాదాపు 50,000 మంది నివసిస్తున్న మిడ్ టౌన్ లో ఉన్న మ్యూజియంలు మరిఉ సాంస్కృతిక కేంద్రాలు వేలమంది పర్యాటలులను ఆకర్స్హిస్తునాయి. ఉదాహరణగా మిడ్ టౌన్ లో జరిగిన డెట్రాయిట్ ఫెస్టివల్ ఆఫ్ ది ఆర్ట్స్ దాదాపు 35,000 సందర్శకులను ఆకర్స్హించింది.


ఎలెక్ట్రానిక్ మ్యూజిక్ ఫెస్టివల్ , ఇంటర్నేస్హనల్ జాజ్ ఫెస్టివల్, ది కంట్రీ మ్యూజిక్ హ్యూడౌన్, ది వుడ్వర్డ్ డ్రీం క్రూసీ, ది ఆఫ్రికన్ వరల్డ్ ఫెస్టివల్, నియోల్ నైట్ మరియు డేలీ ఇన్ ది అల్లే వంటి వారిస్హిక ఉత్సవాలు జరుగుతుంటాయి. డౌన్ టన్ లోపల మార్స్హిస్ పార్ఖ్ పెద్ద వేడుకలకు ఆతిథ్యం ఇస్తుంది. వాటిలో మోటౌన్ వింతర్ బెస్ట్ ప్రధానమైనది. అంతర్జాతీయ ఆటో మొబైల్ సంప్రదాయక కేంగ్రంగా నగరం నగరం నార్త్ అమెరికన్ ఇంటర్నేస్హనల్ ఆటో స్హో కు 1924 నుండి ఆతిథ్యం ఇస్తుంది. జాతీయంగా అతి పెద్దదని గుర్తింపు తెచ్చుకున్న థాంక్స్ గివింగ్ పేరేద్ కూడా నగరంలో జరుగుతున్న ఉత్సవాలలో ప్రధానమైనదే. ఐదు రోజులాటు ఇంతర్నేస్హనల్ రివర్ ఫ్రంట్ వద్ద జరిగే రివర్డేస్ ఉత్సవాలలో జరిగే ఫైర్ వర్క్స్ చూడడానికి దాదాపు 3 మిలియన్ల ప్రేక్స్హకుజు హాజర్ ఒఉతారు.

కోల్ మామ్ యంగ్ మునిసిపల్ సెంటర్ వద్ద ఉన్న "స్పిరిట్ ఆఫ్ డెత్రాయిట్ " శిల్పం ప్రముఖ రౌర శిపంగా మన్నలను అందుకుంది. ఈ శిపం తరచుగా డెట్రాయిట్ నగరానికి చిహ్నంగా వాడుతుంతారు. ఈ శిపం డెట్రాయిట్ క్రీడాకారులు విజయం సాధించిన సందర్భాలలో స్రోర్ట్స్ ద్రెసును ధరిస్తుంది. జఫర్సన్ మరియు వుడ్వార్డ్ అవెన్యూ ల కూదలిలో జ్యూ లూయిస్ జ్నాపక చిహ్నం 1986 అకోబర్ 16 తేదీన దేశానికి సమర్పించబడింది. ఈ శిపాన్ని రాబర్ట్ గ్రహం స్పృట్స్ ఇల్లస్ట్రేత్ కొరకు తయారు చేసాదు.

1986లో హైడెల్ బర్ఘ్ ప్రాజెక్ట్ పేరుతో కళాకారుడైన కైరీ గైటన్ ఒక వివాదాదమైన వీధి ప్రదర్శన ఏర్పాటు చేసాడు. ఈ ప్రదర్శన కొరకు ఆయన హైడల్ బర్ఘ్ దాని సమీపం లో ఉన్న పనికిరాని కారు భాగాలను, దుస్తులను, స్హూస్ వంటివి వాడాడు. గైటన్ ఇక్కడి నివాసితులు మరియు పర్యాటకుల సాయంతో ఈ ప్రదర్శన ఈ ప్రాంతంఓ కొనసాగిస్తూనే ఉన్నాడు.

]

ప్రచార మాద్యమం

ఆర్ధిక రంగం

జన సంఖ్య

చట్టం ప్రభుత్వం

రాజకీయాలు

నేరం

విద్య

నగర నిర్మాణం

ఆరోగ్యం

ప్రయాణ సౌకర్యాలు

మూలాలు

  1. "USGS detail on Detroit". Retrieved 2007-02-18.
  2. "Annual Estimates of the Population for Incorporated Places Over 100,000, Ranked by July 1, 2006 Population: April 1, 2000 to July 1, 2006". U.S. Census Bureau. Retrieved 2007-06-28.
  3. "American FactFinder". United States Census Bureau. Retrieved 2008-01-31.
  4. "US Board on Geographic Names". United States Geological Survey. 2007-10-25. Retrieved 2008-01-31.