హాంగ్‌కాంగ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 131: పంక్తి 131:


ఎగ్జిక్యూటివ్ కౌంసిల్, ది సివిల్ సర్వీసు, ది లెజిస్లేటివ్ కౌంసిల్ మరియు జ్యుడీషియరీ కౌంసిల్ అనేవి హాంగ్ కాంగ్ పాలనా మూలస్థంభాలు. ఎగ్జిక్యూటివ్ కౌంసిల్ అధ్యక్షుడు ఎలెక్షన్ కమిటీ చేత ఎన్నుకొనబడి కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడతాడు. మేధాసంపత్తి అనుసరించి నియమించబడే సివిల్ నిర్వహణాధికారి రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగ నిర్వహణా విధానాల రూపకల్పన మరియు ప్రజలకు ప్రభుత్వపరమైన సేవలు అందుబాటులోకి తీసుకురావడం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు. శాసన సభాసభ్యులైన 60 మంది సభ్యులు హాంగ్ కాంగ్ శాశ్వత పౌర సభ్యత్వం కలిగిన ఐదు భూభాగాల ప్రజలచేత నేరుగా ఎన్నిక చేయబడిన వారు సగం, వ్యాపార ప్రముఖులు మరియు క్రియాత్మక రంగాలు నిర్ధేశించబడిన వారితో ఎన్నిక చేబడిన వారై ఉంటారు. మొత్తం శాససన సభ్యులు స్పీకర్ బాధ్యతను వహించే శాసనసభాధ్యక్షుని ఆధ్వర్యంలో పని చేస్తారు. న్యాయాధికారులను ఇండిపెండెంట్ కమీషన్ నియమిస్తుంది.
ఎగ్జిక్యూటివ్ కౌంసిల్, ది సివిల్ సర్వీసు, ది లెజిస్లేటివ్ కౌంసిల్ మరియు జ్యుడీషియరీ కౌంసిల్ అనేవి హాంగ్ కాంగ్ పాలనా మూలస్థంభాలు. ఎగ్జిక్యూటివ్ కౌంసిల్ అధ్యక్షుడు ఎలెక్షన్ కమిటీ చేత ఎన్నుకొనబడి కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడతాడు. మేధాసంపత్తి అనుసరించి నియమించబడే సివిల్ నిర్వహణాధికారి రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగ నిర్వహణా విధానాల రూపకల్పన మరియు ప్రజలకు ప్రభుత్వపరమైన సేవలు అందుబాటులోకి తీసుకురావడం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు. శాసన సభాసభ్యులైన 60 మంది సభ్యులు హాంగ్ కాంగ్ శాశ్వత పౌర సభ్యత్వం కలిగిన ఐదు భూభాగాల ప్రజలచేత నేరుగా ఎన్నిక చేయబడిన వారు సగం, వ్యాపార ప్రముఖులు మరియు క్రియాత్మక రంగాలు నిర్ధేశించబడిన వారితో ఎన్నిక చేబడిన వారై ఉంటారు. మొత్తం శాససన సభ్యులు స్పీకర్ బాధ్యతను వహించే శాసనసభాధ్యక్షుని ఆధ్వర్యంలో పని చేస్తారు. న్యాయాధికారులను ఇండిపెండెంట్ కమీషన్ నియమిస్తుంది.

అధికార మార్పిడి సమయంలో ప్రధానంగా చర్చించబడి వాగ్ధానం చేయబడిన బేసిక్ లా అమలు సధారణ ప్రజామోదం పొందిది. 2002 లో


== వెలుపలి లింకులు ==
== వెలుపలి లింకులు ==

06:12, 7 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు

香港特別行政區
Hong Kong Special Administrative Region
Flag of Hong Kong Hong Kong యొక్క Emblem
జాతీయగీతం
March of the Volunteers[1]
Hong Kong యొక్క స్థానం
Hong Kong యొక్క స్థానం
రాజధానిNone[2]
అతి పెద్ద district (population) Sha Tin District
అధికార భాషలు English, Chinese[3]
ప్రభుత్వం
 -  Chief Executive Donald Tsang
Establishment
 -  Convention of Chuenpeh January 25 1841 
 -  Treaty of Nanking August 29 1842 
 -  Japanese occupation December 25 1941August 15 1945 
 -  Transfer of sovereignty July 1 1997 
విస్తీర్ణం
 -  మొత్తం 1,104 కి.మీ² (not ranked)
426.4 చ.మై 
 -  జలాలు (%) 4.6
జనాభా
 -  2007 అంచనా 6,921,700 (96th)
 -  2001 జన గణన 6,708,389 
 -  జన సాంద్రత 6,352 /కి.మీ² (3rd)
16,469.6 /చ.మై
జీడీపీ (PPP) 2006 అంచనా
 -  మొత్తం US$263.1 billion (38th)
 -  తలసరి US$38,127 (6th)
జీడీపీ (nominal) 2006 అంచనా
 -  మొత్తం US$189.5 billion (36th)
 -  తలసరి US$27,466 (28th)
జినీ? (2006) 0.533 (high
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) Increase 0.927 (high) (22nd)
కరెన్సీ Hong Kong dollar (HKD)
కాలాంశం HKT (UTC+8)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .hk
కాలింగ్ కోడ్ +852

ప్రవేశిక

హాంగ్ కాంగ్ (చైనీస్: 香港) పీపుల్స్ రిపబ్లిక్ చైనా(పి.ఆర్.సి) ప్రత్యేక పాలనా ప్రదేశం (స్పెషల్ అడిమినిస్ట్‍రేటివ్ రీజన్ ఎస్.ఆర్.పి). ఈ నగరం పీర్ల్ నది సౌత్ సీ సముద్రంలో సంగమించే ప్రదేశంలో దక్షిణ చైనా సముద్రతీరంలో ఉంది. ఈ నగరం అతి ఖరీదైన ఆకాశసౌధ సముదాయాలకు మరియు లోతైన ఓడరేవుకు ప్రఖ్యాతి చెందింది. ఈ నగరవైశాల్యం 1'104 చదరపు కిలోమీటర్లు, జనసంఖ్య 7 మిలియన్లు. హాంగ్ కాంగ్ ప్రపంచంలో అత్యధిక జనసంఖ్య కలిగిన నగరం. హాంగ్ కాంగ్ లోని 95% ప్రజలు సంప్రదాయ చైనీయులు, మిగిలిన 5% ప్రజలు ఇతర సంప్రదాయాలకు చెందిన వారు. హాంగ్ కాంగ్ యొక్క "హాన్ చైనీస్" ప్రజలు పరిసర గుయంగ్డోంగ్ రాష్ట్రభూ భాగంలో లో ఉన్న గ్వాంగ్ఝౌ మరియు తైషన్ ప్రదేశం పూర్వీకంగా కలిగిన వారు.

మొదటి ఓపియం యుద్ధానంతరం హాంగ్ కాంగ్ బ్రిటిష్ కాలనీలో ఒక భాగం అయింది. సహజంగా ఉన్న హాంగ్ కాంగ్ ద్వీపాన్ని స్వాధీనపరచుకున్న తరువాత కాలనీ సరిహద్దులను 1860 లో క్రమంగా పెంచుకుంటూ కోలూన్ ద్వీపకల్పం వరకు విస్తరించి 1868 నాటికి సరికొత్త భూభాగం ఏర్పాటు అయింది. పసిఫిక్ యుద్ధానంతరం హాంగ్ కాంగ్‍ను జపాన్ వశమైంది. తరువాత హాంగ్ కాంగ్ బ్రిటిష్ ప్రభుత్వం తిరిగి స్వాధీనపరచుకుని 1997 వరకు తమ ఆధీనంలో ఉంచుకుంది. తరువాత హాంగ్ కాంగ్‍ మీద స్వాధీనత సాధించుకున్న చైనా కాలనీ ప్రభుత్వం సమయంలో ఉన్నప్పటిలా పరిపాలనా నిర్వహణలో అతి తక్కువ జోక్యం మాత్రమే చేసుకుంది. ఆ సమయంలో హాంగ్ కాంగ్‍ మీద ప్రస్థుత సంస్కృతి ప్రభావాన్ని " ఈస్ట్ మీట్స్ వెస్ట్ " అని అభివర్ణించారు. 2009 సంస్కరణలు అమలయ్యే వరకు ఇంగ్లాండ్ విద్యావిధానం అనుసరించడానికి సడలింపు లభించింది.

" ఒక దేశం రెండు విధానాలు " అన్న నియమావళి అనుసరించి ప్రధన చైనా భూభాగం కంటే హాంగ్ కాంగ్‍ లో రాజ్యాంగం విభిన్నంగా ఉంటుంది. హాంగ్ కాంగ్‍ స్వతంత్ర న్యాయవ్యవస్థ "కామన్ లా ఫ్రేం వర్క్ " ఆధారంగా పని చేస్తుంది. హాంగ్ కాంగ్‍ చట్టమూలాలు, రాజ్యాంగ పత్రం తమపాలనా విధానాలలో విదేశీ వ్యవహారాలు, సైన్యం మరియు రక్షణ మినహా మిగిలిన అన్ని రాజ్యాంగ వ్యహారలలో స్వతంత్రమైన విశేష అధికారాలను ఇస్తుంది. వివిధ పార్టీల విధానం, స్వల్ప ప్రదేశంలో ఎన్నికల నిర్వహణ అధికారం చట్టవ్యహారాలలో సగం ఈ స్వతంత్ర పాలనలో భాగాలే. 400 నుండి 1,200 సభ్యుల కమిటీ చేత ఎన్నికొనబడిన ప్రధాన పాలనాధికారి హాంగ్ కాంగ్ పరిపాలనాధికారిగా బాధ్యత వహిస్తాడు. 20 సంవత్సరాల చైనీయుల పాలనలో హాంగ్ కాంగ్ పాలనా విధానం ఇలాగే కొనసాగుతుంది.

చట్టం, పన్నువిధింపు, స్వతంత్ర వాణిజ్యం, ద్రవ్యం వంటి ప్రత్యేకతలతో ప్రధాన పెట్టుబడి దారి ఆర్ధిక వ్యవస్థ కలిగి అంతర్జాతీయ ఆర్ధిక కేంద్రంగా హాంగ్ కాంగ్ విలసిల్లుతుంది. హాంగ్ కాంగ్ డాలర్ ప్రపంచ సంతలో క్రయవిక్రయాలు జరుగుతున్న ద్రవ్యరూప వ్యాపారంలో ఎనిమిదవ స్థానంలో ఉంది. భూమి కొరత కారణంగా అతి సమీపంగా నివాస భవన నిర్మాణం జరుగుతుంది. ఈ కారణంగా నగరం ఆధునిక నిర్మాణ కౌశలానికి ప్రధాన కేంద్రంగా గుర్తింపు పొందింది. ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన నగరంగా కూడా హాంగ్ కాంగ్ ప్రత్యేక స్థానంలో ఉంది. జనసాంధ్రత కారణంగా ప్రభుత్వ వాహనాలలో రద్దీ పెరిగింది. ప్రయాణపు వ్యయం 90% అధికం అయింది. ఇది ప్రపంచంలో అత్యధికం. వివిధ విషయాలలో హాంగ్ కాంగ్ అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆర్ధిక స్వాతంత్రం, ద్రవ్యం, ద్రవ్య ఆర్ధిక పోటీ, జీవన నాణ్యత, అవినీతి అవగాహన, మనవ వనరుల అభివృద్ధి మొదలైనవి. ప్రంపంచ అధ్యయనాలు ప్రపంచంలో అన్ని దేశాలకంటే హాంగ్ కాంగ్ వాసుల జీవన కాలం అధికమని తెలియజేస్తున్నాయి.

నామచరిత్ర

ఈ నగరానికి కాంటెనస్ లేక హక్కా "香港" అనే శబ్ధం నుండి వచ్చింది. దీనికి అర్ద్గం సువాసన రేవు. ఈ పేరు 1842 కి మముందు అతి చిన్న ద్వీపం ప్రస్థుత అబర్దీన్ హార్బర్ లేక 香港 仔 గాంగ్2, జాయ్ 2 " లిటిల్ హాంగ్ కాంగ్ " ను సూచిస్తుంది. ఈ ద్వీపాలు అబర్దీన్ ద్వీపం మరియు హాంగ్ కాంగ్ దక్షిణం లో ఉంటాయి. ద్వీపాలను బ్రిటిష్ నావికిలు మత్స్యకారుల ణూండి ఒప్పందం మూలంగా మొదటి సారిగా స్వాధీనం చేసుకున్నారు.

ఈ పేరు పరిశోధనలు సువాసన అనేపదం పీర్ల్‍ నది నుండి స్వచ్చజలాలు సాగరంలో సంగమిస్తున్న కారణంగా వచ్చిందని భావించబడుతుంది. మరొక కారణంగా విక్టోరియా రేవు ఉత్తర కోలూన్ వద్ద వరుసగా ఉన్న అగరిబత్తి ఎగుమతులు అబర్దీన్ రేవు వద్ద నిలువ ఉంచడంగా భావించబడుతుంది. 1842 లో " ది ట్రీ టీ ఆఫ్ నాన్ కింగ్ " తరువాత హాంగ్ కాంగ్ అనే పేరు అధికార దస్తావేజులలో మొదటిసారిగా నమోదు అయింది. ఈ నమోదు తరువత ఈద్వీపాలు చుట్టూ ఉన్న ప్రాంతం బ్రిటిష్ కాలనీ ఆధీనంలోకి పరిపూర్ణంగా వచ్చింది.

చరిత్ర

పురావస్తు పరిశోధనాశాఖ పర్శోధనలు 35,000 నుండి 39,000 ముందు " చెక్ లాప్ కోక్ ఏరియా " లో మానవులు నివసించినట్లు ఆధారాలు ఉన్నట్లు భావిస్తున్నారు. అలాగే శాయి కుంగ్ ద్వీపకల్పం ప్రాంతంలో 6,000 సంవత్సరాల ముందు మానవులు నివసించినట్లు భావిస్తున్నారు. " వాంగ్ తేయీ తుంగ్ మరియు త్రీ ఫాతింస్ కోవ్ " అనే రెండు ప్రదేశాలు పురాతన మానవనివాసిత ప్రదేశాలుగా భావిస్తున్నారు. త్రీ ఫాతింస్ కోవ్ నదీలోయ నివాసిత ప్రాంతం. అలాగే తేయీ తుంగ్ లిథిక్ తయారీ ప్రదేశంగా భావిస్తున్నారు. త్రవ్వకాలలో లభించిన నియోలిథిక్ కళాఖండాలు సూచిస్తున్న సాంస్కృతి బైయూకు తరలి వెళ్ళే వరకు నివసించిన చీ జాతి ప్రజలకు ఉత్తర చైనాలో నివసించిన లాంగ్షన్ సంస్కృతితో విభేదిస్తుంది. షాంగ్ సంరాజ్యానికి చెందిన ఎనిమిది శిలాశాసనాలు సమీప ద్వీపాలలో లభించాయి.

క్రీ.పూ 214 చైనా మొదటి చక్రవర్తి " క్విన్ షి హంగ్ " జియ్జొజీ లో బైయూ గిరిజనులను జయించి మొదటిసారిగా ఈ ప్రదేశాన్ని తన సామ్రాజ్యంతో విలీనం చేసాడు. ఆధునిక హాంగ్ కాంగ్ నాంహీ కమాండ్రీలోనూ రాజధాని పాన్యూ లోనూ ఉంటూ వచ్చింది. ఈ ప్రాంతం క్రీ.పూ 204 జనరల్ ఝో తూ స్థాపించ బడి పతనమైన నాన్యూ సాంరాజ్యంలో భాగంగా ఉంటూ వచ్చింది. క్రీ.పూ 111 లో నన్యూ సాంరాజ్యాన్ని యూ చక్రవర్తి జయించాడు. పురావస్తు పరిశీలకుల ఆధారాలు ఈ సయంలో ఇక్కడ నివాసితుల సంఖ్య అభివృద్ధి చెంది సమృద్ధిగా ఉప్పు ఉత్పత్తి ఆరంభం అయింది. కోలూం ద్వీపకల్పంలో ఉన్న లీ చాంగ్ యుక్ సమాధి హాన్ సాంరాజ్య కాలంలో నిర్మించబడింది.

టాంగ్ సాంరాజ్యం కాలంలో " గాంగ్ డాంగ్బ్" ప్రదేశం వాణిజ్యకేంద్రంగా విలసిల్లింది. 736 లో టాంగ్ సాంరాజ్య చక్రవర్తి క్సుయాన్ జాంగ్ ఈ ప్రాంతంలో తీరప్రాంత రక్షణార్ధం త్యూం మున్ అనే సైనిక పట్టాణాన్ని స్థాపించాడు. 1075లో నార్తన్ సాంగ్ సాంరాజ్యం ఆధ్వర్యంలో ఈ కొత్తప్రదేశ సమీపంలో మొదటి విలేజ్ స్కూల్, లీయింగ్ కాలేజ్ స్థాపన జరిగింది. 1276 మంగోల్ దండయాత్ర సమయంలో ది సదరన్ సాంగ్ సాంరాజ్య న్యాయస్థానం ఫ్యూజియన్ కు మార్చబడింది. తరువాత లాంట్యూ తరువాత సంగ్ వాంగ్ టాయ్(ప్రస్తుతం ఇది కూలూన్ నగరం) మార్చబడింది. యామెన్ యుద్ధంలో ఓడిపోయి అధికారాన్ని పోగొట్టుకున్న బాల చక్రవర్తి బింగ్ ఆఫ్ సాంగ్స్ ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయం తీసుకున్నాడు. చక్రవర్తి అనుచరుడైన హ్యూ వాంగ్ ఇప్పటికీ హాంగ్ కాంగ్ వాసుల చేత ఆరాధించబడుతున్నాడు.

1513 లో పోర్చుగీసు నావికుడు యూరప్ యాత్రికుడు జార్జ్ ఆల్వర్స్ కొత్త సరికొత్త భూభాపు వెతుకులాటలో ఒక భాగంగా ఇక్కడకు వచ్చినట్లు మొట్టమొదటి రికార్డులు సూచిస్తున్నాయి. ఇక్కడ వ్యాపార ఒప్పందాలు ముగిసిన తరువాత పోర్చుగీసు వ్యాపారులు దక్షిణ చైనాలో వ్యాపారం చేయడం మొదలు పెట్టారు. అదే సమయం వారు " తూయన్ మూన్ " కు అధిక సంఖ్యలో ప్రవేశించి కోటల నిర్మాణం చేసారు. చైనా మరియు పోర్చుగీస్ మద్య సైనిక పోరాటాలు కొనసాగాయి. ఫలితంగా పోర్చుగీవారిని దేశబహిస్కారం చేయడం మొదలైంది. 16వ శతాబ్ధం మద్యకాలంలో మేరీటైం ఆక్టొవిటీస్ మీద హైజిన్ ఆర్డర్ తో నిషేధం విధించి విదేశీయులతో సంబంధాలను అడ్డగించారు. ఈ చట్టం దేశాంంతర్గత చర్యల మీద కీడా నిస్గేధం విధించింది. 1661-69 మద్య కాంగ్సి చక్రవర్తి విధించిన క్లియరెంస్ ఆర్డర్ వలన ఈ ప్రాంత వాసులు సమస్యల ఫాలయ్యరు. ఈ చర్య గాంగ్డాంగ్ తీరం ఖాళీ చేయాలని వత్తిడిచేసింది. క్సిన్ నుండి 16,000 మంది దేశం అంతర్భాగం లోకి తరలి వెళ్ళారు. వెళ్ళకుండా అక్కడే ఉండి పోయారు. ఈ శాసనం 1669 లో రద్దు చేయబడింది. ఈ నిషేధం సమయంలో ప్రస్థుత హాంగ్ కాంగ్ ప్రదేశం బంజరు భూమిగా ఉండి పోయింది. 1685లో కాంగ్సి మొదటి సారిగా చక్రవర్తి అయిన తరువాత విదేశీయులతో పరిమితికి లోబడి వ్యాపారం చేయడానికి అనుమతి ఇచ్చాడు. వ్యాపారాల కారణంగా "కాంటన్" ప్రదేశం రూపిదిద్దుకుంది.

ఆయన వ్యాపారుల మీద కఠిన షరతులు విధించాడు. అనుమతించిన ప్రదేశంలోనే నివసించాలని, వ్యాపార కాలంలోనే నివసించాలని, ఆయుధాలు అమ్మకూడదని, వెండి వస్తువులు మాత్రమే అమ్మాలని నిషేధాలు విధించబడ్డాయి. 1699 నాటికి ఈస్టిండియా కంపనీ మొదటిసారిగా ఈ ప్రదేశం లోకి ప్రవేశించింది. తరువాత ఈ ప్రాంతంలో బ్రిటిష్ వ్యాపారులతో వ్యాపారం త్వరితగతిలో అభివృద్ధి చెందింది. 1771లో ఈస్టిండియా కంపనీ కాంటన్ లో వాణిజ్య స్థూపాన్ని స్థాపించింది. 1553 యురేపియన్ల ప్రవేశం తరువాత చైనీయులు ఒక సంవత్సరానికి 2, 000 చెస్ట్స్ ఓపియం ఉపయోగిస్తుండగా 1711 నాటికి కాంటన్లో మాత్రమే 1,000 చెస్ట్ ల వాడకానికి చేరింది.

బ్రిటిష్ కాలనీ శకం

1889 లో క్వింగ్ సాంరాజ్య ఆధిపత్యం ఓపియం దిగుమతులను నిరాకరించిన కారణంగా చైనా మరియు బ్రిటన్ మద్య ఓపియం యుద్ధం సంభవించింది. 1841 జనవరి 20 తేదీలో హాంగ్ కాంగ్ బ్రిటిష్ సైన్యాల చేత ఆక్రమించబడింది. తరువాత కేఫ్టన్ ఎలియాట్ మరియు గవర్నర్ క్విషాన్ కలయిలక వలన జరిగిన " యుద్ధ నిలుపుదల (సీస్ సైర్) ఒప్పందం ఫలితంగా బ్రిటన్ మొదట హాంగ్ కాంగ్ మీద ఆధిపత్యం వదులుకుంది. అయినప్పటికీ ఇరు వైపులా రెండు ప్రభుత్వ ఉన్నతోద్యుగుల మద్య సాగిన వివాదాల కారణంగా ఈ ఒప్పందం అమలు కాలేదు. చివరకు ఆగస్ట్ 29 1842న " నాన్ కింగ్" ఒప్పందం ఆధారంగా ఈ ద్వీపం బ్రిటన్ కు శాశ్వతంగా ఒప్పగించబడింది. తరువాత సంవత్సరం వికోరియా సిటీ స్థాపించబడిన తరువాత బ్రిటన్ క్రౌన్ కాలనీని నిర్మించింది. 1841 లో బ్రిటిష్ పాలనలో హాంగ్ కాంగ్ ద్వీపం జనసంఖ్య 7,450 నుండి బాగా అభివృద్ధి చెందింది. వీరిలో అత్యధికులు చైనీయ మత్స్యకారులు. 1870 నాటికి హాంగ్ కాంగ్ జనసంఖ్య 115,000 మంది కంటే అధిక చైనీయులు మరియు 8,754 మంది యురోపియన్లు స్థాయికి చేరింది.

1860లో చైనా రెండవ ఓపియం యుద్ధంలో ఓటమిని చవిచూసింది. పీకింగ్ మీటింగ్ సమయంలో కోలూన్ ద్వీపకల్పం మరియు స్టోన్ కట్టర్స్ ద్వీపం శాశ్వతంగా బ్రిటన్ కొరకు వదులుకొనబడింది. 1894 లో బ్యూబోనిక్ ప్లేగ్ అతి ఘోరంగా వ్యాపించిన కారణంగా హాంగ్ కాంగ్ లో 50,000-1,00,000 వరకు మరణాలు సంభవించాయి.

1898లో హాంగ్ కాంగ్ భూభాగ విస్తరణ సమావేశంలో బ్రిటన్ లాంత్యూ ద్వీపం మరియు దానిని ఆనుకుని ఉన్న ద్వీపాల 99 మీద ఆధిపత్యం సాధించింది. ఈ ఒప్పందం కొత్త భూములు గా అభివర్ణించబడింది. ప్రస్థుతం హాంగ్ కాంగ్ భూభాగం మార్పులకు లోనికాకుండా ఉండిపోయింది.

20వ శతాబ్ధపు సగం వరకు హాంకాంగ్ స్వతంత్ర ఓడరేవుగా ఉంటూ బ్రిటన్ సాంరాజ్యానికి ప్రవేశంగా ఉంటూ వచ్చింది. ప్రాంతీయ చైనీయులలో సంపన్న వర్గాలు మాత్రమే సత్సంబంధాలు కలిగిఉన్న సమయంలో బ్రిటన్ విక్టోరియా శిఖరం వద్ద వారి తరహా విద్యావిధానం పరిచయం చేసింది.



జపాన్ దడయాత్ర

1941 డిసెంబర్ 8 తేదీన జపాన్ హాంకాం మీద దండెత్తింది. " ది బాటిల్ ఆఫ్ హాంకాంగ్ " బ్రిటన్ మరియు కెనడా మద్దతుదారులు డిసెంబర్ 25న హాంకాంగ్ ను జపానుకు స్వాధీనం చేయడంతో ముగింపుకు వచ్చింది. జపాను ఆక్రమణ కాలంలో హాంగ్ కాంగ్ ప్రజలు ఆహారపు కొరత, రేషన్, ధనాభవం వంటి సమస్యలతో బాధలు అనుభవించారు. సైనిక నిర్వహణ కొరకు అధిక ధనం ఖర్చు చేయవలసిన వత్తిడికి గురైయ్యారు. ఈ సమయం అంతా ఆహారం కొరత కారణంగా నిరుద్యోగులను ప్రధాన భూమికి తరలించబడ్డారు. 1941లో 1.6 మిలియన్లు ఉన్న హాంగ్ కాంగ్ జనాభా 1945 లో హాంగ్ కాంగ్ ను యునైటెడ్ కింగ్డం తిరిగి తమ స్వాధీనంలోకి తీసుకునే సమయానికి 0.6 మిలియన్లకు చేరుకుంది.

ప్రచ్చన్న యుద్ధం

చైనా అంతర్యుద్ధం ప్రారంభం అయిన తరువాత చైనా నుండి శరణార్ధులు అలలా హాంగ్ కాంగ్‍లో ప్రవేశించిన తరువాత హాంగ్ కాంగ్ జనసంఖ్య కోలుకుంది. 1949లో పి ఆర్ సి ప్రకటించిన తరువాత దేశంలో కమ్యూనిస్టుల కారణంగా హింస చెలరేగవచ్చన్న భీతి కారణంగా ప్రజలు హాంగ్ కాంగ్‍కు పారిపోయారు. సజ్ంఘై మరుయు గంగ్యూలో ఉన్న పలు సంస్థలను హాంగ్ కాంగుకు మార్చుకున్నారు. 1950లో హాంగ్ కాంగ్ వేగంగా దూసుకఓతున్న వాణిజ్యం వస్త్రఎగుమతులు మరియు ఇతర పరిశ్రమల విస్తరణ వైపు మరలించబడింది. జనసంఖ్య వృద్ధి అయిన కారణంగా శ్రామికుల జీతభత్యాలు అందుబాటులో ఉన్నాయి. జీవప్రమాణాలు పెరిగాయి. 1953లో " షేక్ కిప్ మెయి" నిర్మాణం తరువాత హాంగ్ కాంగ్ మురుకివాడల తొలగింపు మరియు ప్రభుత్వ నివాస భవనాల ప్రారంభం మొదలైంది. ఈ కార్యక్రమం వలస ప్రజల నివాస గృహాలకు అవసరం తీర్చింది. హాంగ్ కాంగ్ వ్యాపారం షెజెన్ మరియు నార్త్ హాంగ్ కాంగ్ లలో అభివృద్ధి చెందింది. హాంగ్‍కాంగ్ చైనలో విదేశీపెట్టుబడి దారులకు ప్రధాన వనరుగా మారింది. హాంగ్ కాంగ్ పి ఆర్ శసి ఆర్ధిక భ్జుభాగంగా మారింది. 1980 ఆరంభంలో దక్షిణ చైనాలో పరిశ్రమల అభివృద్ధి తరువాత హాంగ్ కాంగ్ పరిశ్రమలో పోటీ తగ్గుముఖం పట్టింది. సేరంగంలో వచ్చిన మార్పుల పరిశ్రమ్లు ఉద్యోగులను పని నుండి తొలగించడం మొదలైంది.

బ్రిటిష్ కాలనీ శకం అంతా హాంగ్ కాంగ్ ప్రారిశ్రామిక నగరంగా అభివృద్ధి చేయబడుతూనే ఉంది. అలాగే ఆర్ధిక మరియు ఆరోగ్య సంరక్షణ వంటి విషయాలలో కూడా అభివృద్ధి చెందింది. క్వీన్‍ఎలిజబెత్ హాస్పిటల్ హాంగ్ కాంగ్, ది క్వీన్ మేరీ హాస్పిటల్ హాంగ్ కాంగ్, ది ప్రింసెస్ మార్గరేట్ హాస్పిటల్ హాంగ్ కాంగ్ ప్రింస్ ఆఫ్ వేల్స్ హాస్పిటల్ హాంగ్ కాంగ్ వంటి నాణ్యమైన వైద్యసేవలు అందించగలిగిన ఆరోగ్యసంరక్షణా వసతులను హాంగ్ కాంగ్ వాసులకు కల్పించారు. 1983లో యునైటెడ్ కింగ్డం హాంగ్ కాంగ్‍ను బ్రిటిష్ సాంరాజ్యం నుండి విడివడి ఆధారిత ప్రదేశంగా తీర్మానించిన తరువాత చైనా ప్రభుత్వం మరియు యునైటెడ్ కింగ్డం ఇరురాజ్యాల నడుమ హాంగ్ కాంగ్ స్వతంత్ర ప్రతిపత్తి గురించిన చర్చలు జరిపాయి. ఫలితంగా తరువాతి రెండు దశాబ్ధాల కాలం వరకు హాంగ్ కాంగ్ స్వతరంత్రప్రతిపత్తి కలింగించాలని సూచించబడింది. 1984లో సినో-బ్రిటిష్ సంయుక్త తీర్మానం ద్వారా హాంగ్ కాంగ్‍ను 1997లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు అప్పగించాలని ఒప్పందానికి వచ్చాయి. ఈ ఒప్పందం హాంగ్ కాంగ్‍ను చైనా ఆధీనంలోకి తీసుకున్న తరువాత 50 సంవత్సరాల కాలం వరకు ప్రత్యేక పరిపాలనా భూభాగంగా పరిగణించాలని, బ్రిటిష్ ఆధారిత మూల న్యాయవ్యవస్థ పరిరక్షంపబడాలని నిర్ధేశించింది. ఈ ఒప్పందం ఇరుదేశాలు 1990లో ఆమోదించబడింది.

1997 తరువాత

1997 జూలై 1న యునైటెడ్ కింగ్డం హంగ్ కాంగ్ మీద అధికారాన్ని రిపబ్లిక్ చైనకు అప్పగించింది. దీనితో హాంగ్ కాంగ్‍లో 156 సంవత్సరాల బ్రిటిష్ కాలనీ పాలన ముగింపుకు వచ్చింది. హాంగ్ కాంగ్ చైనా మొదటి ప్రత్యేక అధికారాలు కలిగిన భూ భాగంగా మారింది. తుంగ్-చీ-హ్వా హాంగ్ కాంగ్ ప్రధాన పాలకుడుగా అధికారస్వీకారం చేసాడు. అదే సంవత్సరం ఆర్ధిక పరమైన సమస్యలను ఎదుర్కొన్నది. ఉర్థ్వ శ్వాసనాళ ప్రాంతములో వైరస్ వలన కలుగు విషపడిశము మరియు ఆశియన్ ఆర్ధిక మాంద్యం రెండు సమస్యలు హాంగ్ కాంగ్ ఆత్ధిక వ్యవస్థ మీద దెబ్బతీసాయి. 2003లో హాంగ్ కాంగ్ సార్స్ అని పిలువబడిన తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి వలన పీడించబడింది. " ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ " హాంగ్ కాంగ్ లో ఈ వ్యాధితో 1,755 మంది బాధించబడ్డారని 299 మంది మరణించారని తమ నివేదికలో తెలిపింది. ఈ అంటువ్యాధి ఫలితంగా 380 హాంగ్ కాంగ్ ఒపందాలు రద్దు రూపంలో డాలర్ల (48.9 అమెరికన్ డాలర్లు) ధనాన్ని నష్టపడింది.

2005 మార్చ్ 10 ఆరోగ్యసమస్యల కారణంగా తూంగ్ ప్రధాన నిర్వహణాధికారిగా బాధ్యత స్వీకరించాడు. 2005 లో అదే సమయంలో డోనాల్డ్ త్సంగ్ నిర్వహణా ప్రధాన కాత్యదర్శిగా ఏకగ్ర్జివంగా ఎన్నిక చేయబడి పదవీ బాధ్యతవహించాడు. 2007లో త్సాంగ్ నిర్వహణాఆధికారి ఎన్నికలో విజయం సాధించి తన రెండవ విడత పదవీ బాధ్యత స్వీకరించాడు.

2009 లో " ఐదవ ఆషియన్ క్రీడలు " కు ఆతిధ్యం వహిస్తాయి. ఆ క్రీడలలో హాంగ్ కాంగ్ జాతీయ బృందాలు పాలుపంచుకున్నాయి. ఈ ప్రదేశంలో నిర్వహించబడిన మొదటి మరియు బృహత్తరమైన అంతర్జాతీయ విభిన్న క్రీడలు ఇవే. ప్రస్థుతం హాంగ్ కాంగ్ అంతర్జాతీయ ఆర్ధిక కేంద్రంగా ఉన్నప్పటికీ దాని ప్రధానభూభాగమైన చైనా ఆర్ధికబలం మరియు రిపబ్లిక్ చైనతో కల సంబంధాలు ప్రజాపాలన వైపు జరుగుతున్న సంస్కరణలు అంతర్జాతీయ అంగీకారం వంటివి హాంగ్ కాంగ్ భష్యత్తుకు ప్రశ్నార్ధకం అయింది.

పాలన

అత్యధిక కాలం బ్రిటిష్ సాంరాజ్యపు వలసరాజ్యంగా ఉన్న కారణంగా అది రిపబ్లిక్ చైనాకు తిరిగి ఇచ్చివేయనప్పటికీ ప్రత్యేక రాష్ట్రంగా-నగరంగా మరియు యూనియన్ ప్రాంతంగా ఇప్పటికీ విశేషాధికారాన్ని అనుభవిస్తున్నది. సినో-బ్రిటిష్ ఒప్పందం అనుసరించి ఒక దేశం రెండు విధానాలు అన్న నినాదం అనుసరిస్తూ ప్రత్యేక రాజ్యనిర్వహణా ప్రదేశంగా హాంగ్ కాంగ్ విదేశీవ్యవహారాలు మరియు రక్షణ మినహా అన్ని రంగాలలో ప్రత్యేకనిర్వహణా విధానాలను అనుసరిస్తుంది. సంయుక్త ప్రకటన హాంగ్ కాంగ్ 1997 చైనా రిపబ్లిక్‍కు స్వాఫ్హీనం చేసిన తరువాత కనీసం 50 సంవత్సరాల కాలంహాంగ్ కాంగ్ పెట్టుబడిదారీ వ్యవస్థను మరియు ప్రజాస్వాతంత్ర సంరక్షణ కలిగిస్తుంది. ఈ హామీ ప్రత్యేక హక్కులు, స్వాతంత్రం ఈ ప్రాంత ప్రజలు అనుభవించేలా చేస్తుంది. హాంగ్ కాంగ్ న్యాయవ్యవస్థ ఇంగ్లాండ్ న్యాయవ్యస్థ ఆధారంగా తయారుచేయబడింది.

ఎగ్జిక్యూటివ్ కౌంసిల్, ది సివిల్ సర్వీసు, ది లెజిస్లేటివ్ కౌంసిల్ మరియు జ్యుడీషియరీ కౌంసిల్ అనేవి హాంగ్ కాంగ్ పాలనా మూలస్థంభాలు. ఎగ్జిక్యూటివ్ కౌంసిల్ అధ్యక్షుడు ఎలెక్షన్ కమిటీ చేత ఎన్నుకొనబడి కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడతాడు. మేధాసంపత్తి అనుసరించి నియమించబడే సివిల్ నిర్వహణాధికారి రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగ నిర్వహణా విధానాల రూపకల్పన మరియు ప్రజలకు ప్రభుత్వపరమైన సేవలు అందుబాటులోకి తీసుకురావడం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు. శాసన సభాసభ్యులైన 60 మంది సభ్యులు హాంగ్ కాంగ్ శాశ్వత పౌర సభ్యత్వం కలిగిన ఐదు భూభాగాల ప్రజలచేత నేరుగా ఎన్నిక చేయబడిన వారు సగం, వ్యాపార ప్రముఖులు మరియు క్రియాత్మక రంగాలు నిర్ధేశించబడిన వారితో ఎన్నిక చేబడిన వారై ఉంటారు. మొత్తం శాససన సభ్యులు స్పీకర్ బాధ్యతను వహించే శాసనసభాధ్యక్షుని ఆధ్వర్యంలో పని చేస్తారు. న్యాయాధికారులను ఇండిపెండెంట్ కమీషన్ నియమిస్తుంది.

అధికార మార్పిడి సమయంలో ప్రధానంగా చర్చించబడి వాగ్ధానం చేయబడిన బేసిక్ లా అమలు సధారణ ప్రజామోదం పొందిది. 2002 లో

వెలుపలి లింకులు

  1. Since the transfer of sovereignty in 1997, Hong Kong has used the national anthem of the People's Republic of China.
  2. Historically, the capital of Hong Kong territory was Victoria City; government headquarters are located in the Central and Western District (22°17′N 114°08′E / 22.283°N 114.133°E / 22.283; 114.133).
  3. The Hong Kong Basic Law states that the official languages are "Chinese and English." It does not explicitly specify the standard for "Chinese". While Standard Mandarin and Simplified Chinese characters are used as the spoken and written standards in mainland China, Cantonese and Traditional Chinese characters are the long-established de facto standards in Hong Kong. See Bilingualism in Hong Kong